Sunday, December 11, 2016

రావణ బెదరింపుతో వణికిపోయిన సీత .... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 22 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

రావణ బెదరింపుతో వణికిపోయిన సీత
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
22 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (12-12-2016)

సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు అశోకవనానికి చేరుకుంటాడు. వనంలోకి ప్రవేశించి విహరిస్తాడక్కడ. మాసిన చీరెతో, ధైర్యం చెడిన మనస్సుతో, శుష్కించిన దేహంతో, ఆమే సీత అని గుర్తించలేని స్థితిలో వున్న స్త్రీని చూశాడు హనుమంతుడు. ఆమెను చూసి తనలో తానే వితర్కించుకుంటాడాయన. తాను చూసిన స్త్రీ సీతాదేవేనని నిశ్చయించుకున్న తరువాత ఆమె దుస్థితిని చూసి దుఃఖిస్తాడు.  హనుమంతుడు చూసిన సమయంలో ఆమె వున్న పరిస్థితిని, ఆయన తనలో తానే అనుకున్న విధాన్ని కవి "మానిని" వృత్తంలో రాశారు.
మానిని:       
పూవుల వ్రేకన వ్రాలిన కొమ్మలఁ బొల్చు నశోకమహాతరువుల్
        తావులు నించుచు మాధవ చారు సుధాకర కాంతులు రేఁ గుచు దుః
        ఖావిలఁ జేయుచు నున్నవి ఈ తరళాక్షి నటంచు మనంబున నీ
        దేవియ సీత యటంచును నిశ్చయ ధీయుతుఁ డుండె ద్రుమంబుపయిన్-97

తాత్పర్యం:     పూల బరువుతో వంగిన కొమ్మలున్న అశోక వృక్షాలు సువాసనలు వ్యాపింపచేస్తుంటే, వసంతకాల చంద్రుడి మనోహర కాంతులు విజృంభిస్తుంటే, ఈమె (సీతాదేవి) విరహాగ్నిని మరింత ప్రజ్వలింపచేసి బాధించుతున్నాయే అని తనలో అనుకుంటాడు హనుమంతుడు. తాను చూసిన స్త్రీ సీతాదేవే అని నిశ్చయ బుద్ధితో, రాక్షస స్త్రీలంతా మేల్కొని వున్నందువల్ల, చెట్టు మీదనే వుండిపోతాడు. 

ఛందస్సు:      మానినికి ఏడు "భ" గణాలు, "గురువు", పదమూడింట యతి.
పాపాత్ముడైన రావణాసురుడు మరణ దశ సమీపించడంతో,అశోక వనంలో వున్న సీతాదేవి వద్దకు వచ్చి, తియ్యని మాటలతో తన కోరికను సీతాదేవికి చెప్పే సందర్భాన్ని "మణిమంజరి" వృత్తంలో వర్ణించారు కవి.

మణిమంజరిమసలకు కనక సుమండన! కుంజ
                ద్భసలవిసరములు భాసిలు వేలా
                కుసుమితతరుగణ కుంజములందున్
                బసమెయి మెలఁ గుము భామిని నాతోన్ - 98

తాత్పర్యం:     భామినీ నువ్వు ఆలశ్యం చేయవద్దు. బంగారపు సొమ్ములున్న దానా, ఝంకారాలు చేస్తున్న తుమ్మెదల గుంపులున్న సముద్ర తీరపు పూల చెట్ల పొదలలో, సంతోషంగా నాతో విహరించు.
ఛందస్సు:      మణిమంజరి వృత్తానికి "న, , , " గణాలు, తొమ్మిదింట యతి. 

శ్రీరాముడు తనను విడిపించుకునేందుకు రాలేకపోయినందుకు అనేక విధాలుగా పరితపిస్తున్న సీత పడ్డ ఆవేదనను వర్ణించడానికి కవి ఎంచుకున్న వృత్తాలు "మత్తకోకిలము", "పంచచామరము", "మానిని". వరుసగా అవి ఇలా వున్నాయి:

మత్తకోకిలము:               క్రూరుడైన దశాస్యునాజ్ఞను ఘోర రాక్షస కామినుల్
                        దారుణంబుగ నప్రియంబులు దన్ను పలుకుచు నుంటకున్
                        ధారిణీసుత కానలో మృగనాథుబారిని బడ్డ యా
                        వారణేంద్రుని కన్యరీతిని బాఢ కంపిత గాత్రయై-99

మత్తకోకిలము:               రాక్షసాంగన లెల్లఁ జుట్టును  గ్రాలి భీషణ వేషలై
                రూక్షభాషల బాధ పెట్టఁ గ రోషదూషితుఁ డైన యా
                రాక్షసాధిపు తర్జనంబుల రామకామిని కాన సం
                రక్షకచ్యుతయైన బాలిక రాణఁ దా విలపించుచున్-100

పంచచామరము:      అకాలమందు మృత్యు వబ్బ దండ్రు పెద్ద లెల్ల నా
                ప్రకారమే యథార్థ మయ్యెఁ బ్రాణమేగ దయ్యయో
                నికారరీతిఁ దెచ్చి క్రుచ్చి నిష్ఠురంబు లాడఁ గన్
                వికారరాక్షసీజనంబు నే నదెంత పాపనో-101

మత్తకోకిలము:                 అక్కటా! కర వాయె సౌఖ్యము నైకముదుస్సహ దుఃఖముల్
                పెక్కులాయెను, వజ్రపాత విభిన్న శృంగమునట్టు లై
                యొక్క వే శకలంబు లై చనదుల్ల మొంతయుఁ జూడఁ గా
                నిక్క మీ హృదయంబు నాశిల నేర దెన్నఁ డు దైవమా!-102

మానిని: దుర్భరతేజుఁ డు రాముఁ డు న న్నిట దూర్ణమ చూడఁ గ రానియెడన్
        నిర్భరకోపముతో గడు వేగిన నిష్ఠుర శాతకృపాణములన్
        గర్భమున న్మరణించిన జంతువు కండల శస్త్రచికిత్సకుఁ డున్
        నిర్భిదమున్ ఘటియించుగతిన్ రజనీచరుఁ డోడక కోయుననున్-103


తాత్పర్యం:    
దయాహీనుడైన రావణుడి ఆజ్ఞానుసారం రాక్షస స్త్రీలు తనను అనరాని-వినరాని మాటలంటుంటే, సీతాదేవి సింహం బారిన పడ్డ ఏనుగుపిల్లలా వణికిపోయింది. అంతకుముందు రావణాసురుడు చేసిన బెదిరింపు మాటలను కూడా జ్ఞప్తికి తెచ్చుకుని, అడవిలో పడ్డ తనను కాపాడేవారు లేరుకదా అని ఆడపిల్లలా ఏడిచింది. "విధి నిర్ణయించిన కాలం తీరేవరకు ప్రాణం పోదంటారు పెద్దలు. నా విషయంలో అదే నిజమవుతోంది. కాలం కల్సిరాలేదు. రావణాసురుడు నన్నిలా మోసపూరితంగా ఎత్తుకొచ్చి, వికార రూపాలున్న ఈ రాక్షసుల బారిన పడవేసి, వాళ్లంటున్న మాటలను పడడానికి నేనెంత           పాపం చేశానో! సుఖమా లేదాయె. దుఃఖమా అధికమవుతుండె. హృదయం వేయితునకలై పోతుండె. ఇదంతా చూస్తుంటే నా హృదయానికి నాశనమనేది లేదనిపిస్తుంది" అని పరితపించింది. "శత్రువులు సహింపరాని పరాక్రమమున్న రామచంద్రమూర్తి త్వరగా నన్ను (సీతను) చూడడానికి రాలేదే? గడువైపోతూనే రావణాసురుడు మరింత కోపగించి, శస్త్ర చికిత్స చేసేవాడు మరణించిన గర్భస్థ శిశువును కోసే        విధంగా నన్ను వాడైన కత్తులతో కోస్తాడు" అని భయపడుతుంది.
  
మత్తకోకిలము:        
          ఎంతకాలముగానొ యేడ్చెడి హీనభాగ్యకు రెన్నెలల్
        కొంత కొంత గతించె నే మనుకొందు నయ్యయొ ధారిణీ
        కాంతు నాజ్ఞను గాలు సేతులు కట్ట వేకువ వధ్యుఁ డై
        చింతలం బడు దొంగ భంగిని జింతఁ గుందెద దైవమా! - 104
పంచచామరము:
          ఘనంబుగా మనంబు నిల్పి కంజనేత్ర! నీ పయిన్
        వినాశ మందు చున్న దాన నేను రామ! యీ గతిన్
        వినీతిరీతి నేను జల్పు విశ్వ సద్వత్రంబులున్
        జనెం బ్రయోజనంబు లేక స్వల్ప భాగ్య నౌటచేన్-105

తాత్పర్యం:     దీర్ఘకాలంగా ఏదుస్తున్న నిర్భాగ్యురాలైన నాకు (సీతకు) రెండు నెలల గడువులో కొంత కొంత గడిచిపోయింది. (పదవ నెలలో పదిహేను రోజులయ్యాయి అప్పటికి). అయ్యో ఏమనుకోవాలి! రాజాజ్ఞతో కాళ్లు-చేతులు కట్టివేయబడి ఉదయంకాగానే చంపబడే దొంగ లాగా దుఃఖపడుతున్నాను. ఎంతటి పాపాత్ములకైనా నీమీద కొంచెం మనసుంచితే శ్రేయస్సు కలుగుతుందికదా! అలాగైతే, చిరకాలం నుంచీ, ధృఢంగా నీ మీదే మనసు నిల్పినదానను కదా నేను? ఎందుకీవిధంగా నశిస్తున్నాను? ఈ దోషం నీదికాదు నాదే. ఎందుకంటే, నేను నియమం తప్పకుండా చేసిన వ్రతాలన్నీ, పుణ్యం కొంచెమే చేసుకున్న దానినైనందున, వ్యర్థమై పోయాయి. ఏ కొంచెం అదృష్టమైన దాన్నైనా, నిన్నాశ్రయించిన ఇతరులవలె నేను కూడా బాగుపడక పోయేదాన్నా? నా దుర్దశకు నేనే కారణం. నువ్వు కాదు.

ఛందస్సు:     
మత్తకోకిలము వృత్తానికి "ర, , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి. పంచచామరముకు "జర, జర, " గణాలు. తొమ్మిదింట యతి. దీనిలో మొదటి హల్లు తొలగిస్తే సుగంధి వృత్తమవుతుంది. మానినికి ఏడు "భ" గణాలు, గురువు. పదమూడవ ఇంట యతి.


సీతాదేవితో హనుమంతుడు తాను వచ్చిన కారణం తెలిపిన తదనంతరం, సీత హనుమంతుడిని ఉద్దేశించి తాను చెప్పదల్చుకున్న విషయాలన్నీ తెలియచేస్తుంది.

No comments:

Post a Comment