Wednesday, December 30, 2020

Job potential created in TS has no parallel in the country : Vanam Jwala Narasimha Rao

 Job potential created in TS has no parallel in the country

Vanam Jwala Narasimha Rao

The Pioneer (31-12-2020)

It’s ridiculous to argue, as few have been doing in the recent past, that the Telangana Government has not provided enough of jobs. The last six and half years in the newly born Telangana State the employment potential that has been created is of the order of a whooping over 20 lakhs! These include jobs in the Government departments, Public Sector Undertakings, Governmental organizations like Universities as well as huge employment opportunities created in Information Technology and Industrial Units established as part of TS-I Pass. The KCR Government at the same time is equally a great employee friendly!         

Chief Minister K Chandrashekhar Rao, who spearheaded the separate hood movement with job opportunities as Tagline, from the day one he assumed charge, as CM defined, designed and delivered his vision and action plan to provide job opportunities. Today Telangana is ahead of all the states in providing job opportunities to its unemployed youth through varied sources going beyond the Government jobs.   

Unfortunately, many have a wrong notion that jobs means only jobs in the government. Undoubtedly jobs and job opportunities provided by the Telangana Public Service Commission, in Public Sector Undertakings like the RTC, Singareni, Police, Medical and Health, Universities, several Corporations, Societies, Industries, IT sector, all would also fall under this category. Hence it is imperative to note that employment generated in the government departments as well as other than the government departments directly or indirectly and the job creation thus happened should be treated as the appointments.

Though the KCR government is successful in creating jobs in the government, quasi government, private, private and public sectors, a false campaign is unleashed on the actual data on the job creation and employment generation that the government actually did. Hence there is a need to clarify this and set the records straight. Necessity has also arisen to state the policy decisions taken by the government and the measures that it is taking as on date.

The newly formed Telangana State in the past six and half years has employed more than 1.25 Lakh jobs in the government, State-owned public Sector undertakings, non- government sector, either through TSPSC or directly in departments like the Electricity, in Singareni collieries, Police department, Panchayat Raj (Secretaries), teachers in the Residential Schools, in the universities, Corporations and Societies and in Medical and Health etc.

A whopping 5.82 Lakhs jobs were given in the IT sector thanks to the proper initiatives and polices taken by the Telangana State government. Moreover, with the innovative TS-I Pass policy of the government, more than 14,000 industries came up in the State. In these industries direct and indirect employment is to the tune of 14.96 Lakh. If we put all these together, about 21.50 Lakh unemployed in the state have been gainfully employed or in the process of being employed. Telangana State thus became a unique state, which created employment to such an extent in the government and private sectors in the country. This is a record of sorts!


In the same process, with the instructions from the CM, the official machinery is gearing up to recruit 50,000 more in the government. It is no exaggeration that the Telangana state is only the state in the country which created largescale employment in all the sectors, gave job security to the employees already working in the State and is generating employment on a regular basis.

The state government is according high priority to eradicate unemployment in the state and to fill up all the vacancies in the government departments. The government has exclusively set up Telangana State Public Service Commission. The government has appointed academic scholar and an able administrator Prof Ghanta Chakrapani as the first TSPSC Chairman and later appointed Sri D Krishna Reddy as the temporary Chairman. The TSPSC gave notification to recruit 36665 posts by the end of 2020.  As on date, 31072 posts were filled up. Filling up of other vacancies are at different stages of recruitment. Similarly, 3643 Residential School teachers’ posts were filled up.

The salaries of Special Officers working in Kastur Ba Girls schools, CRTs have been increased. The government issued orders to recruit 840 teaching and 588 non-teaching employees. The government gave permission to recruit 377 employees in the urban residential schools at all the district headquarters in all the 33 districts. Of this, 174 teaching and 203 non-teaching employees will be appointed.

10,477 dependent jobs for those families working in the Singareni Collieries Company and 3148 external recruitees in total 13625 jobs were created. Above all this, regular Bonus is paid and increments are given. The government has taken up several programs for the job security in the company. The government has decided to regularize 758 teachers working as contract teachers in the residential schools for the past nine years and 18 teachers working on Adhoc basis. It was also decided to upgrade 2488 Language Pandits, 1047 PETs as the School Assistants. In the electricity department, it was decided to recruit 11,869 employees directly (in Genco, Transco). Of this, 9289 (Genco, Transco) were recruited and 2552 jobs in Transco were being considered.

As far as employee’s security is concerned, the government has hiked the salaries of GHMC Sanitary workers, drivers. At the time of formation of the State, municipal workers salary was hiked. Anganwadi salaries were hiked twice by the state government. The CM announced that salaries would be hiked for the helper representatives.

For the government employees, who played a key role in the separate state hood movement, the government has announced the PRC. Fitment to the tune of 43 percent of the basic salary was given. The state government has also given a special increment to them for making the then Sakala Janula Samme a grand success.

Salaries of the Indira Kranti Scheme (IKS) employees and staff, Salaries of those working in SERP and national employment guarantee schemes were also increased. The state government has increased the salaried of 1703 employees working with 108 Ambulance service.

Chief Minister K Chandrashekhar Rao, as a new year’s gift, has decided to increase the salaries of all the government employees, increase the age of superannuation and to recruit employees in all the government departments. The CM announced that the salary hike would benefit government employees, Grant-in Aid employees, work charged employees, daily wages employees, fulltime contingent employees, part time Contingent employees, Home Guards, Anganwadi workers, Contract employees, Out-sourcing employees, Asha workers, Vidya Volunteers, SERP employees, people receiving the honorariums, pensioners. All category of employees put together would be 9,36,976 and the salary hike would be extended for all these employees, the CM said. All this means that the job potential created in TS has no parallel in the country.

Sunday, December 27, 2020

అయోధ్యలో రామాయణాన్ని గానం చేసిన కుశ లవులు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-37 : వనం జ్వాలా నరసింహారావు

 అయోధ్యలో రామాయణాన్ని గానం చేసిన కుశ లవులు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-37

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-12-2020)

ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో, వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గానం చేస్తున్న వారి సొంపు-గానం-ఇంపు-కథ పెంపు, వెరసి కర్ణ రసాయనంగా వినడం వల్ల, శ్రోతల కళ్ల నుండి ఆనంద భాష్పాలు జల-జల రాలాయి. రామచంద్రమూర్తి చేస్తున్న అశ్వమేధ యాగం చూడడానికి వచ్చిన మునీశ్వరులందరు కుశ లవులు గానం చేస్తున్న రామాయణాన్ని విని, ఆశ్చర్యపడి, సంతుష్ట మనస్కులయ్యారు. ముని కుమారుల వేషంలో, మనోహర సుందరకారంలో, సంగీత విద్యలో శ్రేష్ఠులై వున్న కుశ లవులను, మునీశ్వరులు మేలైన మాటలతో మెచ్చుకున్నారీవిధంగా: " ఆ హాహా, ఏమీ పాటల నీటు ! అరే ఏమీ పద్యాల హృద్యత ! సెబాసు ! ఏమీ అర్థపుష్ఠి ! ఔరా, ఏమి చిత్రం ! ఎంత కాలం క్రితం జరిగిన సంగతి? వీళ్లిప్పుడు పాడుతుంటే, ఇప్పుడే జరుగున్నట్లుందే ! ఏం ఆశ్చర్యం".

(ఇది జరిగినప్పుడు శ్రీరాముడికి 54-55 సంవత్సరాల వయస్సుంటుంది. సీతాదేవికి 47-48 సంవత్సరాలుంటాయి. వాల్మీకి ఆశ్రమంలో విడిచి పెట్టినప్పుడు సీత వయస్సు 34 సంవత్సరాలు).

వాల్మీకి తమలాంటి ఋషే ఐనప్పటికి, ఆయన రచించిన గ్రంథాన్ని, ఏ మాత్రం అసూయపడకుండా, మునీశ్వరులందరూ ముక్త కంఠంతో పొగిడారు. ఎవరికి వారే మేలు-మేలని స్తుతించారు. వారిస్తున్న ప్రోత్సాహంతో ఉప్పొంగి పోయిన కుశ లవులు, స్వరం-లయ-గ్రామం-మూర్ఛనలతో రక్తికట్టిస్తూ, వినే వాళ్లు పరవశించే విధంగా, మనోహరంగా మళ్లీ - మళ్లీ పాడారు. విని సంతోషించిన మునులు వారికెన్నో బహుమానాలిచ్చారు. కొందరు చిత్రాసనాలిస్తే ఇంకొందరు జంద్యాలిచ్చారు. మోంజిలు, పాత్రలు, కమండలాలు, దండాలు, ఇతరత్రా ప్రియమైన వస్తువులెన్నో ఇచ్చారు మునులందరూ. ఏమీ ఇవ్వలేనివారు దీర్ఘాయుష్యులు కమ్మని దీవెనలిచ్చారు. (ఇవన్నీ బహుమానాలే కాని, దానాలు కావు. భగవత్ కథలు, పురాణాలు చెప్పేవారు ప్రతి ఫలాపేక్ష లేకుండానే చెప్పాలి-వినేవారు మాత్రం వారిని సత్కరించాలి). గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. పాడుతున్న బాలకులు, నెత్తిపై ముందున్న వెంట్రుకలను ముడేశారు - వెనుకనున్న వెంట్రుకలను జారవిడిచారు. పౌర్ణమి నాటి చంద్రుడిని బోలిన ముఖంపైన గోపీ చందనాన్ని రేఖగా దిద్దారు. ఎడమ భుజంపైన వీణ దండాన్ని-ఎడమ చేతిలో సొరకాయ బుర్రను వుంచారు. మెడలో ఒంటి జంద్యముంది. నడుంపైన చిన్న నార వస్త్రం చుట్టారు. లేత కుడిచేతి వేళ్ళతో వీనతంత్రులను మీటుతూ, మనోహరమైన రాగాలతో కాలం-తాళం తప్పకుండా, వాడ-వాడ తిరుగుతూ, రామాయణ గానం చేశారు కుశ లవులు.


(వీణలు రెండు రకాలు. శ్రుతి వీణ, స్వర వీణ. 22 శ్రుతులకు ఉపయోగించేది శ్రుతి వీణ. సప్త స్వరాలకుపయోగించేది స్వర వీణ. ఏక తంత్రికి బ్రహ్మ వీణన్న పేరుంది. రెండు తంత్రులుంటె నకులం అంటారు. విపంచికి ఇరవై ఒక్కటుంటాయి. మత్తకోకిలం, స్వర మండలం, ఆలాపిని, కిన్నరి, పినాకి, పరివాదిని, నిశ్శంక గా మరి కొన్నిటిని పిలుస్తారు. సరస్వతి వీణను కచ్ఛపి అని, నారదుడి వీణను మహతి అని, తుంబురుడి వీణను కళావతి అని, విశ్వావసు వీణను బృహతి అని అంటారు).

అయోధ్యలోని యజ్ఞ శాలలో వున్న జనులు-మునులు అందరూ, వాల్మీకి రచించిన కావ్యం గురించి-దాని మహిమ గురించి-శ్రేష్ఠత గురించి, వీధి-వీధిలో చెప్పుకోవడం జరిగింది. ఆ మహర్షి ఎంతటి మహిమాన్వితుడో కదా అని ఆయన్ను పొగడసాగారు. భావితరాల కవీశ్వరులు రచించబోయే కవితలకు-కావ్యాలకు వాల్మీకి రామాయణం ఆధారమౌతుందని, రాగాలకు యోగ్యమైనదిగా భావించబడుతుందని, ఓపికగా వినేవారి చెవులకు అమృత ధార అవుతుందని, చదివినవారి ఆయువు వృద్ధి చెందుతుందని పొగడ్తలతో దాన్ని గురించి చెప్పసాగారు. సముద్రంలో వున్న రత్నాలలాగా, రామాయణంలో వున్న సద్గుణాలు అనంతమని, నవరసాలకు నిలువ నీడైనదని, వ్యాధులను వుపశమించే దివ్యౌషధమని, ఆత్మ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుందని పొగిడారు దాన్ని. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.

 

మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గమా? : వనం జ్వాలా నరసింహారావు

 మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (27-12-2020) ప్రసారం  

సీతాదేవి కనపడనందుకు, చింతించి జగత్ సంహారానికి సిద్ధపడ్డ శ్రీరాముడిని శాంతింప చేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నకు ఎన్నో విషయాలను చెప్తాడు. ఆయన పాదాలమీద పడి నమస్కరించి, “అన్నా! పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి, ఎన్నో అశ్వమేధయాగాలను చేసి, మరెన్నో గొప్ప పుణ్యకార్యాలను చేసి, మన తండ్రి అతి కష్టంతో దేవతలు అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు” అని అంటాడు.

శ్రీరామచంద్రమూర్తిని అమృతంతో పోల్చడం అంటే, అమృతం వల్ల దానికేమీ లాభం లేదు కాని, దాన్ని అనుభవించిన దేవతలకే లాభమని అర్థం. అలాగే శ్రీరాముడు దేవతలకు, లోకులకు భోగ్యుడై వారికి మేలు చేయడానికి పుట్టాడని అర్థం. లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడు లోకాలను నాశనం చేయడం తగదని లక్ష్మణుడు అంటున్నాడు. అలాగే, అమృతాన్ని సంపాదించడం కోసం ముప్పైమూడు కోట్ల దేవతలు కష్టబడ్డారు కానీ, రాముడి కొరకు ఒక్క దశరథుడే కష్టపడ్డాడని భావన. అమృతం ఎలా రాక్షసుల వినాశనానికి కారణమైందో అలాగే రాముడు కూడా రాక్షస సంహారం చేయాలని చెపుతున్నాడు లక్ష్మణుడు. అందుకే, దేవతలమీద, ఇతర భూతాల మీద కోపం చూపకుండా, అమృతంలాగా ఎల్లప్పుడూ నిర్మలంగా వుండాలని సూచన ఇచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడు ఇంకా ఇలా చెప్పాడు రాముడికి. “నీలో తప్ప ఇతరుల్లో లేని నీ కళ్యాణగుణాలకు సంతోషించి మన తండ్రి నిన్ను ఎడబాసిన కారణాన మరణించాడని భరతుడు చెప్పాడు కదా? అలాంటి కళ్యాణగుణాలను వదిలి ఇలాంటి హేయగుణాన్ని చేపట్టి, లోకానికి ఉపద్రవం కలిగిస్తే, మన తండ్రి నీవిషయంలో ఏమని భావిస్తాడు? రాముడు సౌమ్యుడు, సాధువు, జితేంద్రియుడు, శాంతుడు అనుకున్నానే? ఇంతటి క్రూరుడా, అని అనుకోడా? నువ్వు చేయాలనుకున్న లోకోపద్రవం తండ్రికి కూడా చేసినట్లే కదా? తన నాశనానికా తండ్రి నిన్ను కన్నది? కకుత్థ్సుడి వంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్టుడివైన నువ్వు, మహాశుద్ధసత్త్వం కల నువ్వు, అప్రాకృతుడవైన నువ్వు, కకుత్థ్సుడిలాగా దేవతలను, లోకులను రక్షించాల్సిన నువ్వు, శోకంతో సహించలేని విధంగా పరితపిస్తుంటే, ప్రకృతిబద్ధులైన ఇతరులందరూ దుఃఖం సహించగలరా? అలాంటి వారిలోనే దుఃఖం అణచుకునేవారు  కనిపిస్తుంటే నువ్వు దుఃఖపడడం శోచనీయం.

జగాలను పుట్టించే భారం బ్రహ్మదేవుడిది. సంహరించే భారం రుద్రుడిది. రక్షించే భారం నీది. అలాంటి నువ్వు ధర్మాన్ని వదిలి లోకులను సంహరించాలనుకుంటే భూప్రజలకు రక్షకుడెవరు దొరుకుతారు? పైరును రక్షించడానికి వేసే కంచే పైరును మేయడానికి సిద్ధపడితే ఇక దాన్ని రక్షించే ఉపాయం ఏమిటి? లోకంలో నువ్వొక్కడివే దుఃఖమనుభవించుతున్నానని అనుకోవద్దు. నీకున్నంత దుఃఖం ఎవరికీ లేదనుకోవద్దు. ఎంత మహాత్ములైనా, దేవతా శ్రేష్టులైనా, దైవ సంకల్పాన్ని దాటగలరా? ఎవరైనా కష్టాలను ఎదుర్కోకుండా కాలమంతా సుఖంగా గడుపుతారా? లేరుకదా? కాబట్టి ప్రాణులకు మేలు-కీడు స్వభాసిద్ధంగా వస్తాయి”.

“సీతాదేవి రాక్షసుల చేతిలో చచ్చినా కూడా అందుకోసం నువ్వు గుండెలు పగిలేలా ఏడవవద్దు. అది జ్ఞానంలేనివాడు చేయాల్సిన పని. నువ్విలా ఏడుస్తుంటే సీతాదేవి వస్తుందా? ఏడ్వడం వల్ల దేహం, మనస్సు చెడడమే తప్ప మరేం లాభం లేదు. జ్ఞానంకలవాడు దేనికీ దుఃఖపడడు. జీవకోటుల యథార్థస్థితి అయిన జననమరణాలు, సుఖదుఃఖాలు, శోకసంతోషాలు, సంయోగవియోగాలు లాంటివి నిత్యం జరిగేవి కావు. రావడం, పోవడం వాటి స్వభావగుణాలు.  కాబట్టి వాటికి పరితాపపడడం మంచిదికాదు. నీచమైన హృదయ దౌర్బల్యం వదిలి, గొప్ప మనస్సు చేసుకుని, ఇలా వ్యసనపడడం నీకు తగునేమో ఆలోచించు. జ్ఞానం కలవారు స్వభావసిద్ధమైన బుద్ధిబలంతో మేలు-కీడులను పరీక్షిస్తారు”.

“పూర్వం చేసిన పుణ్యపాపకర్మల గుణాలు కానీ, దోషాలు కానీ, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేం. మనం ఈ కర్మ చేశాం, మనకీ ఫలం కలుగుతుంది, అని నిశ్చయంగా చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. ఈ కర్మ ఈ విధంగా చేయడం వల్ల ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కర్మ చేసిన విధం చెప్పడం కూడా సాధ్యపడదు. కాని, కారణం లేకుండా ఏదీ జరగదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి, దీనికి కారణమైన కర్మ ఎదో, ఎప్పుడో చేశాం అని మాత్రం చెప్పగలం. అలాంటి కర్మ చేయడం వల్లే ఈ ఫలం కలిగిందని చెప్పవచ్చు. మనకు కారణం తెలిసినా, తెలియకున్నా, అనుభవించడం తప్పదు. కాబట్టి సుఖం అనుభవానికి వచ్చినప్పుడు మనం చేసిన పుణ్యం వల్లే ఇది కలిగిందని కాని, దుఃఖం కలిగినప్పుడు మనం పూర్వం ఏదో పాపం చేశామని అందుకే ఇది కలిగిందని భావించరాదు. సుఖం కలిగినందువల్ల పుణ్యమే చేయాలని కాని, దుఃఖం కలగడం వల్ల పాపం చేయరాదని అనుకుని మనస్సు ధృడ పరచుకోవాలి. సంతోషానికి పొంగక, దుఃఖానికి బాధపడక వుండాలి”.

“రామచంద్రా! నువ్వు మూర్ఖుడివి కాదు. కార్యాకార్య, ధర్మాధర్మ విషయంలో నీకుకల స్థిరజ్ఞానం దేవతలకు కూడా లేదు. అయినప్పటికీ దుఃఖాతిశయం వల్ల నీ జ్ఞానం నివురుగప్పిన నిప్పులాగా నిద్రబోతున్నది. మనుష్యులను చూద్దామా, వాళ్ళు నీదగ్గరకు వచ్చి తమ మీద కోపం ఎందుకని అడిగే సాహసం కూడా చేయలేరు. దేవతలేమో నీమూలాన బాగుపడేవారు. కాబట్టి నీకు అపరాధం చేయరు. కాబట్టి వాళ్ళను ఎందుకు బాధించాలి? వ్యర్థ కోపం వల్ల, వ్యర్థ శోకం వల్ల ఏ పనీ కాదు. మనకపకారం చేసినవాడు ఎవడో కనిపెట్టి శూరుడివైన నువ్వు వాడిని దండించు. దానివల్ల నీకు సీత మళ్లీ లభిస్తుంది. కీర్తీ కలుగుతుంది”.

చిన్నవాడైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పగా విన్న పెద్దవాడైన రామచంద్రమూర్తి, దాంట్లోని సారాన్ని గ్రహించి, కోపంతో లోగడ చేద్దామనుకున్న పనిని వదిలి, విల్లు ఆధారంగా నిలబడి, “నాయనా! లక్ష్మణా! సీతను వెదకడానికి ఏం చేయవచ్చు? ఎక్కడికి పోదాం?” అని అడిగాడు. లక్ష్మణుడు జవాబుగా ఇలా చెప్పాడు. “ఈ జనస్థానంలో పెద్ద-పెద్ద మృగాలు, గుహలు, కొండలు, చొరలేని మార్గాలు వున్నాయి. కిన్నరుల ఇండ్లున్నాయి. భయంకరమైన రాక్షసుల దీనంలో వుందిది. పెద్ద-పెద్ద చెట్లున్నాయి. కాబట్టి రాక్షసులు సీతను తెచ్చి ఇక్కడే, ఎక్కడో దాచిపెట్టి వుంటారు. కాబట్టి సీతాదేవిని ఇక్కడే ఎక్కడో వెతకాలి. నీలాంటి బుద్ధి సంపదకలవాడు ఆపద వస్తే చలించాలా? ఎంత గట్టిగా గాలి వీచినా కొండలు కదులుతాయా?”. ఇలా చెప్పగా రామచంద్రమూర్తి తమ్ముడు తనవెంటరాగా అడవి ప్రదేశమంతా వెతికాడు.

         ఇలా వెతుక్కుంటూ పోగా-పోగా, ఆ పర్వతం దగ్గరే ఒకచోట పెద్ద కొండలాగా వున్న, నెత్తుటితో తడిసిన, పుణ్యాత్ముడిని, ప్రాణం పోయినా సరే స్వామికార్యం చేయాలన్న భక్తి కలవాడిని, పక్షి శ్రేష్టుడిని, జటాయువును చూశారు రామలక్ష్మణులు. అతడు రాక్షసుడని భ్రమించి, జటాయువుకు ఎదురుగా పోయి, ఒక తీవ్ర బాణాన్ని సంధించగా భూతలం వణికింది. అప్పుడు గద్గద స్వరంతో పక్షిరాజు రామచంద్రుడితో ఇలా అన్నాడు.

         “సీతను, రావణుడు అపహరించాడు. బలవంతంగా ఆమెను ఎత్తుకుని ఆకాశమార్గాన పోసాగాడు. అది చూసిన నేను, విసురుగా వాడికి అడ్డం పోయాను. వాడిని ఎదిరించి వాడితో బలం కొద్దీ యుద్ధం చేసి వాడి రథాన్ని నేలపడగొట్టాను. వాడిని కింద పడేశాను. నేను విరిచిన విల్లు ఇక్కడే పడి వుంది. పొది కూడా ఇక్కడే పడిపోయి వుంది. నా రెక్కల దెబ్బకు చచ్చిన సారథి ఇక్కడే పడిపోయి వున్నాడు. నేను ముసలివాడినై అలసిపోయాను. అప్పుడు వాడు తన కత్తితో నా రెక్కలను తెగనరికి నేలమీద పడేసి, సీతను పట్టుకుని ఆకాశమార్గాన పరుగెత్తాడు. నీ భార్య కోసం ముందే రావణుడు నన్ను చంపాడు. నా స్నేహితుడైన దశరథుడి పుత్రా! చావడానికి సిద్ధంగా వున్న నన్ను నువ్వు కూడా చంపాలా?

         జటాయువు మాటలు విన్న రాముడు తన విల్లు దూరంగా పడవేసి, అతడిని కౌగలించుకుని, తమ్ముడితో కలిసి ఏడ్చాడు. రెక్కలు నరకబడి నెత్తురుకారుతున్న జటాయువును తన చేత్తో తుడిచి, సీత వృత్తాంతం చెప్పమని అడిగాడు. జటాయువు మెల్లగా రెప్పలు తెరిచి, సన్నటి గొంతుతో జవాబిచ్చాడిలా. “రామా! వాడు మాయగాడు. రహస్యంగా సీతాదేవిని బలాత్కారంగా పట్టుకుని ఆకాశమార్గాన పోయాడు. కత్తితో నా రెక్కలు నరికి అమితమైన వేగంగా దక్షిణ ముఖంగా పరుగెత్తాడు. రాక్షసుడు సీతాదేవిని అపహరించిన ముహూర్తం “వింద”. ఆ ముహూర్తంలో అపహరించబడిన సొమ్ము మళ్లీ స్వంతదారుడికి చేరుతుంది. తప్పదు. ఆ రాక్షసుడు తొందరలో ఇది గమనించలేదు. కాబట్టి నీ భార్యను అపహరించినవాడు కాలం మింగిన చేపలాగా అయిపోతాడు. రామా! సీతకొరకు నువ్వు ఆందోళనపడవద్దు. నువ్వు ఆ రాక్షసుడిని యుద్ధంలో చంపి మళ్లీ సీతను గ్రహించి గొప్ప కీర్తిని సంపాదించి సంతోషంగా అయోధ్యకు పోతావు”. ఇంతదాకా స్మృతి తప్పకుండా తెలివిగా చెప్పి, జటాయువు ఆయన చూస్తుండగానే దేహం విడిచి స్వర్గానికి పోయాడు.

         అలా నేలమీద పడ్డ జటాయువును చూసి రామచంద్రమూర్తి బాగా దుఃఖపడి, తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “తమ్ముడా! మన తండ్రి నాకెలా పూజ్యుడో, ఇతడు కూడా అలా పూజ్యుడే. కాబట్టి తండ్రిలాగా నా చేత సంస్కారం చేయించుకోవడానికి అర్హుడు. జటాయువుకు అగ్నిసంస్కారాలు చేద్దామని నిశ్చయించుకున్న రాముడు తమ్ముడితో, “లక్ష్మణా! నా పనికోసమై ప్రాణాలు విడిచిన ఈ పక్షిరాజును శాస్త్రప్రకారం నా తండ్రిలాగే దహన సంస్కారం చేస్తాను. కాబట్టి చితి పేర్చు” అని జటాయువున్న దిక్కుగా చూశాడు. చూసి, ఆయన్ను వైకుంఠ౦ పొందమంటాడు. పక్షి కాబట్టి కర్మాదికారం లేనందున, అగ్నిసంస్కారానికి యోగ్యత లేనందువల్ల, ఉత్తమలోకాలు లేకపోయినా తన ఆజ్ఞ వల్ల ముక్తిని పొందమని అంటాడు జటాయువును. రామచంద్రమూర్తి బ్రహ్మవిధి ప్రకారం సంస్కరించి, యోగులు పొందే సనాతమైన తన లోకాన్ని ఇచ్చాడు. రామానుగ్రహం వల్ల ఆ గద్ద పరమపదానికి పోయి విష్ణుసారూప్యాన్ని పొందింది.

         జటాయువు ఋషులలాగా మోక్షం కొరకు పరమాత్మోపాసన చేయలేదు. అలాంటివాడికి రాముడెలా మోక్షం ఇచ్చాడు? అలాగైతే అందరికీ ఇవ్వ వచ్చుకదా? అని ఆక్షేపించవచ్చు. దీనికి సమాధానం: మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గం కాదు. చాలా మార్గాలున్నాయి. భగవద్గీతలో కర్మ, జ్ఞాన, రాజయోగాలు, భక్తీ, ప్రపత్తి, క్షేత్రక్షేత్రజ్ఞజ్ఞానం, అవతార జ్ఞానం లాంటివి చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాలలో 32 విద్యలు చెప్పడం జరిగింది. ఇవేవీ లేకున్నా ప్రేమ ఒక్కటే మోక్షసాధనమని శాస్త్రాలు చెప్తున్నాయి. అనన్యమనస్కుడై, భగవంతుడి కోసం రాజ్యాన్ని, ప్రాణాన్ని విడిచి ఆయన సమక్షంలో ఆయనమీదే దృష్టి నిలిపి ప్రాణం వదిలి, ఆయన చేతులమీదుగా సంస్కారం పొందిన జతాయువుకే మోక్షం లేకపోతే ఇంకెవరికి వుంటుంది? ఇలాంటివారికెవరికైనా మోక్షం ఇస్తాడు రాముడు కాని, ప్రకృతిబద్ధులై, కామదాసులై, భక్తీ శూన్యులైన వారందరికీ మోక్షం ఎలా ఇస్తాడు? జటాయువు కంటే ఎక్కువ త్యాగం చేసినవారెవరు? కాబట్టి జటాయువుకు మోక్షమివ్వడం న్యాయమే.

         జటాయువును సొదమీద పెట్టి, అగ్ని రగిలించి, తన తండ్రిలాగే ఆయనకూ నిప్పు పెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ పిండాలను లేతపచ్చిక మీద వుంచి, బ్రాహ్మణులు స్వర్గప్రాప్తి కోసం మనుష్య ప్రేతాలను ఉద్దేశించి ఏ మంత్రాలను చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరీ నదిలో తమ్ముడితో సహా స్నానం చేసి, జటాయువుకు నీళ్లు వదిలారు. మరణించిన గద్ద రాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు. ఇలా రామలక్ష్మణులు కర్మలు చేసి, జటాయువు మీదనే మనసుంచి, సీతాదేవి తనకు లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని పోయారు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Saturday, December 26, 2020

కాలాన్ని దాటడం ఎవరికికైనా సాధ్యమా? : వనం జ్వాలా నరసింహారావు

 కాలాన్ని దాటడం ఎవరికికైనా సాధ్యమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం (26-12-2020) శనివారం ప్రసారం

రామలక్ష్మణులు జటాయువుకు కర్మలు చేసి, సీతాదేవి లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని నైరుతిమూలగా పోయారు. అడవిలో సీతను వెతకసాగారు. మధ్యలో అడ్డుతగిలిన అయోముఖి అనే రాక్షసిని చంపారు. అలా సీతను వెతుక్కుంటూ పోతుండగా అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించి, ఒక భయంకరాకారం కనిపించింది.

         పర్వతంలాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తల-మెడ లేకుండా, బిరుసు వెంట్రుకలు, నల్లటి మబ్బు లాంటి, ఉరుము లాంటి ధ్వని, నిప్పుల్లాంటి ఒంటి పెద్ద కన్ను, పెద్ద కోరలు, యోజనం పొడుగు చేతులు కలవాడిని, నోరు తెరిచి తమ దారికి అడ్డంగా వున్న వాడిని, కబంధుడిని సమీపించారు రామలక్ష్మణులు. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదపాలయ్యారు.

         రాక్షసుడిని చూసి అన్నదమ్ములు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. వారిని చూసి కబంధుడు తనను చూసి వారెందుకు భయపడుతున్నారని అడిగాడు. వాళ్ళను తన నోట్లో పడేట్లు బ్రహ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహా బలవంతుడనీ, భయంకర దేహంకల దుష్టుడనీ, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడనీ, కాబట్టి తమను మింగుతాడు కాని వదలడని లక్ష్మణుడు అంటాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు, రామలక్ష్మణులను నోట్లో వేసుకుందామని ఆలోచించే లోపలే వాడి తత్త్వాన్ని అర్థం చేసుకున్న వారిద్దరిలో రామచంద్రమూర్తి వాడి కుడిచేయి నరికాడు. రాముడికి కుడిపక్కన వున్న లక్ష్మణుడు తన కత్తి దెబ్బతో ఎడమ చేయి నరికాడు. ఇలా నరకగా ఆ రాక్షసుడు భూమ్యాకాశాలు, దిక్కులు దద్దరిల్లేట్లు నేలకొరిగాడు.

         దుఃఖంతో కూడిన ఆ రాక్షసుడు రెండు చేతులూ కోల్పోయి వారెవరనీ, ఈ అడవిలో వాళ్లకేమిపని వుందనీ అని ప్రశ్నించాడు. జవాబుగా లక్ష్మణుడు, వాళ్ల చరిత్ర చెప్పాడు. తాము ఇక్ష్వాకు వంశంలో పుట్టామనీ, తన అన్న పేరు శ్రీరాముడనీ, తన పేరురు లక్ష్మణుడనీ, దండకారణ్యంలో వున్నప్పుడు దుండగులైన రాక్షసులు మాయచేసి అన్న రాముడి భార్య సీతమ్మను దొంగిలించగా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామనీ అన్నాడు. మొండెం మాత్రమే ఆకారంగా వున్న ఆ రాక్షసుడు ఎవరని కూడా అడిగాడు. ఇది విన్న ఆ రాక్షసుడు, తనకు శాపమోక్షణ కాలం దగ్గరికి వచ్చింది కదా అని సంతోషించి ఇలా జవాబిచ్చాడు లక్ష్మణుడికి.

         “ఓ రాఘవులారా! నా భాగ్యం పండడం మిమ్మల్ని ఇక్కడ చూడగలిగాను. చేతులు పోగొట్టుకున్నాను. వినయం తప్పిన పనులు చేయడం వల్లే నాకిలాంటి వికార స్వరూపం కలిగింది. నేను మొట్టమొదట సుందరాకారం కలిగి, అందగాడినని పెరుతెచ్చుకున్నాను. ఆ గర్వంతో మునులను అరణ్యవాసులను భయపడేట్లు అనేకరకాల దుఃఖపెట్తూ, స్థూలశిరుడు అనే మునిని నింద్య రూపంలో భయపెట్టాను. ఆ ఋషీశ్వరుడు ‘ఓరీ! పాపాత్ముడా! నింద్యమైన ఈ రూపంలో నన్ను బెదిరిస్తావా? నీకు ఈ రూపమే శాశ్వతం కలుగుగాక!’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్థించగా ఈ అడవిలో ఎప్పుడు రామచంద్రుడు నీ చేతులు తెగనరికి దహిస్తాడో అప్పుడే నీకు శాపం తొలగిపోయి, నీ పూర్వ రూపం పొందుతావు అని శలవిచ్చాడు ఆ మునీశ్వరుడు”.

“కబంధ రూపం రావడానికి మరో కారణం వుంది. ఒక సారి బుద్ధిహీనుడనై ఇంద్రుడిని యుద్ధానికి రమ్మని పిలిచాను. ఇంద్రుడు వజ్రాయుధం వేటుతో నా తల, రొమ్ము, కడుపు, తొడలు కుదించుకు పోయేట్లు అణచి వేశాడు. నేనప్పుడు, నాకీ దురవస్థకన్నా మరణమే మేలని చంపమని ప్రార్థించాను. నేనెలా బతకాలయ్యా? అని అడిగితే, ఆమడ పొడుగున్న చేతులు, కడుపులో నోరు అనుగ్రహించాడు. వాటి సహాయంతో ఏనుగులను, పులులను, సింహాలను, ఇతర మృగసమూహాలను చంపి తింటున్నాను. లక్ష్మణుడితో సహా ఎప్పుడు రాముడు నా చేతులను నరుకుతాడో అప్పుడు మళ్లీ నేను స్వర్గానికి వస్తానని చెప్పి ఇంద్రుడు పోయాడు”.

“ఇక అప్పటి నుండి ఈ వికార స్వరూపం పోవడానికి ప్రయత్నం చేస్తూ, ఎవరు కనపడ్డా పట్టుకుని, రాముడు చిక్కకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆ మునీశ్వరుడు చెప్పిన రాముడివి నువ్వే. మీకు నేను సహాయం చేస్తాను. మీ కార్యం సాధించగల స్నేహితుడిని చూపిస్తాను. నన్ను అగ్నితో దహించు” అని అంటాడు కబంధుడు. తన దేహాన్ని వేగంగా దహించి వేస్తే సీతను దాచి వుంచిన రహస్యమంతా దాచకుండా చెప్తానంటాడు కబంధుడు రాముడితో. ఆ పని సూర్యాస్తమయం లోపే చేయమంటాడు. వాడి విషయం తెలిసినవాడు ఒకడున్నాడనీ, అతడితో ధర్మబద్ధంగా స్నేహం చేయమనీ, అతడు ప్రపంచంలో తిరగని చోటు లేదనీ, అతడు రాముడికి ఉపకారం చేస్తాడనీ చెప్పాడు కబంధుడు.

          కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు. రామలక్ష్మణులు చూస్తుండగానే, మండుతున్న ఆ మంటల్లో నుండి బయటకు వచ్చి, ఆకాశానికి ఎగిరిన కబంధుడు, తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు.

         “రామచంద్రా! లోకంలో సంధి, విగ్రహ, యానా, సన, ద్వైదీభావ, సమాశ్రయంలనే ఆరు ఉపాయాలను పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ ఆరింటిలో సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కాదు. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు కాబట్టి, నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం, సీత ఉనికి తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరివల్ల సాధ్యపడేది కాదు. కాబట్టి అన్యుల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే, ఎలాంటివారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, వియ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్పవారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువవాడు తనని చులకన చేస్తాడు కాని, నిండు మనస్సుతో ఆదరించడు”.

         “కాబట్టి నీ స్థితిలాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. సుగ్రీవుడు అనే వానర రాజు, తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని దుఃఖపడుతూ, పంపానది ఒడ్డున వున్న పవిత్ర ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడు. అతడు పరాక్రమవంతుడు. ఋజువర్తనం కలవాడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెదకడానికి అతడు నీకు సహాయపడతాడు. రామా! నువ్వెందుకు దుఃఖపడతావు? ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది కాని, దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటివారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదుకదా?.

“సుగ్రీవుడు, అన్న వాలికి భయపడి, తిరుగుతున్నాడు. వాడు నమ్మేట్లు నువ్వు నీ ఆయుధాలన్నిటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమ్మీదగల నదులు, నదాలు, కొండలు, అడవులు, వెతికి నీ భార్య ఎక్కడున్నదీ వార్తా తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నిన్ను ఎడబాసిన కారణాన దుఃఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడు. ఆ రావణుడి ఇల్లు వెతికి, వాడామెను పాతాళంలో దాచినా, మెరువు కొనలో ఉంచినా, రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు”.

          ఇంతదాకా రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. జటాయువు కూడా దక్షిణం వైపే పొమ్మని సలహా నిచ్చాడు. ఈ మార్గానికి కిష్కింధ పడమరగా వుంది. కబంధుడు, ఇంకా ఇలా అన్నాడు. పంపా సరస్సు వైపు పొమ్మంటాడు. పంపా సరస్సు గురించి వర్ణించి చెప్పాడు. అక్కడ సమీపంలోనే వుంటున్న శబరికి దర్సనం ఇవ్వమంటాడు. ఆమె రాముడిని దర్శించి స్వర్గం చేరాలనుకుంటున్నదనీ, రాముడి రాక కొరకు వేచి చూస్తున్నదనీ చెప్పాడు. ఇలా చెప్పి కబంధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు పొమ్మని ఆజ్ఞాపించారు. కబంధుడు సంతోషంగా పోయాడు. రామలక్ష్మణులు త్వరగా పడమటి దిశగా పయనమయ్యారు.

          పడమటి దిక్కుగా పోతున్న రామలక్ష్మణులు శబరి వుండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి సమీపించారు. (పంప ఒడ్డున ఈ ఆశ్రమం ఇప్పటికీ వుందట. ఈ గుహవాకిట్లో పట్టపగలు ఎండలు మండిపోతున్నప్పటికీ, దుప్పటి కప్పుకునేంత చల్లటి గాలి వీస్తుంది). శబరి వీరిని చూసి చేతులు మోడ్చి, వారిపాదాలను అంటి నమస్కరించి, పాద్యం ఇచ్చి, తగిన ఉపచారాలను అన్నింటినీ శాస్త్ర ప్రకారం కావించింది.

“శ్రీరఘురామచంద్రా! నేను శుశ్రూష చేస్తుండే నా గురువులు, మీరు చిత్రకూటానికి వచ్చారనీ, ఇక్కడికి వస్తారనీ, మీ దర్శనం చేసుకుంటే నాకు మళ్లీ జన్మలేని లోకం లభిస్తుందనీ చెప్పిన కారణాన మీ కొరకు వేచి చూస్తున్నాను. సంతోషంగా మీ కోసం మంచివి, ఏరి-కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించాను” అని అన్న శబరి మాటలకు ఆమెను చూసి రామచంద్రమూర్తి మతంగాశ్రమం వింతలు చూపించమని అడగ్గా ఆమె అలానే చేసింది. ఆ తరువాత శబరి, “రామా! వినతగినవన్నీ విన్నావు, చూడతగినవన్నీ చూశావు. ఇక నేను నా గురువులున్న చోటుకు పోయి వాళ్ళను దర్శించాలి. నాకు ఆజ్ఞ ఇవ్వు” అంటుంది. ఆ పుణ్యాత్మురాలు చెప్పిన మాటలన్నీ విన్న రామచంద్రుడు ఆమె గురుభక్తికి, దైవభక్తికి మెచ్చి, ఆమె కోరిక ప్రకారం పరమపదాని పొమ్మన్నాడు.

         శబరి పరమపదానికి పోగా, ఏకాగ్రమనస్కుడై, తన తమ్ముడు లక్ష్మణుడిని చూసి రామచంద్రుడు మతంగముని గురించి చెప్పాడిలా. “ఆహా! ఏమి, ఈ ఋషుల మహిమ? అవి చూస్తూ వుంటే చాలా ఆశ్చర్యంగా వుంది. లక్ష్మణా! ఇక్కడ జింకలు, పులులు, మచ్చికతో సహజ విరోధం వదిలి నమ్మకంగా తిరుగుతున్నాయి. మునీశ్వరులు వున్నప్పుడే కాకుండా వాళ్లు పోయిన తరువాత కూడా వాళ్ల తేజస్సు వ్యాపించి ఉన్నందున హింస అనేది కనబడడం లేదు. మునీశ్వరుడు సృష్టించిన సముద్ర జలాలతో పితృ తర్పణం చేశాం. ఇది మనకు మేలు చేస్తుంది. లక్ష్మణా! మన కష్టకాలం పోయింది. ఇక సౌఖ్యమే కలుగుతుంది. ఇక్కడికి సుగ్రీవుడు వుండే పర్వతం దగ్గరే. ఎంతో దూరం లేదు. ఇక మనం పంపకు పోదాం. అక్కడే కదా సుగ్రీవుడు వానరులతో వుండే ఋశ్యమూకం వున్నది. మనం సుగ్రీవుడిని చూడడానికి పోదాం పద. సీతను వెతికే పని అతడిదే కదా?” అన్న మాటలకు లక్ష్మణుడు తానూ ఆ విషయమే ఆలోచిస్తున్నానని అన్నాడు. వాళ్లు పంపాతీరం చేరారు.

         పంపా సరోవరం చూసిన రామలక్ష్మణులు దాని సౌందర్యానికి, వ్రతనిష్ఠ కల మునులతో కూడిన దాని మహిమకు ఆశ్చర్యపడి నేత్రానందంగా దాన్నే చూసుకుంటూ పోయారు. దానికి కొంచెం దూరంలో వున్న మతంగు కొలనులో స్నానం చేసి ఆ రాజకుమారులు సమీపంలోని అందమైన వనాలను చూస్తూ పోసాగారు. అలా పోతున్న వారికి అందమైన తీగలతో ప్రకాశించే బొట్టుగు చెట్లు, మాదిఫల వృక్షాలు, గన్నేరులు, మొల్లతీగెలు, మర్రులు, ఏడాకుల అరటులు, మొగలి చెట్లు, ఎర్ర గన్నేరులు, మామిడితోపులతో కూడిన ఆ వనం అలంకరించబడిన  పడుచులాగా వుంది. చిలుకలు, గుడ్డికొంగలు, నెమిళ్ళు లాంటి మనోహరమైన పక్షుల ధ్వనులు వింటూ సంతోషంగా పంప చేరారు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో, “ఈ పంప ఒడ్డున వున్న ఋశ్యమూకపర్వతం మీదనే కదా ఆ పుణ్యాత్ముడు సుగ్రీవుడున్నది? శోకతప్తుడినై రాజ్యాన్ని కోల్పోయి, భార్యను పోగొట్టుకుని ఎలా బతకాలి? కాబట్టి మన పనికోసం నువ్వు సుగ్రీవుడిని చూడడానికి వెళ్లు. నేను పోవడం మర్యాద కాదు”. ఇలా లక్ష్మణుడితో చెప్తూ, రామచంద్రమూర్తి అధికమైన దుఃఖంతో పంపాతీరాన్ని చూడడానికి అనువైన స్థలానికి తమ్ముడితో కలిసి చేరాడు. అందమైన ఆ కొలను చూసిన వారికి ఇన్నాళ్లు కలగని సంతోషం కలిగింది.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)