Friday, December 29, 2017

ప్రాంతీయ పార్టీలదే హవా : వనం జ్వాలా నరసింహారావు

ప్రాంతీయ పార్టీలదే హవా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-12-2017)

          వచ్చే సెప్టెంబర్ నెలలో, లేదా, డిసెంబర్ నెలలో లోక్ సభకు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. సెప్టెంబర్, డిసెంబర్ లలో కాకపోయినా ఆతరువాత మరో ఆరేడు నెలలకు ఎలాగూ అవి జరగక తప్పదు. ఆ ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఇప్పుడిప్పుడే ఊహించడం కొంత సాహసమే అయినప్పటికీ, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నవనేది తధ్యమే అనాలి. పరిస్థితి తప్పకుండా మారుతుంది. మోడీ మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాకపోవచ్చుకూడా! అందులో సందేహం లేదు. లోతుగా విశ్లేషిస్తే....

2014 లోక్ సభ ఎన్నికల అనంతరం ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలోభాగస్వామ్య పక్షాలుగా శివసేన, టీడీపీ లతో పాటు చిన్నా-చితకా పార్టీలు పది దాకా వున్నాయి. వీటిలో శివసేన (18)- టీడీపీ (16) లదే  చెప్పుకోదగ్గ సంఖ్యా బలం వున్న పార్టీలు. మిగతావాటి సంఖ్యా బలం ఒకటి నుండి ఆరు వరకు మాత్రమే. పేరుకైతే ఎన్డీయేలో 32 పార్టీలున్నాయి. ప్రతిపక్ష పార్టీలలో అధిక సంఖ్యలో భారత జాతీయ కాంగ్రెస్ (46) వుండగా, ఏఐడీఎంకె (37), తృణమూల్ కాంగ్రెస్ (33), బీజేడీ (20), టీఆరెస్ (12) ఆ తరువాతి స్థానాల్లో వున్నాయి. వచ్చే లోకసభ ఎన్నికలవరకు ఈ సంఖ్యాబలంతో ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి దోఖా లేదు. ఎవరి మద్దతున్నా లేకపోయినా బీజేపీకి స్వయానా 280 మంది సభ్యుల దాకా వున్నారు. దానంతట దానికే మెజారిటీ వుంది. ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే శ్రీరామ రక్షగా మిగిలిపోయిందిఇంతవరకూ బాగానే వుంది. కేవలం కేంద్రంలో అధికారంలో వుండడమే కాకుండా 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుందని, ఇది ఇందిరాగాంధీ హయాంలో 18 రాష్ట్రాలలో అధికారంలో వున్న కాంగ్రెస్ రికార్డును అధిగమించిందనీ ప్రధాని మోడీ సగర్వంగా చెప్పుకుంటున్నారు. కాకపొతే గుజరాత్ ఎన్నికల్లో పేరుకు గెలిచింది బీజేపీనే అయినప్పటికీ అది దాదాపుగా ఓడినట్లే. నిజానికి మరింత పకడ్బందీ వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ చేసి వుంటే బీజేపీ ఖచ్చితంగా ఒడి వుండేదే!

ఈ నేపధ్యంలోరాబోయే ఎన్నికల అనంతరం, ప్రాంతీయ పార్టీల సారధ్యంలో-అండదండలతోఎన్డీయేతర-యూపీయేతర సంకీర్ణ ప్రభుత్వం రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కాని, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కాని ఎన్నికలయ్యేంతవరకు బీజేపీతో, కాంగ్రెస్ తో కలిసి వున్నా, ఆ తరువాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఎప్పటికీ అటు కాంగ్రెస్ వారినో, లేదా బీజేపీ వారినో ఎందుకు ప్రధాని చేయాలి? తమలోనే ఒకరు కాకూడదా అనే అభిప్రాయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటి నుంచే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ, బిజెపి సారధ్యంలోని ఎన్డీయేమూడోనాలుగో ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు

కాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి మిత్ర పక్షాలు కానిఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదుఅదే పరిస్థితి బీజేపీది కూడా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అవి తమతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని పోటీ చేసే కంటేఅవి వేరుగా పోటీ చేసివీలై నన్ని స్థానాలు గెల్చుకునిఎన్నికల అనంతరం సంకీర్ణంగా ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది

బీజేపీ ఇలా ఆలోచించడానికి కారణం "యాంటీ ఇన్‍కంబెన్సీనితట్టుకోవాల్సిన పరిస్థితిలో పడిపోవడమే! డీమోనిటైజేషణ్, జేఎస్టే నేపధ్యంలో ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం ఆ పార్టీని ఓటమి దిశగా తీసుకుపోయే ప్రమాదం పొంచి వుంది. తన పార్టీకి ఎలాగూ గతంలో వచ్చి నన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ భావనలాగా కనిపిస్తోందితనతో కలిసి పోటీ చేసి తన మైలను భాగస్వామ్య పక్షాలు అంటించుకునేకంటేవిడిగా పోటీ చేసి మంచి పేరుతో కొన్ని స్థానాలు గెలవడం మంచిదన్నది బీజేపీ  పార్టీ ఆలోచనగా వుందిఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అదే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోందిబీజేపీ మైల తమకు అంట రాదని భావించి ఒక్కొక్క పార్టీ దానికి  దూరం కావచ్చుఈ నేపధ్యంలో 2019 లో కానిఅంతకంటే ముందస్తుగా కాని ఎన్నికలు జరుగుతేప్రాంతీయ పార్టీల హవా కొనసాగబోతోంది అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచినేటిదాకాగత ఏడు దశాబ్దాల కాలంలోరాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయిఆ మార్పులను వివిధ కోణాలనుంచి పరిశీలన చేయవచ్చుఆ మార్పులలో ప్రధానంగా గమనించాల్సిన విషయంప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత పెరగడంఒకప్పుడు ఏ ఒకటో-రెండో రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ల్లూనుకు పోయిపార్లమెంటులో తమ బలాన్ని చాటుకుంటున్నాయిగత రెండు-మూడు సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనిస్తేజాతీయ పార్టీలకంటే అవి అధికంగా వున్నాయిఅంటే జాతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో తగ్గుకుంటూ పోతుంటేప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుక్కుంటూ పోతోందిభారత దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న మరో ప్రధానాంశంవోటు వేసే వారిలో అధిక శాతం మంది బలహీన వర్గాలకుఅణగారిన వర్గాలకు చెందిన వారు కావడంమహిళలు కూడా పెద్ద ఎత్తున పురుషులకంటే అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషంవీటన్నిటి ప్రభావం ఏ మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందో విశ్లేషించాలంటేప్రాంతీయ పార్టీల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలిఈ నేపధ్యంలో ఇక్కడ కొన్ని మౌలికాంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటేమరొక వైపుజాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతోపార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి సాధ్యపడదుమెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమేఎప్పుడైతేఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదోఇప్పటి లాగేప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదుఅలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో అవగాహన ఎన్నికల ముందా తరువాతా అన్న ప్రశ్న ఉదయించక మానదుఉదాహరణకు 2009 ఎన్నికలే తీసుకుంటేఎన్నికల ముందు ఎక్కువగా కలిసి కట్టుగా-ఉమ్మడిగా పోటీ చేయడం జరగలేదుఎన్నికల అనంతరమే అవగాహన కొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందిఅలా అని ప్రాంతీయ పార్టీలుజాతీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయలేదని అర్థం కాదుఎన్నికల ముందు అవగాహన వుంటే సంకీర్ణాలు మనుగడ సాగించడం సులభంఎన్నికల అనంతరం అవగాహనకు వస్తేబెదిరింపుల మధ్యసంకీర్ణ ప్రభుత్వం మనుగడ కష్టం అవుతుంది.


1999-2004 మధ్య అధికారంలో వున్న బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా, 2004-2009 మధ్య అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమైనాఅస్థిరత-స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీపూర్తికాలం పాటు కొనసాగాయిఅది ఒక విధంగా గొప్ప విషయమేఇక 2009 తరువాత అధికారంలో కొచ్చిన యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అహర్నిశలూ బెదిరింపులను ఎదుర్కుంటూనే మనుగడ సాగించిందివచ్చిన బెదిరింపులన్నీ ప్రాంతీయ పార్టీల నుంచే కావడం విశేషం. 2014 లొ వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంలోని నాయకత్వ పార్టీ అయిన బీజేపీకి స్వంతంగా మెజారిటీ స్థానాలు రావడంతో లోక సభలో ఇబ్బంది లేకపోయినా రాజ్యసభలో అది మిత్ర పక్షాలపై ఆధార పడక తప్పటంలేదు.

ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోనుప్రాంతీయ పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోనుఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయిందిఒక్కో ఎన్నిక జరిగే కొద్దీపోటీలో వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. 1952 లోక్ సభ ఎన్నికలలో కేవలం 55 పార్టీలు మాత్రమే రంగంలో వుంటే, 2009 ఎన్నికల కల్లా వాటి సంఖ్య 370 కి చేరుకుందిఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 1957 లో మాత్రమే అతి తక్కువగా కేవలం 16 పార్టీలు మాత్రమే పోటీలో వుండగాఅత్యంత అధిక సంఖ్యలో 2009 లో పోటీకి దిగాయివీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చుమొదటి ఎన్నికలలో పోటీ చేసిన 55 పార్టీలలో, 18 రాష్ట్ర స్థాయి పార్టీలు, 29 రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం 8 మాత్రమేవాటి సంఖ్య 2004 లో 6 కు పడి పోయిందికాగా అదే ఎన్నికలలో పోటీలో వున్న 230 పార్టీలలో, 36 ప్రాంతీయ పార్టీలు, 188 రిజిస్టర్డ్ పార్టీలు వున్నాయిదానర్థం ఒకవైపు ప్రాంతీయ-రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటేజాతీయ పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోందిఅదే విధంగా 1952 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్లమెంటులో 22 పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, 2009 ఎన్నికల అనంతరం 37 పార్టీలకు ప్రాతినిధ్యం లభించిందిఅత్యంత తక్కువగా కేవలం 12 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది 1957 ఎన్నికల అనంతరంఏ విధంగా పార్టీల సంఖ్యఅవి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు తెలియచేస్తాయి.

ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడమంటేరాజకీయ పోటీ తత్వంలో మార్పుల రావడమేమొదట్లోరాష్ట్ర శాసన సభలలో జాతీయ పార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంటులో జాతీయ పార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయిఒక్కో రాష్ట్రంలోఒక్కో ప్రాంతీయ పార్టీకి ప్రజల మద్దతు-ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తేవారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారేమో అనిపిస్తోందికొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకిఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటేతమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకిమరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోందిఎన్నికల రంగంలో ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు మూడు-నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోందిప్రాంతీయ పార్టీలతో పోల్చి చూస్తేదేశం మొత్తం మీద జాతీయ పార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోందిప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోందిఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రాంతీయ పార్టీలుమరో పక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ ఓటింగ్ శాతం కేవలం 31 మాత్రమే. భాగస్వామ్య పక్షాలతో కలిపితే 38.5%, అలాగే కాంగ్రెస్ ఓటింగ్ శాతం 19.3. భాగస్వామ్య పక్షాలతో కలిపితే 23%. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి, ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ కు కలిపి వచ్చిన ఓట్లు కేవలం 50% మాత్రమే. అంటే మిగిలిన ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలవే!

1984 లో ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి 11.2% ఓట్లు రాగా, 2009 ఎన్నికల నాటికి 28.4% కి పెరిగింది2014 లో సుమారు 50% కి చేరుకుంది.  దానర్థం వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలకు కనీసం రెండు వందల నుంచి రెండువందల ఏబై స్థానాలకు మించి రావు. రావడం కష్టమే!  ఎక్కువమంది ఓటర్లలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలే మంచివన్న అభిప్రాయం వుందిరాష్ట్రాల పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లో వుండాలని కోరుకోవడంతో పాటురాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటేపార్లమెంటులో కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు.


ఈ నేపధ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా కానుందిఎన్నికల అనంతరం యుపిఎఎన్డీఏలు తమదైన శైలిలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తాయి. కాకపోతే  వారికి డిఎంకెఅన్నా డిఎంకెతృణమూల్ కాంగ్రెస్సమాజ్ వాదీబహుజన సమాజ్ పార్టీతెలంగాణ రాష్ట్ర సమితితెలుగు దేశంఎన్సీపిజనతాదళ్శివసేనఅకాలీదళ్బిజూ జనతాదళ్రాష్ట్రీయ జనతాదళ్ వైఎస్సార్సీపి లాంటి పార్టీల మద్దతు కీలకమవుతుందివీటిలో చాలా వరకుప్రస్తుతానికి యుపిఎఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా వున్న పార్టీలే. అన్నీ కలిసి సుమారు 250 కి పైగా స్థానాలు గెల్చుకునే అవకాశం వుందివీరంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లేఅందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంఅందులో టీఅరేస్ కీలకపాత్ర పోషించవచ్చు. జాతీయ పార్టీలూ తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment