Saturday, September 2, 2017

పాద నమస్కారం భారతీయ సంస్కారం : వనం జ్వాలా నరసింహారావు

పాద నమస్కారం భారతీయ సంస్కారం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (03-09-2017)

“పాదాభివందనాలు, ప్రమాణాలు” శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కంచ ఐలయ్య షఫర్డ్ రాసిన వ్యాసం అతి జుగుప్సాకరంగా, అన్నిరకాల న్యాయ-ధర్మ-సహేతుక సూత్రాలకు విరుద్ధంగా, అనాదిగా వస్తున్న శాస్త్రీయ కట్టుబాట్లకు వ్యతిరేకంగా, సహేతుకమైన ఆలోచనలకు భిన్నంగా, పలువురి మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఒక్క మాటలో చెప్పాలంటే హేతువాద-వివేచనలకు అందనిస్థాయిలో వుంది. ఆయన ఉద్దేశం, ఆయన చెప్పదలచుకున్నదేంటో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదందులో. ఒకవైపు నమస్కారాలు, పాదాభివందనాలు తప్పు అని అంటూనే, ఫలానా-ఫలానా వ్యక్తులకు, ఫలానా దేవుళ్లకు కేసీఆర్ ఎందుకు మొక్కలేదని ప్రశ్నిస్తున్నాడు! ప్రణబ్ ముఖర్జీ, నరసింహన్ కాళ్ళకు మొక్కిన సీఎం, ప్రధానికి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి, రాష్ట్రపతి కోవింద్ కు ఎందుకు మొక్కలేదని అర్థరహితమైన ప్రశ్న సంధించాడు. వాళ్లుబ్రాహ్మణులైనందున మొక్కాడనీ, వీళ్లు కానందున మొక్కలేదనీ ఆయన వాదన. జయశంకర్ బ్రాహ్మణుడు అనుకుని మొక్కాడని మరో వాదన లేవదీశాడు. పనిలో పనిగా బ్రాహ్మణుల మీదా, బ్రాహ్మిణిజం మీదా తనదైన శైలిలో విమర్శలు ఎప్పటిలాగానే గుప్పించాడు. మధ్య-మధ్య రాజకీయాలను చొప్పించారు ఐలయ్య గారు.

ఇటీవల ఐలయ్యగారి లాంటి కొందరు ప్రభుద్దులు పెద్దలకు నమస్కారం చేయడాన్ని, దేవుళ్లకు మొక్కడాన్ని విమర్శిస్తున్నారు. వారి గురించి ఆలోచించడం ఒక విధంగా సమయం వృధా చేసుకోవడమే అయినా, కొన్ని విషయాలు పదిమందికి తెలియచేయక తప్పదు. లేకపోతే ఐలయ్య చెప్పిందే సిద్దాంతం అనుకునే పోరాపాటుంది.  హిందువులు రాళ్ళకు, గుట్టలకు, చెట్లకు, నదులకు, నమస్కారం చేస్తారని ఆక్షేపిస్తూ తత్వజ్ఞానహీనులు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారనేది వాస్తవం. హరిమయం కాని ద్రవ్యం, పరమాణువు లేదు. ఈశ్వరుడు ఒక్కడే అంతర్యామి. తానే సర్వ రూపాలు, సర్వనామాలై వున్నాడు కాబట్టి,  సర్వం భగవత్ స్వరూపమే! సర్వం భగవన్మయమే! కాబట్టి ఎవరు దేనికి నమస్కారం చేసినా, ఆ రూపం వహించి, అందు అంతర్యామిగా వుండే భగవంతుడికే నమస్కారం చేస్తున్నాం కాని, వేరే దేనికీ నమస్కారం చేయడం లేదు. ఈశ్వర భావంతో నమస్కారం చేయడం తత్వజ్ఞ లక్షణం. తెలియకుండానైనా నమస్కారం చేయడం మధ్యముల లక్షణం. దానిని నిషేధించడం మూర్ఖుల లక్షణం. మన శరీరంలో ఈశ్వరుడెలా వున్నాడో అన్ని ప్రదేశాల్లో అలానే వున్నాడు స్థూల దృష్టితో చూస్తే. మనం నమస్కారం చేసేది జగన్మయుడైన భగవంతుడికే! వాయువు, అగ్ని, చెట్లు, సముద్రాలు అన్నీ విష్ణువు శరీరమే కాబట్టి నమస్కారం చేయాలి.

ఒక వ్యక్తి ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి మొక్కాలి, దేనికి మొక్కాలి, ఏ దేవతకు మొక్కాలి, ఎందుకు-ఎప్పుడు మొక్కాలి అనేది వారి-వారి ఇష్టా-ఇష్టాల మీద ఆధార పది వుంటుంది కాని ఐలయ్య చెప్పాడనో, మరెవరో విమర్శించాడనో అందరికీ మొక్కాల్సిన అవసరం లేదు.

“ఆదాభివాదనమ్” అనే పుస్తకంలో నమస్కారం గురించి క్షుణ్ణంగా విపులీకరించడం జరిగింది. అది కాని, అలాంటి పుస్తకాలు కాని చదివితే మన సంస్కారం, మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక గొప్పదనం అర్థమవుతుంది. ఎవరెవరికి, ఎప్పుడు, ఎలా నమస్కారం చేయవచ్చో అందులో స్పష్ఠంగా వుంది. అందులో చెప్పినట్లు, పాదాలను భూమికి తాకి నక్షత్రాలకు, సూర్యుడికి, బ్రాహ్మణులకు నమస్కారం చేయాలి. తల్లికి, తండ్రికి, జ్ఞానప్రదునకు, శ్రోత్రియుడికి నమస్కారం చేయాలి. తనకంటే కనీసం మూడు సంవత్సరాలు అధికంగా వుంటే వారికి నమస్కారం చేయాలి. చిన్నవారైనా మేనమామకు, పినతండ్రికి నమస్కారము చేయవలయును. వృద్ధుడైనా ఇష్టం లేకపోతె నమస్కారం చేయాస్లిన పనిలేదు. వేదాలను చదివినవాడు, చిన్నవాడైనా నమస్కరించతగినవాడు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గవర్నర్‌కురాష్ట్రపతికి పాదాభివందనం చేయడాన్ని వక్రీకరించి భాష్యం చెప్పిన సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్యకు ఇలా రాయడం మాట్లాడడం కొత్తేమీ కాదు. తన వ్యాసాలలోపుస్తకాలలో అను నిత్యం బ్రాహ్మణ్యాన్నిబ్రాహ్మణులను "బాపనోడు" అనే పదాలతో కించపరిచే వ్యాఖ్యలు చేయడంఅది తప్పని చెప్పిన వారితో వాగ్వాదానికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హిందూ మతాన్ని అదే పనిగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో విమర్శించడం కూడా ఆయనకు నిత్య కృత్యం. వీటిని ఒక విడ్డూరంగాఇదేదో బ్రాహ్మణ్యాన్ని మాత్రమే గౌరవించినట్లు, చిత్రీకరించడం శుద్ధ తప్పు.  నమస్కారం చేస్తున్న వ్యక్తి అలా  చేసేటప్పుడు  కానీ పాదాభివందనంచేసేటప్పుడు కానీఎవరికైతే అలా చేస్తున్నామోఆ వ్యక్తి బ్రాహ్మణుడాబ్రాహ్మణేతరుడా అని ఎవరూ చూడరు. నమస్కారానికి తన దృష్టిలో అర్హుడాకాదాఅనేదే చూస్తారు. పాదాభివందనం చేసే విషయంలో  ఆర్హత విషయాన్ని మరింత లోతుగా ఆలోచించడంబేరీజు వేయడం సమంజసం.

          పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సుజ్ఞానంపెద్దరికందైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్థపూరిత ప్రేమసమాజం కోసం చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనాన్ని చేస్తాం. ఇలా పాదాభివందనాలను నిత్యం కానీలేదా ముఖ్యమైన కొన్ని సందర్భాలలో చేయడం కానీ భారతీయ సంస్కృతి-సంప్రదాయం. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు అనుకూల శక్తి రూపంలో వారి నుంచి మంచి కోరికలుఆశీర్వాదాలు అందుకుంటున్నట్లు భావించాలి. కుటుంబంలోసమాజంలో ప్రజల మధ్య సామరస్యాన్నిపరస్పర ప్రేమగౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం సృష్టించగలదని గుర్తించాలిజ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు చేసే నమస్కారమే పాదాభివందనం. వయస్సుచే కానివిద్యచేత కాని అధికు లైనవారికి ఎదురుగా వెళ్లి నమస్కరిస్తేవారికి ఆయువువిద్యకీర్తిబలంవృద్ధి లభిస్తాయని మను ధర్మశాస్త్రంలో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతోబ్రాహ్మణ కులంతో ముడిపెట్టి విమర్శలు చేయడం తగని పని.


సామాజిక శాస్త్రవేత్తగా-విశ్లేషకుడిగావిద్యాధికుడిగా పేరున్న కంచ ఐలయ్య దృష్టిలోఆయన ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా వున్న ప్రతి చిన్నా-పెద్దా విషయం తప్పుగానే కనిపిస్తుంది. ఆయన తన పుస్తకాలలోవ్యాసాలలో బ్రాహ్మణులను హిందూ మతాన్ని కించపరిచి రాసినట్లేఆయన కులాన్ని కానిఇతర కులాల వారిని కాని బ్రాహ్మణులు కాని మరెవరైనా కాని విమర్శిస్తే ఆయన వూరుకుంటాడాబ్రాహ్మణేతరుడైన సత్య సాయిబాబాకు దేశ విదేశ ప్రముఖులెందరో పాదాభివందనం చేశారుఅందులో పీవీ నరసింహారావు లాంటి బ్రాహ్మణులు కూడా వున్నారు.

ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారం కాదని మరో విమర్శ చేశారు ఐలయ్య. అలాగే ఆయన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సమస్య అంతకంటే కాదుఆత్మవంచన-విశ్వాసాలను ప్రదర్శించడం కూడా కాదుసభ్యతకుసంస్కారానికిఆచార వ్యవహారానికిఅనాదిగా వస్తున్న నమ్మకానికిమీదుమిక్కిలి సాంప్రదాయానికి అసలు సిసలైన నిదర్శనంపెద్దలకు పాదాభివందనం చేయడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆ పదవిలోకి రావడానికి ముందునుంచే అలవాటుందనే విషయం ఆ సామాజిక శాస్త్రవేత్త వ్యాసంలోనే వుందికాకపోతేఆయన అప్పట్లో పాదాభివందనం చేసిన జయశంకర్ బీసీ అనే విషయం చంద్రశేఖర్ రావుకు తెలియదని చిన్న ట్విస్ట్ ఇచ్చాడుబహుశా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులెవరోబ్రాహ్మణేతరులెవరో ఒక్క ఆ సామాజిక శాస్త్రవేత్తకు తప్ప మరెవరికీ తెలియదేమోహిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినామనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి కంచ ఐలయ్య గుర్తుచేసుకుంటే మంచిదేమో!

అహర్నిశలూ కంచ ఐలయ్య లాంటి వారి నుంచి విమర్శలనెదుర్కునే బ్రాహ్మణుల విషయానికొస్తేఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణులను ఈ రోజుల్లో ప్రతి దానికీ టార్గెట్ చేస్తున్నారు కొందరు.  హైందవ మతంలోఆచారంలోబ్రాహ్మణులు కూడా ఒక భాగం. పూజారులుగాఅర్చకులుగావేద పండితులుగాకర్మకాండలు నిర్వహించే వారిగాసంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో వారికి ఇప్పటికీ పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలోఅంత్యక్రియలలోఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. రాజకీయంగా కానిసామాజికంగా కానిఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేకబీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి.

బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది. చివరకు జరిగిందేంటిఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీదభూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులుచట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. ఒక నాటి పౌరోహిత్యంపూజారి జీవితంఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఎప్పుడోవేల ఏళ్ల క్రితంఅప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతోఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమాదోపిడీ చేసిన వారుదోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడుసమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమాప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!


         తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులనుతమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూవారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబుముఖ్యమంత్రి పాదాభివందనం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగవర్నర్ నరసింహన్ బ్రాహ్మణులు కావడం వల్లనే అలా జరిగినట్లుగావాళ్లు బ్రాహ్మణులు కావడం తప్పైనట్లుగా ఐలయ్య రాయడం   అన్నింటికన్నా పెద్ద తప్పు.

No comments:

Post a Comment