అగస్త్యాశ్రమంలో శ్రీ సీతారామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-23
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (26-08-2018)
ఆశ్రమ ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్య ముని శిష్యుడిని
చూసి, అయ్యా! దశరథ మహారాజు పెద్ద కొడుకు, సీతాదేబి భర్త, శ్రీరామచంద్రమూర్తి భార్యతో కూడి ముని దర్శనార్థమై వచ్చాడని చెప్పాడు.
"ఆ రాముడి తమ్ముడిని. నా పేరు
లక్ష్మణుడు. నేనాయనకు హితుడను, భక్తుడిని, అనుకూలుడిని, ఎల్ల వేళల ఆయన్నే సేవిస్తాను. జనకాజ్ఞ
పాలించాలన్న నీతిననుసరించి అడవులకు వచ్చాం. మీ గురువు అగస్త్య మునిని
దర్శించాలనుకుంటున్నాం. మేము వచ్చిన సంగాతి ఆయనకు
చెప్పి పోమగృహంలో వున్న అగస్త్య్డితోణ్యం కట్టుకోండి" అని లక్ష్మణుడు
చెప్పగా. అలానే అనుకుంటూ, హోమగృహంలో వున్న
అగస్త్యుడితో దశరథ రాజకుమారులు, సీతాసమేతంగా ఆయన
సేవకొరకు వచ్చారని చెప్పారు. మునీంద్రుడు ఆజ్ఞ ఇస్తే తీసుకొస్తామని అంటారు.
ముని శిష్యుడు అలా చెప్పగానే, "ఔరా నా అదృష్టం...ఇన్నాళ్లకైనా రామచంద్రమూర్తి
ఇక్కడికి వచ్చాడు. అదే చాలు. సాధుయోగ్యమైన నడవడి కల ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాను. ఆ ముగ్గురిని పూర్ణ భక్తితో భోగ్యమైన విధంగా ఇక్కడికి తీసుకుని రా. అనావశ్యకమైనా ఆలశ్యం ఎందుకు చేశావు? సీతారామలక్ష్మణుల
పేర్లు వినగానే వెంటనే పిలుచుకుని రావాలి కదా? నువ్వు
రావడానికి, పోవడానికి ఇంత సమయం తీసుకుని, వ్యర్థం చేసి, వాళ్లను బయట నిలబెట్టవచ్చా? వాళ్లు మన వాకిట్లో నిలబడాల్సినవారా?" అని
అగస్త్యుడు అనగానే, శిష్యుడు గురువుకు నమస్కారం చేసి, పరుగెత్తుకుంటూ పోయి, లక్ష్మణుడితో ఆయనను, రామచంద్రమూర్తిని, సీతతో సహా రమ్మని చెప్పాడు. వారంతా కలిసి శీఘ్రంగా లోపలికి పోయారు. పోతూ
అక్కడ వారు...బ్రహ్మ స్థానం (బ్రహ్మను
ఆవహింప చేసి పూజించే స్థానం), అగ్ని స్థానం, శ్రీవిష్ణు స్థానం, ఇంద్రుడి స్థానం, సూర్య స్థానం, చంద్ర స్థానం, భగుడి స్థానం, కుబేర స్థానం, ధాత స్థానం, విధాత స్థానం, వాయు స్థానం, ఆదిశేషుడి స్థానం, గాయత్రీ స్థానం, వసువుల స్థానం, వరుణుడి స్థానం, కుమార స్వామి స్థానం, ధర్ముడి స్థానం...అనే పూజా ప్రదేశాలను చూశారు. అలా పోతూ...పోతూ, శిష్యులతో
కూడి అగస్త్య్డుడు ఎదురుగా రాగా,ఆయన్ను చూసిన
శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చే వాడే అగస్త్యుడు అని చెప్పాడు.
వచ్చే వాడే అగస్త్యుడని ఎలా చెప్పగలిగాడో రాముడంటే...ఆయన బ్రహ్మ వర్చస్సు బట్టి తెలుసుకున్నానంటాడు. ఆయన రాగానే శ్రీరాముడు ఆయన్ను సమీపించి,పాదాలమీద
వాలాడు. ఆ తరువాత సీతాదేవి, లక్ష్మణుడు
శ్రద్ధగా అలానే చేసారు. ఆ తరువాత వారంతా అభివందనం చేసి
నిలుచుని వుండగా, ఆ ముని శ్రేష్టుడు
శ్రీరామచంద్రమూర్తిని అతిథిగా గ్రహించి, ప్రేమతో
అతిథులకు ఇవ్వాల్సిన అర్ఘ్యం, పాద్యం ఇచ్చి, పూజించి, యోగక్షేమాలు విచారించి, కూర్చోమని చెప్పాడు. తరువాత వానప్రస్ఠ ధర్మం
ప్రకారం నిండుగా, తృప్తి కలిగేట్లు వారికి భోజనం
పెట్టాడు. దాంతర్వాత, నిర్మల
ధర్మజ్ఞానంలో పండితుడైన శ్రీరామచంద్రుడిని చూసి, వానప్రస్థగృహస్థ
ధర్మాలు తెలిసే విధంగా ఇలా చెప్పాడు.
"సమస్త ప్రపంచానికి, అందులోని
జనులకు, నీవే ప్రభువువి. నీవే మహారథుదవు...నీవే
మూర్తీభవించిన ధర్మాత్ముడవు. విశేషంగా ప్రకాశించే కీర్తికలవాడివి. గౌరవించాల్సిన
ఆకారం కలవాడివి నీవే. ఎంతటి పూజకైనా పూర్ణంగా తగినవాడివి. భూపతివైన నీవు
ప్రయాతిథివై వచ్చావు. ఇంతకు మించిన పుణ్యం ఇంకేమైనా వుంటుందా?" అని చెప్పి వారికి కడుపునిండా పళ్లను, వేళ్లను, పూలను, తినటానికిచ్చి, ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప విల్లు, అక్షయ బాణాలు, తూణీరాలు చూపించి ఇలా చెప్పాడు.
"దేవసంబంధమై, పూజ్యమై, బంగారు రత్నాలతో అలంకరించబడిన అసమానమైన ఈ విష్ణు ధనస్సు విశ్వకర్మ
నిర్మించాడు. ఈ బాణ సమూహం వ్యర్థం కాదు. సూర్యుడి కాంతిలాంటి కాంతికలదిది. ఇది
బ్రహ్మ ఇచ్చాడు. ఈ అక్షయ బాణాలు, పదునైన బాణాలతో నిండిన
అమ్ముల పొదులు, బంగారు పిడికల కత్తి, దాని ఒర ఇంద్రుడిచ్చాడు. సూర్య తేజా! ఈ వింటితో విష్ణుదేవుడు రాక్షసులను
యుద్ధంలో చంపి, జయం పొందాడు. ఈ బాణాలు, కత్తి, పొదులు ఆయన యుద్ధంలో ఉపయోగించినవే. నీకూ
జయం కలగడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకున్నట్లు వీటిని గ్రహించు" అని
అంటూ ఆ శ్రేష్ఠమైన ఆయుధాలను శ్రీరామచంద్రమూర్తికిచ్చి మళ్లీ ఇలా అన్నాడు.
No comments:
Post a Comment