Monday, December 31, 2018

KCR’s impeccable governance : Vanam Jwala Narasimha Rao


KCR’s impeccable governance
and
Governance that touches all
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (01-01-2019)
and
Telangana Today

            In a recent Press Conference Chief Minister Telangana K Chandrashekhar Rao described the neighboring state CM Chandrababu Naidu as a most opportunistic political manager running the show with the help of two media houses and in no way, he can be called as a leader. According to KCR N Chandrababu Naidu is a politician of no consequence, a liar, incompetent administrator lacking even basic knowledge of economics or agriculture.

            In this context it may be relevant to differentiate between a Leader and Manager and contextualize with reference to governance. KCR who provided the real leadership with statesman like qualities and comparing the progress achieved in Telangana and the neighboring AP has probably every right to describe Babu as a mere manager and not a leader. The development in Telangana is to be credited to KCR for providing the leadership. KCR even predicted the defeat of Babu in the next election in his state as he did not to do anything worthwhile for the welfare and development of people there.

            On the other side, the Telangana state government during the last four and half years initiated and implemented a variety of programs. The basic reason and the driving force for achieving this success are the statesmanship, vision, leadership qualities and commitment, decision making process through consensus, consultation and quality review methodology of Chief Minister K Chandrashekhar Rao. All these resulted in conceptualization and implementation of people oriented, welfare oriented and development-oriented schemes in the state. Above all it is the Statesman like Leadership that is causing development.

In this context we may probably refer to Jim Collins who authored a book on leadership titled “Good to Great” where he deals extensively with the qualities and success of level five leadership and differentiates leader and manager.

According to Jim Collins Good-to-Great leaders embody a paradoxical mix of personal humility and professional will. Good” is The Enemy of “Great”. Level Five Leadership does not happen overnight. It refers to the highest level in a hierarchy of executive capabilities. Leaders of this type are those who combine extreme personal humility with intense professional will; shun the attention of celebrity, channeling their ambition toward the goal of building a great system. They provide new vision, strategy and direction, around which institution gains people’s commitment. The transformation from Good to Great has a process that includes building first level five leadership, deciding on first who and then what, confronting the brutal facts, transcending the curse of competence, inculcating culture of discipline for breakthrough results and technology accelerators. Collins also differentiates between the levels of leadership and elaborates the other four levels in support of level five leaders.


Level five leaders like KCR rise to that level against a background of his rich experience in various fields of activity, individual discipline, ups and downs in the life, colleagues support and many more most of which are success stories. Level one in the hierarchy is a highly capable individual who makes productive contributions through talent, knowledge, skills and good work habits. Level two is a member who contributes individual capabilities to the achievement of group objectives and works effectively with others in a group setting. Level three is a competent manager and capable of organizing people and resources towards the effective and efficient pursuit of predetermined objectives. Level four is an effective leader who catalyzes commitment to and vigorous pursuit of stimulating higher performance standards. Level five the highest in the Hierarchy builds enduring greatness through paradoxical blend of personal humility and professional will. The greatness of level five leaders lies in choosing the other four levels for successful accomplishment.

            Professional will of level five leadership creates superb results, demonstrates resolve to produce the best long-term results, no matter how difficult, sets standard of building institution and will settle for nothing less. He looks in the mirror, not out the window, to apportion responsibility for poor results, never blaming other people, external factors or bad luck. He is never boastful, acts with quiet calm relying on inspired standards, channels ambition into the institution and looks out the window, not in the mirror to apportion credit for the success. He chooses the right people for right work and lets them into his vehicle of performance and achieving results and only with them forms a superior executive team. The wrong people are off the vehicle and when and why is the tactical choice of level five leaders. For him Great vision without Great people is irrelevant.

            When we talk of governance and politics the level five leaders is basically a Statesman like qualities person. We heard of Governance and later Good Governance. But today people want Great Governance and Governance with a difference. It is just not enough to attend to mere current needs of people and call it as a development. Long term planning along with short term and medium term are essential. This is what has been happening in the state during the last four and half years and with this same leadership would happen in the coming days and months. The schemes conceived in the state are all keeping the long terms needs of people in mind. All these are examples of statesmanship of Chief Minister Chandrashekhar Rao.

            In the recent elections the landslide victory of TRS under the leadership of statesman KCR did not happen just like that. Ever since the state was formed, by initiating and implementing number of welfare and development schemes during the 51 months of his first phase of governance, which did not happen during the erstwhile Congress and TDP rule for over 50 years, CM KCR who is also the TRS Party President successfully appealed for votes. In support of his appeal he demonstrated the process of successful completion of schemes with statistical data. The progress card was presented to the people in detail. As a leader, as a statesman, as a politician, as a designer of development-welfare schemes, as a visionary, as a pragmatist and an intellectual KCR won the hearts of people at large. This is how the landslide victory was made possible.

         It is not just “Governance” or “Good Governance” that is seen and felt now……it is a “Great Governance” with a “Huge Difference” headed by a Statesman Leader Chief Minister K Chandrashekhar Rao.

KCR initiates execution of poll promises : Vanam Jwala Narsimha Rao


KCR initiates execution of poll promises
Vanam Jwala Narsimha Rao
The Hans India (01-01-2019)

The sagacious and sensible people and voters of Telangana, in the recently concluded state assembly elections, once again voted Telangana Rashtra Samiti led by Kalvakuntla Chandrashekhar Rao to power bestowing a landslide majority. People supported in unequivocal terms KCR who fashioned a great platform for statehood movement in the form Telangana Rashtra Samiti, led it to success to realise separate state of Telangana, and in the process made the voice of Telangana heard from Kashmir to Kanyakumari, convinced 36 parties across the nation in favour of Telangana, brought pressure on the then ruling Congress Party to concede Telangana and also convinced the opposition BJP to form Telangana state.

Naturally people reposed their unilateral confidence once again on KCR. Fulfilling the wishes of people he sworn in as Chief Minister second time in succession. Aiming at realising the Golden Telangana that has been in the process, TRS government under the leadership of KCR commenced its second phase of journey. Immediately after assuming power the TRS government of CM KCR initiated measures to implement election promises on top priority. In addition action plan has also been initiated to attend to urgent and immediate needs of the people. Accordingly series of review meetings chaired by Chief Minister KCR are being held.

As part of immediate priority items for implementation, among others, expediting construction of irrigation projects, rural-village development, effective implementation of Panchayati Raj Act, recruiting village secretaries to every gram panchayat, greenery, sanitation, Aasara pensions to all who completed 57 year’s of age, conclave of panchayat raj functionaries, formation of few more new districts,  distribution of Batukamma sarees, Kalyan Laxmi/ Shaadi Mubarak cheque distribution through MLAs, supply of drinking water to every house-hold through Mission Bhagiratha before 31st March, 2018, developing health profile of all, establishing separate directorate for pensioners, establishing of food processing units etc have been listed.

Officers concerned were instructed to complete all projects for providing irrigated water to one crore acres of land within two years. Including Sitarama and Sriram Sagar revival schemes, all the other project works are to be completed on war footing without any delay. Compensation to be paid in lieu of lands acquired for projects. Chief Minister has decided to visit personally and inspect works pertaining to construction of Medigadda as part of Kaleshwaram, sundilla, annaaram barrages, pumphouses, works on SRSP revival scheme and other connected places.  


Chief Minister told officers and engineers that they need to expedite works of Kaleshwaram Project that provides water to major part of Telangana to ensure irrigated water by June-July 2019, expedite construction of Medigadda, sundilla, annaaram barrages, as well as pumphouses. Sitarama Lift Irrigation Project and Sriram Sagar revival scheme, Devadula project works are also to be expedited said CM.

Chief Minister emphasising the need to concentrate more on rural development said that it is only when villages are developed the country develops. CM desires that the newly enacted Panchayat Raj Act shall be effectively implemented to ensure transformation in the development of villages. When once the gram panchayat elections are completed, greenery and sanitation will be given priority and will be taken up swiftly. Government has taken up the recruitment process of appointing 9335 village secretaries to ensure that there will be a secretary to every one of the 12,751 villages. This is the first recruitment done after the new zonal system came into force.

Chief Secretary has been asked to workout modalities for payment of old age Aasara pensions to all those who completed the age of 57 years. This would be given with effect from April 2019. In accordance with the election promise, steps have been taken to form two more districts namely, Mulugu and Narayan pet. With this the process of formation of additional new districts has begun. In addition, formation of new Revenue Division Korutla and couple of new Mandals has also begun.  

Batukamma sarees that were to be distributed ahead of this year’s festival could not be done due to complaints from Congress party during elections, has commenced with effect from December 19, 2018. This is being done along with distribution of Christmas cloths. Kalyana Laxmi/ Shaadi Mubarak cheques that were earlier distributed by MLAs and was passed on to Collectors due to election code during elections, has now been reverted back, and henceforth MLAs will distribute them.

Chief Minister said that by March 31, 2019 after duly fitting all taps clean, purified drinking water should reach every house in the state irrespective of whether the house is a in a hilly area, forest area or in a remote area. He wants that no one shall be seen with a pot or vessel fetching water from a place other than their own house. For this CM told the officials that there is no dearth of funds and whatever might be the expenditure, the drinking water should reach every house by the stipulated time. The bulk supply shall be completed before January 10, 2019 said CM. In fact the responsibility, according to CM, does not cease with mere supply of water but continues since water should be supplied uninterruptedly. It is equally important to properly manage the scheme as that of supplying water. CM patted all those staff and engineers for executing this marvelous wonder.

Telangana state has exhibited an exceptional wonder in the form of Mission Bhagiratha to the entire country which is a pride to the state and role model to the country. Several states are evincing keen interest to replicate and adopt the scheme and Telangana Government also is ready to cooperate and help them in this regard.

Thus, after assuming charge second time CM KCR concentrated on governance once again. After dissolution of Assembly on 6th September, for thee months, it was election season totally. Immediately after the results, and after assuming charge as Chief Minister, KCR is taking stock of the situation of every Government department. Top priority is accorded to irrigation projects. Execution of election promises has been initiated. Plans are getting ready for this.

Against the backdrop of election promises, for laying strong foundation to implement them, the state finances are to be prepared. For effective implementation of promises and other welfare and development schemes, committed and efficient officers are required.

Whatever it is….CM KCR and his government is marching ahead towards implementation of election promises. He is leaving no stone unturned to successfully take the state towards Golden Telangana. CM who held meetings in his capacity as TRS president on the first and second day after he assumed charge has since then concentrating on reviews of various departments one after another.

Saturday, December 29, 2018

లంకకు పోయి రావణుడిని కలిసిన శూర్పనఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-41 : వనం జ్వాలా నరసింహారావు


లంకకు పోయి రావణుడిని కలిసిన శూర్పనఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-41
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (30-12-2018)

         పద్నాలుగు వేలమంది క్రూరులైన రాక్షస శ్రేష్టులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు, ఒంటరిగా యుద్ధం చేసిన శ్రీరాముడి చేతిలో చావడం చూసిన శూర్పనఖ, ఇతరులకు సాధ్యంకాని రాముడి పరాక్రమం స్వయంగా చూసి భయపడి, బొబ్బలు పెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, శీఘ్రంగా రావణుడు పాలించే లంకకు పోయింది. అక్కడ దేవతలతో కూడిన ఇంద్రుడిలాగా, పుష్పక విమానంలో మంత్రులతో, సూర్యుడిని పోలిన బంగారు పీఠంమీద తన ఇష్టప్రకారం, బంగారు ఇటికలతో కట్టబడిన వేదిలో హోమం చేయడం వల్ల మండుతున్న అగ్నిహోత్రుడిలా, సమస్త భూతకోటిని, గంధర్వులను జయించగలవాడిని, యముడిలాంటి వాడిని, రావణుడిని చూసింది శూర్పనఖ.

దేవాసురులకు మధ్య జరిగిన ఘోర యుద్ధంలో అసమానమైన వజ్రాయుధం దెబ్బ వల్ల గాయం మాత్రం పడ్డ వక్షం కల రావణుడిని; ఐరావతం కొమ్ములతో పొడవగా కాయలు కాచిన రొమ్ముకల రావణుడిని; దీర్ఘమైన ఇరవై చేతులు, పది తలలు, తెల్లని చామరాలు, తెల్ల గొడుగు, విశాలమైన ఎత్తైన రొమ్ము, రాజచిహ్నాలు కల రావణుడిని; వైడూర్యంలాగా మిస-మిస మెరిసే రావణుడిని; నిగనిగలాడే రత్నాలు చెక్కిన బంగారు కుండలాలు కల రావణుడిని; పెద్ద ముఖం కల రావణుడిని; తెల్లని దంతాలు కల రావణుడిని; విష్ణు చక్రం లాంటి అనేక ఆయుధాలతో కొట్టబడి గాయపడ్డ సకలావయవములు కల రావణుడిని; ఇతరుల భార్యలను అపహరించే రావణుడిని; సమస్తమైన దివ్యాయుధాలు కల రావణుడిని; ఋషుల యజ్ఞాలు విఘ్నం చేసే రావణుడిని; భోగవతీపురంలో సర్పరాజైన వాసుకిని యుద్ధంలో ఓడించి, తక్షకుడిని గెలిచి, అతడి భార్యను అపహరించిన రావణుడిని; కైలాసంలో కుబేరుడిని గెలిచి పుష్పక విమానాన్ని తెచ్చిన రావణుడిని; ఇంద్రుడి ఉద్యానవనాన్ని, కుబేరుడి ఉద్యానవనంలో వున్న నలిని అనే సరస్సును కోపంతో నాశనం చేసిన బలిష్టుడైన రావణుడిని; ఉదయించే సూర్యుడిని చేతులతో అడ్డగించగల శక్తిమంతుడైన రావణుడిని; సమస్త ప్రాణులను మొర్రో అని ఏడిపించే రావణుడిని; దేవతలను పారతోలిన రావణుడిని; పెద్దనవ్వుతో దేవతా స్త్రీలకు గర్భస్రావం అయ్యేట్లు చేసిన రావణుడిని; భుజ శౌర్యంతో విరవబడిన ఐరావతం దంతాలుగల రావణుడిని; జనులను బాధించడంలోనే పరమాసక్తికల రావణుడిని; కుచ్చితపు ఆలోచనలు చేయడంలో తొందరపడే రావణుడిని; ఇంతదాకా రాక్షస వంశాన్ని వృద్ధి చేసిన రావణుడిని; కళ్లకు కనబడడం ప్రళయకాలమని ఆభరణాలతో అలంకరించుకునే రావణుడిని; తన అన్నాను చూసి శూర్పనఖ రాముడి భయంతో ఇలా అంది.

         తనకు కలిగిన అవమానం, తన దుఃఖం చూసి కూడా ఆదరించకుండా వూరికే చూస్తున్న రావణుడిని చూసి మంత్రులు వింటుంటే, వాళ్ళుండగా అలా మాట్లాడడం మంచిదికాదని కూడా భావించకుందా, దురాగ్రహంతో శూర్పనఖ ఇలా అంది.


“ఓరీ! కండ కొవ్వుతో మదించి ఒళ్లు మరిచినవాడా! ఎప్పుడూ కామ సుఖాలలో ఆసక్తికలిగి హద్దో-అదుపూ లేకుండా, దండించే వాడు లేకుండా మూర్ఖుడవై, నీ పక్కనే నిన్ను వాత వేసేందుకు కాచుకున్న మృత్యుదేవతను కనుక్కోలేక పోతున్నావుకదా! ఎప్పుడూ స్త్రీలతో రతిక్రీడల్లో మునిగి, వాట్లోనే ప్రీతికలిగి తన ఇష్టం వచ్చినట్లు సంచరించే రాజును ప్రజలు స్మశానాగ్నిలాగా గౌరవిస్తారా? నీలో అలంతో దోషం వుంది. కాబట్టే నిన్ను లోకులు గౌరవించరు. స్త్రీలతో విశేషంగా సంభోగించడం వల్ల బుద్ధి బలం చెడి కార్యాకార్యాలు ఆలోచించే శక్తి లేక రాజకార్యాలు తానై చేయని రాజు చెడిపోతాడు. వాడు తలపెట్టిన పనులు చెడి పోతాయి. వాడి రాజ్యం చెడుతుంది. నువ్వు ఆ గతికి చేరనున్నావు”.

         “వేగులవాళ్ళను ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలుసుకోకుండా, ఆలోచన చేయకుండా, ప్రజలకు అవసరమైనప్పుడు దర్శనం ఇవ్వకుండా, అంతఃపురంలో కాంతాలోలుడై చాటున వుంటూ, స్వయంగా పనులు చేయాల్సి వచ్చినప్పుడు సంబంధం లేనివాళ్లు, స్వార్థపరులు చెప్పిన మాటలు నమ్ముతూ, భార్యలు, మంత్రులు, తోవన పోయేవారి చెప్పిన మాటలు నమ్మి పరాధీనుడైన రాజును తొలగిపోతారు ప్రజలు. అన్ని పనుల్లోనూ తానే పెద్దగా వుంటూ, తన ఇష్టప్రకారం స్వతంత్రించి పనులు నెరవేర్చక ఇతరులకు పెత్తనం ఇచ్చి, వారితో పనులు చేయించే రాజులు సముద్రంలో పర్వతాలు మునిగినట్లు వాళ్ల వల్లే చెడిపోతారు. వారి ప్రభుత్వం, అధికారం, సంపద వాళ్లకంటే ముందుగానే నశిస్తుంది. నీకెప్పుడు కీడు చేద్దామా అని ఎదురుచూస్తున్న దేవతలు, దానవులు సమయం కోసం కాచుకున్నారు. అది కనుక్కోలేక కార్యాలోచనపరత్వం లేకుండా, స్థిరబుద్ధి లేకుండా, చపలుడవై వుండే నువ్వు ఎలా ప్రాణాలతో వుండగలవు?”. 

Thursday, December 27, 2018

రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కల్వకుంట్ల : వనం జ్వాలా నరసింహారావు



రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కల్వకుంట్ల
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-12-2018)
         రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజనీతిజ్ఞుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని  తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన నాటినుండి అధికారంలో వున్న కాంగ్రెస్, తెలుగుదేశం చేయలేని అభివృద్ధిని, అమలుపర్చలేని సంక్షేమ పథకాలను, తన ఏబై ఒక్క నెలల పాలనలో చేసి చూపించి మరీ ప్రజలను ఓట్లు అడిగారు సీఎం, తెరాస అధినేత చంద్రశేఖర్ రావు. తన అభ్యర్థనకు మద్దతుగా, ఏబై ఒక్క నెలల కాలంలో తన సారధ్యంలోని ప్రభుత్వం రూపకల్పన చేసి, కార్యాచరణ పథకం తయారుచేసి, చేపట్టి, విజయవంతంగా అమలుచేసిన అభివృద్ధి-సంక్షేమ పథకాలను-కార్యక్రమాలను ఓటర్లకు గణాంకాలతో సహా వివరించారు కేసీఆర్. ప్రగతి నివేదికను ప్రస్ఫుటంగా ప్రకటించారు. తన పథకాలను విశ్లేషించి మరీ చెప్పారు ఓటర్లకు. ఒక నాయకుడిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకర్తగా, ఒక దార్శనికుడిగా, ఒక యదార్థవాదిగా, ఒక మేథావిగా ప్రజల మనసు చూరగొన్నాడు. ఫలితంగా లభించిందే అఖండ విజయం.

         వాస్తవానికి, అందుబాటులో వున్న, పదిమంది అంగీకరించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు, వర్తమాన-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, అందునా ఒక క్రమ పద్ధతిలో వాటిని అన్వయించుకుంటూ, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే పథకాల రూపకల్పన-అమలు జరుగుతేనే అది అసలు-సిసలైన అభివృద్ధి అనడానికి వీలవుతుంది. ప్రజల మనసులు చూరగోనడానికి వీలవుతుంది. అదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ నెలనుండి. అదే భవిష్యత్ లొ కొనసాగనుంది. అమలు చేయడానికి అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ, సైద్ధాంతిక భావజాలాన్ని ప్రదర్శించుకుంటూ, "ప్రాక్టికల్" అవగాహనతో కాకుండా "థియరీ" తో సరిపుచ్చుకుంటూ కాలం వెళ్లబుచ్చడం అభివృద్ధిని సాధించడం అనరు. అవన్నీ తాత్కాలిక రాజకీయ అవసరాలకు పనికి రావచ్చునేమో కాని ప్రజల విశ్వసనీయతకు నోచుకోవు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం చెయ్యాలనేది ఆలోచన చేసి, దానికి అవసరమైన ప్రణాళికను రూపొందించి, అమలుకు పటిష్ఠమైన కార్యాచరణ పథకాన్ని తయారుచేసి, ఒక నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది.

ఈ మొత్తం ప్రక్రియలో, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాంప్రదాయక, సహజసిద్ధమైన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది కేసీఆర్ మొదటి విడత అధికారంలో వున్న ఏబైఒక్క నెలల కాలంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో-ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా జరగడానికి అన్నింటికన్నా ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజనీతిజ్ఞత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, నిబద్ధత, ప్రతి అంశాన్నీ పదిమందితో కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధానం, దేన్నైనా ఒకటికి పది సార్లు సమీక్షించిన తదుపరే నిర్ణయం చేసే సుగుణం...ఇలా మరెన్నో. వీటన్నిటి ఫలితమే అనేక పథకాల రూపకల్పన-అమలు. అభివృద్ధిని సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యం లీడర్షిప్.

         విశ్వవిఖ్యాత మేనేజ్‌మెంట్ రంగ నిపుణుడు జిమ్ కాలిన్స్, "గుడ్ టు గ్రేట్" అనే మహత్తరమైన పుస్తకాన్ని రాశాడు. అందులో ప్రధానంగా ఆయన లీడర్షిప్ లక్షణాలను, లీడర్ నాయకత్వంలో నడుస్తున్న సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన పద్ధతులను, మేనేజర్ కు లీడర్ కు, అందునా ఉన్నత స్థాయి లీడర్ కు వుండే వ్యత్యాసాన్ని వివరిస్తాడు. ఆయన తన సిద్ధాంతంలో "గుడ్", "గ్రేట్" అనేవి, ఒకదానికి మరొక టి బద్ధ శతృవులని,  "గుడ్ టు గ్రేట్" ఎదగడానికి ఒకే ఒక దూకుడుతో జరిగే మార్పు కాదు-కానే కాదు అని, సంస్థను "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" తీసుకెళ్లడానికి కావలసిందల్లా....ఐదో (ఉన్నత) స్థాయి నాయకత్వమని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని సోదాహరణంగా వివరిస్తాడు. లీడర్ అనే వాడు మొట్ట మొదలు తనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకుంటాడని, వారిలో ఎవరు-ఏమిటి అన్న ఆలోచన చేసి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో నిర్ణయిస్తాడని, నగ్న సత్యాల లాంటి పాశవిక వాస్తవాలను ధైర్యంగా విశ్లేషణ చేసుకుంటూ ఆ వాస్తవాలను వున్నదున్నట్లు పది మందికి తెలియచేస్తాడని, అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతాన్ని తుచ తప్పకుండా పాటిస్తాడని, నిరంతరం సత్ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని, సంస్కృతిని అలవరచుకుంటాడని, ఐటీ లాంటి సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకుంటాడని.....ఇవన్నీ చేసేవాడు ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకుడనిపించుకుంటాడని జిమ్ కాలిన్స్ అంటాడు.


         అరుదైన ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకత్వ లక్షణాలున్న వారు, ఆ స్థాయికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అంచలంచలుగా ఎదుగుతారు. అలా ఎదిగే నేపధ్యంలో వివిధ రంగాలలో వారు పొందిన అనుభవం, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితంలో ఎదురైన ఆటుపోటులు, అనుభం నేర్పిన గుణపాఠాలు, సహచరుల తోడ్పాటు....ఇలా ఎన్నో వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అందరికీ ఇలా ఎదగడం కుదరదు. అతికొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి చేరుకో గలరు. మరో విధంగా అలా ఎదిగినవారు, ఆ ప్రక్రియలో వివిధ స్థాయిలలో నాయకత్వ-యాజమాన్య (మేనెజీరియల్) లక్షణాలెలా వుంటాయో అవగాహన చేసుకోవాలి.

వివరాల్లోకి పోతే: వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి అలవాట్లతో, ఫలవంతమైన తోడ్పాటును సంస్థకు అందించగల వారే మొదటి స్థాయి "స్వయం సాధకులు". ఇక రెండో స్థాయికి చెందిన వారు, నలుగురున్న బృందంలోని "భాగస్వామ్య సభ్యులు". వీరు సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల వారై వుంటారు. మూడో స్థాయికి చెందిన "మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వ్యక్తులై వుంటారు. నాలుగవ స్థాయి "సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరందరిని, ఏఏ పనికి ఉపయోగించుకోవాలో, సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన స్థానంలో ఎవరెవర్ని నియమించాలో నిర్ణయించగలిగేది ఐదో స్థాయి "కార్య నిర్వహణాధికారి" మాత్రమే . వీరు తమ వ్యక్తిగత నమ్రత-అణకువలను-అనుభవాన్ని-నైపుణ్యాన్ని వృత్తి పరమైన కార్య సాధనతో రంగరించి, ఒక అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచెలంచల వ్యవస్థలోనే, "గుడ్ టు గ్రేట్" ఆచరణ సాధ్యమవుతుంది.

         వృత్తి పరమైన కార్య సాధన, వ్యక్తిగత నమ్రత-అణకువలను-అనుభవాన్ని-నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకున్న ఐదో స్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వ తీరుతెన్నులను అర్థం చేసుకోగలగడం ఆ స్థాయి వారికే తప్ప ఇతరులకు అంత త్వరగా అర్థంకాదు. తన కార్య సాధనలో భాగంగా సముచిత స్థాయి నుంచి సమున్నత స్థితికి సంస్థ రూపాంతరీకరణ చేసే దిశగా పతాక స్థాయి ఫలితాలను సాదించగలడు ఆ నాయకుడు. ఎంత కష్టమైనా-ఎన్ని అవాంతరాలెదురైనా సడలించని సంకల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాడు. శాశ్వత సమున్నత స్థితి సంస్థను నిర్మించేందుకు, తగిన ప్రమాణాలను నిర్ణయించగలడు. తన కృషి ప్రతిబింబిస్తోందా, లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించేందుకు అద్దంలో దృష్టి సారిస్తాడు గాని నాలుగు గోడల అవతల వాటి మధ్య నున్న కిటికీ బయట తలపెట్టి చూడడు. అలా చూసి, నిస్సారమైన ఫలితాల బాధ్యతను ఇతరులపై మోపి, వాళ్లపై నింద వేయడు. తన దురదృష్టమనో-కారణాంతరాల వల్ల అనుకున్నది సాధించలేక పోయాననో, తప్పు తనది కాదనో అనడు. నమ్రత-అణకువలను కార్య సాధనలో అడుగడుగునా ప్రదర్శించుకుంటూ, వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం-ముఖ స్తుతి కోరుకోవడం చేయడు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుండా నిర్ధారించిన ప్రమాణాల ఆధారంగా ముందుకు సాగుతాడు. సంస్థలో పనిచేసే వారిలో మంచి ఫలితాలను సాధించాలనే ప్రగాఢ వాంఛను కలిగించి, తన లాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్ లో-రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు. సాధించిన ఫలితాలన్నీ తన వల్లనే జరిగాయని అద్దంలో చూసుకుని మురిసిపోకుండా, ఆ పేరు-ప్రతిష్ఠలను ఇతరులతో పంచుకునేందుకు, తనకు తోడ్పడిన వ్యక్తులను గుర్తించేందుకు నాలుగు గోడల అవతల దృష్టి సారించుతాడు.

         సంస్థలో పనిచేసే ప్రతివారు ముఖ్యులని అనేకన్నా, వారిలోని సరైన వ్యక్తులే ముఖ్యులని భావించడం మంచిది. సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి సంస్థను తీసుకెళ్లాలంటే, అందుకు తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం కార్య నిర్వాహకులు మొట్టమొదట చేసే పని. ముఖ్యంగా తన సహచర "నాయకత్వ బృందం" విషయంలో మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. తాను నిర్దేశించిన ప్రమాణాలను-సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను "సంస్థ వాహనం" నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి. "గొప్ప దూరదృష్టికి గొప్ప మనుషులే కావాలి" అన్న సిద్ధాంతాన్ని పాటించుతారు వీరందరు. తన కింది వారు నిబద్ధతతో పనిచేయలేరని అనుమానం వచ్చిన వెంటనే, సరైన వ్యక్తులను వారి స్థానంలో నియమించడం వారిలోని నైపుణ్యం. అలా నియమించబడిన "సరైన వ్యక్తుల" తెలివితేటలు-నేర్పరి తనం కంటే, వారిలోని సామర్థ్యం-ప్రవర్తన-నడత, సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి వారి పనితనాన్ని నిరంతరం అజమాయిషీ చేయడం కంటే, వారికి సరైన మార్గదర్శకాలను సూచించితే సరిపోతుంది. వారిని ముందుకు దూసుకుని పొమ్మని బోధించితే చాలు. "సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి" నడిపించగల బృంద సభ్యులు జీవితాంతం స్నేహితులుగానే నిలిచిపోతారు. ఐదో స్థాయి కార్య నిర్వాహక నాయకుడు చేయాల్సిందల్లా అలాంటి వారిని వెతికి పట్టుకుని, సంస్థ వాహనం ఎక్కించి సత్ఫలితాలను సాధించడమే. అవసరం అనుకుంటే వాహనంలోంచి దింపడంలోనూ చాకచక్యం చూపడమే !

         "గుడ్ టు గ్రేట్" నాయకత్వ సిద్ధాంతం కేవలం ప్రయివేట్ సంస్థలకు మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్వహణకు కూడా అన్వయించుకోవచ్చు. ప్రభుత్వంలో, రాజకీయాలలో ఐదో స్థాయి "కార్యనిర్వహణాధికారి" నాయకత్వమంటే, "రాజనీతిజ్ఞుడు" అని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు "పరిపాలన" గురించి విన్నాం...ఆ తరువాత కాలంలో "సుపరిపాలన" అనేది పాపులర్ అయింది. అంతకంటే మెరుగైన పాలన కోరుకుంటున్నారు ప్రజలు. రాజనీతిజ్ఞతతో కూడిన సుపరిపాలన" కావాలంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల వర్తమాన అవసరాలను మాత్రమే తీరుస్తే సరిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. భవిష్యత్ కు బంగారు బాటలు (బంగారు తెలంగాణ) వేయాలి. కేసీఆర్ మొదటి విడత ఏబై నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్ లో జరగబోయేది అదే. రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించి, అమలు చేస్తున్న పథకాలు సార్వజనీనమైన పథకాలే! పది కాలాల పాటు మనుగడ సాగించి ప్రజల అవసరాలను తీర్చే పథకాలే! ఈ పథకాలన్నీ ముఖ్య మంత్రి "రాజనీతిజ్ఞత" కు నిదర్శనాలే! జిమ్ కాలిన్స్ సిద్ధాంతంలోని సమున్నత స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుని పోవడానికి వేస్తున్న బంగరు బాటలే! ఉదాహరణలు కోకొల్లలు.

         అభివృద్ధి అంటే ఇలా వుంటుంది అని ప్రజలు అనుకునేలా ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది, పరుస్తున్నది ఈ ప్రభుత్వం. అందుకే...ఇప్పుడున్నది కేవలం "పరిపాలనో", లేక "సుపరిపాలనో" కాదు..."పరిపాలనలో రాజనీతిజ్ఞత". అదే అభివృద్ధికి పునాది. అందుకే...ఇందుకే...రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.


Sunday, December 23, 2018

సీతాపహరణం చేయమన్న అకంపనుడు, వద్దన్న మారీచుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-40 : వనం జ్వాలా నరసింహారావు


సీతాపహరణం చేయమన్న అకంపనుడు, వద్దన్న మారీచుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-40
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-12-2018)
         అకంపనుడు శ్రీరాముడి వధోపాయంగా సీతాపహరణం చేయమని ఇలా చెప్పాడు రావణుడితో. “ఓ అసురరాజా! రామచంద్రుడి భార్యైన సీత గురించి నేనేం చెప్పగలను? రాముడి గురించి వృత్తబాహుడని, వృషాంసుడని చెప్పాను కాని సీతాదేవి విషయం చెప్పడానికి నాకు సాధ్యం కాదు. అయినా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆమె అందం లాంటి అందం ముల్లోకాలలో ఎక్కడా లేదు. ఆమె నడక ఏనుగు నడకలా వుంటుంది. నడి వయస్సులో వుంది. దేవతా స్త్రీలలో కాని, గంధర్వ స్త్రీలలో కాని, అప్సరసలలో కాని, రాక్షస స్త్రీలలో కాని, జానకితో సమానమైన స్త్రీ లేనేలేదు. ఇక మనుష్య స్త్రీలలో లేదని చెప్పాల్నా? ఆమెను నువ్విక్కడికి తెస్తే, ఆమె మీద ప్రేమ కల రాముడు, ప్రియురాలి ఎడబాటుతో కలిగే తాపం అనే అగ్నిలో పడి చస్తాడు” అని అకంపనుడు చెప్పగా రావణుడు ఆ ఆలోచన బాగుందని ఆమోదించాడు. యుద్ధం లేకుండా శత్రువు చనిపోతున్నాడనే ఆలోచన రావణుడికి రుచించింది.

         అకంపనుడు చెప్పినట్లే చేస్తానని, ఉదయాన్నే పోయి సీతాదేవిని తెస్తానని అంటూ, వాడిని వెళ్ళమంటాడు రావణుడు. అలా చెప్పి సూర్యకాంతితో సమానమైన కంచరగాదిడలు కట్టిన తెల్లటి రథం మీద సారథితో ఒక్కడే బయల్దేరి పోయాడు. ఆకాశమార్గంలో పోతున్న ఆ రథం ఆ సమయంలో మేఘాల మధ్యనుండే చంద్ర మండలంలాగా కనిపించింది. అలా పోయి మారీచుడి ఆశ్రమంలో దిగాడు రావణుడు. మారీచుడు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఆసనం చూపించి, భక్ష్య భోజ్యాలిచ్చి తృప్తి పరిచాడు. ఆ తరువాత రావణుడితో “రాక్షసరాజా! నీకు, రాక్షసులకందరికీ క్షేమమేకదా? ఉపద్రవం ఏదీ జరగలేదు కదా? ఇలా ఒంటరిగా, తోడు ఎవరూ లేకుండా, సరాసరి ఇక్కడికి వచ్చావంటే ఏదో గొప్ప పని పడిందని సందేహం కలుగుతున్నది” అని అన్నాడు మారీచుడు. ఆ మాటలు విన్న రావణాసురుడు “తండ్రీ! రాముడనే ఒక్క మానవుడు రాక్షసులందరినీ యుద్ధ సామర్థ్యంతో వధించి జనస్థానాన్ని పాడుచేశాడు. అతడి భార్యను నేను అపహరించాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి. ఆ విధంగా నేను నా పగ తీర్చుకుంటాను” అని అంటాడు.

         రావణుడు ఈ విధంగా చెప్పగా విన్న మారీచుడు, సీతాదేవి గురించి లోపల శత్రుత్వం, బయటికి స్నేహం కలవాడెవడో, ఎప్పుడు రావణుడు చెడిపోవాలో అని ఎదురు చూస్తున్నవాడు ఇలా చెప్పాడని అంటాడు. “సీతను తెమ్మని చెప్పినవాడు నీ మేలుకోరేవాడు కాదు. ఇప్పుడు ముల్లోకాలను పాలించే నీ గొప్పదనం చూసి ఓర్వలేనివాడెవడోఅది భగ్నమైపోవడానికి ప్రయత్నించాడు. ప్రసిద్ధమైన విషసర్పం కోర పీకమని నీకెవడు చెప్పాడు? ఏమరుపాటుతో వాస్తవం తెలియకుండా నిద్రపోతున్నవాడిలాగా వున్న నీతలను తన్నింది ఎవరు? రాక్షసరాజా! జగత్ప్రసిద్ధమైన గొప్పవంశంలో పుట్టటమనే తొండం కొన, గొప్ప పరాక్రమమనే మదపు నీళ్లు, గడియమాకుల లాంటి చేతులనే దంతాలు, శత్రువులకు భయం కలిగించే రాముడనే మదపుటేనుగును, ఇప్పుడు కనురెప్పలు ఎత్తైనా చూడడానికి ప్రయత్నం చేయవద్దు. యుద్ధ ముఖంలో నిలబడడం అనే పైకెత్తబడిన తోక కలిగి, రాక్షస సమూహాలను మృగాలలాగా సంహరించ కలిగి, గొప్ప బాణాలనే వాడి గోళ్లు కలిగి, వాడిగల కత్తులను కోరలుగా కలిగి, బలిష్టమైన నరరూపం ధరించిన రాముడనే సింహాన్ని, ఎక్కడో ఒకచోట ఎవర్నీ బాధించకుండానిద్రిస్తుంటే, దాన్ని లేపవచ్చా? చక్కగా ఆలోచించు”. అని అంటాడు మారీచుడు.


ఇంకా ఇలా అంటాడు మారీచుడు. “పాతాళంలో పడి అక్కడి నుండి మళ్లీ పైకి రాలేనట్లు రామపాతాళంలో నువ్వు పడ్డావా మళ్లా ఊపిరితో వెలుపలికి రాలేవు. రామపాతాళం ఎలాంటిది అంటావా? విల్లే మొసలి...అది నీళ్లలో అడుగు పెట్టీ పెట్టకముందే వాతవేస్తుంది. అది దాటిపోతే భుజ వేగమనే పెద్ద బురద వుంటుంది. దాంట్లో దిగబడితే అంతే సంగతి ఇక. అదీ దాటిపోగలిగితే, బాణపరంపరలనే అలలు మీదమీద వచ్చిపడి లోపలి ఈడ్చుకు పోయి చంపుతాయి. ఇలాంటి యుద్ధ ప్రవాహంకల రామపాతాళంలో పడితే ఇక జీవితాశ లేదు. లంకాధిపతీ! నేను పరుషంగా చెప్పానని కోప్పడవద్దు. క్షమించు. వాస్తవంగా నీ మేలు కోరి చెప్పాను. కోపం తగ్గించుకొని లంకకు వెళ్లు. నీ భార్యలతో సంతోషంగా జీవించు. ఆడవిలో ఆయన భార్యతో రాముడు వుంటాడు. ఆయన భార్యతో ఆయన లేకుండా చేశావా....నీ భార్యలతో నువ్వు సుఖంగా వుండవు”.

ఇలా మారీచుడు చెప్పిన హితోక్తులు విన్న రావణుడు, అలాగే ఆయన చెప్పినట్లే చేస్తానని జవాబిచ్చి, లంకకు పోయి సంతోషంగా తన ఇంటికి చేరాడు. రాముడితో బలవద్విరోధం ఎందుకు? నేనొక్కడినే పొతే, అందర్నీ చంపిన రాముడిని తానొక్కడినే జయించగలనని నమ్మకం ఏమిటి? అని ఆలోచించి సంతుష్టుడై ఇంటికి పోయాడు రావణాసురుడు.

(ఇప్పటికింకా రావణుడికి శూర్పనఖ ముక్కు-చెవులు కోసిన సంగతి తెలియదు. అకంపనుడు తెలిసినా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఖరుడికి, రాముడికి యుద్ధం ఎందుకు జరిగిందని రావణాసురుడు అడగలేదు. అందరు ఋషులను చంపినట్లే రాముడిని కూడా చంపడానికి పోయి చచ్చారేమో అనుకున్నాడు. తనంతట తానుగా అకంపనుడు చెప్పలేదు. అసలు శూర్పనఖ రాముడి దగ్గరకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రావణుడు అడుగుతాడని భావించి అకంపనుడు ఆ విషయాన్ని దాటేశాడు. అదే వచ్చి అన్ని సంగతులు చెప్పుకుంటుందిలే, మనకెందుకీ బాధ? అనుకున్నాడు).

Friday, December 21, 2018

“ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” డీఎక్స్ఎన్ వ్యూహం : వనం జ్వాలా నరసింహారావు


“ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” డీఎక్స్ఎన్ వ్యూహం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (22-12-2018)
            184 దేశాల్లో, 70 లక్షల పంపిణీదార్లతో, 1600 కు పైగా సిబ్బందితో, సుమారు బిలియన్ డాలర్ల వ్యాపార దిగ్గజం డీఎక్స్ఎన్ సంస్థ. నేరుగా అమ్మకాలు (డీఎస్సీ కంపెనీ) జరిపే ప్రపంచవ్యాప్త కంపెనీలలో డీఎక్స్ఎన్ ది 24 వ స్థానం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి 1984 లో డిగ్రీ పొందిన సివిల్ ఇంజనీర్ డాక్టర్ లిమ్ సియో జిన్ డీఎక్స్ఎన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి.

మలేషియా దేశంలోని వాయువ్య ప్రాంతంలో గల కేదా ప్రదేశంలో ఆవిర్భవించిన డీఎక్స్ఎన్, తన విజయ పథానికి దాన్నే కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. అక్కడే ఒక సాదా-సీదా కంపెనీగా మొదలైన డీఎక్స్ఎన్, అంచెలంచలుగా ఎదిగి, ఈ రోజున ప్రపంచవ్యాప్త సంస్థగా రూపుదిద్దుకుంది. చైనా దేశపు వాడుకపదమైన “డాక్సేన్” నుంచి పుట్టుకొచ్చిందే డీఎక్స్ఎన్ నామకరణం. “డాక్సేన్” అంటే, విశ్వసనీయత, నిజాయితీ, ధర్మం. డీఎన్ఎక్స్ కంపెనీ సిద్దాంతం, “ఆరోగ్యం, సౌభాగ్యం, సంతోషం”.

డీఎక్స్ఎన్ తన 25 సంవత్సరాల పూర్తి పండుగను 2018 మే నెలలో జరుపుకుంది.

ఎక్జేక్యూటివ్ చైర్మన్ హోదాలో ఏప్రియల్ 3, 1996 నుండి వ్యవహరిస్తున్న డాక్టర్ లిమ సియో, కంపెనీని 1933 లో స్థాపించారు. అత్యంత నైపుణ్యం కల డాక్టర్ లిమ్ సియో ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ నుండి డాక్టరేట్ పట్టా పొందడమే కాకుండా, పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఒక వ్యవస్థాపకుడిగా, ఔత్సాహికుడిగా, ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా, శాస్త్రవేత్తగా, పరోపకారిగా డాక్టర్ లిమ్ సియో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ప్రపంచాన్ని ఒక ఉత్తమమైన జీవన వేదికగా మార్పుకు కారకుడయ్యారు.

రచయిత డాక్టర్ రాజేష్ ఎస్. సవేరా, డాక్టర్ లిమ్ సియో ల మధ్య చోటుచేసుకున్న అనుభవాల మార్పిడే “మై జర్నీ విత్ డీఎక్స్ఎన్” పుస్తకంగా రూపుదిద్దుకుంది.

అనాదిగా, వేలాది సంవత్సరాలుగా ఏషియా తరహా వైద్యానికి సంబంధించిన ఏషియా మష్రూమ్ దినుసుల జాతికి చెందిన “గనోదేర్మా” మూలిక ద్వారా ఆరోగ్య లాభాలను డాక్టర్ లిమ్ సియో గుర్తించిన నేపధ్యమే డీఎక్స్ఎన్ విజయానికి కారణం. సుమారు 400 కు పైగా జీవ క్రియాత్మక సమ్మేళనాలున్న “గనోదేర్మా” వల్ల,  నిర్విషీకరణ (detoxication), శారీరక విధుల సమతుల్యం (balancing body functions), రోగ నిరోధక శక్తి ప్రభావాలు (immunoregulatory effects), అనామ్లజన చర్యలు (antioxidants activities),  కాలేయ నిరసన (liver protesting), హైపో గ్లేసీమిక్ (hypoglycaemic), బ్యాక్తీరియల్ వ్యతిరేక ప్రభావాలు (anti-bacterial effects) లాంటి అనేక రకాల రుగ్మతలతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడం కూడా చేస్తుందని అధ్యయనంలో తేలింది.

కట్టింగ్ అంచు ప్రాసెసింగ్ సాంకేతిక విధానం ద్వారా, డీఎక్స్ఎన్ చర్మ సంరక్షణ సంబంధిత నుండి కాఫీ సంబంధిత వరకూ, రక-రకాల ఉత్పత్తులను తయారుచేయగల సామర్థ్యం వుంది. “గనోదేర్మా” నుండి  తయారయ్యే “లిమ్ఘజీ” అనే ఒక అసాధారణ ఉత్పత్తికి డాక్టర్ లిమ్ సియో విజన్ నుండి రూపుదిద్దుకున్న “ఒకే ప్రపంచం, ఒకే మార్కెట్” అనే మార్కెటింగ్ వ్యూహం కారణాన, యావత్ ప్రపంచానికి అది సులువుగా లభ్యమవుతున్నదిప్పుడు.

కేవలం రెండు రకాల ఉత్పత్తులతో ఆరంభమైన డీఎక్స్ఎన్ ప్రస్థానం అంచెలంచలుగా ఎదిగి, “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” వ్యూహం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా పాకింది. మొదట్లో డాక్టర్ లిమ్ సియో తన భావనను బయటపెట్టినప్పుడు నవ్వని వాళ్ళు లేరు. “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” వ్యూహం అంటే, డీఎక్స్ఎన్ కంపెనీ తయారుచేసి, విడుదల చేసి, పాకింగ్ చేసిన ఉత్పత్తులను నేరుగా, సరాసరి వినియోగదారులకు పంపిణీ చేయడమే. దీనికి అనుగుణంగా దేశదేశాలలో తయారీ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడం కోసం ప్రపంచవ్యాప్తంగా భారీగా పెట్టుబడులు పెట్టింది డీఎక్స్ఎన్ కంపెనీ.

నేరుగా, సరాసరి (Direct Selling) అమ్మకాల వ్యాపార శైలిలో యావత్ ప్రపంచంలోనే డీఎక్స్ఎన్ సంస్తది ఒక రకమైన ఏకైక మార్కెటింగ్ భావనగా నిరూపణ కావడం విశేషం. ఇలా జరగడంతో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రజల కలిసి-మెలిసి, ఒక నెట్వర్క్ గా, ఒకరికొకరు సహాయ-సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటూ, సంబంధిత సభ్యులకు బలీయమైన ఆర్ధిక పుష్టిని కలిగించడమే కాకుండా, ఒక ప్రపంచవ్యాప్త సంఘంలో ఒకే రకమైన విలువలను పంచుకుంటూ భాగస్వాములం అయ్యామన్న తృప్తి కలిగింది.

పంపిణీదార్లు రూపొందించిన డిమాండ్ ఆధారంగా డీఎక్స్ఎన్ తన మార్కెట్ ను అంతర్నిర్మాణo చేసింది.  ఒక దేశంలోని సభ్యులు డీఎక్స్ఎన్ ఉత్పత్తుల కొరకు డిమాండ్ రూపొందించగానే, కంపెనీ తక్షణమే స్పందించి, పంపిణీదార్ల సౌలభ్యం కొరకు, ఆయాదేశాల్లో కార్యాలయాలను నెలకొల్పుతుంది. దానంతట అదిగా ఎక్కడికీ పోదు...కార్యాలయాలను నెలకొల్పదు....అమ్మకాలు ప్రారంభించదు. ఇదొక రకమైన దుకాణ రహిత భావన (shop-less concept). ఈ వ్యూహాన్ని వందమందికి పైగా చురుకైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నిర్వహిస్తుంటారు. క్రమేపీ డీఎక్స్ఎన్ రూపొందించిన “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” వ్యూహం వాస్తవరూపం దాల్చి, ఎవరైనా, ఏ దేశం నుండైనా, ఎవరితోనైనా, వారే దేశంలో వున్నప్పటికీ, వ్యాపారం చేస్తూ, వాళ్ల స్థానిక కరెన్సీలో సంపాదన చేసుకోవచ్చు.

“ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” భావన చాలా తేలికైంది. డీఎక్స్ఎన్ సభ్యులు ప్రపంచంలోని ఏ ప్రదేశం నుండైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా, ఎవరినైనా, నిరభ్యంతరంగా ఒక అభ్యర్థిగా నియమించుకోవచ్చు. కంపెనీ ఉత్పత్తులను యావత్ ప్రపంచంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. అంతర్జాతీయంగా చేసిన వాళ్ల వ్యాపారానికి ప్రతిఫలంగా అదనపు ఆదాయాలను స్థానిక కరెన్సీలో పొందవచ్చు. ఈ యావత్ ప్రక్రియలో భాగంగా, కేవలం ఒక స్మార్ట్ ఫోన్ తన చేతిలో వుంచుకుని, ఏ సభ్యుడైనా అంతర్జాతీయ మార్కెటింగ్ అతి సులువుగా చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా కావాల్సినవారిని నియమించుకోవచ్చు, అవసరమైన ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చు, దానికి అవసరమైన నగదు చెల్లించవచ్చు, చివరకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చాట్ చేయవచ్చు కూడా. ఇంత భారీ కార్యకలాపాల కారణాన, మలేషియాలోని కేదాలొ వున్న కంపెనీ ప్రాసెసింగ్ కేంద్రం, దానికి అనుబంధంగా వున్న కౌలాలంపూర్ లోని కార్పోరేట్ కేంద్ర కార్యాలయం, పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి.


డీఎక్స్ఎన్ లోగోలో కూడా ఎంతో నిగూఢ అర్థం వుంది. దాన్లోని నీలం రంగు, ప్రాణికోటి జీవించడానికి అత్యంత అవసరమైన నీటికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా వుంటుంది. ఆకుపచ్చ రంగు విస్తరణకు సంకేతం కాగా, ఎరుపు రంగు ఒక విషయం మీద మేధస్సు ఎలా కేంద్రీకృతమై వుంటుందో తెలియచేస్తుంది. డీఎక్స్ఎన్ కార్పోరేట్ సామాజిక బాధ్యతలో తన వంతు పాత్ర పోషిస్తున్నది. అవసరమనుకున్న సందర్భాలలో అంబులెన్సులను, డయాల్సిస్ యంత్రాలను లయన్స్ క్లబ్ ద్వారా దానం చేయడంతో పాటుగా, ప్రకృతివైపరీత్యాలలో ఇబ్బందులకు గురైనవారిని ఆర్థికంగా ఆదుకుంది చాలా సందర్భాలలో.

వీటన్నింటి వెనుక వున్నా ఆపన్న హస్తం డాక్టర్ లిమ్ సియో. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను రూపొందించుకుని, “ఆరోగ్యం, సౌభాగ్యం, సంతోషం” అనే సిద్దాంతం ప్రాతిపదికగా ఆయన తన కార్యక్రమాలను, వ్యూహాలను అమలుపరుస్తున్నారు. డీఎక్స్ఎన్ సంస్థను ఒక వసుదైక ప్రపంచవ్యాప్త కుటుంబంగా పరిగణిస్తే, ఆ కుటుంబానికి పెద్దగా, తండ్రిలాంటి వాడిగా డాక్టర్ లిమ్ సియోను గుర్తించాలి.

“మై జర్నీ విత్ డీఎక్స్ఎన్” అనే పుస్తకం, దాని రచయిత డాక్టర్ రాజేష్ ఎస్. సవేరాకు, డీఎక్స్ఎన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ లిమ్ సియోకు మధ్య, హైదరాబాద్ నగరంలో మార్చ్ 5, 2018 నుండి నాలుగు రోజులపాటు జరిగిన సమావేశం-చర్చల పర్యవసానమే. తానెలా డీఎక్స్ఎన్ సంస్థను స్థాపించిందీ, స్థాపించాల్సి వచ్చిందీ, తన సుదీర్ఘ ప్రస్తానం ఎలా సాగిందీ, తాను చేసిన త్యాగాలేంటీ, తానెలా రాజీపడ్డదీ, ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నదీ...ఇలా ఎన్నెన్నో విషయాలను డాక్టర్ లిమ్ సియో రచయితతో పంచుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల గురించీ, తన భవిష్యత్ విజన్ గురించీ కూడా రచయితతో పంచుకున్నారు డాక్టర్ లిమ్ సియో.

మిగతా చాలా విషయాలతో పాటు ఈ పుస్తకంలో ప్రధానంగా, డాక్టర్ లిమ్ సియో ఇంజనీరింగ్ విద్యార్ధి దశ, ఆయన మొదటి ఉద్యోగం, ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆయన జీవనయానం ఎలా సాగిందీ, మొదటిసారిగా డీఎక్స్ఎన్ సభ్యుడైన విధానం, ఆ సంస్థ ప్రారంభ ఉత్పత్తుల టెస్టిమోనియల్స్, “ఒకే ప్రపంచం ఒకే మార్కెట్” భావన, భవిష్యత్ లాంటివి వున్నాయి.
(“మై జర్నీ విత్ డీఎక్స్ఎన్”, డాక్టర్ లిమ్ సియో జిన్ జీవిత చరిత్ర
రచన: డాక్టర్ రాజేష్ ఎస్. సవేరా...ఆధారంగా)