Sunday, November 29, 2020

వాల్మీకిని చూసేందుకు వచ్చిన బ్రహ్మ .... ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-33 : వనం జ్వాలా నరసింహారావు

 వాల్మీకిని చూసేందుకు వచ్చిన బ్రహ్మ

్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-33

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (30-11-2020)

(శ్లోక-పద్య రూపంలో శాపం ఇవ్వాలన్న తలంపు వాల్మీకికి లేదు. ఆయనా, తను వూరికే దూషించిన వాక్యం శాపంగా మారిందేనని, వాల్మీకి ఆశ్చర్యపడ్డాడు. దీని యదార్థ భావాన్ని వివిధ రకాలుగా విశ్లేషించవచ్చు. వాల్మీకి నారదుడిద్వారా రామ కథనంతా-సర్వం తెలుసుకుంటాడు. కరుణ రస భూరితంగా ఆ చరిత్రను గ్రంథస్థం చేయాలనుకుంటాడు. అందుకు ఆయనకి కరుణ రసం తగినంత పాళ్లలో వుండాలికదా! ఆ విషయాన్ని పరీక్షించగోరి, గతంలో భృగుమహర్షి ఇచ్చిన శాపాన్ని స్థిర పరిచేందుకు, శ్రీరాముడు బోయవాడి వేషంలో రాక్షసుడైన క్రౌంచపక్షిని చంపాడట. దీనినే శ్రీరాముడు-సీత అనే భార్యా-భర్తల ఎడబాటుగా అన్వయించుకోవచ్చు కూడా. ఏదేమైనా, వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి అర్థం వెతికేటప్పుడు, వాల్మీకి రామాయణమే ప్రమాణం కాని, ఇతర గ్రంథాలు ప్రమాణం కావు.


అలాంటప్పుడు, వాల్మీకి రామాయణం సత్యచరిత్రమనీ, అందులోని అనేక విషయాలు జరిగినవి-జరిగినట్లే, తెలుపబడ్డాయనీ చదువరులు మనస్సులో వుంచుకోవాలి. తక్కిన రామాయణాలన్నీ స్వమతాభిమానాన్ని, స్వమతాన్ని వుద్ధరించాలన్న ఆలోచనను తెలియబర్చేవి మాత్రమే. తన ఏడుపు కథను రాసేందుకు వాల్మీకికి తగినంత మోతాదులో ఏడుపు గొట్టుందానని శ్రీరాముడు పరీక్షించాడనడం విడ్డూరమనే అనాలి. ఇంతకూ, వాల్మీకి రామాయణాన్ని శృంగార ప్రబంధంగా వ్యాఖ్యాతలందరు అంగీకరించారు కాని, కరుణ ప్రబంధంగా అంగీకరించలేదు. సీతా వియోగం కూడా విప్రలంభ శృంగారమే.

వాల్మీకి బోయవాడిని రామచంద్రమూర్తి అని అనుకుని శపించలేదనేది పూర్తి యదార్థం. ఆయన రాముడి భార్య సీత తన ఆశ్రమంలో వుందన్న విషయం, ఆమె దుఃఖంతో పరితపిస్తున్న విషయం ఎరిగిన వాల్మీకి, ఆమె దుఃఖాన్ని మరింత పెంచడు కదా! తను శ్లోక (పద్య) రూపంలో అన్నది శాపంగా పరిణమిస్తుందని ఆయనకూ తెలియదప్పుడు. ఆయన మనస్సు లోని ఉద్దేశం తిట్టు రూపంలో శ్లోకం (పద్యం)గా రావడానికి కారణం, ఆయన నాలుకపై సరస్వతి వుండడమే. పలికించింది బ్రహ్మ పనుపున రామకథ వాల్మీకితో చెప్పించాలని వచ్చిన సరస్వతి. అంటే, కవి అనుకోకున్నప్పటికీ, సరస్వతి ఆయన నోట అలా పలికించిందనాలి).

ఆ తర్వాత వాల్మీకి శాస్త్రం చెప్పిన రీతిలో నదిలో స్నానం చేసి, సమీపంలో వున్న జల పూర్ణ కమండలాలను తీసుకుని, శిష్యుడు వెంటరాగా, తాను చెప్పిన (శ్లోకం) పద్యం గురించే ఆలోచిస్తూ ఆశ్రమం వేపు వెళ్తుంటాడు. వెళ్తూ, తను వూరికే శపిస్తే అది పద్యమెలా అయిందానని అనుకుంటూ, ఆ పద్యమే శాపానికి బదులుగా ఆశీర్వాదమయిందికదా అని ఆశ్చర్య పోతుంటాడు. ఆశ్రమం చేరి భగవద్విషయాలను తలచుకుంటుంటాడు.

బోయవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో బాధపడ్డ వాల్మీకి, వాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించి, తదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో, ఆయన్ను చూడడానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. పది దిక్కులకు తన తేజస్సును వ్యాపింపచేస్తూ, యోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే, వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడు, తనంతట తానే, దేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడు. ఇలా బ్రహ్మ తన ఇష్టులతో, శిష్టులతో రావడంతో, వాల్మీకి తటాలున లేచి, మిక్కిలి భక్తితో మ్రొక్కి, నిలబడి ఈయనెందుకొచ్చాడా అని కారణం వెతకసాగాడు. "ఇదేదో వింతలాగుందే. నారదుడే స్వయంగా వచ్చి, రామ చరిత్ర ఉపదేశించడం మొదటి వింత. శాపోక్తులు భగవత్ మంగళా శాసనం కావడం మరో వింత. ఏళ్ల కొద్దీ తపస్సు చేసినా ప్రత్యక్షం కాని బ్రహ్మ తనంతట తానే నా గుడిసెలోకి రావడం ఆశ్చర్యంగా వుంది" అని, తనలో అనుకుంటూ,వినయంగా బ్రహ్మకు అర్ఘ్య-పాద్యాలిచ్చి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి, సాష్టాంగ పడ్డాడు వాల్మీకి. తదుపరి, బ్రహ్మదేవుడు, ఉన్నతాసనంలో కూర్చొని, వాల్మీకిని కుశల ప్రశ్నలడిగి, ఆయన్నూ కూర్చోమని చెప్పాడు. సమీపంలో కూర్చొన్నప్పటికీ, బోయవాడి సంగతి మాత్రం మనస్సులో ధ్యానిస్తూనే వున్నాడు వాల్మీకి."అయ్యో, బోయవాడెంత దయలేనివాడు. ఏ కారణం లేకుండానే, పగబట్టినవాడిలా, పాపమని కూడా అనుకోకుండా, మనోహరంగా కూస్తున్న క్రౌంచ పక్షిని చంపాడు కదా" అని ఆలోచిస్తూ, పక్షి పడిన దుఃఖాన్ని తలచుకుంటూ, శోకం కలుగుతుంటే, తాను చెప్పిన పద్యం గురించే, ఎదుట బ్రహ్మ వున్న విషయం కూడా మరిచి వ్యాకుల పడుతున్న వాల్మీకిని గమనిస్తాడు బ్రహ్మ.

TRACING THE ROOTS OF LAND RECORDS:BOOK REVIEW By VJM Divakar,

 TRACING THE ROOTS OF LAND RECORDS

The Latest book by Vanam Jwala Narasimha Rao

is of immense educative value

BOOK REVIEW By

VJM Divakar, Senior Journalist

Telangana District and Land Administration at A Glance

(Published by Adugujaadalu: 252 Pages, Rs 350)

This is the compilation of articles written by Vanam Jwala Narasimha Rao over the period on several platforms, his regular columns in daily newspapers, his personal Blog, the media releases he prepared as Chief Public Relations Officer to Chief Minister K Chandrashekhar Rao. Jwala Narasimha Rao has picked and chosen articles from his vast repertoire of writings. This will be one reference book for the students, teachers, scholars of the public administration and political science especially for those who want to study the District and Land Administration in the Telangana region from the ancient times, through the Nizam period to till date.

As Jwala Narasimha Rao himself stated in his Prologue and Acknowledgements, “This book has more than 40 articles deals among others with creation of new and small districts in Telangana, evolution of district administration, the changing role of Collector in the changed scenario, the survey settlements aspects of lands, rectification and updation of land records, municipal and Panchayat Raj Acts, urban policy, need for training of civil servants, citizen centric government etc.”

This book is a humble attempt to cover all aspects of the district and land administration. While doing so, Jwala made a sincere effort to trace the roots of Land records in the region and wonderfully presented the reforms evolution in a lucid manner, which even a common reader, can understand. He also dealt at length about the importance of creating new and small districts and their significance. He also argued how creation of new and smaller districts help the governance to reach to the door step of people and how it provided an opportunity for the young IAS officers to work as Collectors. He also traced the evolution of district administration since Independence.

On the Land records administration, Jwala Narasimha Rao records the early land reforms that took place in ancient India to the British regime, the Nizam period to the present. He explains at length various terms, methodology, policies connected with the land records, documents. Since as CPRO, he has ringside view of the discussions that CM KCR had on the subject, Jwala Narasimha Rao at appropriate places mentions about these discussions, reviews, observations made by the CM which very well fitted in the narrative.

Jwala Narasimha Rao also traces the saga of land reforms from PV to KCR and goes on to prove that Land Records Updation is, indeed, the heart of good governance. He discusses at length on the changing role of Collectors in the changed scenario. He explains to the last detail about the New Revenue Act, Municipal Act and how they usher in a new dawn in Telangana State for the large welfare of the people and for their development.

Among all the important chapters in the book, the most interesting is about the Gramayanam. Jwala Narasimha Rao refers to a small Monograph on Gramayanam written by Prof Maramraj Satyanarayana Rao, former Registrar of the Dr BR Ambedkar Open University. It is very interesting to read. As a former Faculty member of the Dr MCR HRD Institute, Jwala Narasimha Rao highlights the need to train public servants on a regular basis in tune with the fast changing environment in the administration. He argues for more citizen centric governance. He also wrote about the much-talked Dharani Portal for registration of properties in a transparent way, the robust state’s economy and how effectively the government schemes, policies and programme should be implemented.


To put it in TSPSC Chairman Prof Ghanta Chakrapani words, which he wrote in his preface to the book, “The vision and farsightedness of the Telangana State administration in introducing administrative reforms is very systematically captured by Sri Jwala Narasimha Rao in his book.”

Senior IAS officer and Secretary to Chief Minister Telangana and Secretary Revenue, V Seshadri says that this book is of immense educative value and can serve as a reference material for all the administrators, academicians, and research scholars.

Another senior IAS officer BP Acharya says that his book is a valuable addition to the literature on contemporary politics and policy making in Telangana. In her introductory Note Dr Pallavi Kabde, Head dept of Public Administration, DR BRAOU, says this book will be of great use to teachers of public administration.

Former RBI Governor Duvvuri Subba Rao says that everyone interested in land and district administration will find reading this book an engaging and rewarding experience.

 

Saturday, November 28, 2020

A Saga of IPKF-LTTE conflict .... Dr AP Ranga Rao the advisor IPKF in Sri Lanka : Vanam Jwala Narasimha Rao

 A Saga of IPKF-LTTE conflict

Dr AP Ranga Rao the advisor IPKF in Sri Lanka

Vanam Jwala Narasimha Rao

Hans India (29-11-2020) 


            For evaluating the needs of civilians in the then conflict between (Indian Peace Keeping Force) IPKF and (Liberation Tigers of Tamil Eelam) LTTE Late Dr AP Ranga Rao was deputed by Ajit Bhowmick, the then Secretary General of Indian Red Cross Society (IRCS), to Sri Lanka in the third week of October 1987. At that time Dr Ranga Rao, a medical professional was working in State TB Centre, Hyderabad.  Dr Rao flew to Delhi and after obtaining a survival Kit and a camera from IRCS flew to Chennai along with three nurses and two assistants from Central Red Cross.


After waiting for two days in Chennai he could fly in an army chopper that was transporting goats, vegetables and poultry. He was one of three passengers on board. It took 40 minutes to reach Palely air base in northern Sri Lanka. It was raining. He got off the chopper and looked around. And it was like a scene in a war film around there. Everyone was in uniform except Rao.  


Dr Rao took out his Red Cross badge and pinned it on his shirt. He introduced himself to an officer who led him to the nearby army medical core first aid post and asked them to accommodate him for the night. Next morning, he flew in a chopper to Jaffna and reached Jaffna General and Teaching Hospital in an army truck.


On the way he could see devastation. There were burnt out vehicles, corpses of few days old, eagles and dogs around them all over the place. He could only see the faces of army personnel with their helmets, guns pointed behind makeshift sand bag shields. He could hear occasional gun fire. Except these, roads were deserted.


On reaching the Hospital he wanted to go and meet doctors in the OP block, but Jawan guarding gestured him towards the other side. There he met a person who introduced himself as Colonel (Dr) Puri and asked Rao to follow him. Both moved towards the Emergency Area Operation theatre. Colonel Puri along with two other army Doctors and staff were living in a room in theatre block.


While they were conversing a Jawan came to inform that few civilian causalities were brought, and no one was attending on them. Rao could hear the wailing and crying in the corridor. Then with the consent of Colonel Puri Ranga Rao went to a ward nearby where he met one young lady Doctor, a doctor past his middle age and another male doctor in his thirties. They all looked very haggard.


There was no electricity in the hospital and even in the town. There was curfew in the town. With reluctance the Doctors attended to the cases. During the course of chat Rao understood that the main problem was shortage of man power and medical supplies and electricity. Together they prepared an inventory of requirements and went back to Colonel Puri and requested him to arrange to send the indent to the Secretary General IRCS at Delhi.


That night Dr Ranga Rao rested in a labour room. He stretched on the labour table. Except few hard chapattis and two cups of black tea he did not have anything to eat whole day. He was hungry, tired and fretful. It was dark and sultry. It was a nightmare. He was frequently disturbed by mosquitoes and sounds of gunfire and distant explosion of bombs. After a formal bath in the morning at a nearby well and morning routine, Dr Rao went back to Col Puri. During conversation with him he realised that death may strike one from any corner any time and it was futile to be afraid of it. He decided that he should be a real Red Cross worker and maintain his neutrality. He should first win the confidence of the three Civil doctors so that he could help those in need. 


Next morning Col Venugopal arrived along with two General Duty Doctors and three nurses and two assistants. All of them were from Delhi. In the afternoon a truck load of medicines and supplies arrived from Delhi. The truck unloaded them and left. All of the medical team carried them and stored them in the stores of the hospital and handed over them to the Civilian Doctors.


            Two days earlier to Dr Rao’s arrival there were some serious skirmishes between LTTE and IPKF forces. It is alleged that LTTE was firing from the hospital premises at the advancing IPKF. IPKF bombed the hospital areas. The gaping holes in the roofs of the emergency ward were still seen. Since the firing from hospital has not stopped even after the bombing IPKF forces entered the hospital premises. They rushed into the OP block which was suspected to be the area from which LTTE was suspected to be firing. In the resulted firing it is said that totally 70 persons were killed, and the number included patients, two junior doctors, three nurses, and a senior doctor and some LTTE activists and sympathisers. The bodies of the dead were still lying in the OP block which was sealed after sanitisation.


Civilian Doctors Dr Shashi Sabha Ratnam, Dr Ponnampalam and the other doctor thanked Dr Ranga Rao for the supplies. Colonel Venugopal found some accommodation within the hospital for the Red Cross team to stay and all moved into it. All slept on floor in the same room. Col Venugopal made some arrangements for food to be cooked in a hotel nearby "Subash Hotel".


Curfew was lifted for few hours after a week after its imposition. There was a chaos. The general market which was close to the hospital was looted. Even the patients left their beds and returned with whatever they could lay their hands on. There was a barter between people and they exchanged the required goods. Ranga Rao could procure some cigarettes as he was running out of his stock.


Next morning, they decided to visit some camps where people congregated to know their requirements. The camps were well stocked with food supplies and clothes etc. The demand was more for sanitary napkins, soaps, toiletries, milk powder and anti-hypertensive and anti-Diabetic medicines.


Dr Ranga Rao and his team tried to establish clinics in the camps. Very few attended and those attended were asking for medicines which at that time were not available in India. Ranga Rao sent a report requesting for Tamilian Doctors and staff to be deputed. In response few more Red cross members arrived to take care of the distribution. Dr Ranga Rao made a courtesy call on the newly appointed town commandant Brigadier Callahan. Dikshit who was Indian Ambassador visited Jaffna and the hospital.


Days passed by and there was no let-up in the fighting. It spread to new areas. Total curfew with relaxation for few hours was imposed throughout the northern peninsula. Curfew in Jaffna lasted for 21 days. Ranga Rao could not contact his family during the period. On his request and suggestion, a team consisting of thirty-five with 8 doctors was deputed. The team was divided into four groups the bigger group staying back at Jaffna and others were sent to Batticaloa, Vavuniya, and Trincomalle and to point Pedro. 


The Red Cross used to receive many enquiries from various countries in regards the safety and whereabouts of persons said to be living in Jaffna peninsula. Slowly the life was returning to normalcy. After intimating IRCS Ranga Rao withdrew and returned to Hyderabad to re-join his regular duty.


Dr Ranga Rao recollected that often he wondered what were the aspects that led to civil strife in Sri Lanka. Jaffna peninsula was mostly inhabited by Tamils and Keralites, whereas southern Sri Lanka was mostly inhabited by Buddhists who migrated from north India during Ashoka time. While Tamilian in Jaffna Peninsula consisted 20% of population the Southern were 80%. The northern areas are not fit for agriculture and the people were mostly occupied in the service sector. Education was the industry in northern areas.


Every alternate house was an educational institute. During the period of rule of Bandaranaike in Sri Lanka there was massive agitation against the predominant occupation and domination of Tamilian in Government jobs and professional courses. This led to legislation of reservation in Government jobs and professional courses for the majority. The country was taken as a unit for its application.


Suddenly Tamilian population found themselves in minority in Government jobs and Professional courses. Tamilian student who secured marks and stood fourth in the country could not secure a seat in Jaffna medical college and was accommodated in Colombo. Such sudden shift in their prospects led to strikes and agitations, which were effectively suppressed by the ruling Sinhalese majority.


To make a living majority of young educated Tamilian population migrated to other countries while the older members of family stayed back in northern Sri Lanka. Since there were many cheaper educational opportunities in northern Sri Lanka their children stayed back with their grandparents. There was a tremendous vacuum of age groups of 20 to 60 in northern Sri Lanka for decades. The migrated population used to send money from abroad to support their parents and children. The small group of uneducated Tamilian population mostly living on fishing and allied activity soon took control of the local situation.


There was a big scope for them to indulge in smuggling activity to neighbouring countries like India where a sympathetic Tamil population lived. The young children living with their grandparents were soon lured to the adventurism and under the guise of culture and fight against exploitation joined the cadres of LTTE. The grandparents who lost the earlier opportunities and suffered the majority rule stayed as silent mute spectators.

(Source: Hopping Memories, an autobiography of Late Dr AP Ranga Rao)

Friday, November 27, 2020

Modi Ji, be a statesman not a politician please! : Vanam Jwala Narasimha Rao with VJM Divakar

 Modi Ji, be a statesman not a politician please!

Vanam Jwala Narasimha Rao with VJM Divakar

The Pioneer (28-11-2020)

Prime Minister Narendra Modi has once again brought to the forefront the ‘One Nation One Election’ theory. In all probabilities he appears to have resolved holding simultaneous polls as his personal dictum. No debate, no opinion gathering, no consensus and nothing of that sort but a flash of declaration. Modi Ji said that his idea is not a matter for debate but it is what the country needs! Whether right or wrong, good or bad, practicable or not, in a country like ours which has democratically elected leaders at national, state and local level it is essential to garner opinion of many but no single view, before making such a fundamental policy proclamation.     

No doubt that frequent elections resulting in frequent (MCC) Model Code of Conduct hamper normal governance and development programs of concerned governments. But the solution is not doing away with this and instead it is better to remodify the procedure of imposing MCC. There are umpteen ways to overcome the hazards of MCC and ‘One Nation One Election’ shall be the least and last choice. The talk of saving tax payers’ money by politicians, when it suits them, is ridiculous. Elections are pillars of democracy and expenditure on elections is an investment but not waste. Instead of calling as frequent elections let us say elections as and when necessitated.    

There is no truth in saying that a lot of money could be saved if elections are held just once in five years, as the money (black money) would never be any problem for those who contest elections. It is the corporate sector, which should worry about the huge expenditure incurred during elections. But they never complain about excessive infusion of money in elections because of the enormous benefits they will reap after elections.

None of these claims have any empirical evidence to support them. Frequent elections have not affected the quality of governance or decision-making. Many major decisions with far reaching impact on the economy and other areas of national life were taken during those decades when elections were held at different times. Modi Ji’s decision of demonetization, was done just a couple of months before assembly elections in Uttar Pradesh and four other states.

The history of elections in India had its beginning with simultaneous elections. The first general election in 1951-52 saw the country voting for both the Union and state governments. This continued for many years until the aayaram and gayaraam culture dawned on Indian political scenario. With Congress Party, which once was monopoly party at center and states, loosing election in state after state and with frequent interruptions due to president rule the frequent elections started thus disrupting the simultaneous elections. The indiscriminate use of Article 356 of the constitution for the dismissal of state governments and dissolution of assemblies before terms ended has been the main culprit for frequent elections.

Moreover, simultaneous elections are not a practical proposition though the Election Commission is ready to execute it. There are many practical problems surrounded by it. For instance, if it is decided that elections to the Lok Sabha and all state assemblies will be held together in 2022, what will happen to the assemblies elected in 2020 and 2021? Will they be dissolved? Then what will be the term of the government that comes to power? An assembly is elected for a period of five years. It can be dissolved only when the government in that state cannot carry on, in accordance with the provisions of the constitution, and also when no alternative government is possible. Otherwise, the constitution does not permit the dissolution of assemblies before the end of their term.

In the event that the constitutional machinery in states breaking down, after simultaneous elections are held, necessitating dissolution of the assemblies prematurely, will these states be under the president’s rule till the next elections? Or the elections will be held for the left-out period? These questions, and many others, remain to be answered. These are debatable but cannot be just a single individual’s dictum.

It is pertinent to note that the nation witnessed to the imposition of president’s rule on more than hundred occasions, which dislodged the popularly elected government in states. In most cases, the president’s rule was imposed at the discretion of the governor motivated by the political government in power at the center. The decision was more of political in nature than otherwise. Instead of curbing such unhealthy practices, the theory of simultaneous elections is tantamount to undermining Indian democratic fabric and it roots, resulting in erosion of political plurality.

India has the distinction of fashioning local self-government and holding elections to them in a democratic manner at periodic intervals. With the 72 and 73 Amendments high standards were set in establishing people elected local self-governments at grassroots. Clubbing these three-tiers, the national level, the state level and the local level, and holding elections at the same time, will not yield any useful purpose but destroy the very federal fabric of our nation.

As it is the federal spirit of Indian Constitution and the liberty of the State government is weakened in a systematic manner beyond repair. Constitution founders designed a two-tier system of Parliamentary democracy with a great vision and foresight. They have purposefully created subjects under the Centre, State Lists and also a Concurrent List. These have been willfully eroded, often trampling upon them with a view to consolidate the power at the Centre. Modi Ji, the Honorable Prime Minister, as a supreme leader of our country should act and exhibit him-self like a Statesman but not as an ordinary politician leading to infringement of constitution and federal structure.

Contemporary developments all over the globe have once again demonstrated that majority of people want a vibrant, working, transparent democracy. It is not correct that leaders like Modi Ji think that their theories are the right ones for the country and whatever they think for the country should be accepted by all. It is high time that Modi Ji realizes that he is heading one of the largest, vibrant and greatest parliamentary democracies in the World modelled on the West Minister model.

The beauty of Indian Constitution is that it is like the concept of God in Hindu belief system, omnipresent, omnipotent and all pervading. We don’t change God if something unhappy happens and similarly Constitution cannot be changed to suit our needs. Under the Constitution, the President is Supreme Seat of Power like that in Britain, and we don’t need another seat of power surpass this! Its an appeal to Modi Ji to rethink for a while and reconsider his thought of ‘One Nation One Election’ which will ultimately destroy Indian federal spirit, democratic fabric and unity in diversity.  Let Modi Ji be remembered in the modern Indian history as a Statesman but not as a mere politician!

Sunday, November 22, 2020

బోయవాడిని శపించిన వాల్మీకి మహర్షి .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-32 : వనం జ్వాలా నరసింహారావు

 బోయవాడిని శపించిన వాల్మీకి మహర్షి

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-32

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (23-11-2020)

"ఓరీ నిషాదుడా, క్రౌంచ పక్షుల జంట కలిసున్నప్పుడు, కామ క్రీడలు సలుపుతున్నప్పుడు, ఆ మత్తులో తేలుతున్నప్పుడు, జంటలో ఒక పక్షిని చంపావు కనుక, నీవు దీర్ఘకాలం బ్రతకవు". శపించిన తర్వాత సర్వ శాస్త్రజ్ఞాన సంపన్నుడైన వాల్మీకి మహర్షి, ఎంతగానో దుఃఖిస్తున్న క్రౌంచ పక్షి దురవస్థ చూడలేనందువల్లే బోయవాడినుద్దేశించి ఇలా అంటినికదా అనుకుంటాడు. అయితే తానన్న మాటలు ఎలా పరిణమించాయో నని ఆలోచించిన వాల్మీకి, శిష్యుడు భరద్వాజుడితో :"ఇప్పుడొక వింత జరిగింది. గమనించావా? దుష్టుడైన బోయవాడు చేసిన తప్పుడు పనికి బాధపడ్డ నేను, కోపంగా బోయవాడినన్న మాటలు, ఛందోశాస్త్ర విధుల ప్రకారం ఓ (శ్లోకం) పద్యమై వర్ధిల్లుతున్నది. ఏమి ఆశ్చర్యం? నాలుగు పాదాలతో, సమాన సంఖ్యగల అక్షరాలతో, మనోహరమై, వీణపై వాయించేందుకు అనువుగా, తాళానికి-లయకు సరిపడే (శ్లోకం) పద్యమైంది చూసావా?" అని అంటాడు. ఇలా వాల్మీకి ప్రేమతో చెప్పిన తర్వాత భరద్వాజుడు, గురువు చెప్పిన మాటలను గ్రహించి, ఆ (శ్లోక) పద్యరూప వాక్యాలకు చాలా ఆశ్చర్యపడి, దానిని కంఠస్తమయ్యేట్లు వల్లెవేస్తాడు. ఆ శిష్యుడి నడవడి చూసిన వాల్మీకికి ఎంతో సంతోష మేస్తుంది. తాను చెప్పింది లోకం మెచ్చుకోవడమే కవికి కావాల్సింది.

సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:

"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః

యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక

ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల

గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు

కామమోహిత ముం జంపు కారణమున"

(రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చే ట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు. ఈ పద్యానికి నాలుగు పాదాలు.పాదానికి 13 అక్షరాలు.సాంఖ్యశాస్త్రంప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని సూచిస్తుంది. "అకారోర్థో విష్ణు" వని ప్రమాణం."ప్రతిష్ఠ” స్త్రీ లింగం.ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది).


బ్రహ్మ అనుగ్రహంతో రామాయణానికి మొట్ట మొదలు బీజ రూపంలో వెలువడ్డ ఆ శ్లోకం కేవలం శాపంగానే భావించకూడదని, అది శ్రీరామచంద్రుడి మంగళా శాసనం కావచ్చునని పూర్వులు ఆ శ్లోకానికి ఎన్నో అర్థాలు చెప్పుకున్నారు. క్రౌంచ మిథునాన్ని మండోదరి-రావణుల కలయికగానూ, క్రౌంచమంటే కుటిల స్వభావంగల రావణుడిగా అన్వయించి, అట్టి రావణుడిని చంపి లోకాలను రక్షించినందున తప్పక శాశ్వతంగా జయం కలుగుతుందని అర్థం చెప్పుకున్నారు కొందరు. మరో వ్యాఖ్యానంలో, రాముడు వాల్మీకిచే శపించబడాలని కోరుకుంటాడట. కోరుకుని బోయవాడయ్యాడట. దీనికి కారణం, శోకరసపూరితమైన తన చరిత్ర రాయడానికి సరిపోయినంత శోక రసం వాల్మీకి మనస్సులో వుందో-లేదోనని పరీక్షించేందుకేనట.

(ఈ పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా"  అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది."శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చినందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ శ్లోకం- పద్యంలో).

Monday, November 16, 2020

నాగుల చవితి, ధర్మాంగద చరిత్ర, పాముపాట : వనం జ్వాలా నరసింహారావు

 నాగుల చవితి, ధర్మాంగద చరిత్ర, పాముపాట

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (17-11-2020)

నాగుల చవితి సందర్భంగా పాము పుట్టలో నాగుపాము వుంటుందన్న నమ్మకంతో, అది తాగుతుందన్న భావనతో చాలామంది, ముఖ్యంగా మహిళలు పాలుపోయడం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగులచవితి అని అంటారు. మన పూర్వీకులు చెట్టును, పుట్టను, గుట్టను, రాతిని, ఆమాటకొస్తే సమస్త ప్రాణికోటిని ఆరాధించడం మనకు నేర్పారు. ఇది మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయం. బహుశా అందులో భాగంగానే నాగుపామును కూడా ఒక దేవతగా పూజించే ఆచారం అనాదిగా వచ్చి వుంటుంది. నాగుపాముకు పుట్టలో పాలుపోసిన తరువాత అంతా కలిసి ఒక ఇంట్లో కూర్చుని పాడుకునేదే పాముపాట. దాన్నే ధర్మాంగద చరిత్ర అని కూడా అంటారు. పాముపాట చదవడానికి పూర్వరంగంలో, దేవతా ప్రార్థన, కవిస్తుతి, శ్రీరామమూర్తి ప్రార్థన లాంటివి చేస్తారు. ఆరోజున ఉపవాసం వుంటారు. మర్నాడు నాగ పంచమి రోజున ఆహారం తీసుకుంటారు సాధారణంగా.  

ఇక కథ విషయానికొస్తే.....ఒకానొక రోజుల్లో అప్పటి కాశ్మీర దేశంలోని కనకాపురంలో సంగీత, సాహిత్య, సరస విద్యల్లో ఆరితేరి, వేదాలను అలవోకగా వల్లించగల బ్రాహ్మణులు అనేకమంది వుండేవారు. అలాగే రకరకాల వృత్తులవారు కూడా అక్కడ వుండేవారు. ఆ దేశం అప్పుడు ధనధాన్యాదులతో అలరారుతుండేది. ఆ దేశం రాజు పేరు ధర్మాంగదుడు. ధరణిలో ప్రఖ్యాతికన్నవాడు. ఆ రాజు భార్య పేరు అర్మిలీ దేవి. వారిద్దరూ ఆదర్శ దంపతులు. సకలభాగ్యాలున్న ఆ దంపతులకు సంతానం లేదనే చింత బాధిస్తుండేది. పుత్రులు లేకుంటే పుణ్యం లేదని, సుతుడు లేకుంటే గతులు లేవని తానిప్పుడు ఏంచేయాలని ఆ ధర్మాంగదుడు ఒకనాడు తన మంత్రుల సలహా అడిగాడు. దైవ ప్రార్థన చేయమని వారంతా సూచించారు. సంతానం కొరకు ఆయన అలాగే వారు చెప్పినట్లు చేయడంతో, దైవయోగాన ఆయన భార్య అర్మిలి గర్భం దాల్చింది. రాజుగారికి అ ఆవిషయం తెలిసి సంతోషమయింది. గర్భిణీగా వున్న స్త్రీలకు చేయాల్సిన వేడుకలన్నీ ఆమెకు చేశారు భందుమిత్రులు.

ఇదిలా వుండగా గర్భం దాల్చిన అర్మిలీదేవి నెలలు నిండగానే రెండు నాల్కలతో నిండు పడగను కలిగి, చిర్రుబుర్రుమనే శేషుడు (పాము) పుట్టాడు. ఈ విషయాన్ని చెలికత్తెల ద్వారా తెలుసుకున్న ధర్మాంగదుడు మూర్ఛపోయాడు. తరువాత తెప్పరిల్లి, ఏంచేయాలని మంత్రులను అడిగాడు. కొడుకు పుట్టాడని నగరంలో చాటిద్దాం అని, లేకపోతే, మనం చులకనైపోతామని వారు చెప్పారు. పుత్రుడు పుట్టినందుకు దానాలు కూడా చేద్దామన్నారు. అర్మిలీదేవికి కూడా ఆ సలహా నచ్చింది ఆ క్షణాన. తన పాముకొడుక్కు మామూలుగానే సపర్యలు చేయాలని చెప్పింది చెలికత్తెలకు. ఒక పెట్టె తెప్పించి అందులో దాన్ని వుంచి, పాలు పోసి పెంచసాగారు. ధర్మాంగదుడికి నిజంగా కొడుకే పుట్టాడని భావించిన పొరుగు రాజులు ఆయనతో వియ్యమందాలని నిర్ణయించుకున్నారు. తమ కోరికను ఉత్తరాల ద్వారా ధర్మాంగదుడికి తెలియచేయగానే ఆయన సిగ్గుపడ్డాడు బయటికి చెప్పుకోలేక. వారికి ఏమని జవాబు రాయాలో అర్థం కాలేదు రాజుకు. ఒక అందమైన అమ్మాయిని చూసి పాముకు పెళ్లి చేయాలని సలాహా ఇచ్చారు మంత్రులు.

పెళ్లికూతురును చూడడానికి బ్రాహ్మణులను పంపాలని నిర్ణయం జరిగింది. తక్షణమే పురోహితులను పిలిచారు. దేశదేశాలు తిరిగి, ఒక చక్కటి అమ్మాయిని వెతికి, ఆమె జాతకం పరిశీలించి, ఆయుర్దాయం చూసి, అయిదవతనం చూసి, తల్లిదండ్రుల నేపధ్యం విచారించి రమ్మని వారిని పురమాయించాడు రాజు ధర్మాంగదుడు. వారు ఆయన ఆజ్ఞానుసారం అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాల లాంటి దేశదేశాలు తిరిగారు. ఎక్కడా వారికి అనుకూలమైన అమ్మాయి కనిపించలేదు. రాజుకు ఈ విషయం ఎలా చెప్పాలి అని వారు మధనపడుతుండగా దారిలో వారికొక బ్రాహ్మణుడు కలిసి, సౌరాష్ట్ర దేశంలో మాణిక్యపురం పాలించే రత్నాంగుడు అనే రాజుకు త్రైలోక్య సుందరి అనే కూతురుంది అక్కడికి వెళ్లమని సలహా ఇచ్చాడు. వారలాగే అక్కడికి వెళ్లి రాజు రత్నాంగుడిని కలిసి తాము వచ్చిన పని చెప్పి అమ్మాయిని చూపించమని అడిగారు. ఆయన ఆ అమ్మాయిని సభకు రప్పించి చూపించాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణులు, ధర్మాంగదుడి కొడుక్కు, రత్నాంగుడి కూతురు సరిగ్గా సరిపోతుందని నిర్ణయించారు. జాతకాన్ని కూడా చూసి సంతోషించారు. రత్నాంగదుడి కూతురును తమరాజు కొడుక్కు ఇవ్వమని అడిగారు.

రత్నాంగరాజు తన పురోహితులను కనకాపురానికి పంపాడు. రాజు కొడుకును చూసి రమ్మన్నాడు. ఎవరిని చూపించాలని ధర్మాంగదుడు మధనపడ్డాడు. అప్పుడొక మంత్రి తన కొడుకును చూపిస్తానన్నాడు. రత్నాంగ రాజు పంపిన బ్రాహ్మణులకు మంత్రి తన రాజుకు చెప్పినట్లే తన కొడుక్కు ముస్తాబు చేసి చూపించాడు. ఆ బాలుడి హస్తరేఖలు చూసి ఆ బ్రాహ్మణులు సంతృప్తి చెందారు. ధర్మాంగదుడి వంశంలో ఒక ఆచారం వున్నదనీ, ఆయన కొడుకును అంటే పెళ్లికొడుకును పరదేశానికి పంపరనీ, కత్తికి బాసికం కట్టి తరలి వస్తారనీ, కత్తికి, కాంతకి పెళ్లి జరగాలనీ ఆయన మంత్రులు రత్నాంగుడి బ్రాహ్మణులకు చెప్పారు. వారా విషయాన్ని తమ రాజుకు చెప్పి ఒప్పించారు. పెళ్ళికి తిథి, వార నక్షత్రాలు నిర్ణయించారు. ఇద్దరు రాజులు పెళ్లిపత్రికలు రాసుకున్నారు. పెళ్లిప్రయత్నాలలో వున్నారు. శుభలేఖలు రాసుకున్నారు. మంత్రి తన నేర్పంతా చూపించి కోడలిని తీసుకురావాలని ధర్మాంగదుడు అన్నాడు.


ధర్మాంగదరాజు అనుకున్న ముహూర్తానికి పాముకు బదులుగా కత్తిని తరలించాడు. మాణిక్యపురంలోని స్త్రీలంతా పెళ్లికొడుకును చూద్దామని వచ్చారు. చివరకు వారికి కత్తి తప్ప ఇంకేమీ కనబడలేదు. ఇదేం వింత అని వారంతా ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. అంగరంగ వైభోగంగా పెళ్లి తతంగం జరిగింది. కత్తినే పెళ్లి పీటలమీద వుంచారు. పెళ్లికూతురుతో ఆ కత్తికే తలంబ్రాలు పోయించారు. ఐదురోజుల పెళ్లి జరిగింది. నాగవల్లి కూడా జరిగింది. ఐదురోజుల తరువాత ధర్మాంగదుడు తిరుగు ప్రయాణమయ్యాడు. రత్నాంగుడు తన రాజసానికి అనుగుణంగా తన కూతురు త్రైలోక్య సుందరితో పాటు అనేక రకాల బహుమానాలు ఇచ్చాడు మగ పెళ్లివారికి. అత్తగారింట్లో ఎలా మెసలుకోవాలో అనేకరకాలుగా చెప్పి పంపించారు కూతురును రత్నాంగుడి దంపతులు. ఆ అమ్మాయి కూడా అత్తగారింట్లో అలాగే వుంది. మంచి పేరు తెచ్చుకుంది. చివరకు తన భర్త పాము అన్న విషయం తెలుసుకుంది. ధర్మాంగదుడిని నిలదీసింది.

కోడలికి నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు ధర్మాంగదుడు. ఇదంతా తమ కర్మఫలం అన్నాడు. భర్తలేకపోతే తన గతేంటి అని అడుగుతుంది సుందరి. ఇలా ఎలా జరిగింది అని అడుగుతుంది. తన భర్త నాగారాజుతో కలిసి దివ్యతిరుపతులన్నీ తిరిగి వస్తానని అంటుంది. నూటొక్క తిరుపతులు సూటిగా తిరుగుతానంటుంది. ఒక పెట్టెలో పామునుంచి తీర్థయాత్రలకు బయల్దేరుతుంది. తనకు ఏ ఆభరణాలు వద్దని రుద్రాక్షలు కావాలని అంటూ బైరాగి వేషాన్ని ధరిస్తుంది త్రైలోక్య సుందరి. అందరి దగ్గర సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయల్దేరింది. తీర్థయాత్రలో భాగంగా దేశదేశాలలో వున్న గుళ్లు, గోపురాలు, ఆశ్రమాలు, నదులూ, పుణ్య తీర్థాలూ....ఇలా అనేక ప్రదేశాలకు భర్త నాగరాజును తీసుకుని పోతుంది. చివరకు నైమిశారణ్యం చేరుతుంది. అక్కడ దైవ ఘటనవల్ల కొందరు మునులు ఆమెకు తారసిల్లారు. మాండవ్య, కౌశిక, కౌండిన్య, మౌద్గల, గాంగేయ, కపిలుడు, కౌశికుడు, వాసిష్ట, ఆత్రేయ, వాల్మీకి, జమదగ్ని మొదలైన మునులను ఆమె దర్శించింది. తనకు పతిదానం ఇప్పించమని వారిని వేడుకుంది. తాను తిరిగిన ప్రదేశాల వివరాలు చెప్పింది.

మునులప్పుడు కరుణతో సుందరితో ఇలా అన్నారు. “దివ్యదృష్టితో అంతా చూశాం. నీ పతిసంగతి నీకు చెప్తాం. పూర్వజన్మలో యితడు పుడమికి రాజు. ఏడు దీవులను ఏకచ్చత్రాదిపత్యంగా ఎదురు లేకుండా పాలించేవాడు. కొంతకాలం తరువాత యితడు బ్రాహ్మణ భూములను పండనివ్వకుండా పడావు పెట్టించాడు. ఆ పాపఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నీ పుణ్యఫలాన ఇతడెలాగైనా మళ్లీ రాజవుతాడు. సృష్టిలో మీ దంపతులు సుఖంగా వర్ధిల్లుతారు. పుత్ర-పౌత్రులను పొందుతారు. ఎన్నో తిరుపతులు తిరిగావు. పడమట దిశగా తిన్నగా పోయి బ్రహ్మ గుండంలో పాముపెట్టేతో సహా నువ్వు స్నానం చేస్తే ఈ పాము నరనాథుడవుతాడు. శీఘ్రంగా వెళ్లు”.

ఆ మాటలు విన్నదే తడవుగా సుందరి వారికి సాష్టాంగ దండం చేసి పాముపెట్టెను ఎత్తుకుని అతివేగంగా వారు చెప్పిన దిక్కుకు పోయింది. పోయి బ్రహ్మగుండం దగ్గరకు చేరి తల్లి తండ్రులకు, పెద్దలకు, దేవుడికి నమస్కారం చేసింది. అప్పుడు ఆకాశవాణి ఆమెను త్వరగా ఆ గుండంలో మునగమని ప్రోత్సహిస్తుంది. ఆమె అలాగే ముమ్మారు పాముతో సహా బ్రహ్మగుండంలో మునిగింది.

అలా మునిగిన మరుక్షణమే ఫణిరాజు తన ఎదుట నాధుడై నిలిచాడు. తాను ఆయన ఇల్లాలినని సుందరి ఆయనకు చెప్పింది. తనను రక్షించమని వేడుకుంది. అప్పుడతడు ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్తుంది. ఇంకా అతడు సందేహిస్తుంటే ఆకాశవాణి ఆ బాలిక చెప్పినదంతా నిజమేనని పలుకుతుంది. దంపతులిద్దరూ సుఖంగా వుండాలని దీవించింది. వారిద్దరూ తిరిగి తీర్థయాత్రలు చేసి కాశ్మీర దేశానికి, కనకాపురానికి తిరిగి వస్తారు. ఆకాశవాణి, మనిషిగా మారిన నాగరాజుకు, చిత్రాంగదుడు అని పేరు పెట్టింది. చిత్రాంగదుడికి, త్రైలోక్య సుందరికి మళ్లీ శాస్త్రోక్తంగా వివాహం జరుగుతుంది. ఆ తరువాత సుఖంగా జీవించారు చాలా సంవత్సరాలు.

(పాముపాట అనే దీన్ని నాగులచవితి రోజున చదువుతే పుణ్యం అని అంటారు)

Sunday, November 15, 2020

తమసాతీరంలో విహరించిన వాల్మీకి మహర్షి ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-31 : వనం జ్వాలా నరసింహారావు

 తమసాతీరంలో విహరించిన వాల్మీకి మహర్షి

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-31

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-11-2020)

         (నారదుడు చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు. నారదుడు పోయింతర్వాత, వాల్మీకి, శిష్యుడితో తమసాతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు, జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు విన్న వాల్మీకి, ఎంతో జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల (శ్లోకం) పద్యమయింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ, శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు.సంక్షిప్తంగా నారదుడు చెప్పిన రామ చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు.

(గ్రంథాన్ని చదవాలనుకునేవారు మూడు విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం చెప్పిందెవరు? అతడి నడవడి ఎలాంటిది? లోకులకతడు ఆప్తుడా? అని విచారించాలి. దీన్నే వక్తృ విశేషం అంటారు. మేలుకోరి మంచే చెప్తాడన్న విశ్వాసానికి పాత్రుడైన వాడే ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్త వాక్యం. ఆప్త వాక్యం తోసివేయలేనటువంటిది. మొదటి ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్తవాక్యం. ఫ్రజల మేలుకోరి, వేదార్థాలను, పురాణ-ఇతిహాస శాస్త్రాలను, లోకానికి తెలిపినవారు ఆప్తులు. వారి రచనలు ఆప్త వాక్యాలు. యధార్థాన్ని తను తెలుసుకుని, కామ-క్రోధ-లోభాలకు లోనుకాకుండా, తనెరిగిన ఆ యధార్థ విషయాన్నే, ఇతరుల మేలుకోరి చెప్పడమే ఆప్త లక్షణం. అలాంటిదే వాల్మీకికి బ్రహ్మానుగ్రహంవల్ల కలిగింది. కాబట్టి ఆయన పరమాప్తుడు).

బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం లోకులు తరించేందుకొరకై వాల్మీకి ఈ కృతి రచించాడు. ఈ వక్తృ విశేషం మొదలు చెప్పుకుంటున్నాం. తనడిగిన విషయమంతా తన హితం-శ్రేయస్సు కోరి, వింటానికింపైన అమృత బిందువుల లాంటి వాక్యాలను చెప్పి, తనను కృతకృత్యుడిని చేసి, తన సందేహం తీర్చిన నారదుడిని, మనోహరమైన మాటలతో వాల్మీకి సంతోష పరిచాడు. వాల్మీకి చేసిన ప్రదక్షిణ నమస్కార పూజలనందుకున్న నారదుడు, ఆయన దగ్గర శలవు తీసుకుని ఆకాశమార్గాన బ్రహ్మ లోకానికి పోయాడు.

నారదుడు వెళ్లిన తర్వాత, గంగా తీరం దగ్గరున్న తమసానది దగ్గరకు వచ్చాడు వాల్మీకి. సువాసనలు వెదజల్లే, పూ తీగల పొదరిండ్లున్న ప్రదేశమది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడున్నాడు. వీరిరువురు కలిసి, మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని, తమసానదిలో దిగుతారు. తేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో: "చూసావుకదా భరద్వాజా, ఈ నదీజలాల అడుగున కాని-పైన కాని, బురదలేదు. లోన పాపపు అలోచన లేకుండా, బైట పాపపు చర్య చేయకుండా, శుద్ధాంతఃకరణగల సత్పురుషుడి మనస్సులాగా తేటగా కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఎన్నోసార్లు చూసాంగాని, ఎప్పటికప్పుడు కొత్తగా-మనోహరంగా కనపడుతూ ఎంతో సంతోషం కలిగిస్తుంది కదా. నార గుడ్డలివ్వు-కమండలాలను పదిలంగా ఒక చోట వుంచు. ఈ పుణ్య నదీ తీర్థంలో నేను స్నానం చేయాలి, తొందరగా రా" అంటాడు.


అని చెప్తూ, తనపై నున్న భక్తితో శిష్యుడిచ్చిన నార బట్టలు తీసుకున్నాడు వాల్మీకి. నారద ఉపదేశం విస్తరించి లోకాన్నెలా బాగుపర్చాలా అని ఆలోచిస్తూ, మధ్యాహ్నం మించిపోతున్న సంగతి కూడా గమనించకుండా, వన సౌందర్యం తిలకిస్తూ, సంచారం చేయసాగాడు. అప్పుడాయన కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆసమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు.

నేల పైనబడి, నెత్తుటిమడుగులో, తన సమీపంలోనే కొట్టుకుంటూ చావడానికి చేరువలో వున్న మగపక్షిని చూశాడు వాల్మీకి. ఆహార-నిద్ర-విహార సమయాలలో, రేయింబవళ్లు, స్నేహంగా తన వెంటే వున్న మగపక్షితో, సమీపంలో బోయవాడున్నసంగతి కూడా గమనించకుండా, ఆనందంతో మైమరిచి కలిసున్న తమ జంటలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటూ విలవిలా తన్నుకుంటుంటే, భరించలేక దుఃఖంతో కూయ సాగింది ఆడ పక్షి. కీచుకీచుమనే సన్నని ధ్వనితో, ఎడతెరిపి లేకుండా కూస్తూ, సమీపంలో వాలి, ముక్కుతో గీరుతూ, బోయవాడు దగ్గరకు రాగానే భయపడి ఎగిరిపోయి, దగ్గర లోని చెట్టు కొమ్మపై వాలి, చనిపోయిన మగడిని చూస్తూ ఏడుస్తున్న ఆడ పక్షిని తదేక ధ్యానంతో చూశాడు వాల్మీకి. నేలమీద పడి వున్న మగపక్షినీ చూశాడు మళ్ళీ. వేటాడడాన్నీ, జీవహింస కులవృత్తిగా వుండే వేటగాళ్లు అనుసరించాల్సిన ధర్మాన్నీ తెలిసిన వాల్మీకి, జంటగా పక్షులు కలిసున్న సమయంలో, ఒకదాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకుంటాడు. కనుబొమలు ముడిపడగా, కళ్లెర్రపడగా, క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు.