Saturday, September 30, 2023

న్యాయం ఆలస్యమైతే దానిని నిరాకరించినట్లే! ..... వనం జ్వాలా నరసింహారావు

 న్యాయం ఆలస్యమైతే దానిని నిరాకరించినట్లే!  

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-09-2023)

ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ, రాజకీయేతర ప్రముఖుల అరెస్టులు, వారిలో కొందరికి తక్షణమే బెయిల్ రూపంలో తాత్కాలిక, ఆ తరువాత శాశ్వత ఉపశమనం దక్కుతోంది. మరికొందరికి విశ్వప్రయత్నాలు చేసినా ఎటువంటి ఉపశమనం లభించడంలేదు. కొందరిని సుదీర్ఘకాలం ‘అండర్ ట్రయల్స్ గా జైళ్లలో వుంచి రిమాండుల పేరుతో విచారణ చేస్తున్నారు. మరికొందరికి అకస్మాత్తుగా బెయిల్ ఇచ్చి ఏళ్ల తరబడి కేసును తేల్చకుండా వారికి స్వేచ్చ కలిగించడం చూస్తున్నాం. వీరిలో కొందరు ఏకంగా ఎన్నికల్లో పోటీచేసి ఉన్నత పదవులను అలంకరించి, తమ స్థితినే ప్రత్యర్థులకు కలిగిస్తున్నారు. ఇంకొందరు అధికారులుగా ఉన్నత పదవుల్లో పనిచేసి పదవీ విరమణ చేయడం, మరికొందరు పూర్వపు వ్యాపార లావాదేవీలలో టిరిగి చురుగ్గా పాల్గొనడం లాంటి పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారికి ఆశ్చర్యం, విస్మయం, ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తు అయోమయంగా కూడా దర్శనమిస్తున్నది.

న్యాయశాస్త్ర నియమ, నిబంధనల నేపథ్యంలో, రాజ్యాంగ ప్రకరణాలకు, సహజ న్యాయ, ధర్మ సూత్రాలకు వందకు వందశాతం అనుగుణంగానే న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. అలా వుంటున్నాయా అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు, ఒక్కొక్కరి విషయంలో, ఒక్కొక్క విధంగా వుంటున్నదనేది వచ్చే జవాబు. న్యాయం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగం నొక్కివక్కాణిస్తున్నా, సామాన్యులకూ, అసామాన్యులకూ; పలుకుబడికల వారికి, లేనివారికి; ధనస్వామ్యులకు, పేదలకు; అధికారపార్టీ మద్దతు వున్నవారికి, అనధికార పార్టీ మద్దతు లేని వారికి; ఒక్కొక్క రాజకీయ నాయకులకు ఒక్కొక్క విధంగా; రకరకాలుగా న్యాయం వింతపోకడలు పోవడం, ప్రత్యేకించి ఇటీవలి కొన్ని సంవత్సరాలుగా, బహుశా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ‘భారత్ (ఇండియా) కే చెందుతుందేమో!!! వాస్తవానికి రాజ్యాంగం దృష్టిలో ‘అందరూ సమానులే’ అంటున్నప్పటికీ, కొందరు ‘ఎక్కువ సమానులు కొందరు ‘తక్కువ సమానులు అనే అర్థాన్ని స్ఫురించే విధంగా న్యాయవ్యవస్థ వున్నదా అన్న అనుమానానికి ఆస్కారం వుందనడం బహుశా అతిశయోక్తి కాదేమో!

కొందరి విషయంలో న్యాయం త్వరితగతిన పరిష్కారం కావడానికి కాని, ఉపశమనం లభించడం కానీ, ఇతరుల విషయంలో అలాంటి తరహా న్యాయమే కనీసం ఆలస్యంగా కూడా పరిష్కారం కాకపోవడం కాని,  తాత్కాలిక ఉపశమనం కూడా లభించకపోవడానికి కానీ కారణాలు, వారి సామాజిక, ఆర్ధిక స్థోమతైనా, రాజకీయ పలుకుబడైనా, లేదా వారి, వారి పక్షాన వాదించడానికి నియమించుకునే న్యాయవాది ప్రజ్ఞాపాటవాలకు, ఆయనకు ఫీజు చెల్లించుకునే స్థోమతకు సంబంధమేమైనా వున్నదేమో! విచారణ సంస్థలు, న్యాయం, న్యాయశాస్త్రం, న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాలు ఒక్కొక్కరి విషయంలో, ఒక్కొక్క విధంగా వ్యవహరించడం ఈవిధంగానే నిర్విఘ్నంగా కొనసాగితే, భవిష్యత్తులో న్యాయవ్యవస్థ మీద నమ్మకం క్రమేపీ సడలుతుందేమో!!! ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదేమో!

పౌరులందరి విషయంలో సమానంగా వుండాల్సిన నైతిక, రాజ్యాంగ బాధ్యత స్థానంలో కొందరికి వేగంగా, మరికొందరికి ఆలస్యంగా పరిష్కారం కావడాన్ని మేధావులు, రాజ్యాంగనిపుణులు, న్యాయశాశ్త్ర కోవిదులు, పదవీ విరమణ చేసిన నిష్పాక్షిక న్యాయమూర్తులు, రాజనీతిజ్ఞులు, పౌరహక్కుల రంగప్రముఖులు, విద్యావేత్తలు, అఖిలపక్ష నాయకులు, తదితరులు నిశితంగా చర్చించి ఆమోదయోగ్యమైన సూచనలు, సలహాలు చేసే సమయం ఆసన్నమైందనడంలో ఇసుమంతైన సందేహం కూడా లేనేలేదు.

నాలుగున్నర దశాబ్దాలకు పైగా వివిధ పదవుల్లో తనదైన ముద్రవేసి, శక్తిమేరకు ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సుదీర్ఘకాలం ప్రజాస్వామ్య బద్ధమైన ఉన్నత పదవిలో ముఖ్యమంత్రిగా సేవలందించడంతో పాటు, ప్రధాన ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరించిన వ్యక్తిని, పదవిరీత్యా ఆయన తప్పుచేశాడో లేదో సరైన నిర్ధారణ కాకుండా, ఆయన వయసు, ఆరోగ్యం కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఎక్కడికో పారిపోతాడన్న రీతిలో అరెస్టు చేయడం, జైలుకు సహితం పంపడం, విచారణ నిమిత్తం రిమాండుకు ఇవ్వడం, న్యాయసూత్రాలకు అనుగుణంగా వున్నాయేమో కాని, కొంత ఎబ్బెట్టుగా కనిపించడంలో మాత్రం సందేహంలేదు. న్యాయసూత్రాలకు వ్యాఖ్యానం చెప్పడం, అన్వయించు కోవడం ఎప్పుడూ ఒకేరకంగా వుండకపోవచ్చు. కాని, కనీసం ఏ స్థాయి న్యాయస్థానంలో కూడా బెయిల్ ఇవ్వకుండా వుండడం ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం. ‘న్యాయం ఆలశ్యమైతే, న్యాయం నిరాకరించినట్లే’.  

ఒక పార్టీ అధినాయకుడు, కాలం కలిసొస్తే మరోమారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్న వ్యక్తిని, ఒకవేళ కాలేకపోయినా ప్రతిపక్షనాయకునిగా వుండే వ్యక్తిని, నామమాత్రంగా అరెస్ట్ చేసి, బెయిల్ మీద విడుదల చేసి, ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజులు విచారణ చేయకూడదా? చార్జ్ షీట్ దాఖల్ చేసి కోర్టులో న్యాయ విచారణ జరపకూడదా? అనేది విశ్లేషకులకు కలిగే సందేహం. పోలీసు అధికారి అరెస్టయిన వ్యక్తికి ఆ వ్యక్తి చేసిన నేరానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడంతోపాటు, నేరం బెయిలబుల్ కావడానికి గల ప్రమాణాలకు సరిపోతుంటే వారు బెయిల్‌పై విడుదల చేయడానికి అర్హులని చెప్పి, సాధ్యమైనంతవరకు వారికి తోడ్పడడం సహజన్యాయం. ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయనేది సందేహాస్పదమే. ఆ వ్యక్తి అరెస్ట్ వ్యతిరేకించడం కానీ, సమర్థించడం కానీ ఈ వ్యాసం ఉద్దేశం కానేకాదు.

ఇదిలావుండగా, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో (ముఖ్య) మంత్రికి రాజ్యాంగ పరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యతే ఉంటుంది. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి. సంబంధిత (ముఖ్య) మంత్రికి అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలి. అలాంటప్పుడు నిర్ణయాలకు సంబంధించిన సమాచారం అందించడానికి అధికారుల సమక్షంలో విచారణ జరపడం,  న్యాయమేమో ఆలోచనచేస్తే మంచిది.

 అరెస్టు అనేది ఎప్పుడూ తప్పనిసరి కాదని, 'అరెస్టును రొటీన్‌గా చేస్తే, అది వ్యక్తి ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి ఎనలేని హాని కలిగిస్తుందని, ఆగస్ట్ 20, 2021 న ఒక కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మా రాజ్యాంగ ఆదేశంలో ముఖ్యమైన అంశం అని మేము గమనించవచ్చు. కస్టడీ విచారణ అవసరమైనప్పుడు లేదా అది ఘోరమైన నేరం లేదా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న చోట లేదా నిందితులు పరారీలో ఉన్నప్పుడు దర్యాప్తు సమయంలో నిందితుడిని అరెస్టు చేసే సందర్భం ఏర్పడుతుంది. కేవలం చట్టబద్ధమైనందున అరెస్టు చేయవచ్చన్న కారణంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదు' అని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొనిందప్పుడు. అలాగే జూలై 16, 2022 నాడు, జైపూర్‌లో జరిగిన 18 వ అఖిలభారత లీగల్ సర్వీస్ అథారిటీస్ సమావేశంలో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రసంగిస్తూ, విచక్షణారహితంగా అరెస్టులు చేయడం,  త్వరితగతిన బెయిల్ పొందడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం గురించి ప్రస్తావించారు. వారి మాటల ప్రకారం, అండర్ ట్రయల్స్‌ను సుదీర్ఘంగా నిర్బంధించే ప్రక్రియకు తక్షణ శ్రద్ధ అవసరమని బోధపడుతుంది.

భారత న్యాయవ్యవస్థ నిష్పాక్షికతకు, స్వతంత్రతకు యావత్ ప్రపంచానికే ఆదర్శం. భారతదేశ ప్రధమ పౌరుడికి ఎలాంటి న్యాయమో, సామాన్య పౌరుడికి కూడా అలాంటి న్యాయమే, సమాన స్థాయిలో వుంటుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు కూడా వున్నాయి. అయినా, ఎందుకోకాని, ఎక్కడో, ఏదో, అర్థంకాని ‘సందేహాస్పద వెలితి’ కనిపిస్తుంటుంది. జూన్ 1975 లో మకుటంలేని మహారాణి అనిపించుకున్న ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు పాక్షికంగా నిలుపుచేసి, కింది న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడం జరిగింది. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అక్టోబర్ 2000 లో కిందికోర్ట్ మూడేళ్లు శిక్ష విధించడం, అమలుకు స్టే ఇవ్వడం, పైకోర్టు 2002లో శిక్ష రద్దు చేసి నిర్దోషిగా విడుదల చేయడం తెలిసిందే. వీరి విషయంలో విచారణ జరిగింది కాని అరెస్టులు జరగలేదు.

గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులను కొన్నేళ్ల విరామం తరువాత అదే అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టిన సందర్భాలు కూడా వున్నాయి. ఉదాహరణకు, 2011 జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, అసలే జరుగదనే నమ్మకంలేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది. అప్పట్లో న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక ‘హెబియస్ కార్పస్ కేసు’ లో తీర్పిచ్చిన నలుగురు న్యాయమూర్తులు, ‘ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు’ అని ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయాన్ని జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు తప్పుపట్టారు. ఆ ఇద్దరు న్యాయమూర్తులు కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అలాగే ఆ బెంచీ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఉన్నతంగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదనేది దీని సారాంశం. ఆయన భిన్నాభిప్రాయానికి ప్రతిఫలంగా సుప్ర్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం పోయింది ఖన్నాకు.

భారత రాజ్యాంగం దేశానికి అత్యున్నతమైన చట్టం. దానిముందర అందరూ సమానులే. అంటే పౌరులందరూ సమానులే అయినప్పుడు, కొందరి విషయంలో న్యాయం త్వరితగతిన, మరికొందరి విషయంలో, కొన్ని కేసుల విషయంలో ఆలస్యంగా ఎందుకు అమలు కావాలి? ఒకవైపు వందల, వేల కేసులు వివిధ న్యాయస్థానాలలో ఏళ్ల తరబడి పెండింగులో వున్నాయని చెప్తూనే, కొందరి కేసులు, కింది నుండి పైన్యాయస్థానాల దాకా పిటీషన్ దాఖల్ చేసిన నిమిషాలలో, గంటలలో, రోజుల్లో, తాత్కాలిక స్టే పేరుమీదో, మధ్యంతర ఉత్తర్వుల పేరుమీదో, కింది న్యాయస్థానం ఉత్తర్వులను తాత్కాలికంగా కొట్టివేయడం అనే పేరుమీదో, బెయిల్ ఇవ్వడమో, లేదా ఇంకేదన్నా ‘రిలీఫ్ పేరుమీదో ఉపశమనం కలిగించడమో జగమెరిగిన సత్యం. ఇక మరికొందరు ఏ న్యాయస్థానానికి వెళ్లినా ఎందుకోకాని చుక్కెదురే! రిమాండుల మీద రిమాండులే!

కొందరు ఏళ్ల తరబడి, లేదా, నెలల తరబడి జైలులో వుండి, వారితోపాటు సహచరులను వుంచుకుని, రాజభోగాలు అనుభవించి, బెయిల్ మీద బయటకొచ్చి, ఏళ్ల తరబడి కేసులు తేలకుండా వుండడం ఆశ్చర్యకరమైన విషయమే! కొందరికి, కోరుకోగానే చట్టం ఇచ్చిన అవకాశాలైన తక్షణ బెయిల్, యాంటిసిపేటెడ్ బెయిల్, లంచ్ మోషన్, క్యాష్ మోషన్, హౌజ్ మోషన్, హెబియస్ కార్పస్ పిటీషన్ లాంటివి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. మరికొందరికి ఆ రిలీఫ్ వుండదు. ఎవరెవరికి ఇలాంటివి ఏవిధంగా ఉపయోగపడుతాయో సామాన్యుడికి, తెలిసే రోజు రావాలి. కొందరిని ఏళ్ల తరబడి ‘అండర్ ట్రయల్స్ గా జైళ్లలో ఉంచడంలో హేతుబద్ధత, న్యాయబద్ధత ఏమిటి? సుదీర్ఘకాలం అలా వున్నతరువాత వారు నిర్దోషిగా తేలితే అలా వున్న వ్యక్తికి జరిగిన నష్టానికి పరిహారం ఏమిటి? ఎందుకు ఇలాంటి కేసులను తక్షణం పరిష్కరించ కూడదు?

17 comments:

  1. ఎంత గొప్ప చట్టం ఐనప్పటికీ అమలుచేసే వారి పైన ఆధారపడి ఉంటుంది అది సరిగా పనిచేయటం. దీనికి విరుగుడు న్యాయవ్యవస్థను శాసనవ్యవస్థకు లోబడి ఉన్న పరిస్థితినుండి విముక్తి కలిగించి స్వతంత్రంగా పనిచేయగల పరిస్థితి కల్పించటమే. అది జరిగే పని కాదు. అందుచేత సమన్యాయమూ నెఱవేరే అవకాశమూ లేదు.

    ReplyDelete
    Replies
    1. ఈ సన్నాయి నొక్కులు కొంతమంది కోసమే పలుకుతాయి. తమకు నచ్చని వాళ్ళు ఇబ్బంది పడితే అంతా సవ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మాట పెగలదు.

      Delete
    2. మీరు చెప్పింది అక్షరాలా నిజమే. మీరు చెప్పే ప్రకారం న్యాయవ్యవస్థ చట్టానికి లోబడి పని చేయదా? పరిపాలకులకు లోబడి పని చేస్తుందా? చట్టాలు కూడా న్యాయ వ్యవస్థే చేస్తుందా? న్యాయవ్యవస్థే పరిపాలన చేస్తుందా?ఇదివరకునుంచీ అలాగే ఉందా? అటువంటపుడు దానిని మార్చాలని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు తోచలేదు? తమ బాధ ప్రపంచమంతటీకి బాధేనా? సామాన్యులకి కోర్టులు అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచి న్యాయం చెబుతాయా? చెబుతున్నాయా? ఈ సన్నాయి నొక్కులు పెద్దవారి బాధ కలిగినపుడే బయటికొస్తాయా? సమన్యాయం కావాలని గొంతెందుకెత్తటం లేదు? చెప్పాలనిపిస్తే చెప్పండి.

      Delete
    3. న్యాయాలయాలు స్వతంత్రంగా పని చేయటం లేదంటారా? అందరు న్యాయధిపతులూ చట్టం తెలియకనే తీర్పులిస్తున్నారంటారా? శాసన వ్యవస్థలే న్యాయాధిపతులు లొంగి పనిచేస్తున్నారా? ఏ కేస్ లో ఏ తీర్పు ఇవ్వాలో ప్రభుత్వాలే నిర్ణయించి చెబుతున్నాయా న్యాయాధిపతులకు?

      Delete
    4. 41A నోటీస్ ఇవ్వాలని పోలీసులకు తెలీదా? 75సంవత్సరాలలో ఎంతమందికి ఈ నోటీస్ ఇచ్చి ప్రశ్నించారు పోలీసులు? ఏ ప్రభుత్వాన్ని అడిగారు మీరు, అలా నోటీసులివ్వక బలవంతంగా ఎవరికిని చెప్పకనే తీసుకుపోతున్నారని ప్రభుత్వాలకి చెప్పుకున్నప్పుడు, తమరూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెబితే చేసినదేమి? పెద్దల దగ్గరకొచ్చేటప్పటికే ఈ నోటీసులు గుర్తొస్తాయా? పెద్దలకో నీతి సామాన్యులకో నీతి ఉందా? చెప్పండి చెప్పాలనుకుంటే!

      న్యాయం ఆలస్యంగా చెబితే నిరాకరించినట్టే! చిత్తం ఎంతమంది విషయంలో ఇది అమలుజరుగుతోందో చెబుతారా!

      Delete
    5. I agree to disagree if our views differ. I mentioned clearly that 'ఆ వ్యక్తి అరెస్ట్ వ్యతిరేకించడం కానీ, సమర్థించడం కానీ ఈ వ్యాసం ఉద్దేశం కానేకాదు'. My only request is please read once again calmly and coolly and then I am sure you will understand that I only raised an issue but did not question. Ifd I am hurt anyone my apologies please.

      Delete
  2. ---- క పార్టీ అధినాయకుడు, కాలం కలిసొస్తే మరోమారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్న వ్యక్తిని, ఒకవేళ కాలేకపోయినా ప్రతిపక్షనాయకునిగా వుండే వ్యక్తిని, నామమాత్రంగా అరెస్ట్ చేసి, బెయిల్ మీద విడుదల చేసి, ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజులు విచారణ చేయకూడదా? ----

    చంద్ర బాబుకొ న్యాయం .. మిగతా వారికో న్యాయమూనా .. మీరు పచ్చ పత్రికకు రాసిన వ్యాసంలో ఇంత కన్నా కోరుకునేది ఏముంటుంది లెండి

    ReplyDelete
  3. జ్వాలా, భండారు .. లౌక్యం .

    న్యాయస్థానాలు కేసును పరిశీలించి న్యాయ నిర్ణయం చేస్తాయి. క్రియాశీలంగా ఉన్నవారికి వయస్సు సెలెక్టివ్ గా క్రైటీరియా ఎలా అవుతుంది.

    ఎంత గొప్ప వ్యక్తి అయినా చేసిన కర్మలకు అనుగుణంగా ఫలాలను ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో అనుభవించక తప్పదు.

    ReplyDelete
  4. మూడు నాలుగు గొడుగులు సిద్ధం చేసి పెట్టుకుంటే మంచిది. ఎప్పుడు ఏ గొడుగు అవసరం పడుతుందో చెప్పలేము

    ReplyDelete
  5. నీహారిక, జిలేబి ఇద్దరూ ఏమయ్యారు ..

    ReplyDelete
    Replies
    1. నరుడా ఏమీ నీ కోరిక ?

      Delete
    2. జిలేబి తినాలనుంది

      Delete
    3. జిలేబి... జిలేబి దగ్గరే దొరుకును. ప్రస్తుతం కంద పద్యాలు వండుతున్నారు.

      Delete
    4. జిలేబి గారూ
      మీరు లేని సమయం చూసి బడుద్దాయిలు వాల్ల వాల్ల ఇష్టమొచ్చిన చంఫుడు లో పజ్యాలల్లేస్తున్నారు ఓ మారొచ్చి గదమాయించండి

      Delete
    5. ఐతే ఓ అనానిమస్సు గారూ, మీరు జిలేబీ చంపితేనే హాయిగా చస్తూ ఉంటారన్నమాట.

      Delete
  6. నీహారిక గారూ .. మీ దర్శన భాగ్యం మా ఆదృష్టం ..

    ReplyDelete
    Replies
    1. బ్లాగర్లు అందరూ quora లో వ్రాస్తున్నారు. అక్కడ మీకు బోలెడంత భాగ్యం కలుగును.

      Delete