Wednesday, August 29, 2018

Election Commission bound to respond positively: Vanam Jwala Narasimha Rao


Election Commission bound to respond positively
and
Ball in Election Commission's Court 
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (30-08-2018)
Telangana Today (30-08-2018)
The Hans India (31-08-2018)

Gossip…gossip…everywhere gossip about the early polls in Telangana State. Some Newspapers even went to the extent of predicting the date of dissolution of Telangana Assembly and the possible period of election. Whenever Chief Minister K Chandrashekhar Rao visits New Delhi and meets the Prime Minister Modi to pursue for early approvals for the long pending state issues in his own characteristic style, the media gossips about the elections with banner headlines. The media astrologers prediction however may be worthwhile to analysis addressing the pros and cons of dissolution of Assembly and going for early polls. And, if the Assembly is dissolved what possible questions might arise out of it.

First and foremost is, what might be the conceivable reasons for Chief Minister KCR to prefer a dissolution and go for early poll as reported? Then, “Why Not”? KCR recommend to dissolve and seek fresh mandate? It is absolutely and unequivocally CM KCR prerogative as Chief Minister enjoying undisputable majority in the Assembly, to recommend for dissolution and when he prefers it, he will take decision at appropriate time of his choice.

In India mesmerising the voter with false and impracticable promises is taken for granted. Since first general elections this has gone unchecked. Even the Constitutional body like Election Commission maintains silence in preventing the political parties indulging in false promises. Consequently it’s the voter who becomes a victim to it. For instance the promises that are being made by one of the opposition parties that was in power in the state for most of the time, that they would waive the Agriculture Loans to a tune of Rs 2 lakhs in one go, double the Aasara pensions, grant multiple pensions, give unemployment allowance, reduce the age limit for pensions etc. if voted to power are ridiculous. Whether the financial implications were worked out before announcing is a million dollar question. In 2009 elections also the same party made false promises, won the elections and were in power for a full five-year term without fulfilling them.


If with these copious promises the voter is carried away and misled and the lengthy time gap before the elections are held in routine course becomes advantageous to political parties who announce them, an unfortunate but highly unlikely situation might arise, wherein a dishonest and unprincipled party could come to power. Then the result would be hindrance to Bangaru Telangana? What should happen to the welfare and development of Telangana? What should happen to the irrigation projects? What should happen to the Mission Bhagiratha and Mission Kakatiya? What should happen to the Rythu Bandhu and Rythu Bhima? And umpteen other such schemes and programs? After all Telangana was achieved after a prolonged struggle and has to make a long journey.

The Government of Telangana did a lot for the welfare and development of people. There is of course lot more to be done. Power problems have been overcome and the state is proceeding towards surplus power and will it be possible if other than TRS is in power? What about taking further forward the industrial policy of single window? To keep the farming community harmoniously by strengthening further the Rythu Bandhu and Rythu Bhima schemes we need a visionary governance of KCR. Who will further strengthen rural economy in the absence of TRS government? And many more like this.

Will these so called self-proclaimed parties and its leaders be able to understand even an iota of the irrigation projects? Do they know how much water will be available in any of the projects? Will they be able to understand the intricacies of river water management and from where to where water flows etc.? Should this be allowed? Never of Course!!! In a democracy great individuals with righteous indignation should raise above every level and see to it that people’s interests are protected come what may. That may be precisely what KCR thinking looks like.  

Against this background, the question is, when and who can dissolve the Assembly? Assembly can be dissolved when the leader of the majority of the ruling party makes a recommendation to the Governor. The prerogative and timing entirely rests with leader of the majority and he or she has absolute right to do so and none can question. If the news of dissolution that appear in media in the recent past has any credibility, then, Chief Minister Telangana has absolute right to recommend to the Governor, if he wishes to do so without assigning any reason. KCR has the trust and confidence of huge Majority of legislature and hence can recommend to the governor of the state to dissolve the assembly and go for fresh polls.

After the Assembly is dissolved, elections are to be held to constitute the next Assembly. The prerogative of announcing the dates and conducting the elections belongs to the Election Commission who has a timetable on the basis of which elections are held after the Assembly stands dissolved. The Prime Minister has no role in this and does not fit into the process constitutionally. Probably those who pose doubts may be thinking that PM might influence the Election Commission and see to that the lections are not held as desired and expected by KCR. But what benefit does the PM get by this? And why should he resort to this?

As per the Constitution, not more than six months must lapse before two sessions of Legislature. This means that the Election Commission has no alternative and is bound to hold the elections such that a new government can take office within six months of the dissolution of the previous Assembly. According to Article 172 of Constitution which specifies the term of Legislature, every Legislative Assembly of every State, unless sooner dissolved, shall continue for five years from the date appointed for its first meeting.  


The Gujarat example and the then decision of Election Commission cannot be quoted in the context of Telangana. The present PM while CM of Gujarat, consequent to riots of 2002 supposed to be the worst ever in India's troubled history, and at a time when BJP Governments were in control in both New Delhi and Ahmedabad, decided to dissolve Assembly on July 19, 2002 and seek fresh mandate of people. The EC took the view that although Article 174 of the Constitution required the election to be held within six months from the last session of the dissolved Assembly, this was not possible because the State was still in turmoil, the electoral rolls were not ready, and the electoral machinery needed reinforcement. However when President referred the matter to Supreme Court it held that the six months within which elections were to be held was from the date of dissolution of the Assembly.

This thus holds good, in the case of Telangana also and if CM takes a decision to dissolve Assembly sometime in September, as has been reported in media, the elections are bound to be conducted before March 2019. However, since elections are due sometime before December 2018 for states of Mizoram, Chhattisgarh, Rajasthan and Madhya Pradesh, the Election Commission of India has no option or alternate except to hold elections in Telangana too simultaneously, if CM KCR prefers a dissolution of Assembly and seeks a fresh mandate, couple of months earlier than scheduled. 

అభివృద్ధిలో తెలంగాణ నమూనా : వనం జ్వాలా నరసింహారావు


అభివృద్ధిలో తెలంగాణ నమూనా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-08-2018)
సుమారు యాబై నెలలకు పైగా, జూన్ నెల 19, 2014 నుండి ఈ నాటివరకూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా, ఆయన నాయకత్వంలో యావత్తు అధికార-అనధికార బృందం, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి చేపట్టి అమలు పరుస్తున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ఒక ప్రత్యక్ష సాక్షిగా, పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపి, 29వ రాష్ట్రంగా అది ఏర్పడగానే ఆ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారాయన. జూన్ 2, 2014 న సీఎం గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుండే, వైవిధ్యభరితమైన సుపరిపాలనను రాష్ట్ర ప్రజలకు అందించడానికి, ప్రజల అవసరాలకు-ఆకాంక్షలకు అనుగుణంగా, స్వయంగా పథకాలను, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి, అమలు చేయడానికి అహర్నిషలూ కృషి చేస్తూ వచ్చారు కేసీఆర్.

కేసీఆర్ సీఎం పదవి చేపట్టిన పక్షం రోజులకు, జూన్ 17, 2014 న, మధ్యాహ్నం నుండి రాత్రి పోద్దుపోయేవరకూ, సుమారు ఎనిమిది గంటలకు పైగా జరిగిన ఒక అనధికారిక సుదీర్ఘ సమావేశంలో, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ గురించి తన మనసులోని భావాలను, తన విజన్ ను, సీఎంవో అధికారులతో పంచుకున్నారు. ఆ సమావేశంలో వున్న నేను అక్షరం పొల్లుపోకుండా ఆయన విజన్ కు సంబంధించిన అంశాలను నోట్ చేసుకున్నాను. ఆ సమావేశంలోనే ముఖ్య మంత్రి, ఒకటికి పది సార్లు, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి, పునర్వికాసం గురించి, తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదపడే విషయాల గురించీ కూలంకషంగా వివరించారు.

తెలంగాణ బడ్జెట్, ఆదాయ వనరుల సమీకరణ, వ్యవసాయ ఋణ మాఫీ, ఫీజ్ రీఇంబర్స్మెంట్, కేజీ టు పీజీ ఉచిత విద్య, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్ట్, చెరువుల పునరుద్ధరణ, కోతలు లేని విద్యుత్ సరఫరా-విద్యుత్ ప్రాజెక్టులు, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, ఉద్యోగ అవకాశాల కల్పన, ఏక గవాక్ష పారిశ్రామిక విధానం, పోలీసు సంస్కరణలు, హైదరాబాద్ నగరాభివృద్ధి, భారీ ఎత్తున మొక్కలు నాటడం, మన వూరు-మన ప్రణాళిక, గ్రామజ్యోతి, దళితులకు మూడెకరాల భూమి, రైతు సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనారిటీల అభున్నతి-సంక్షేమం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పటిష్టం మొదలైన అంశాల విషయంలో ఆనాడే స్పష్టత ఇచ్చారు. ఆనాటి ఆయన విజన్ కు అనుగుణంగా, ఎన్నికల్లో ఆయన సారధ్యంలోని టీఆరెస్ పార్టీ చేసిన వాగ్దానాలకు అనుగుణంగా, అప్పటినుండి ఇప్పటి వరకూ అనేకానేక అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు జరుగుతూ వస్తున్నది.

అధికారంలోకి వచ్చిన నాటినుండీ, తన విజన్ ను ముందుకు తీసుకు పోవడానికి, క్రమం తప్పకుండా, అనునిత్యం, అవసరమైనప్పుడల్లా గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, తనదైన శైలిలో ప్రజలకు కావాల్సిన ప్రతి అంశాన్నీ స్పృశిస్తూ, ప్రతి ఒక్కరి అభివృద్ధి-సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగుతోంది. ఇప్పుడున్న తెలంగాణా రాష్ట్రం గతంలో ఈ విధంగా ఏనాడూ లేదనీ, దీన్నొక నూతన రాష్ట్రంగానే చూడాలనీ, దానికి అనుగుణంగా ఒక చారిత్రాత్మక ఆరంభం జరగాలనీ పదే-పదే చెప్తుంటారు కేసీఆర్. ఆ కోణంలోనే ఎన్నో నూతన పథకాలకు వినూత్నమైన పద్ధతిలో రూపకల్పన చేసి, శ్రీకారం చుట్టి, నిరంతరాయంగా అమలు చేయడం జరుగుతున్నదీ రాష్ట్రంలో. వీటన్నిటి వెనుక  ముఖ్యమంత్రి స్వయం చొరవ, స్వీయ పర్యవేక్షణ వుండడం విశేషం.

యాభై నెలల పైబడి అధికారంలో వున్న కాలంలో, సీఎం కేవలం రెండే-రెండు పర్యాయాలు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఒక సారి సింగపూర్ కు, మరో సారి చైనాకు వెళ్ళిన సీఎం, రెండు సార్లు కూడా విదేశీ పెట్టుబడుల నిమిత్తమే వెళ్లారు. ఆహ్వానం మేరకు, చైనా-దాలియాన్ లో 2015 లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్.

తెలంగాణ ఆవిర్భవించిన అనతికాలంలోనే, కేవలం యాబై నెలల కాలంలో, అనూహ్యమైన ప్రగతిని సాధించింది. యావత్ భారతదేశానికే తెలంగాణ ఒక అభివృద్ధి నమూనాగా రూపుదిద్దుకుంది. ఒకనాటి సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై దెబ్బతిన్న అనేక రంగాలు క్రమేపీ పునర్వికాసం పొందాయి. ప్రజలే కేంద్ర బిందువుగా రూపుదిద్దుకున్న సంక్షేమ-అభివృద్ధి పథకాలు పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, అన్ని కులాల-మతాల వారికి, అగ్రకులాల పేదవారికి మేలు కలిగించి అండగా రక్షణ కలిగిస్తున్నాయి. సీఎం విజన్ కు అనుగుణంగా రాష్ట్రం తనను తాను పునర్నిర్మించుకుంటూ జాతి ప్రగతికి, అభ్యున్నతికి, నిర్మాణానికి తనవంతు కృషి చేస్తున్నది.

రాష్ట్ర ఆవిర్భావం నాటికి అగమ్యగోచరంగా వున్న తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, దరిమిలా చోటుచేసుకున్న వ్యవసాయిక సంక్షోభాన్ని అధిగమించి, దాన్ని పటిష్ట పరిచి రైతులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే, 35.29 లక్షల రైతులకు లబ్ది చేకూరే విధంగా రు. 17,000 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు, వ్యవసాయ శాఖకు రవాణా పన్ను రద్దు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల నష్టపరిహారం రు. 6 లక్షలకు పెంపు, సకాలంలో ఎరువులు-విత్తనాలు సరఫరా, కల్తీ ఎరువులు-పురుగుల మందులు-విత్తనాలు సరఫారా చేసిన వారిపై కఠిన చర్యలు లాంటి చర్యలు చేపట్టి అమలుపరుస్తున్నది ప్రభుత్వం.


దేశంలో రైతులకు ఉచితంగా, జనవరి 2018 నుండి, కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ను, ఇతర రంగాలకు సమానంగా, 24 గంటలూ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే ఇక చిమ్మ చీకట్లే అన్న వాళ్లు తమ మాటలను తామే మింగాల్సిన పరిస్థితి ఇప్పుడు. అనతికాలంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా రూపుదిద్దుకోనుంది.

            సంఘటిత శక్తిలో వున్న బలాన్ని రైతులకు తెలియచేయడానికి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరిగింది. ఇవి రైతులకు ఎల్ల వేళలా, విత్తనం వేసినప్పటి నుండి, పంటకు గిట్టుబాటు ధర లభించే వరకూ సహాయపడుతుంటాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా, సామాజిక న్యాయం అమలు కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టి వాళ్లు చైర్మన్లుగా అయ్యే అవకాసం కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం.

         భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి, భూ సంబంధిత రికార్డులు పారదర్శకంగా నిర్వహించడానికి, భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం జరిపించింది. ప్రభుత్వ బృహత్తర ప్రయత్నం వల్ల సుమారు 94% భూముల యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. “ధరణి” వెబ్సైట్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో నూటికి నూరు శాతం పారదర్శకత సాధించేందుకు వీలుకలిగింది.

         రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ పెట్టుబడి సమస్యను అధిగమించడానికి “రైతుబందు” పేరుతో వినూత్నమైన పథకాన్ని అమలుచేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కు వున్న ప్రతి రైతుకు ఎకరానికి పంటకు రు. 4000 చొప్పున రెండు పంటలకు కలిపి రు. 8000 ఈ పథకం ద్వారా సమకూరుస్తున్నది ప్రభుత్వం. రు. 5111 కోట్లను 49,49,000 మంది రైతులకు మొదటి పంటకు పంపిణీ చేయడం జరిగింది. ఇంత భారీ మొత్తంలో రైతులకు ఒకేసారి ఆర్ధిక సహాయం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.

            భారత జీవిత భీమా సంస్థ ద్వారా ఆగస్ట్ 15, 2018 నుండి రైతు భీమా పథకాన్ని అమలు చేస్తూ, రాష్ట్రంలో ఏ రైతైనా, ఏ కారణానైనా మరణిస్తే అతడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, రైతు చనిపోయిన పదిరోజుల్లోపల రు. 5 లక్షల  భీమా సొమ్ము చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

         కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాగునీటి ప్రాజెక్టుల రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత పాలకులు లోపభూయిష్టంగా రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్లను నిపుణుల సలహా-సూచనల మేరకు మళ్లీ కొత్తగా డిజైన్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ స్వయంగా ఈ బాధ్యతను తనపై వేసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మిషన్ కాకతీయ పథకం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, పూడికతీత పనులు జరుగుతున్నాయి.

         గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం చేయడానికి, కులవృత్తులను ప్రోత్సహించాలని ఆర్ధిక సహాయం అందిస్తున్నదీ ప్రభుత్వం. గొల్ల-కురుమలకు 75% సబ్సిడీ మీద పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలవుతున్నది. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు యూనిట్ కు రు. 80,000 ల వ్యయంతో పాడిరైతులకు పాడిపశువుల పంపిణీ జరుగుతున్నది. చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం చేప-రొయ్య పిల్లల్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. చేనేత, పవర్లూం కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అనేక పథకాలను అమలు చేస్తున్నది.

         నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, కల్లుగీత కార్మికులకు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సంచార కులాల, ఆశ్రిత కులాల సంక్షేమం కోసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటైంది. బ్యాంకులతో నిమిత్తం లేకుండా నూటికి నూరు శాతం ఉచితంగా బీసీ కుల్లల వారందరికీ స్వయం ఉపాధి కోసం ఆర్ధిక సహాయం అందచేస్తున్నది ప్రభుత్వం.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం, కల్యాణలక్ష్మి,  కేసీఆర్ కిట్స్ లాంటి పథకాలను అమలు పరుస్తున్నది ప్రభుత్వం. అన్నికులాల వారికి హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయించాలని నిర్ణయించింది. 

రు. 40,000 కోట్లతో అమలవుతున్న 40 కిపైగా సంక్షేమ పథకాలలో భాగంగా వృద్ధులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, నేత, బీడీ కార్మికులకు, చేనేతవారికి, ఎయిడ్స్ బాధితులకు, దివ్యాంగులకు, వృద్ధ కళాకారులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నది ప్రభుత్వం. అసహాయులందరికీ కనీస జీవన భద్రత కలుగుతున్నది. ఒక్కో వ్యక్తికీ ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది వున్నా అంతమందికి రూపాయికి కిలో చొప్పున బియ్యం ఇస్తున్నది. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో వుంది.

పేదింటి ఆడపిల్లల పెళ్లికి రు. 1,00116 ఆర్ధిక సహాయంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఇతరకులాలలోని ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లల విదేశీ విద్యకు రు. 20 లక్షల స్కాలర్షిప్ అమల్లో వుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రగతి పద్దు చట్టాన్ని పకడ్బందీగా అమలుపరుస్తున్నది ప్రభుత్వం. వారికి జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నది. వారికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసే విధంగా, ఒక ఏడాది ఖర్చు చేయని నిధులు మరుసటి సంవత్సరానికి బదలాయించే విధంగా చట్టంలో రక్షణ వుంది. దేశంలో ఎక్కడాలేని రీతిలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం తెలంగాణాలో అమలవుతున్నది.

మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమల్లో వున్నాయి. అలాగే మహిళల సంక్షేమం కోసం, రక్షణ కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, షి-బృందాలు, ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి లాంటి పథకాలున్నాయి. వివిధ రకాల ఉద్యోగుల జీతాలు ఎప్పటికప్పుడు పెంచుతున్నదీ ప్రభుత్వం.

         మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన ఒక అద్భుతమైన ఇంటింటికి మంచినీటి సరఫరా పథకం. పేదలకు మెరుగైన వైద్యం లభింప చేయాలని ప్రభుత్వాసుపత్రుల్లో వసతులను అభివృద్ధి చేసింది. వైద్య పరీక్షల సౌకర్యం కలిగించింది. కొత్తగా వైద్యకళాశాలలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానలను నెలకొల్పింది. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడానికి కేసీఆర్ కిట్స్ పథకం అమల్లో వుంది. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా 542 కొత్త గురుకులాలను, బీసీల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. తెలంగాణాకు హరితహారం ద్వారా కోట్లాది మొక్కలను నాటించింది ప్రభుత్వం. పాలాన సంస్కరణల్లో భాగంగా మొత్తం 31 జిల్లాలు, 69 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలు ఏర్పాటయ్యాయి. పంచాయితీల సంఖ్య 12,751 పెరిగింది. సింగిల్ విండో పారిశ్రామిక విధానం ద్వారా రు. 1,32,000 పెట్టుబడితో, 8.37 మందికి ఉపాధి కలిగే విధంగా, 7679 పరిశ్రమలు నెలకొన్నాయి. అన్ని రంగాలలో అభివృద్ధి తెలంగాణ యాబై నెలల పాలనా ప్రగతి ప్రత్యేకత. 

Monday, August 27, 2018

లంకకు వచ్చిన కారణం రావణుడికి తెలిపిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


లంకకు వచ్చిన కారణం రావణుడికి తెలిపిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-08-2018)
ప్రహస్తుడడిగిన ప్రశ్నలకు వాడంటే లక్ష్యంలేకుండా, రావణుడంటే జంకు లేకుండా, మాట తడబడక, తనవృత్తాంతాన్నంతా చెప్తా వినమంటాడు. ఇంద్రుడు, వరుణుడు, యముడు పంపితే తాను రాలేదు అంటాడు. కుబేరుడికి తనకు ఏనాడూ స్నేహంలేదనీ, విష్ణువిక్కడకు పొమ్మని అనలేదనీ చెప్పాడు. తానే ఆకారంలో కనిపిస్తున్నాడో, ఆ జాతివాడినేననీ, దుర్లభమైన రాక్షసరాజు దర్శనంకోరి ప్రమదావనాన్ని పాడుచేసాననీ అన్నాడు. యుద్ధం చేయడానికి రాక్షసులొస్తే తన్ను కాపాడుకోవటానికి మాత్రమే వారితో పోరాడానంటాడు.

 తనను ఇంద్రాది దిక్పాలకులెవరూ కూడా అస్త్రాలతో కట్టెయ్యలేరనీ, తానే కావాలని పట్టుబడ్డాననీ చెప్పాడు. "బ్రహ్మ చేత నీవొక్కడివే వరాలు పొందలేదు. నేనుకూడా ఇట్టి వరాలు పొందినవాడినే. రాక్షస రాజును చూడగోరి బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాను. రాక్షసులు నన్ను తాళ్లతో కట్టినప్పుడే ఆ అస్త్ర బంధాలూడిపోయాయి" అంటాడు. రావణాసురుడిని చూడాలని పట్టుబడ్డ తను, రాచకార్యం మీద ఆయన్ను చూడదల్చుకున్నాననీ, గొప్ప పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తి బంటుననీ, రాక్షసరాజుకు కొన్ని క్షేమకరమైన మాటలు చెప్తా వినమనీ హెచ్చరికగా అంటాడు హనుమంతుడు. 

తాను లంకకు వచ్చిన కాకారణం చెప్తా వినమంటాడు హనుమంతుడు రావణుడితో:
"సుగ్రీవుడి ఆజ్ఞానుసారం నిన్ను చూడటానికి ఈ పట్టణానికి వచ్చాను. నీ తమ్ముడు వానర రాజు, సుగ్రీవుడు నీ కుశలవార్త అడిగాడు. నీకు ఇహపరాలలో సుఖం కలిగించే ధర్మ వాక్యాలను చెప్పి పంపాడు. దానిని నీకు చెప్తా విను. చతురంగ బలాలున్న దశరథుడనే మహారాజున్నాడు. ప్రజలకాయన తండ్రిలాంటి వాడు. తేజంలో ఇంద్రుడికి సాటి. అతడి పెద్దకొడుకు, భూజనులను సంతోషపెట్టేవాడు, కీర్తిమంతుడు. పేరు శ్రీరామచంద్రుడు”.

(ఈమాటలు హనుమంతుడు స్వయంగా తానే చెప్పినా సుగ్రీవుడిమాటలవలె చెప్పాడు. కొన్ని మాటలు ఆయన చెప్పినవి కాకపోయినా దూతధర్మంగా ప్రభువు మాటలను ఆయన అభిప్రాయానికి అనుకూలంగా చెప్పాడు).

“ఆ రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞప్రకారం భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు తోడురాగా దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆయన భార్య ఒకనాడు అడవిలో కనిపించక పోయేసరికి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వెతుక్కుంటూ ఋశ్యమూక పర్వతం వద్దకు వచ్చారు".

"సుగ్రీవుడు సీతను వెతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుడికి వానరరాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి, ఇచ్చిన మాట ప్రకారమే యుద్ధంలో వాలిని చంపి, సుగ్రీవుడిని రాజును చేసాడు. వాలి ఎవరో, ఎట్టివాడో నీకూ తెలుసు . అలాంటివాడు ఒక్క రామబాణానికి చచ్చాడు. ఆ తర్వాత సీతను వెతికేందుకు వేలాదివేల వానరులను అన్ని దిక్కులకూ పంపాడు సుగ్రీవుడు”.

( రావణుడిని జయించిన వాలిని రాముడు ఒక్క బాణంతోనే చంపాడని చెప్పడంలో ఉద్దేశ్యం స్పష్టం. వాలి అంతటి వాడినే ఒక్క బాణంతో కూల్చి పారేసిన రాముడికి రావణుడొక లెక్కా! అని హెచ్చరించడమే!)

“గరుత్మంతుడితో సమానమైన వేగంగా పోగలిగే వానరవీరులు, భుజ బలసంపన్నులు, సీతాదేవిని అన్నిప్రదేశాల్లో వెతుకుతున్నారు. సుగ్రీవుడి దగ్గర నాలాంటివాళ్లు అనేకమంది వున్నారు. నన్నొక్కడిని జయించడమే నీకింత కష్టమైతే, వారందరూ ఒక్కసారే వస్తే నువ్వేమి చేయగలవో ఆలోచించుకో".


"నేను వాయుపుత్రుడిని. పేరు హనుమంతుడు. సీతాదేవిని వెతుక్కుంటూ నూరామడల సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. ఆమెను నీ ఇంట్లో చూసాను. నేను చెప్తున్నదంతా సత్యం”.

(దూత ధర్మం ప్రకారం, సీతను రావణుడు దొంగిలించాడని చెప్పలేదు. అయితే దొంగసొత్తు వాడింట్లో వుందని స్పష్టంగా చెప్పాడు).

"విధానాన్ననుసరించి ధర్మశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసావు. ప్రపంచం మెచ్చేరీతిలో తపస్సు చేసావు. ఇంత గొప్పవాడివి, పరపురుషుల స్త్రీలను బాధపెట్టడం ధర్మమా? రాక్షసవంశాన్ని నీ ఈ అధర్మ కార్యం కూకటివ్రేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీయదా? నీవంటి బుధ్ధిమంతుడు, ఇలాంటి పనులు చేయవచ్చా? నాకెవడూ కీడుకలిగించలేడని అనుకోవద్దు. రామచంద్రమూర్తి కోపంగా వదిలే బాణాలకు, లక్ష్మణుడి బాణాలకు, నీవేకాదు దేవదానవులందరు కలిసి ఎదిరించినా నిలువలేరు. శ్రీరామచంద్రమూర్తికి కీడుచేసిన వారెవ్వరైనా, ముల్లోకాల్లో ఎక్కడైనా ప్రాణాలతో వుండడం సాధ్యమేమో నీవే ఆలోచించు. నిన్ను జయించి కారాగృహంలో బంధించిన కార్తవీర్యార్జునిడిని ఓడించి, ఇతర రాజులందరినీ ఇరవై ఒక్క సార్లు చంపిన పరశురాముడిని అరగడియలో బాణప్రయోగం లేకుండానే ఓడించాడాయన".

"ధర్మమైనదీ, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు పనికొచ్చేదీ, సుఖలాభాలతో కూడినదైన సుగ్రీవుడి మాటలు విను. జానకీదేవిని రాముడికివ్వు. ఆమె ఎక్కడుందో చూశాం. వున్నా స్థలం తెలిసిపోయింది. మిగిలిన కార్యం రామచంద్రమూర్తే చేస్తాడు. రామచంద్రమూర్తి చూసిరమ్మన్నాడే కాని తీసుకుని రమ్మనలేదు కాబట్టి ఒక్కడినే వెళ్తున్నాను. సీతాదేవిని నేను చూసాను. ఆమె స్త్రీయేకదా అని నువ్వనుకుంటే అదిపొరపాటు. నిన్ను చంపడానికి నీ మెడకు చుట్టుకున్న ఆడ త్రాచుపాము. ఆమె దగ్గరకు పోతే చస్తావు. నిన్ను చంపటానికి ఆమే చాలు. విషం కలిపిన అన్నం తినడం ఎలాంటిదో, ఆమెను స్వీకరించాలనుకోవడం అలాంటిదే. కడుపులో చేరిన విషంలాగా ఆమె నీ ఇంట్లో చేరిందనుకో. నిన్ను చంపకుండా ఆమెవదలదు కాబట్టి, ఆమెను నువ్వువదులు".

"రావణా! నీకు లెక్కకు పదితలలున్నా, మంచి, చెడు ఆలోచించేందుకు, ఒక్క తలకూడా ఉపయోగపడడంలేదు. ఎంతో కష్టపడి తపస్సు చేసావు. అది మర్చిపోయి, తపోధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేసావు. నీ తపస్సు వ్యర్ధమై పోతున్నదని మర్చావు. నీ తపఃఫలంతో దేవదానవులెవ్వరూ నిన్ను జయించకుండా వరం పొందావు. ఇంక నాకేం భయమని గర్వపడ్డావు. ఆ వరాలేవీ నిన్నిప్పుడు రక్షించలేవు. ఎందుకో చెప్తా విను".

"నువ్వు దేవతలతో, దానవులతో, రాక్షసులతో, గంధర్వులతో, నాగులతో చావకుండా వరం పొందావు. సుగ్రీవుడు అమరుడు కాదు, అసురుడూకాదు, గంధర్వుడుకూడ కాడు, దానవుడూ కానే కాదు, నాగులలో చేరినవాడూ కాదు. మరి నీవరాలు నిన్నెట్లా రక్షిస్తాయని అనుకుంటున్నావు? ఆ వరాల బలంతో నీవెట్లా బ్రతుకుతావు? కాబట్టి తపోబలం వుందన్న గర్వం వదులుకో. చీకటి, వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్యఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. నువ్వు పుణ్యఫలం అనుభవించుతున్నంత వరకూ, పాపఫలం దరికిరాదు. ధర్మఫలం అధర్మఫలాన్ని చెరిపేపేస్తుంది. చీకటి ఎలాగైతే వెలుతురును చెరచలేదో, అలానే అధర్మఫలం ఇంకా నీకనుభవంలోకి రాలేదు. నీ తపఃఫలం వల్ల నీకసలే పాపఫలం రాదనుకుంటున్నావేమో! అష్ట ఐశ్వర్యాలను అనుభవించేవాడికి రోగాలు రావా? నీ తపస్సు నీకు దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, నువ్వుచేసిన పరస్త్రీ అపహరణనే పాపపు పనివల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరుగవు కాబట్టి, నీ చావింతవరకూ ఆగింది. అదేకాకుండా, తపస్సు చేసినవాడు వ్రతఫలం కోరకుండా వుంటే ఆ ఫలం అందరినుండీ కాపాడేది. నీ వ్రతఫలంగా దేవదానవుల చేతుల్లో చావులేకుండా వరం కోరావు. నరవానరులను నిషేధించావు. నీ తపఃఫలం వారినుండి నిన్ను కాపాడదు. ఇక నీ పూర్వపుణ్యం పూర్వపాపాన్నే హరిస్తుంది. కాని ఇప్పుడు చేస్తున్న పాపకార్యాలనుండి నిన్ను రక్షించదు. నేడు చేస్తున్న భోజనం, నిన్నటి ఆకలిబాధ తీరుస్తుందేకాని, రేపటిబాధను కాదుకదా! పశ్చాత్తాపం చెందితే, ప్రాయశ్చిత్తముంటుంది. నీవు బలవంతంగా ఎత్తుకొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరివారికి వారిని అప్పగిస్తే నీ దోషం పోతుంది".

Saturday, August 25, 2018

అగస్త్యాశ్రమంలో శ్రీ సీతారామలక్ష్మణులు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-23 : వనం జ్వాలా నరసింహారావు


అగస్త్యాశ్రమంలో శ్రీ సీతారామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-23
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (26-08-2018)

ఆశ్రమ ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్య ముని శిష్యుడిని చూసిఅయ్యాదశరథ మహారాజు పెద్ద కొడుకుసీతాదేబి భర్తశ్రీరామచంద్రమూర్తి భార్యతో కూడి ముని దర్శనార్థమై వచ్చాడని చెప్పాడు. "ఆ రాముడి తమ్ముడినినా పేరు లక్ష్మణుడునేనాయనకు హితుడనుభక్తుడినిఅనుకూలుడినిఎల్ల వేళల ఆయన్నే సేవిస్తానుజనకాజ్ఞ పాలించాలన్న నీతిననుసరించి అడవులకు వచ్చాం. మీ గురువు అగస్త్య మునిని దర్శించాలనుకుంటున్నాం. మేము వచ్చిన సంగాతి ఆయనకు చెప్పి పోమగృహంలో వున్న అగస్త్య్డితోణ్యం కట్టుకోండి" అని లక్ష్మణుడు చెప్పగా. అలానే అనుకుంటూ,  హోమగృహంలో వున్న అగస్త్యుడితో దశరథ రాజకుమారులుసీతాసమేతంగా ఆయన సేవకొరకు వచ్చారని చెప్పారు. మునీంద్రుడు ఆజ్ఞ ఇస్తే తీసుకొస్తామని అంటారు.

ముని శిష్యుడు అలా చెప్పగానే, "ఔరా నా అదృష్టం...ఇన్నాళ్లకైనా రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడుఅదే చాలుసాధుయోగ్యమైన నడవడి కల ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నానుఆ ముగ్గురిని పూర్ణ భక్తితో భోగ్యమైన విధంగా ఇక్కడికి తీసుకుని రాఅనావశ్యకమైనా ఆలశ్యం ఎందుకు చేశావుసీతారామలక్ష్మణుల పేర్లు వినగానే వెంటనే పిలుచుకుని రావాలి కదానువ్వు రావడానికిపోవడానికి ఇంత సమయం తీసుకునివ్యర్థం చేసివాళ్లను బయట నిలబెట్టవచ్చావాళ్లు మన వాకిట్లో నిలబడాల్సినవారా?" అని అగస్త్యుడు అనగానేశిష్యుడు గురువుకు నమస్కారం చేసిపరుగెత్తుకుంటూ పోయిలక్ష్మణుడితో ఆయననురామచంద్రమూర్తినిసీతతో సహా రమ్మని చెప్పాడువారంతా కలిసి శీఘ్రంగా లోపలికి పోయారుపోతూ అక్కడ వారు...బ్రహ్మ స్థానం (బ్రహ్మను ఆవహింప చేసి పూజించే స్థానం), అగ్ని స్థానంశ్రీవిష్ణు స్థానంఇంద్రుడి స్థానంసూర్య స్థానంచంద్ర స్థానంభగుడి స్థానంకుబేర స్థానంధాత స్థానంవిధాత స్థానంవాయు స్థానంఆదిశేషుడి స్థానంగాయత్రీ స్థానంవసువుల స్థానంవరుణుడి స్థానంకుమార స్వామి స్థానంధర్ముడి స్థానం...అనే పూజా ప్రదేశాలను చూశారుఅలా పోతూ...పోతూశిష్యులతో కూడి అగస్త్య్డుడు ఎదురుగా రాగా,ఆయన్ను చూసిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చే వాడే అగస్త్యుడు అని చెప్పాడు.

వచ్చే వాడే అగస్త్యుడని ఎలా చెప్పగలిగాడో రాముడంటే...ఆయన బ్రహ్మ వర్చస్సు బట్టి తెలుసుకున్నానంటాడుఆయన రాగానే శ్రీరాముడు ఆయన్ను సమీపించి,పాదాలమీద వాలాడుఆ తరువాత సీతాదేవిలక్ష్మణుడు శ్రద్ధగా అలానే చేసారుఆ తరువాత వారంతా అభివందనం చేసి నిలుచుని వుండగాఆ ముని శ్రేష్టుడు శ్రీరామచంద్రమూర్తిని అతిథిగా గ్రహించిప్రేమతో అతిథులకు ఇవ్వాల్సిన అర్ఘ్యంపాద్యం ఇచ్చిపూజించియోగక్షేమాలు విచారించికూర్చోమని చెప్పాడుతరువాత వానప్రస్ఠ ధర్మం ప్రకారం నిండుగాతృప్తి కలిగేట్లు వారికి భోజనం పెట్టాడుదాంతర్వాతనిర్మల ధర్మజ్ఞానంలో పండితుడైన శ్రీరామచంద్రుడిని చూసివానప్రస్థగృహస్థ ధర్మాలు తెలిసే విధంగా ఇలా చెప్పాడు.


"సమస్త ప్రపంచానికిఅందులోని జనులకునీవే ప్రభువువి. నీవే మహారథుదవు...నీవే మూర్తీభవించిన ధర్మాత్ముడవు. విశేషంగా ప్రకాశించే కీర్తికలవాడివి. గౌరవించాల్సిన ఆకారం కలవాడివి నీవే. ఎంతటి పూజకైనా పూర్ణంగా తగినవాడివి. భూపతివైన నీవు ప్రయాతిథివై వచ్చావు. ఇంతకు మించిన పుణ్యం ఇంకేమైనా వుంటుందా?" అని చెప్పి వారికి కడుపునిండా పళ్లనువేళ్లనుపూలనుతినటానికిచ్చిఆ తరువాత శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప విల్లుఅక్షయ బాణాలుతూణీరాలు చూపించి ఇలా చెప్పాడు.

"దేవసంబంధమైపూజ్యమైబంగారు రత్నాలతో అలంకరించబడిన అసమానమైన ఈ విష్ణు ధనస్సు విశ్వకర్మ నిర్మించాడు. ఈ బాణ సమూహం వ్యర్థం కాదు. సూర్యుడి కాంతిలాంటి కాంతికలదిది. ఇది బ్రహ్మ ఇచ్చాడు. ఈ అక్షయ బాణాలుపదునైన బాణాలతో నిండిన అమ్ముల పొదులుబంగారు పిడికల కత్తిదాని ఒర ఇంద్రుడిచ్చాడు. సూర్య తేజా! ఈ వింటితో విష్ణుదేవుడు రాక్షసులను యుద్ధంలో చంపిజయం పొందాడు. ఈ బాణాలుకత్తిపొదులు ఆయన యుద్ధంలో ఉపయోగించినవే. నీకూ జయం కలగడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకున్నట్లు వీటిని గ్రహించు" అని అంటూ ఆ శ్రేష్ఠమైన ఆయుధాలను శ్రీరామచంద్రమూర్తికిచ్చి మళ్లీ ఇలా అన్నాడు.

Monday, August 20, 2018

Governance with a difference : Vanam Jwala Narasimha Rao


Governance with a difference
Vanam Jwala Narasimha Rao
The Millennium Post (21-08-2018)

Let me, as CPRO to Chief Minister K Chandrashekhar Rao, for exactly 50 months, since 19th of June 2014, present an eye witness yet concise account of the just completed 50 months tenure in the office of KCR with his apex team. After successfully spearheading the struggle and achieving Telangana as the 29th state of Indian Union, he went on to become its first Chief Minister. Since coming to power on June 2, 2014, the Chief Minister has focused on Governance with a difference and has left no stone unturned in defining, designing and delivering the schemes that the state and its people required.

I remember the day (17th June 2014), just two days before I officially assumed charge as CPRO to CM, when the CM presided over an informal marathon meeting lasting for more than eight hours, from afternoon till late in the evening, a fortnight after KCR was sworn in as CM.  He presented his vision of the state, emphasizing constantly the words, Telangana needs to be reinvented and reoriented.

During that meeting CM presented his vision on several aspects that the state would be facing and the process to deal with them. All subjects were covered like Telangana budget and the funds flow; sources of income; resource mobilization; agriculture loan waiver; fee reimbursement; KG to PG free and compulsory education; irrigation projects as a priority item; drinking water project; power projects and power supply without cuts; two bedroom housing for poor; massive employment program; single window industrial policy; police reforms; brand image of Hyderabad city; massive and schematic plantation; our Village and our Planning; land purchase scheme for Dalits etc. among others. 

Subsequently and from time to time, for taking forward his vision, CM held a series of review meetings, touching every aspect of development and welfare of the state and people. CM used to say time and again that the present Telangana state had never existed before in this form and has to be viewed as a new state and therefore, needs a historical beginning. That is how several Schemes were meticulously planned and designed by the CM with his personal touch. 

CM had been abroad only twice, once to Singapore and second time to China to attract foreign investments. On invitation, CM participated in the World Economic Forum’s Annual Meeting of the New Champions 2015, held in Dalian, China.

            The state during the last 50 months recorded remarkable growth in a very short time since it achieved separate hood. Today it has become a development and welfare role model state to the entire country. Every sector that suffered very badly during the erstwhile united rule have been rejuvenated. The people centric development designs and plans extended a helping hand to poor, vulnerable and downtrodden. Welfare measures benefited the have-nots and dis-advantaged immensely. As envisioned by CM the state has been reinventing and reorienting itself and, in the process, helping the Nation development.

KCR Government firmly initiated steps to overcome agrarian crisis that existed at the formation of state and strengthen agriculture sector and thereby enthuse self confidence in the farmer. Waiver of Rs 17,000 Crore Agricultural loans benefitting 35.29 Lakhs farmers, payment of Input Subsidies, waiving of transport tax on the Agriculture Tractors, increasing the amount of compensation to the members of the bereaved farmer families who committed suicide to Rs 6 lakhs, procuring and making available to the farmer the fertilizers and seeds well in advance, stringent steps against those who supply spurious fertilizers, pesticides and seeds were some of the measures initiated and implemented by KCR Government. 

            Telangana is the one and only state in the country which supplies quality power free of cost round the clock 24 hours to the farmer from First of January 2018. Those who cursed that Telangana will plunge into darkness if the state is formed had to swallow their words. In a short period from now, Telangana will become a power surplus state.

To make the farmers aware of the strength of unity, Rythu Samanvaya Samithis (Farmers Coordination Committees) were formed. These committees help the farmer right from seeding to obtaining support price for their product at every stage. Reservations have been introduced in Market Committees enabling individuals belonging to SC, ST, BC and Women become Chairman of the Market committees.

            For an everlasting permanent solution to the land disputes and for maintaining the land records with utmost transparency, State Government had done comprehensive cleansing of land records. The efforts of Government resulted in getting clarity of rights of land ownership in case of 94% of the lands in the state. The Government also initiated comprehensive reforms to achieve 100% transparency in the land registration system for which Dharani website has been designed.


            ‘RYTHU BANDHU’ aiming at investment support to agriculture is being implemented. Through this scheme every farmer owning a land gets at the rate of Rs. 4000 per acre per season for both the seasons amounting to Rs.8000. The Government has distributed cheques worth Rs.5,111 crores for the first crop to 49,49,000 farmers. It is for the first time in the history of the Country that on such a large-scale distribution of money to the farmers took place.

The Government started implementing through the Life Insurance Corporation of India from August 15, 2018 the Rythu Bhima scheme aiming at paying Rs. 5 lakhs insurance amount to the members of the bereaved farmer’s family within 10 days of the death and create confidence in the family.

K Chandrashekhar Rao immediately after the formation of Telangana State focused mainly on irrigation sector to bring one crore acres under irrigation.  The faulty project designs prepared by the erstwhile rulers have been redesigned as per the suggestions made by experts. The Kaleshwaram, Palamoor-Rangareddy, Seetharama projects are all being constructed on fast-track. Several tanks that were destroyed during erstwhile rule have been revitalized and rejuvenated through Mission Kakatiya.

The Government has decided to provide financial support to the hereditary professions and encourage them so that the rural economy is rejuvenated. A programme to distribute sheep to Golla and Kuruma castes on 75% subsidy is in implementation. Government started a program to distribute Milch Animals to dairy farmers to encourage dairy industry in the state with each unit costing Rs 80,000. Government has also been supplying fish seed and prawn seed to fishermen to encourage fish farming on a large scale. To change and better the living conditions of handloom and power loom workers the Telangana government has taken special care and introduced several schemes.  

Schemes for Naayi Brahmins, Rajakas, Toddy tappers besides establishing MBC corporation are some more benefits to BCs. Government has also decided to provide financial assistance for self-employment with 100% subsidy to BCs to undertake any activity of their choice and  interest delinking with the banks.

            The Government with commitment has been making efforts to help the upper caste poor aiming at poverty alleviation as a basic objective. Aasara Pensions, Ration rice, Kalyana Lakshmi etc schemes are made applicable to all the poor of all upper caste.

            As part of nearly 40 welfare schemes with over Rs. 40,000 crore funds, Government has been giving Aasara Pensions to the old age people, widows, toddy tappers, handloom, beedi workers, aids patients, differently abled, old age poor artists, single women and filaria effected patients. Minimum life security is provided to all the helpless individuals. At the rate of 6 kilos for the individual, without any limitation irrespective of the numbers in the family, rice at Rs.1 a kilo is being given. Food with fine rice is given in schools and hostels.  

            The government implements Kalyana Lakshmi and Shaadi Mubarak schemes to provide financial assistance of Rs. 1,00116 for the marriage of poor girl child. For foreign Education Rs. 20 lakhs as overseas scholarships to SC, ST, BC, Minorities as well as those who belong to economically back ward other classes is given.

            For the welfare of SCs and STs the government has enacted special SC, ST Pragathi Fund Act and has been implementing effectively. The funds are allotted and spent in the ratio of SC, STs in the population. The Act provides for spending the funds allotted for SC, STs exclusively to them and also for transferring the unspent balance of a particular year to the following year. Distribution of 3 acres of land to the Dalits is implemented in the Telangana state which is not done anywhere in the country. The Government has provided bore well, motor, power connection, as well as investment support for the crop on this land.

            For the welfare of minorities and for their development, 206 residential schools, remuneration to Imams and Mauzams, new cloths to minorities during Ramzan and Christmas festivals, iftar parties, Christmas parties, construction of Islamic Centre, IT park etc. have been done.

            For the welfare of women schemes like Kalyan Laxmi, Shaadi-Mubarak, KCR Kits, SHE Teams, Arogya Laxmi, Ammavodi etc are being implemented. Salaries of Anganwadi workers have been substantially increased. Salaries and remunerations of Home Guards, IKP, MNAREGA SERP staff, 108 employees, 104 employees, VROs, VAOs, ANMs, Contract and outsourcing staff, part-time lecturers, sanitation staff working in GHMC etc are increased substantially.

            Mission Bhagiratha aiming at supply of purified and treated drinking water to the doorstep each and every family has been completed with more than 19,000 habitations getting water supply. Health and medical facilities have been improved in a such a way that people started gaining confidence in government hospitals than the corporate. Diagnostic facilities are created across the state. Basthi clinics have been established in Hyderabad to bring medical facilities nearer to common man. Four more new medical colleges have been started. Poor pregnant women are covered under KCR kits scheme which compensates their wage loss.

            As part of KG to PG education system in addition to the existing 296 residential schools, 542 more institutions have been established. 119 more residential schools one in each assembly segment exclusively for BCs will come-up from next academic year. Through the largest green cover Telangana ku Haritha Haram so far 82 crores of saplings were planted all over the state. As part of reorganization of 31 Districts, 69 Revenue Divisions and 584 Mandals have been made. The number of Gram panchayats has been increased to 12,751 which includes Girijan Thandas and Lambadi Gudems. The new Zonal system would take shape shortly with seven zones and two multizones.

            Thanks to the single window industrial policy 7679 industries with Rs 1,32,000 crores investment providing employment to 8.37 lakhs have been started out of which 5570 have gone into production. In IT development, in law and order front, in the case of Highways, two bedroom houses for poor  etc. the state’s progress card is simply fantastic.  
      
            Thus an all-round achievement in all fronts has been achieved by KCR 50 months in power and truly it is a governance with a difference.