Sunday, December 16, 2018

శ్రీ సుందరకాండ పారాయణం...సర్వ ఆపన్నివారణం .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీ సుందరకాండ పారాయణం...సర్వ ఆపన్నివారణం
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (17-12-2018)
           శ్రీ సుందరకాండలో సుందరుడు హనుమంతుడు. ఆయన రామాయణ మహామాలా రత్నం. కాగా సుందరకాండ (మందర మకరందం) మహామంత్ర మాలాభాండం. ఇందులో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మం త్రబద్ధమైన చందఃగంధం. దీనిని భక్తితో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా, క్లేశాలు, కష్టాలు తొలగిపోతాయి. రోగాలు నయమౌతాయి. భయాలు పోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. అతి భయంకరమైన క్షయ, అపస్మారం, కుష్టు, ఉన్మాదం లాంటివి దరిచేరవు. అశ్వినీదేవతలు కూడా నయం చేయలేని రోగాలు నయమౌతాయి. పుత్ర, మిత్రులతో వచ్చిన విరోధాలు శమిస్తాయి. కుటుంబ కలహాలు నశిస్తాయి. మృత్యు భయం పోతుంది. వివరాల్లోకి పొతే....ఏ ఫలం కోరి ఏది చదవాలి అనుకుంటే....

1.    భూత-ప్రేతాదుల నుండి రక్షణకు.....లంకా విజయం
2.    బుద్ధి మాంద్యం తొలగడానికి....హనుమ నిర్వేదం
3.    పర దారా గమన దోష నివారణకు......లంకలో సీతాన్వేషణ ఘట్టం
4.    ఐశ్వర్య సిద్ధికి.....లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం
5.    దుస్వప్న దోష నివారణకు.....త్రిజటా స్వప్న వృత్తాంతం
6.    సత్వగుణ సిద్ధికి....సీతారావణ సంవాదం
7.    ఎడబాసిన బంధువుల సమాగానికి....సీతా హనుమ సంవాదం
8.    ఆపదలు శాంతించడానికి.....అంగుళీయక ప్రదానం
9.    తెలిసీ-తెలియక చేసిన రామాపచార దోష నివారణకు.....కాకానుగ్రహం
10. బ్రహ్మజ్ఞానం......చూడామణి ప్రదానం
11.  శత్రు జయం.....కిమ్కరాది రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు
12. గృహం, వ్యవసాయ పనుల అభ్యుదయానికి......లంకాదహన ఘట్టం
13. బ్రహ్మలోక ప్రాప్తి ...... మధువన ధ్వంసం
14. మనోవాంఛా సిద్ధికి.... సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం
15. పుత్ర సంతానానికి.... 68 రోజుల పారాయణం
16. కన్యా వివాహం..... 68 రోజుల పారాయణం
17. వర్షప్రాప్తికి, కరవు నివారణకు, దారిద్ర్య నిర్మూలనకు నిత్య పారాయణం
18. యుద్ధ విజయానికి....అంగుళీయక ప్రదానం
19. శని బాధా నివారణకు.....బ్రహ్మాస్త్ర బంధం నుండి విముక్తి, హనుమద్గ్రహణం
20.        సర్వకార్య సిద్ధికి, సకల శుభాలకు.....నిత్య పారాయణం.

నైవేద్యం: పారాయణానంతరం ఆవు పాలను బాగా కాచి, గోరు వెచ్చగా చల్లార్చి, చక్కర కలిపి, శ్రీరాముడికి నివేదించాలి. అన్ని నైవేద్యాలకు ఇది ప్రతినిధి.


నవగ్రహ దోష నివారణార్థం పారాయణ క్రమం:
1.    చంద్ర దోష నివారణ....చంద్రవర్ణన ఘట్టం
2.    కుజుడు, గుర్వంతర దశ.....హనుమ రావణుడికి చేసిన హితబోధ
3.    కుజుడు, శుక్రాంతర్దశ.......హనుమ క్షేమానికి సీతమ్మ చేసిన అగ్ని ప్రార్థన
4.    రాహు, శుక్రాంతర్దశ...... హనుమ రాముడికి చూడామణిని ఇవ్వడం
5.    రాహు, శని అంతర్దశ......హనుమ రాక్షస సంహారం
6.    గురు మహాదశ.....సముద్ర లంఘనం (చక్కర, పేలాలు నివేదనం)
7.    గురు కేతురంతర దశ.....మధువన ధ్వంసం
8.    శనితో అంతర్దశ.....బ్రహ్మాస్త్ర బంధం నుండి హనుమ విముక్తి
9.    శనితో బుధుడు.....లంకా దహనం
10. శనితో శుక్రుడు.....చూడామణిని సీతమ్మ హనుమకు ఇవ్వడం
11.  బుధుడు.....హనుమ శ్రీరామచంద్ర స్వరూప వర్ణన
12. బుదుడిలో కుజ భుక్తి ప్రతికూలం....సీతమ్మకు శుభ శకునాలు
13. బుదుడిలో కేతువు....అశోకవనంలో సీతమ్మను వెతకడం
14. కేతువులో శుక్రుడు......హనుమ రాముడికి సీతాదర్శన ఘట్టం చెప్పడం
15. శుక్రుడులో శుక్రుడు....అంగుళీయక ప్రదానం

సకల కార్యసిద్ధికి సంపూర్ణ సుందరకాండ పారాయణం సర్వఫల ప్రదం. శ్రీ సుందరకాండ పారాయణానంతరం విధిగా శ్రీరామ పట్టాభిషేక ఘట్టం పారాయణం చేయాలి.

శ్రీరామానుగ్రహ ప్రాప్తికి, సకల బాధా నివారణకు, సకల కార్య సిద్ధికి, సర్వ శత్రు శమనానికి, సర్వత్రా విజయ పరంపరకు, కోరికలను, కోపాన్ని నియంత్రించడానికి మంత్ర శ్లోకాలు:

1.    ఆపదా మప హర్తారం దాతారం సర్వ సంపదాం,
లోకాభిరామం శ్రీరామం భూయో భూయోన మామ్యాహం
2.    ధర్మాత్యా సత్య సందశ్చ రామో దాశరథిర్యది
పౌరుషేచా ప్రతి ద్వందఃశరైనంజహిరావణమ్
3.    సకృదేవ ప్రసంనాయ తవాస్మీతిచ యాచతే
అభయం సర్వభూతే భ్యోదదామ్యేతద్రత్వం మమ
4.    త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమన్ యతమాస్థాయి దుఃఖక్షయహరోభవ
(సమాప్తం)

1 comment:

  1. please provide sundara kanda parayna sankalpam in telugu

    ReplyDelete