బాలకాండ
మందరమకరందం
బాల
కాండ చివరి పద్యాలు-గద్యం
వనం
జ్వాలా నరసింహారావు
కం: ఓంకారాత్మక రామా ! శంకరగిరిజావిరించి
జపితసునామా !
సంకటనిచయవిరామా
! పంకజమిత్రాన్వయ వారిధిసోమా !
కం; సర్వాధిక సర్వాత్మక ! సర్వ జగత్కారణా ప్రశస్తగుణాఢ్యా !
సర్వాదిమకారణ హరి ! సర్వ శరణ్యా మాహత్మ సర్వస్తుత్యా !
తరలం: జలజవైరిమహీధరాగ్ని శశాంకపద్యనిరూపితా
తులితబాల్యవినోదఖేలన తోయజాక్ష ! రమాధవా !
కలశవారిధితుల్యసజ్జన కాండ
చిత్తనివాసకా !
కలుషసంహార
! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా !
జలజవైరి అంటే చంద్రుడు = 1 , మహీధరఅంటే పర్వతాలు= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసుదాసుగారు ఎన్ని పద్యాలు
రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371 పద్యాలున్నాయి.
ఇది శ్రీమద్రామచంద్ర చరణారవిందమిళిందాయమాన మానసత్వ మహావైభవ
వావిలికొలను రామచంద్ర
రాయతనూభవ సుజనవిధేయ
సుబ్బరాయ నామధేయ ప్రణీతం
బైన
శ్రీ మదాంధ్ర
వాల్మీకిరామాయణ మను
మహాకావ్యంలో బాలకాండ
మందరం
అనువక్త-వాచవి
వనం జ్వాలా నరసింహారావు
నమోస్తు రామాయ
సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై
జనకాత్మజాయై
నమోస్తు
వాతాత్మభువే వరాయ, నమోస్తు వల్మీక భవాయ తస్మై.
(ఇంతటితో బాల కాండ మందర మకరందం సమాప్తం)
No comments:
Post a Comment