Sunday, April 28, 2024

తూర్పు కదంబ వంశం, మైత్రక వల్లభి రాజవంశం (బ్రాహ్మణ రాజులు-19, 20) : వనం జ్వాలా నరసింహారావు

 తూర్పు కదంబ వంశం, మైత్రక వల్లభి రాజవంశం

(బ్రాహ్మణ రాజులు-19, 20)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-04-2024)

తూర్పు కదంబ వంశం

తూర్పు కదంబ వంశరాజులు కళింగ కాదంబులుగా వ్యవహరించబడినారు. వీరు కళింగ సామ్రాజ్యంలోని ఒక భాగాన్ని ఏలారు. కదంబ రాజవంశీయులు నేటి బెల్గాం, ధార్వార్ జిల్లాలను వైజయంతి, బనవాసి రాజ్యాలుగా పాలించారు. ఈ కదంబ రాజులను పశ్చిమ కదంబ వంశీయులు అనేవారు. కళింగ దేశంలోని భాగాలు పాలించిన వారిని తూర్పు కదంబులనీ, కళింగ కదంబులనీ పిలిచేవారు. వీరు కళింగ గాంగ వంశపు రాజుల సామంతులు. ఇప్పటికీ అనేక కదంబ కుటుంబాలవారు గంజాం మండలంలో వున్నారు. మరికొందరు కటక్ రాజస్వ విభాగంలో నివసిస్తున్నారు.

         తూర్పు కదంబ వంశీయులు తొలుత గంగానదీ మైదాన ప్రాంతంలో వుండేవారు. వారు క్రమంగా కళింగానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో వీరి వలస ప్రారంభం అయింది. ఇకపోతే పశ్చిమ కదంబులు లేక వనవాసీ కదంబులు నేటి తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా కందూరు గ్రామ వాస్తవ్యులు. కదంబ వృక్షాన్ని పూజించేవారు. వీరిలో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మయూరశర్మ సంతతి వారు కదంబ రాజ్యాన్ని అతి వైభవోపేతంగా పాలించి, వాకాటక, గుప్తవంశపు రాజులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకొని ప్రబల శక్తి సమన్వితులై వుండేవారు.

         తొలుత తూర్పు కదంబులు మగధ రాజ్య భాగాన్ని పాలిస్తూ కళింగానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అలా స్థిరపడిన కదంబులు శివపూజా దురంధరులు. కదంబ వృక్షాల వల్లే ఈ వంశీయులను కదంబులు అని పిలిచారు. కాదంబులు మత్స్య వంశీయులు. బహుశా అలనాటి విరాటరాజు వంశానికి చెందిన వారై వుండవచ్చు. తూర్పు కదంబ వంశీయులు ప్రాచీన అర్వాచీన గాంగ వంశపు రాజుల సామంతులుగాను, బందువులుగాను వర్దిల్లారు. పశ్చిమ కదంబ వంశీయులు ఏ విధంగానైతే పశ్చిమ గాంగ వంశపు రాజులతో సత్సంబంధాలు కలిగి వున్నారో, అలాగే తూర్పు కదంబ వంశీయులు తూర్పు గాంగ వంశపు రాజులతో సంబంధ బాంధవ్యాలు కలిగి వుండేవారు.

         తూర్పు కదంబ వంశీయులు ఖేతపురం రాజధానిగా కళింగ గాంగ వంశపు రాజుల సామంతులుగా, కళింగావనిలోని ఒక భాగాన్ని పాలించారు. తూర్పు కదంబ వంశీయులు వేద విద్యలను ప్రోత్సహించి అనేక దేవాలయాలను నిర్మించారు. వేదవేదాంగేతిహాసాలను అభ్యసించారు. నాగఖేడి కదంబ వంశీయుడు. గాంగ సామ్రాజ్యంలో ఉన్నత పదవిలో నియమించబడ్డాడు. ధర్మఖేడి తండ్రి భీమఖేడి. తాత నియర్ణవ. జయంతీపురం ధర్మఖేడి నివాసం. అతడికి అనేక బిరుదులున్నాయి.

         తూర్పు కదంబ రాజ వంశీయుల శాసనాలు వారు మహేంద్రగిరి ప్రాంతాన్ని పటిష్టపరిచి పాలించినట్లు తెలియచేస్తున్నాయి. కదంబ రాజ వంశీయులు గాంగ వంశపు రాజుల విదేయ సామంతులుగానే కాకుండా వారి సేనానాయకులుగానూ, మంత్రులుగానూ వ్యవహరించారు. గాంగ వంశపు రాజులు కదంబ రాజ కుమారుల మీద సంపూర్ణంగా రాజ్య రక్షణా బాధ్యతలను మోపినారు. కళింగ దేశంలో గాంగ శకంతో పాటు కదంబ శకం కూడా వ్యాప్తిలోకి వచ్చింది.

         గాంగ వంశపు రాజులలాగానే కదంబులు కళింగ దేశంలో రాజ్యాన్ని స్థాపించుకుని, వైదిక మతాన్ని ఉద్ధరిస్తూ, బ్రాహ్మణులకు, దేవాలయాలకు, విద్యాసంస్థలకు అనేక అగ్రహారాలను ఇస్తూ తమ ప్రభు భక్తిని, దైవ భక్తినీ చాటుకున్నారు. చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకున్న ఈ వంశపు రాజులు, కాకతీయులు కళింగ రాజ్యాన్ని జయించిన తదుపరి వారి సామంతులుగా స్వీకరించబడినారు.    

మైత్రక వల్లభి రాజవంశం

           గుప్త సామ్రాజ్య పతనానంతరం భారత ఉత్తర భాగాలలోనూ, పశ్చిమ తీరంలోనూ, దక్షిణాపథ, దక్షిణ భారతంలోనూ, అనేక స్వతంత్ర రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఈ రాజ్యాలన్నీ చిన్నవి. ఒకటి-రెండు మాత్రం గొప్ప రాజ్యాలుగా వర్ధిల్లాయి. ఈ రాజవంశాల వారు ఒకరితో మరొకరు కలహించుకుంటూ, తమ తమ రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా చివరకు పతనమయ్యారు. ఈ రాజ వంశాల వారిలో వల్లభీలు, కదంబులు, ఘూర్జరులు, మౌఖరులు, కామరూప పాలకులు, తదితరులున్నారు.

         ఇదిలా వుండగా, వల్లభి నగరాన్ని రాజధానిగా పాలించినవారు వల్లభి రాజవంశీయులు. వీరు గుప్తరాజుల సేనానులుగా వుండేవారు. ఈ వంశానికి ఆజ్యుడు భట్టారకుడు. ఇతడు గుప్త సామ్రాజ్యంలో సేనానాయకుడిగా వుండి, ఆ రాజ్య పతనావస్థ కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. భట్టారకుడు మైత్రక వంశ సంజాతుడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు, భట్టారకులు. భట్టారకుడు శక్తి సమన్వితుడు. తన పరిధిలో వున్న రాజ్యాన్ని అతడు గుప్త రాజుల ప్రతినిధిగా పాలించాడు. అతడి పాలన క్రీస్తుశకం ఐదవ శతాబ్ది ఉత్తరార్ధం వరకు సాగింది. భట్టారకుడి తరువాత అతడి కుమారుడు ధారసేనుడు సింహాసనానికి వచ్చాడు. ధారసేనుడి సోదరుడు ద్రోణసింహుడు మైత్రక వల్లభి వంశంలో మూడవ రాజు. మహారాజు బిరుదం వున్నవాడు. ద్రోణసింహుడి సోదరుడు ధ్రువసేనుడు వల్లభి రాజ్యాన్ని స్వతంత్రంగా పాలించాడు. ఇతడిని కూడా మహారాజుగా పేర్కొన్నారు చారిత్రకారులు.

         వల్లభి నగరం మైత్రక వంశీయుల రాజధానీ నగరం. ఈ రాజ వంశీయుల శాసనాలన్నీ వల్లభి నగరం నుండే ప్రకటించబడ్డాయి. వీరు వల్లభిని ఎప్పుడు రాజధానిగా చేసుకున్నారో ఆధారాలు లేవు. బహుశా సురక్షిత నగరమైన వల్లభిని మైత్రక వంశీయులు తమ రాజధానిగా చేసుకొని వుండవచ్చు. వల్లభి రాజ్యం ఎలా అభివృద్ధి చెందినదో ఆధారాలు లేకపోయినప్పటికీ, అది సౌరాష్ట్రంలో ప్రబలమైనదిగా కీర్తించబడినది. వల్లభీపుర ప్రాంతం భావనగర్ రాష్ట్రంలోని తూర్పు కథియావాడ్ కు చెందినది.

         మొదటి ధ్రువసేనుడు ప్రబల శక్తి సమన్వితుడు. అతడు వల్లభీ రాజ్యాన్ని అతి వైభవంగా 20 సంవత్సరాలు పాలించాడు. వల్లభీరాజులలో ఇతడు నాల్గవవాడు. వంశ స్థాపకుడైన భట్టారకుడికి నలుగురు కొడుకులు. వారు ఒకరి తరువాత మరొకరు వల్లభీరాజ్యాన్ని పాలించారు. వారిలో మొదటి ధారసేనుడు జ్యేష్టుడు. రెండవవాడు ద్రోణసింహుడు. మూడవ కుమారుడు ధ్రువసేనుడు. నాల్గవ వాడు ధారపట్ట. ధ్రువసేనుడు వల్లభి రాజ్యాన్ని క్రీస్తుశకం 525 నుండి క్రీస్తుశకం 545 వరకు పాలించాడు. అతడి తరువాత సోదరుడు ధారపట్ట క్రీస్తుశకం 545 నుండి క్రీస్తుశకం 559 వరకు 14 సంవత్సరాలు పాలించాడు.

         ధారపట్ట మహారాజు కుమారుడు గుహసేనుడు ప్రతిభావంతుడు. తండ్రి తరువాత వల్లభి రాజ్యపాలనా బాధ్యత వహించి సుమారు 8 సంవత్సరాలు పాలించాడు. ఇతడు స్వతంత్రంగా వల్లభి రాజ్యాన్ని పాలించాడు. వల్లభి వంశంలో మహారాజుగా పేరుగాంచిన గుహసేనుడి కుమారుడు రెండవ ధారసేనుడు తండ్రి అనంతరం క్రీస్తుశకం 567 లో సింహాసనం అధిష్టించాడు. ఇతడు కూడా పరాక్రమవంతుడే. గురులక వంశీయుడైన సింహాదిత్యుడు ఇతడి సామంతుడు. రెండవ ధారసేనుడు వల్లభి రాజ్యాన్ని విస్తరించాడు ఇతడు క్రీస్తుశకం 590 వరకువరకు సుమారు 23 సంవత్సరాలు పాలించాడు.

         రెండవ ధారసేనుడి పెద్ద కుమారుడు కరగ్రహుడు తండ్రి తరువాత క్రీస్తుశకం 590 నుండి 606 వరకు 16 సంవత్సరాలు ప్రశాంతంగా పాలించాడు. మైత్రిక వంశంలో ప్రసిద్ధికెక్కిన వల్లభి పాలకులలో మొదటి శిలాదిత్యుడు ప్రముఖుడు. అతడు రెండవ ధారసేనుడి రెండవ కుమారుడు. కరగ్రహుడి సోదరుడు. రెండవ ధ్రువసేనుడు, శిలాదిత్యుడి అనంతరం వల్లభి రాజ్యాన్ని క్రీస్తుశకం 640 వరకు పాలించాడు. శిలాదిత్యుడి పాలనాకాలం క్రీస్తుశకం 606 నుండి క్రీస్తుశకం 612, సుమారు 6 సంవత్సరాలు.

         శిలాదిత్యుడి అనంతరం వల్లభి రాజ్యం క్షీణించ సాగింది. ఇతడి సోదరుడు మొదటి కరగ్రహుడికి ఇద్దరు కుమారులు. వారిలో మూడవ ధారసేనుడు మొదటివాడు. అతడు పినతండ్రి శిలాదిత్యుడి మరణానంతరం వల్లభి రాజ్య సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం 612 నుండి క్రీస్తుశకం 624 వరకు 12 సంవత్సరాలు పాలించాడు. మూడవ ధారసేనుడి సోదరుడు రెండవ ధ్రువసేనుడు. అతడు క్రీస్తుశకం 624 లో రాజై, క్రీస్తుశకం 640 వరకు సుమారు 16 సంవత్సరాలు పాలన చేశాడు. ఇతడి కుమారుడు నాల్గవ ధారసేనుడు తండ్రి అనంతరం వల్లభి పాలకుడు అయ్యాడు. నాల్గవ ధారసేనుడి అనంతరం రెండవ కరగ్రహుడు, రెండవ శిలాదిత్యుడు వల్లభి రాజ్యాన్ని ఏలారు. రెండవ శిలాదిత్యుడి తరువాత అతడి కుమారుడు మూడవ శిలాదిత్యుడు వల్లభి రాజ్యాన్ని పాలించాడు. ఇతడితో గుప్తరాజుల సేనాపతి భట్టారకుడు స్థాపించిన మైత్రక వల్లభి రాజ్యం అంతరించి పోయింది.     

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

Saturday, April 27, 2024

Khammam Mostly sent Imported Leaders to LS : Vanam Jwala Narasimha Rao

 Khammam Mostly sent Imported Leaders to LS

Vanam Jwala Narasimha Rao

The Hans India (28-04-2024)

{Three Political and Financial Giants, Nama Nageswara Rao (BRS), Tandra Vinod Rao (BJP), and Ramasahayam Raghuram Reddy (Congress Party) are in the battle in in 2024 elections. In such politically conscious, highly volatile, and sensitive district, where ‘Fortunes turns Like a Wheel’ Victory of any candidate is unpredictable ‘Until the Last EVM is Counted.’} – Editor Hans India

Khammam Lok Sabha constituency is accustomed to the ‘Dubious Distinction’ of ‘Electing Imported Candidates’ by and large chosen by Congress Party with convenient moderation. In this elections, Congress, a day before last date for filing nominations, announced name of Ramasahayam Raghuram Reddy to contest, but not before Sonia, Rahul, and Priyanka denied the offer. Raghuram Reddy’s illustrious, eminent, politically well-known, 92-year-old father Surender Reddy, is a four-time former MP, two-time former MLA and longest serving Hyderabad Race Club Chairman.

Their Family hails from Maripeda in Mahaboobabad district, adjoining Khammam Lok Sabha periphery, and hence, strictly speaking Raghuram Reddy is not a Non-Local. Further, through marriage in the family, he became relative to powerful Congress Leader, Minister Ponguleti Srinivas Reddy, that fortifies his political bondage with Khammam Lok Sabha. BRS candidate Nama Nageswara Rao too, is not a Non-Local. BJP candidate Tandra Vinod Rao is faultless Local. This is a slight deviation from regular practice.

Politically Eminent persons like, Jamalapuram Keshav Rao, Madapati Ramachandra Rao, Jalagam Vengal Rao, ‘Kingmaker’ Bommakanti Satyanarayana Rao, Seelam Siddareddy, Chekuri Kasiah, Ananth Ramulu Mallu etc. were from Khammam District. Many from Congress, TDP, and TRS became Ministers in State and Central Cabinets. Present Deputy CM Bhatti Vikramarka Mallu is from Khammam District.

Choosing candidates to Khammam Lok Sabha has been a herculean task from the beginning. Notwithstanding this, since 1952, Congress demonstrated its stronghold on Khammam Lok Sabha Seat by winning 12 times. PDF (CPI), TDP, CPI(M), YSRCP candidates also won.

Twice in 1952, 1957 TB Vithal Rao of PDF (CPI); thrice in 1962, 1967, 1971 T Laksmi Kantamma, twice in 1977, 1980 Jalagam Konadal Rao, twice in 1984, 1989 Jalagam Vengal Rao, in 1991 PV Rangiah Naidu (All from Congress); in 1996 Tammineni Veerabhadram of CPI(M); in 1998 Nadendla Bhaskar Rao, Twice in 1999, 2004 Renuka Choudary (Both Congress); twice Nama Nageswara Rao of TDP (2009) and TRS (2019) and in 2014 Ponguleti Srinivas Reddy of YSRCP won. Three Congress MPs (Jalagam, Rangiah Naidu, Renuka) served as Union Ministers and Nama Nageshwar Rao served as Floor Leader of TRS.   

Barring once or twice, right from PDF (CPI) candidate TB Vithal Rao’s election, it has always been a ‘Non-Local’ who won from this Constituency mysteriously!!! Laksmi Kantamma, Rangiah Naidu, Nadendla, Renuka Choudary all representing Congress were Nonlocals. When CPI(M) leader Tammineni Veerabhadram a True Local won, he became the first communist to have won, after a gap of 40 years since 1957 when undivided Communist Candidate TB Vithal Rao won. However, Tammineni’s term was short due to midterm elections when Nadendla defeated him then.

Prior to Rangiah Naidu, Congress Candidates Laksmi Kantamma and Jalagam Brothers won the seat with comfortable majorities. Many times, both Communist Parties contested against each other, benefiting Congress Candidates to win. After Communist Party split in 1964, for the first time CPI and CPI(M) candidates (N Giri Prasad and M Ramkishen Rao) contested against each other in 1967 enabling a cakewalk to Lakshmi Kantamma of Congress. In 1971 CPI supported Congress (Laksmi Kantamma) defeated CPI(M) candidate Ramkishen Rao who polled substantial number of votes.

In the 1977 elections, N Giri Prasad (CPI) and Dr Y Radha Krishna Murthy (CPIM) contested in the absence of seat adjustment between communists, only in Khammam Constituency. In 1980 too CPI and CPIM were in different boats, straightaway helping Congress victory. NTR TDP candidate being in the field helped Tammineni (CPIM) victory in 1996.    

Nadendla victory was possible in 1998 defeating CPIM Tammineni by a slender majority of 11,000, due to BJP candidate’s presence. In 1999 Nadendla was denied ticket by Congress in favor of Renuka Choudhary who won with slight margin against TDP candidate. In fact, then the combined votes of TDP and CPIM candidates, were lot more than Renuka Choudhary.

In 2004 Renuka Choudary of Congress won with comfortable majority against TDP candidate Nama. In 2009 elections because of Praja Rajyam Party candidate in the contest, Nama of TDP won against Renuka Choudhary of Congress. In 2014 elections, YSRCP candidate Ponguleti Srinivasa Reddy won, though polled only 35% of votes. TDP, CPI, TRS Candidates in the contest, together polled abnormally more votes than him. In 2019 TRS Nama won comfortably, defeating Renuka Choudary of Congress.

Results of Assembly Constituencies in the district have also been with a difference. ‘Politically Highly Conscious Khammam District’ distinctly survived TPS, Janatha Party, Indira, NTR, and TRS waves in elections. Khammam voters verdict strikingly differs from other districts. In 1978 Assembly Elections when Congress(I) swept all over the state, in five out of nine segments it lost. In 1983 when NTR TDP received massive mandate, except one seat, rest were won by other parties. In both 2014 and 2018 elections TRS fared very badly in this district, including loosing Khammam Lok Sabha Seat in 2014 to YSRCP. 

From Khammam Assembly Constituency, in the first election PDF candidate Namavarapu Peddanna won. In subsequent elections, Giriprasad, Rajab Ali both from CPI; Ananth Reddy from Congress; Manchikanti Ramkishen Rao from CPIM; Puvvada Nageshwar Rao from CPI; Younus Sultan from Congress; Tammineni Veerabhadram from CPIM, Tummala Nageshwar Rao once from TDP, once from Congress and Puvvada Ajay Kumar once from Congress, once from TRS won the seat. ‘Permutations and Combinations,’ preceded before announcing candidates for Assembly Seat too.  

In the Long Enduring Political History of Communist Movement, Khammam District is known as ‘Bastion of Communists’ and stands as ‘Giant Communist Edifice.’ During the renowned Telangana Peasant Armed Struggle’ Stalwart Communist Leaders from this District were in the Forefront. Chirravuri Laxmi Narasaiah (Longtime Khammam Municipal Chairman), Manchikanti Ramkishen Rao, Sarvadeva Bhatla Ramanadham, Ravella Satyanarayana, KL Narasimha Rao, Bode Pudi Venkateshwara Rao, Bojedla Venkata Narayana, Maccha Veeraiah, Gangavarapu Srinivasa Rao, Tammineni Subbaiah, Parsa Satyanarayana, Payyavula Lakshmiah, Ravella Janaki Ramaiah, Vattikonda Nageshwar Rao, Vasireddy Venkatapathi, etc. were among them.

Post Independence, number of comrades like, Puvvada Nageshwar Rao, TVR Chandram, Rajab Ali, Gandluri Kishan Rao, Baji Hanumanth, Vanam Narsing Rao (The First Elected Chairman of Palair Cooperative Sugars), Rayala Venkateshwarlu, Kunamneni Sambasiva Rao (who is CPI Telangana State Secretary), Tammineni Veerabhadram (who is CPIM Telangana State Secretary) etc. contributed in strengthening Communist Movement to keep it alive, to the extent possible. Genesis of Civil Liberties Movement’ in the state and country was in Khammam District, with the initiative of CPIM Leaders Doctor Yalamanchili Radhakrishna Murthy, a former Rajya Sabha Member, Advocates Bode Pudi Radhakrishna and Subba Rao (Trio of Intellectuals) during largescale arrests following 1962 India-China War.  

Unfortunately, the same Communist Party, both divided and undivided, which was ‘Built Brick by Brick’ in the background and context of ‘Mass Peasant Movements’ and once reached Himalayan Peak, was gradually weakened by internal strife, and bickering. Very Existence of it, is now a Million Dolor Question. Years ago, an interesting Book ‘Nippuku Chedalu’ (Worms to Fire) was brought out by Former Comrades that narrated controversial allegations on the then existing CPIM Khammam Leadership, that further weakened party.

Three Political and Financial Giants, Nama Nageswara Rao (BRS), Tandra Vinod Rao (BJP), and Ramasahayam Raghuram Reddy (Congress Party) are in the battle in in 2024 elections. In such politically conscious, highly volatile, and sensitive district, where ‘Fortunes turns Like a Wheel’ Victory of any candidate is unpredictable ‘Until the Last EVM is Counted.’

Chairman Centre for Media Studies (CMS) Dr N Bhaskara Rao recently told PTI News Agency, that, the 2024 Lok Sabha elections will become the ‘Most Expensive Electoral Event in the World’ touching a staggering Rs 1.35 Lakh Crore. One inevitability that has emerged over a period is, everywhere, including Khammam Lok Sabha Constituency, it is only a Millionaire or Billionaire not to speak of Trillionaire or Deca-Billionaire will be able to afford to contest in future’ ‘Is This The Democracy to Cherish’!!!

Thursday, April 25, 2024

సీతాకల్యాణం : వనం జ్వాలా నరసింహారావు....{భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక}

 సీతాకల్యాణం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక (ఏప్రియల్ నెల 2024)

         శ్రీరామలక్ష్మణులను విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకుని వెళ్లాడు. వారిని జనక మహారాజుకు పరిచయం చేసి, శివ ధనుస్సును చూపించమన్నాడు. అయితే జనకుడు ధనస్సును చూపించే ముందు సీత జన్మ వృత్తాంతం చెప్పాడు. సీత వీర్యశుల్కనీ, తన దగ్గరున్న, శివ ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే అయోనిజైన సీతను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. ఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వారిలో ఎవరు కూడా ఆ విల్లు ఎత్తలేక పోయారని చెప్పాడు. చివరిగా ధనుస్సును శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు జనకుడు.

శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి చూశాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని, వింటిని ఎక్కుపెడతానని అన్నాడు. ఆయన అనుజ్ఞ ఇవ్వడంతో, రాముడు అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది.

రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీతనిచ్చి తాను ధన్యుడవుతానని జనకుడు అన్నాడు. దానివల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లయిందని కూడా విశ్వామిత్రుడితో చెప్పాడు. ఆ తరువాత దశరథ మహారాజుకు కబురు చేయడం, ఆయన మందీమార్బలంతో మిథిలా నగరానికి రావడం జరిగింది. సీతా రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాల వారు వంశ క్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు.

పాణిగ్రహణం  

కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు, తీసుకొననూ కూడదు అనేది సనాతన ఆచారం. వివాహంలో వధూవరుల వంశవృక్షం, నేపధ్యం, ప్రవర అవశ్యంగా తెలియాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో ఇది ప్రధానమని శాస్త్రం చెపుతున్నది. ఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది.

"సీతను సర్వాభరణో,  పేతను  దా నిలిపి నగ్ని  కెదురుగ గౌస

ల్యా తనయున  కభిముఖముగ,  క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్"

          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా, శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా

కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్"

         ‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’ అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్ర జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. తరువాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, ‘లక్ష్మణా ఇటురా. కన్యాదానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను’ అని కోరాడు. ఆ తర్వాత, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తిని కన్యాదానం చేశాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు కన్యధారపోసాడు జనకుడు.


రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు, తండ్రి అనుమతితో అగ్నికి, వేదికి, మౌనీశ్వరులందరికి, రాజులకు భార్యలతో కలిసి, వారి చేతులను తమ చేతుల్లో వుంచుకొని,  ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూల వాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో, గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా, గుంపులుగుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే పెళ్లి తంతు ముగిసింది.

జనకుని మనసు

         సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి చర్చకు వచ్చే కొన్ని విషయాలున్నాయి. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘కౌసల్యా సుత’ అని సంబోధించాడు. రామా అని కాని, దశరథ కుమారా అని కాని అనలేదు.  రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరు కావచ్చు. దశరథ కుమారా అంటే నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘ఈ సీత’ అంటాడు జనకుడు రాముడితో. సిగ్గుతో సీత తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘ఈ సీత’ అని చెప్పాడు.

         సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను రాముడికి ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా ' సీత' అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, 'నాదుకూతురు' అని చెప్పాడు. నీ ‘సహధర్మచరి అనడమంటే, రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం.

అనసూయకు చెప్పిన కథ

తన కళ్యాణ వివరాలను సాక్షాత్తూ సీతాదేవే అత్రి మహాముని భార్యైన, అనసూయాదేవికి వివరించింది. అరణ్యవాసంలో భాగంగా చిత్రకూటం నుండి సీతాలక్ష్మణ సమేతంగా బయల్దేరిన శ్రీరాముడు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుని, ఆయనకు, ఆయన భార్య సతీ అనసూయాదేవికి సీతాదేవిని పరిచయం చేశాడు. సీత పుణ్యచరిత్రదని, పాతివ్రత్యమే గొప్పదిగా భావించి, చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారాజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి భర్తతో  వచ్చిందని, ఆమెలాంటి స్త్రీలు అరుదని, కొనియాడింది అనసూయ.

శ్రీ రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో సీతను పెళ్లి చేసుకున్నాడని వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదని, అ కథ వినాలని వుందని, జరిగినదంతా వివరంగా చెప్పమని అనసూయ సీతను అడిగింది. జవాబుగా సీతాదేవి, తన తండ్రి జనకుడు విదేహ దేశానికి రాజని, ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి తాను భూమిలోనుండి బయటకు వచ్చానని, అప్పుడు జనకుడు తనను చూసి ఆశ్చర్యపడి, తన పెద్ద భార్యకు ఇచ్చాడని చెప్పింది. ఆమె తన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుని పెంచిందని, తనకు వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు తనకు భర్తగా తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, మన్మథాకారుడిని సంపాదించాలని జనకుడు వెతికాడు కాని ఎవరూ దొరకలేదని, అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడని సీతాదేవి అనసూయకు చెప్పింది.

 ‘ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను, రాజులందరికీ చూపించాడు జనకుడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక పోయారు. చివరకు విశ్వామిత్రుడితో వచ్చిన శ్రీరామచంద్రుడు ఆ పని చేసి తనను వివాహం చేసుకున్నాడు అని చెప్పింది సీత.

సీతాకల్యాణ తిథి  

శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కొడుకులకై దశరథుడు పుత్రకామేష్టి చేయగా శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు.

శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఘబహుళ విదియ నాడు శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. హస్త పోయి చిత్రా నక్షత్రం ప్రవేశించడంతో, ఆ రోజు ప్రయాణానికి మంచి రోజే కాకుండా అది శ్రీరాముడికి ధృవతార కూడా. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున ఫాల్గున శుద్ధ శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టిఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో, శుభదినమైన శుక్ల త్రయోదశి నాడు సీతారాముల కల్యాణం జరిగింది అని ఆంధ్రవాల్మీకి వాసుదాస స్వామి ‘ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం చెబుతోంది.