Tuesday, May 31, 2022

కాకతీయుల నుంచి కేసీఆర్ దాకా..... : వనం జ్వాలా నరసింహారావు

 కాకతీయుల నుంచి కేసీఆర్ దాకా.....

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-06-2022)

ప్రపంచంలోని అతి ప్రాచీనమైన ఆవాస ప్రాంతాలలో ప్రధానమైంది దక్కన్ భూభాగం. 1766 నుండి నైజాం పరిపాలన కింద వున్న తెలుగు ప్రాంతానికే తెలంగాణ అన్న పేరొచ్చింది. తిలింగ పదం కాకతీయుల కాలం నుంచి వ్యవహార శైలికొచ్చింది. శాతవాహనులు తెలంగాణ లోని కోటి లింగాల నుంచి పాలన ప్రారంభించారని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వీరికి సమాంతరంగా వాకాటకులు ఉత్తర తెలంగాణ జిల్లాలను పాలించారు. వాకాటకుల తరువాత విష్ణుకుండినులు ఏడవ శతాబ్దం దాకా పాలించారు. అ తరువాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు తమ పాలనను విస్తరించారు.

కాకతీయుల యుగం తెలంగాణలో స్వర్ణయుగంగా ప్రసిద్ధికెక్కింది. వ్యవసాయానికి నీటి పారుదల 22ప్రణాళికలు, గొలుసు కట్టు చెరువులు వారి హయాంలోనే వచ్చాయి. వ్యవసాయం లాభసాటిగా రూపుదిద్దుకున్నది కాకతీయుల పాలనలోనే. 1500 ప్రాంతంలో బహమనీ రాజ్యం ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. విడిపోయిన వారిలో కుతుబ్ షాహీలు కూడా వున్నారు. గోల్కొండ రాజ్య స్థాపకుడు కులీ కుతుబ్ షా 1592 లో రాజధానిని హైదరాబాద్ కు మార్చాడు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అప్పట్లో దాని పేరు భాగ్యనగరం. గోల్కొండ కోట మొఘల్ చక్రవర్తుల ఆధీనమైన తరువాత నిజాముల్ ముల్క్ సుబేదారుగా నియమించబడ్డాడు. ఆయనే స్వతంత్రం ప్రకటించుకుని ఆసఫ్ జాహీ వంశ పాలనకు శ్రీకారం చుట్టాడు. ఏడవ రాజైన నిజాం ఉస్మాన్ మీర్ అలీఖాన్ తో ఆసఫ్ జాహీ వంశం అంతరించింది.

           సాలార్ జంగ్ సంస్కరణలో భాగంగాప్రస్తుతం వున్న జిల్లాల వ్యవస్థరెవెన్యూ పాలనా వ్యవస్థజిల్లా బందీ విధానం వచ్చిందిహైదరాబాద్ తో కలుపుకుని తెలుగు మాట్లాడే ఎనిమిది (దరిమిలా అవే పది జిల్లాలయ్యాయి) జిల్లాలను ఒక ప్రాంతంగా ఏర్పాటు చేశారుఅదే ఇప్పటి 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రం. సాలార్ జంగ్ నిజాం రాజులను ఒప్పించి కృష్ణా నదికి వెళ్లే వరదలను సముద్రం పాలు కాకుండా నివారించడానికి డిండిమూసిపాలేరువైరా మొదలైన జలాశయాలను నిర్మించాడుఇప్పటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును మొదటగా ఆలోచించి డిజైన్ చేసినిర్మాణానికి ప్రయత్నం ఆయన కాలంలోనే జరిగిందిఅలాగేహైదరాబాద్ నగరానికి వరదలు తెచ్చే ప్రాంతంలోని నీటిని నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరిగిందిఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థవిద్యుత్ శక్తి వ్యవస్థ నెలకొల్పారువీటి నిర్మాణంలో అలీ నవాజ్ జంగ్ కృషి వుంది. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీసిటీ కాలేజీఆసిఫియా గ్రంధాలయం ఏర్పాటయ్యాయిపోలీసు చర్య తదనంతరం ఆంధ్ర ప్రాంత అధికారుల పెత్తనం పెరిగిపోయిందికమ్యూనిస్టుల సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. 1950 లో పౌర ప్రభుత్వం ఏర్పాటైఎం కే వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యారు. 1952 ఎన్నికల వరకు బూర్గుల రామకృష్ణారావు మంత్రి పదవిలో వున్నారు. 1952 లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది.

1952 నాటి ముల్కీ ఆందోళనలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ వూపందుకుందితెలంగాణలో గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమందరిమిలా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా డిమాండ్ చరిత్రలో భాగాలు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైఅందులో తెలంగాణ విలీనమైందిపేరుకు పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. అది కేవలం కాగితాలకే పరిమితమై పోయింది. అంతటితో ఆగకుండాతెలంగాణ ప్రాజెక్టులను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల డిజైన్ చేసిందిఅన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందివనరులు దోపిడీ చోటు చేసుకుందిఆంధ్ర ప్రాంతం వారే ఉద్యోగాలు దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం విడిపోతే తప్ప న్యాయం జరుగదనే భావన సర్వత్రా కలిగింది. 1969 లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగిందికొంతకాలం తరువాత అనేక కారణాల వల్ల అప్పట్లో ఉద్యమం రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కొనసాగలేకపోయింది. తెలంగాణకు సంబంధించిన నిధులునీళ్లునియామకాల్లో అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఈ అన్యాయం కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలలో నిరాటంకంగా కొనసాగింది.

          ఈ నేపధ్యంలోవిద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగాతెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగాసిద్దిపేట ఎమ్మెల్యేగాఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవులకు రాజీనామా చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టారుసుదీర్ఘంగా పదమూడేళ్ల పాటు సాగిన ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ పార్టీలతో సహాజాతీయ పార్టీ నాయకుల మద్దతు కూడగట్టారు కేసీఆర్. 2009 నవంబర్ 29న లో కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన మలుపుతెలంగాణ ప్రజల సమిష్టి పోరాట ఫలితంగా డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి వెనక్కు తగ్గింది. తెలంగాణ సమాజం ఉద్యమాన్ని తీవ్రతరం చేసిసకల జనుల సమ్మెమిలియన్ మార్చ్ లాంటివెన్నో చేపట్టి తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన విభజన చట్టం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది. జూన్ 2, 2014 , 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం కావడంఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేయడం జరిగింది.

              ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచేటీఆరెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాగ్దానాల అమలు దిశగాపరేడ్ మైదానంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ భవిష్యత్ కార్యక్రమాన్నిప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వారంలోపలప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతోందీఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేయబోతోందీవాటి అమలుకు ప్రభుత్వం రూపొందించుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక ఏంటీఅన్న విషయంలో స్పష్టమైన అవగాహనతోఆలోచనతో ముందుకు సాగుతూవాగ్దానాల అమలు దిశగా వడివడిగా అడుగులు వేసింది కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం.

ఇక అప్పటినుంచి...ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలన్నీ అమలు జరుగుతున్నాయివాటన్నింటి కన్నా ముఖ్యంగారాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి వేసే దిశగా వ్యూహం రూపొందించడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగాపారదర్శకంగా అమలు కాసాగాయికేంద్రంతోపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయిప్రభుత్వ పాలన కూడా ఉద్యమ పథంలోనే జరగ సాగిందితెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి తలమానికమయ్యేలా సుపరి పాలన అన్ని రంగాల్లో చోటు చేసుకుందిదళితులుగిరిజనులుబీసీలుమైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం దొరికిందిఈ వర్గాల కోసం ఏటేటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిగాయిఅభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పన-అమలు దేశంలో ఎక్కడ లేని విధంగా జరుగుతోందిక్కడ. ఎస్సీలుఎస్టీలుబిసిలుమైనారిటీలుఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందీ ప్రభుత్వంసంక్షేమ రంగానికి అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం

సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులనుదెబ్బతిన్న వ్యవసాయాన్నిగ్రామీణ ఆర్థిక వ్యవస్థనుపునరుద్ధరించడానికి పటిష్ఠమైన ప్రణాళిక వేసి అమలు చేస్తున్నదీ ప్రభుత్వం. చెరువులకు పూర్వ కళ రాసాగింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు శ్రీకారం చుట్టిందీ ప్రభుత్వం. శాస్త్రీయం అధ్యయనం చేసి ప్రాజెక్టుల రీ-డిజైన్ అవసరం వున్న చోట చేసింది. కాళేశ్వరం లాంటి ప్రపంచ ప్రఖ్యాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంతో పూర్తయ్యాయి. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందికు మిషన్ భగీరథను చేపట్టింది. వందకు వంద శాతం ఆవాసాలకు సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా పలువురి ప్రశంసలు అందుకున్నది తెలంగాణ. 51 నెలల పాలన అనంతరం ముందస్తు ఎన్నికలుకు పోవాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. దరిమిలా డిసెంబర్ 2018 లో జరిగిన ఎన్నికలలో అఖండమైన మెజారిటీ సాధించిన ఆయన నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు అధికారంలోకి వచ్చింది. ముఖ్యంత్రిగా కేసీఆర్ రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఇప్పటికి కీసీఆర్ పాలన మొత్తం ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకుని తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్తున్నది.  

ఇంతకు ముందే చెప్పినట్లు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేకానేక అద్భుతమైన, అమోఘమైన, ప్రత్యేకత సంతరించుకున్న, దేశానికే తలమానికమైన, తెలంగాణ మోడల్ గా పేర్కొనదగిన, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని, వినూత్న పధకాలకు, కార్యక్రమాలకు ఒకవైపున సంక్షేమ రంగంలో, మరోవైపున అభివృద్ధి రంగంలో, శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ దే. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ అన్ని రంగాలకు సరఫరా చేస్తున్నదీ ప్రభుత్వం. ర్రైటు బందు, రైతు భీమా, దళిత బంధు లాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికే ప్రత్యేకం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ దేశానికే తలమానికం. ఆర్థికంగా శరవేగంతో పురోగమిస్తూ అత్యంత ధనిక రాష్ట్రంగా మన్ననలు ఓండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలుకు అదనంగా, చెప్పనివెన్నో కూడాప్రజల బహుళార్థ సంక్షేమం-అభివృద్ధిని దృష్టిలో వుంచుకుని రూపొందించి అమలు చేస్తున్నదీ ప్రభుత్వంప్రజలకు ఈ ప్రభుత్వం పైన నమ్మకంఅభిమానంవిశ్వాసం వుందనడానికి నిదర్శనంగా అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరిగిన ఎంపీఎమ్మెల్యేఎమ్మెల్సీకార్పొరేషన్మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలను తీసుకోవాలిప్రజా క్షేత్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుపు ప్రభుత్వంలో వున్న పార్టీదేప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రజల సంక్షేమానికేననేది తిరుగులేని సత్యంప్రతి పథకం ఈ రోజున దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రశంసలను అందుకుంటున్నదిఎన్నో రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారుఆవార్డులందుతున్నాయి

ఏ తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలందరూ పోరాడారో, ఏ తెలంగాణ పోరాట ఫలితంగా సాకారమైందో, ఏ తెలంగాణాలో ప్రతి వ్యక్తీ సుఖ శాంతులతో జీవించాలని కోరుకుంటున్నాడో, ఏ తెలంగాణాలో ప్రతి వ్యక్తీ తన అవసరాలు తీరాలని భావిస్తున్నాడో, ఏ తెలంగాణలో గతంలో జరిగిన దోపిడీకి తావులేకుండా పోతుందో, ఏ తెలంగాణాలో బంగరు భవితకు బాటలు పడాల్నో, ఆ తెలంగాణాలో మనం వున్నాం ఇప్పుడుతెలంగాణ ధనిక రాష్ట్రంఇక్కడి వనరులు ఇప్పుడు ఇక్కడివారికేమన నిధులు మనవే. మన ఉద్యోగాలు మనవేమన సాగు నీరు మనదేఅనతికాలంలో మనం రూపొందించుకున్న ప్రాజెక్టులుపథకాలుకార్యక్రమాలు పూర్తి ఫలితాలను ఇవ్వడం నగ్న సత్యంమన రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆదాయంరాష్ట్ర ఆదాయం వృద్ధి చెందుతుందిసంపద పెరుగుతుంది. రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందిజాతి పునర్నిర్మాణంలో మనవంతు పాత్ర పోషిస్తాం. మన కలలు పండుతాయి.

తెలంగాణ ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం రాష్ట్ర రధసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడే రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తే కానిదేముంది? దటీజ్ కేసీఆర్!!!   

(జూన్ నెల 2, 2022 న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా)

 

No comments:

Post a Comment