Wednesday, June 30, 2021

Dalit Empowerment as KCR sees it : Vanam Jwala Narasimha Rao

 Dalit Empowerment as KCR sees it

Vanam Jwala Narasimha Rao

 The Pioneer (01-07-2021)

Empowerment is the degree of autonomy and self-determination in people and in communities, enabling them to represent their interests in a responsible and self-determined way, acting on their own authority. It is the process of becoming stronger and more confident, especially in controlling one's life and claiming one's rights. Empowerment as action refers both to the process of self-empowerment and to professional support of people, which enables them to overcome their sense of powerlessness and lack of influence, and to recognize and use their resources.

Rural and urban as well as Dalit livelihoods are enhanced through effective participation of people and communities in the management of their own social, economic and environmental objectives by empowering people, particularly Dalit. Empowerment hinges broadly on three pillars, which when put together, can work wonders, namely, community empowerment, partnerships, and holistic development.

In this context and background, during this week, Chief Minister K Chandrashekhar Rao has embarked on yet another innovative but extraordinary initiative to empower several sections of people, from those living in rural areas to strengthen the rural economy, those living in the urban areas and lastly but not the least, the Dalits living all over the state to live with dignity, self-respect and to become self-sufficient economically forever.

CM KCR’s innovative schemes especially the Dalit Empowerment Policy in the presence of Dalit leaders cutting across the party lines, MPs, MLAs, MLCs and other stake holders was welcomed by all of them including the politically opposing parties from the Congress to BJP. This has once again proved his unquestionable commitment towards all sections of people and his dedication to work for the development and welfare. The marathon 11-hour all party meeting and with the Dalit representatives chaired by KCR demonstrated his concern for Dalits and other oppressed classes in the society.

A day before, while reviewing Palle and Pattana Pragathi Programs the next phase of which are scheduled to commence from First July, the CM called upon the public representatives and official machinery to treat rural and urban development as a continuous process and discharge their duties thinking that the needs of people as top on the agenda. He wanted the administrative set up to gear itself to make the Telangana state an ideal state in the country.

For the development of villages and urban areas, the government would keep two Crore rupees of funds with the Ministers and one crore rupees with all the district collectors. CM said Collectors play a key role in the development of villages and urban areas and they should select an efficient working team and make them partners in the developmental programs. In the meeting, the CM said that the state government stood by the farmers and agriculture and the state had turned itself into a great agriculture-based state. Telangana State became a rice bowl and crops are in abundance.

Since the sale of spurious seeds, fertilizers and pesticides are causing havoc to the rural economy and to farmers in the state, the CM instructed the agriculture and police department to act in coordination and with Collectors and other higher district officials using their special powers to eradicate the spurious seeds sale.

Cleaning profile of urban areas will have to be prepared and accordingly CM KCR had instructed the officials to prepare a list of the retired employees, ex-servicemen and utilize their services in Pattana and Palle Pragathi programs. Since new integrated Collectors’ complexes are made functional, measures should be taken to protect all the government buildings and assets in the district and they should be utilized for the public utilities. During the ten-day Pattana Pragathi program, officials should plan in accordance with ‘Map your town’ model and rectify the mistakes in the urban areas.

The CM said under the Dalit Empowerment Program eligible Dalit BPL families would be developed in a phased manner and this is in addition to SC Sub Plan. The CM said Collectors and higher officials would play a key role in removing backwardness and problems of the Dalits and beneficiaries should be selected in a transparent way. He said beneficiaries should be selected by draw of lot and like the Rythu Bandhu and old age pensions, the financial assistance should be given to the beneficiaries and the amount should be credited to their bank accounts.

It was decided at the all-party meeting to send Rs 10 Lakh financial assistance directly to the bank accounts of the Dalit beneficiaries under CM Dalit Empowerment Program to the eligible Dalits. In the first phase, from the 119 Assembly Constituencies, 100 families from each constituency all over the state will be chosen and the assistance would be given to the eligible 11,900 people selected. For this, the All-Party meeting decided to ear mark Rs 1200 Crore. The government wanted to do more for Dalits who had been discriminated for generations. In addition to spending Rs 40,000 crore in coming years, a corpus fund would also be set up.

CM said through Dalit Empowerment Program, eligible poor Dalit beneficiaries would be given assistance without any bank guarantees. Special plans would be prepared following the policy of Centre for Dalit Studies for the welfare and development of Dalits.

The proposed CM Dalit Empowerment Program, as felt by the all-party meeting, would bring in a qualitative change in the lives of Dalits and the programs launched by the CM and his thoughts on Dalits have become a role model for the country. CM Dalit Empowerment Program would further change the lives of Dalits for better. The All-Party meeting was convened to make them stake holders to stand unitedly by the Dalits, remove their inferiority and to bring in qualitative change in their thought process and attitude.

For the last seven years, CM KCR’s endeavor is to bring in a qualitative change in the lives of all sections of people in the State. His commitment to strengthen the rural economy, turn agriculture as profitable venture, revive and revitalize the hereditary professions, effect rapid changes in the power, education, medical and health sectors supported by a slew of progressive measures are all aimed at creating wealth and strengthening the economy which is in doldrums in the rest of the country.

Though he never made any proclamation, CM KCR is aiming at something very high, mighty, and big. He is laying a strong foundation for future generations’ prosperity, peace, harmony, and development. Making all sections of people to become economically self-reliant, revolutionary administrative reforms, progressive and forward-looking changes in the education sector, KCR is thinking and acting like a Statesman, which ordinary people find it difficult to understand and digest. (With VJM Divakar, Senior Journalist)

 

వేదాలలోనుండి వచ్చినవే ఉపనిషత్తులు : వనం జ్వాలా నరసింహారావు

 వేదాలలోనుండి వచ్చినవే ఉపనిషత్తులు

వనం జ్వాలా నరసింహారావు

మనకున్న ప్రాచీన పరంపర సంబంధాన్ని బట్టి మనల్ని భారతీయులుగా గుర్తించారు. భారతీయులందరికి ప్రమాణం వేదం. వేదాన్ని ప్రమాణంగా భావించే వారిని ఆస్తికులు అని, వేదాన్ని ప్రమాణంగా భావించని వారిని నాస్తికులని అంటారు. భగవంతుడు ఉన్నాడు, లేడు అనే భావనలతో ఆస్తిక-నాస్తిక అనేవి ఏర్పడలేదు. కారణం, భగవంతుడు ఉన్నాడు అని చెబుతూ వేదాన్ని నమ్మని వాళ్ళూ ఉన్నారు కనుక వారిని కూడా నాస్తికులు అనే అంటారు తప్ప ఆస్తికులు అని అనబడరు. భగవంతుడిని అంగీకరించకపోయినా వేదాన్ని అంగీకరించేవారిని ఆస్తికులు అనే అంటారు. కారణం, వేదంలో కొంత భాగాన్నైనా ప్రమాణంగా గుర్తించి జీవనాన్ని గడపాలనే కోరిక ఎవరిలో ఉన్నా వారిని ఆస్తికులు అనడంలో తప్పు లేదన్నమాట. మనం భారతీయులం కనుక వేదాన్ని ప్రమాణంగా గుర్తిస్తాం.

వేదం "అపౌరుషేయం", అంటే ఒకరిద్వారా నిర్మింపజేసినవి కాదు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పలేం. లక్షల సంవత్సరాలుగా వస్తున్న పరంపర ఇది. ఆది లేనిది కనుక "అనాది" అని పేరు పెట్టారు. మార్పు చెందనిది కనుక దాన్ని "నిత్యం" అంటారు. ఇది ప్రమాణం కనుక "వేదం" అని అంటారు. ఎప్పటినుండో ఉన్న మానవసామాన్యానికి అంతటికీ ఆమోదయోగ్యమై, విశ్వజనీనమైనదై ఉండగలిగేదేదో అది నిర్ణయించి చెప్పాలి. ఇలాంటి ఆచరణని చెప్పినది ఒకటే. అది వేదం. అందుకే మనకి వేదం చెప్పింది ధర్మం ఆయ్యింది.

మనలో ఏర్పడే రకరకాలైన  సంశయాలని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలని తీర్చగలిగేది వేదం ఒక్కటే. అందుకే దాన్ని మన పెద్దలు ప్రమాణము అని చెప్పారు. అందుకే వేదం ఆధరణీయమైనదే కాదు ఆరాధించ తగినది అని స్వీకరించారు. అది మనకు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి సంచరించాలి అని నిర్ణయం చేసుకున్నారు మన పెద్దలు. వేదాల్లో కేవలం మనిషిని గురించి మాత్రమే కాదు, చేతనాలని అంటే చైతన్యం కల జీవరాశిని, అచేతనాలని అంటే చైతన్యం లేనటువంటి వాటిని రెంటినీ నియంత్రించగలిగిన శక్తి తత్త్వమైన దైవాన్ని గురించి కూడా వివరించింది. వేదం విశ్వవ్యాప్తమైన అన్నింటిని గురించి కనుక బాగుపడగోరిన ఎవ్వరికైనా మార్గనిర్దేశం చేయగలిగిన ఏకైక  ప్రమాణం వేదం. దాన్ని అనుసరించడం బుద్ధిమంతుడి లక్షణం.

వాస్తవాలని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తెలుసుకోవాలంటే వేదాన్నే ప్రశ్నించాలి. ప్రశ్నించడం అంటే మనం ఈ నాడు ఏదో ప్రశ్న వేయాలని అర్థం కాదు, ఆ వేదమే ప్రశ్న వేస్తూ సమాధాన రూపంలో తత్త్వ రహస్యాలని తెలుపుతుంది. అసలు వేదం అంటేనే తెలిపేది అని అర్థం. వేదం తెలియజేసేది అపారము, అంతా తెలుసుకోవడం కన్నా ఏది మన జీవితానికి లక్ష్యము అనే దాన్ని తెలుసుకుంటూ ముందుకుపోవడం ఉత్తమము.

మన ఋషులు. భగవంతుణ్ణి చూడాలి అనే ఆరాటంలో అడవులని చేరి కోరికతో తిండి, నిద్రలు మాని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సుని చేసి ఒక దివ్య అనుభూతిని పొందారు. దాన్ని లోపల ఇమడ్చుకోలేక మనందరితో పంచుకున్నారు. పరతత్వాన్ని దర్శించిన ఋషుల ప్రేమతో అప్రయత్నంగా, అసంకల్పితంగా దివ్య వాక్కు ఏర్పడింది. ఇలా ఒకరి నుండి మరొకరు ఆ దివ్య తత్వాన్ని దర్శించగలిగారు దానికి ఉప-నిషద్ అని పేరు పెట్టారు. ఉపనిషత్తులు వేదాలలోంచి వచ్చాయి. వేదాలు అపౌరుషేయాలు. ఎవరో కూర్చోని రచించినది కాదు. వేదాన్ని ఎవ్వరూ వ్రాయలేదు. ఆది అఖండమైన అనంతమైన విజ్ఞాన రాశి, అలౌఖికమైన వాంగ్మయం వేదం. దోషాలు లేనివి. పౌరుషేయ గ్రంథాల్లో వలె దోషం లేని దాన్ని వేదం అని అంటారు. అది ఎప్పుడో వ్రాసినది కాదు కనుక ఎప్పటికీ ఉంటుంది అందుకే నిత్యం అంటారు.

వేదాలు మన తత్త్వాన్ని గురించి, పరమాత్మ తత్త్వాన్ని గురించి, ప్రకృతి తత్త్వాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు చెబుతాయి. వేదాలు మనకు ఇతరత్ర తెలియాల్సిన విషయాలని తెలిపే విజ్ఞాన గనులు.  

శరీరానికి సుఖాన్ని కలిగించేవి రకరకాలుగా ఉన్నాయి వాటిని రకరకాలుగా సంపాధించే ప్రయత్నం చేసినా ఈ లోపల ఉండే మనల్ని గురించి తెలిస్తే తప్ప వీటిని ఎట్లా వాడుకోవాలో తెలియదు కనుక ముందు దాన్ని తెలుసుకోమని ఉపనిషత్తులు మనకి ఉపదేశం చేస్తాయి. మనిషి దేన్ని లక్ష్యంగా తీసుకుంటాడో ఆ జ్ఞానం కావాలి దానికి ఆటంకంగా ఉండే ఇతర జ్ఞానరాహిత్యం అంతా తొలగిపోవాలి, అలా చేసేదానికి ఉపనిషద్ అని పేరు. ఉపనిషత్తులకి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి, మనలో నింపాల్సిన జ్ఞానాన్ని నింపే సామర్థ్యం ఉంటుంది కనుక ఆ పేరు వచ్చింది. ఇవి వేదంలోని ప్రధాన ప్రతిపాద అంశాలు, వేదం యొక్క లక్ష్యం ఇదే కనుక వీటికి వేదాంతం అని కూడా అంటారు.

ఉపనిషత్తులు ఆరణ్యకాలలోని భాగాలు. ఉపనిషత్తులను బ్రహ్మభాగము అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా జ్ఞానాన్ని గురించి చెబుతాయి.  మిగతా భాగాన్ని ధర్మ భాగము అని అంటారు. అంటే మనం ఆచరించాల్సిన కర్మ గురించి చెబుతాయి.  కొందరు ఉపనిషత్తులకు ప్రత్యేకించి  శృతి లేదు అని ఇది వేదంలోనిది కాదు అని సందేహిస్తారు కానీ అది తప్పు. ఉపనిషత్తులని వేదంలోంచి తీసి వేస్తే వేదాలు అర్థ రహితం అవుతాయి. ఉపనిషత్తులు పరమాత్మ ఏమిటో, మనం ఉండే ప్రకృతి ఏమితో, అత్మ ఏమిటో, ఆత్మకు ప్రకృతికి ఉన్న సంబంధం ఏమిటో, ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటో, మనిషిగా అత్మ యొక్క లక్ష్యం ఏమిటో ఇలా ఎన్నో విషయాలను తెలుపుతాయి. ఈ మధ్యకాలంలో ఎందరో ఉపనిషత్తులని వ్రాస్తున్నారు. అట్లాంటివి ఉపనిషత్తులు అని అనబడవు. ఉపనిషత్తులు అనేవి వేదంలోని భాగమే.

ఉపనిషత్తులు ప్రతి వేదంలో కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి ప్రధానంగా ఒక పది, మరొక నాలుగు ఉపనిషత్తులు కలిపి మొత్తం పద్నాలుగు ఉపనిషత్తులని వేదాంతం అని చెప్పవచ్చు. ఇవన్నీ మన పూర్వ ఆచార్యులైన ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మద్వాచార్యులచే అంగీకరించబడినవి. అందుకే వారు అందించిన దర్శనాలను వేదాంత సిద్దాంతాలు అని చెబుతారు.

ఉపనిషత్తులు వరుసగా: ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్, తైత్తిరీయ ఉపనిషత్, చాందోగ్య ఉపనిషత్, బృహదారణ్యకోపనిషత్, ఐతరేయ ఉపనిషత్, స్వేతాస్వేతర ఉపనిషత్, కౌషీతకీ ఉపనిషత్ లేదా కౌషీతక్యుపనిషత్, మహోపనిషత్, సుబాలోపనిషత్.

ఈశావాస్యము శుక్ల యజుస్ అనే యజుర్వేదంలోనిది. ఇందులో పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి. శుక్ల  యజుర్వేదం లోనే రెండు శాఖలు ఉన్నాయి. కాన్వ, మాధ్యందిన అని. కాన్వలో పదిహేడు శ్లోకాలతో మాధ్యందినలో పద్దెనిమిది శ్లోకాలతో కనిపిస్తుంటుంది. ఏది ఏమైనా మనం అర్చించాలిన అర్చా మూర్తి వైభవాన్ని స్పష్టం చేస్తుంది.  

కేనోపనిషద్ సామవేదంలోని తలవకారం అనే శాఖలోనిది. మనకందరికి వెనకాతల ఉన్న కారణమేమిటి ? దాన్ని గుర్తించకపోవడానికి మనలోఉన్న అడ్డేమిటి ? దాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుపుతుంది.

కఠోపనిషద్ అనేది యజుర్వేదంలోనిది. యముడికి నచికేతస్సుకి మధ్య జరిగే సంవాదంగా సాగుతూ అన్ని విషయాలని సమగ్రంగా అందిస్తుంది. జీవుడు దేహాన్ని త్యాగంచేసిన తరువాత చేరుకొనే స్థానమేది, అక్కడ భగవంతుని సాయుజ్యం ఎట్లా ఉంటుంది అనేదాన్ని స్పష్టం చేస్తుంది.

ప్రశ్నోపనిషద్ అదర్వ వేదంలోనిది. ఆరుగురు మహనీయుల ప్రశ్నలు వాటి సమాధానాలు అందులో కనిపిస్తాయి.

ముండకోపనిషద్ అదర్వ వేదంలోనిది. సమగ్రంగా అన్ని విషయాలని స్పష్టం చేస్తుంది.

తైత్తిరీయము అనేది కృష్ణ యజుర్వేదంలోనిది, ఒక ఐదు భాగాలు ఉంటాయి. సృష్టి జరిగే క్రమం నుంది, సృష్టి జరిపే తత్త్వాన్ని నిరూపిస్తూ ఆతత్త్వంయొక్క కల్యాణ గుణాలని ఆవిష్కరణం చేస్తుంది.

ఛాందోగ్యం అనేది సామవేదంలోనిది. చాలా పెద్దది. బ్రహ్మ విద్యల్ని వివరిస్తుంది.

బృహదారణ్యకం అనేది శుక్ల యజుర్వేదానికి సంబంధించిన మరో పెద్ద ఉపనిషద్. పేరునుండే 'బృహద్' ఆరణ్యకం అని తెలుస్తుంది. ఇందులో కూడా అన్ని విషయాలని స్పృషిస్తుంది.  సామాన్యంగా ఋషుల సంవాదాలుగా, పరిపాలకుల ద్వారా ఋషులకు నిగూఢమైన విషయాల్ని గ్రహించి అందించినవిగా తెలుస్తుంది.

ఐతరేయము, కౌషీతకీ అనేవి ఋగ్వేదంలోనివి. సుభాల అథర్వ వేదానికి సంబంధించినది. స్వేతాస్వేతర యజుర్వేదానికి సంబంధించినది. ఇక్కడ మనం ప్రస్థావించినవి కాని ఉపనిషత్తులు ఏవైనా ఉంటే అవి తత్త్వ నిర్ణయాన్ని అంత స్పష్టంగా కలిగించేవి కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఏది ప్రధానమో దాన్ని మనకు అందించగలిగేదాన్ని మనం గుర్తిస్తే చాలు.

ఉపనిషత్తులు మంత్ర రూపంలో ఉంటాయి.

(శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ ప్రవచనం ఆధారంగా)

Sunday, June 27, 2021

రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపిన దశరథుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-62 : వనం జ్వాలా నరసింహారావు

 రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-62

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-06-2021)

తనకిష్ఠం లేకున్నా, తన హితులు చెప్పినట్లు చేస్తే శ్రేయస్కరమని భావించాడు దశరథుడు. వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి, మునివెంట పంపేందుకై, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని నిండు మనస్సుతో పిలిచాడు. (రామలక్ష్మణులిద్దరిదీ అవినాభావ సంబంధం కాబట్టే, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని పిలిచాడు అని అనటం జరిగింది). తండ్రి పిలవగానే కులోచితమైన ధర్మకార్యనిర్వహణకు తమను ఉపయోగించ బోతున్నాడు కదాననీ- సాధువర్తనులైన ఋషులను రక్షించేందుకు, వారికి కీడు కలిగించనున్న అధర్మవర్తనులను శిక్షించే సమయం వచ్చింది కదా ననీ-అవతార ప్రయోజనం సమకూరడం ప్రారంభమయిందికదాననీ -మనస్సులో సంతోషం ఉప్పొంగుతుండగా వచ్చిన కొడుకులకు తొలుత తల్లితండ్రులు మంగళా శాసనం కావించారు. (తల్లితండ్రులు దీవించారనడం సమాసంకొరకు కాదు. శ్రేష్ఠత్వాన్ని బట్టి తల్లి ముందు చెప్పబడింది. మహాకార్యార్థమై పంపేటప్పుడు తల్లితండ్రులు దీవించి పంపాలి. అయితే తల్లి దీవనే ప్రధానం). తరువాత పురోహితుడు శుభమైన మాటలతో వారి హితం కోరి-వారికి రాక్షసులవల్ల బాధలుకలుగకుండా మంత్రించారు. దశరథుడు శ్రీరామచంద్రుడిని తన దగ్గరకు పిల్చి, శిరం వాసనచూచి, మీద చేయి వేసి, మహా ప్రీతితో అంతరాత్మ సంతోషిస్తుండగా, బ్రహ్మ సమానుడైన విశ్వామిత్రుడికి రామలక్ష్మణులను అప్పగించాడు.

కౌసల్యా నందనుడైన’ శ్రీరామచంద్రమూర్తి అవతార ప్రయోజనానికి అంకురార్పణ చేయబోతున్నాడు కాబట్టి, దేవతలు శుభశకునాలను ప్రదర్శించారు. (దశరథ నందనుడు అనకుండా-కౌసల్యా నందనుడు అనడానికి కారణముంది. దశరథుడిలాగా కౌసల్య ఎదురు మాట్లాడకుండా, తన కొడుకుకు - చిన్ననాడైనప్పటికీ, ఘనకార్యం చేసే అవకాశం వచ్చిందికదానని సంతోషంతో అనుమతించింది కనుక అలా సంబోధించి వుండవచ్చు). భవిష్యత్ లో ఈయనను ఆశ్రయించి, తన కుమారుడైన హనుమంతుడు ధన్యుడై తనకూ కీర్తికలిగించబోతున్నాడన్న సంతోషంతో వాయుదేవుడు ఆయనకు (రాముడికి) మార్గంలో ఆయాసం కలగకుండా, తనకు చేతనైన విధంగా, సువాసనలతో మెల్లమెల్లగా సుఖం కలిగేటట్లు వీచాడు. ఇక తమకు రాక్షసులవల్ల భయం లేదనీ-జయమేనని, ధైర్యంతో, దేవతలు బహిరంగంగా దుందుభులు మోగించారు. భూజాతలు (వృక్షాలు - భూజాతంటే సీత) తలంబ్రాలు పోయబోతున్నట్లుగా పూలవాన కురిపించాయి. సూర్యకిరణాలు వేడి సోకకుండా సన్న తుంపర వాన కురిసింది. దేవతలు కనబర్చిన శుభశకునాలను చూసిన అయోధ్యాపురవాసులు, బ్రహ్మ కుమారుడు - కౌశికనందనుడైన విశ్వామిత్రుడివెంట శుభంగా శ్రీరామచంద్రుడు వెళుతుంటే, శంఖాలను - నగారాలను సంకులంగా మోగించారు.

ముందు తోవ చూపిస్తూ విశ్వామిత్రుడు పోతుంటే, తన వెనుక లక్ష్మణుడు నడుస్తుంటే, ఎడమచేతితో విల్లు ధరించి - సొమ్ములపై సొమ్ములు పెట్టుకున్న విధంగా ముద్దైన జుట్టు కనిపిస్తుంటే - చూసేవారికి సంతోషం కలిగించే విధంగా భూషణాలు మెరుస్తుంటే - తన ప్రకాశంతో దిక్కులన్నీ వెలుగుతుంటే - పురంలో వున్న స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకాగ్రతతో తననే చూస్తుంటే - కొందరు స్త్రీలు పుష్పాంజలులు చల్లుతుంటే - దిక్కులు పిక్కటిల్లేటట్లు వాద్యాలు మోగుతుంటే - మూడువందల ఏభైమంది తల్లులు వారివారి మేడలమీద నిలబడి కిటికీలనుండి కనబడే వరకూ పరవశలై తొంగి,నిక్కి చూస్తుంటే, శ్రీరామచంద్రమూర్తి వెళ్తున్నాడు. చేతుల్లో విల్లంబులు ధరించి - తలకు ఇరువైపుల రెండు మూపులమీద రెండంబులపొదలు బిగించి - మూడుతలల పాములలాగా కనిపిస్తూ - వేళ్ళకు దెబ్బలు తగులకుండా తిత్తులు తొడుక్కొని - తమదేహకాంతులు పదిదిక్కులవరకూ వ్యాపిస్తుంటే - దేహం నిండా ఆభరణాలు ధరించి - సౌందర్యంలో మన్మధుడిని మించి - నడి కట్టుల్లో ఖడ్గాలనుంచి - బ్రహ్మదేవుడి వెంటపోయే అశ్వినీ దేవతలలాగా, శివుడి వెనుక వెళ్ళే కుమారస్వామిలాగా, శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తోడుకొని పోయాడు.

వేదవ్యాసుడి నాలుగు వేదాలు, పద్దెనిమిది పురాణాలు : వనం జ్వాలా నరసింహారావు

 వేదవ్యాసుడి నాలుగు వేదాలు, పద్దెనిమిది పురాణాలు

వనం జ్వాలా నరసింహారావు

బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను అభ్యసిస్తున్నారు.

కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించాడు. వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వున్న నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.

పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం చాలా పెద్దది. ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని అందుకే బహ్వ్ఋచ సంహిత అనేవారు. దానిని సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. సామవేదాన్ని నేర్చుకున్న జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. క్రమేపీ శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.

త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఆరుగురు వేదాంగవేత్తలు సూతుడి తండ్రి రోమహర్షుడి దగ్గర పురాణాలను నేర్చుకున్నారు. సూతుడు వారి దగ్గర శిష్యరికం చేసి పురాణ సంహిత మొత్తాన్నీ అభ్యసించాడు. కశ్యపుడు, సూతుడు, సావర్ణి, అకృతవ్రణుడు, రోమహర్షుడి దగ్గర మూల సంహితలు నాలుగూ నేర్చుకున్నారు.

పద్దెనిమిది మహాపురాణాలు: బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారద, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, బ్రహ్మాండ, గరుడ పురాణాలు. ఇవి కాకుండా ఉపపురాణాలు కూడా వున్నాయి.

పద్దెనిమిది మహా పురాణాల పరిమాణం వేర్వేరుగా వుంటుంది. బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో కూడి వున్న గ్రంథం. పద్మ పురాణం 55 వేల, విష్ణు పురాణం 23 వేల, శివ పురాణం 24 వేల, శ్రీమద్భాగవత పురాణం 18 వేల, నారద పురాణం 25 వేల, మార్కండేయ పురాణం 9 వేల, అగ్ని పురాణం 15400, భవిష్యోత్తర పురాణం 14500, బ్రహ్మవైవర్త పురాణం 18 వేల, లింగ పురాణం 11 వేల, వరాహ పురాణం 24 వేల, స్కాంద పురాణం 81100, వామన పురాణం 10 వేల, కూర్మ పురాణం 17 వేల, మత్స్య పురాణం 14 వేల, గరుడ పురాణం 19 వేల, బ్రహ్మాండ పురాణం 12 వేల శ్లోకాలు వుంటాయి.

బ్రహ్మ పురాణంలో విశేషముగా పుణ్య క్షేత్రాల గురించి చెప్పబడింది. భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్య తీర్ధముల గురించి చెప్పబడింది. గౌతమీ మాహాత్మ్యములో అనేక నదుల గురించి చెప్పబడింది. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రము గురించి చెప్పబడింది. బ్రహ్మ పురాణం విష్ణుదేవునితో సమానమైనది. బ్రహ్మ పురాణం సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్ధములకు పొందడానికి సర్వ శాస్త్రాలకంటే విశేషము కలది. నక్షత్రముల జన్మము, వివాహము; చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట; దేవ, రాక్షస, మానవ గణములు; వివాహ సమయంలో చేసే ప్రమాణములు; చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము; చంద్రుని క్షయరోగ విముక్తి; మహా పాతకము, పుణ్యములో పాపము; గోవు పుట్టుక; గాయత్రి ఉత్పత్తి ఇందులోని ముఖ్యాంశాలు.

పద్మ పురాణంలో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి వున్నది. ఇందులో సృష్టి నిర్మాణం, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు, వాల్మీకి రామాయణంలోని సీతా రాముల కథ కన్నా భిన్నమైన కథనం, పండగలు, ఎక్కువగా విష్ణువును కీర్తించే, కొంచెం శివుని కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగా, ఆత్మను గురించిన తాత్విక వివరణ, అద్వైతం, మోక్షం లాంటి అంశాలను స్పృశించారు. 

విష్ణు పురాణం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మాలు తెలుసుకునేందుకు వజ్రుడు అర్హుడని భావించి వైష్ణవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది. జంబుద్వీప వర్ణన, భారత వర్షం విశేషాలు ఇందులో వున్నాయి.

శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు. శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు: సృష్టి ప్రశంస అజిత; తరణోపాయము; శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము; శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక; శివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము; అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము; నంది, భృంగుల జన్మ వృత్తాంతము; పరశురామోపాఖ్యానము; కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనము; పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట; పరశురామ కార్తవీర్యుల యుద్ధము; సుచంద్రుని యుద్ధము; పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట; ముక్తి సాధనములు; పిండోత్పత్తి విధానము; బృహస్పత్యోపాఖ్యానము.

లింగ పురాణంలో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది. లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. సృష్టి నిర్మాణ శాస్త్త్రం, ఖగోళ శాస్త్త్రం, భూగోళ శాస్త్త్రం దీనిలో వివరించడం జరిగింది.

గరుడ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.

నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది. నారద పురాణంలో విశేషంగా జ్యోతిఃశాస్త్ర విశేషాలు, మంత్రశాస్త్ర విశేషాలు చెప్పబడ్డాయి. నారద పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని చెబుతారు. ఇందులో ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, నవగ్రహ మంత్రములు, కార్తవీర్య మంత్రం, హయగ్రీవ మంత్రోపాసన, హనుమాన్ మంత్రం సంగ్రహించబడ్డాయి. ఉత్తరభాగంలో వివిధ పుణ్యక్షేత్రాల గూర్చి చెప్పబడింది. కాశి, గయ, ప్రయాగ, పురుషోత్తమక్షేత్ర, పుష్కర క్షేత్రం, గోకర్ణ క్షేత్రం, రామ సేతు, అవంతి తీర్థం, ద్వాదశి, ఏకాదశి వ్రత విధానం గురించి చెప్పబడింది.


భాగవత పురాణం హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు భాగవతంలో పొందుపరచబడినాయి. భగవంతుడి లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము.

అగ్ని పురాణంలో శ్రీమహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది. ఇందులో విష్ణువు అవతారాల గురించి, విశేషించి రామావతార౦, కృష్ణావతారాలగురించి, పృథ్వి గురించి ఉంది. యాగ పూజావిధానాలు, జ్యోతిశ్శాస్త్ర విషయాలు, చరిత్ర, యుద్ధము, సంస్కృత వ్యాకరణము, ఛందస్సు, న్యాయం, వైద్యం, యుద్ధ క్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చోటు చేసుకొన్నాయి.

స్కంద పురాణంలో అరుణాచల మహత్మ్యం; వేంకటాచల మాహాత్మ్యం; కార్తీకమాస మహత్మ్యం; మార్గశీర్ష మాస మహత్మ్యం; భాగవత మహత్మ్యం; వైశాఖమాస మహత్మ్యం; ద్వారక మహత్మ్యం లాంటివి ఇందులో వున్నాయి.

భవిష్య పురాణంలో మొత్తం 5 భాగాలున్నాయి. మొదటి భాగంలో విష్ణువు, శివుడు, సూర్య భగవానుని జననం వర్ణించ బడింది. రెండవ, మూడవ, నాల్గవ భాగాలలో ఆ దేవతల గొప్పతనం వర్ణించ బడింది. ఐదవ భాగంలో స్వర్గలోక వర్ణన ఉంది. భవిష్య మహాపురాణంలో రాబోవు కాలము యొక్క చరిత్ర గురించి వర్ణించ బడింది. ఇందులో బ్రహ్మ పర్వము, మధ్యమ పర్వము, ప్రతిసర్గ పర్వము, ఉత్తర పర్వము అను నాలుగు పర్వములు ఉన్నాయి.

బ్రహ్మవైవర్త పురాణం పరబ్రహ్మ వ్యాప్తము గురించి వివరిస్తుంది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణం అన్నారు. ఈ పురాణం నాలుగు భాగాలుగా విభజింపబడింది. బ్రహ్మ ఖండము-బ్రహ్మాండోత్పత్తి గురించి; సృష్టి గురించి; ప్రకృతి ఖండము-ఆదిశక్తి గురించి; ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి; గణేశ ఖండము-గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము; శ్రీకృష్ణ ఖండము-పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు. ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్యాసమహర్షి వర్ణించాడు.

మార్కండేయ పురాణం శివుడికి, విష్ణువుకూ, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది. ఈ గ్రంథం మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. మన్యంతరాల గురించిన వివరాలు,  దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి), పౌరణిక వంశాల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి.

శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది వామన పురాణం. బ్రహ్మ వామనుని స్తుతించుట, బలి యజ్ఞం మొదలుపెట్టడం, ప్రహ్లాదుడి తీర్ధయాత్ర, బలిచక్రవర్తి ఆదర్శ పాలన, శివకేశవుల అభేధం శివుడే తెలియజేయుట, కుమారస్వామి జననం, దేవసేనాధిపతిగా పట్టాభిషేకం, శివపార్వతుల కల్యాణం, కురుక్షేత్రం, ధరక్షేత్రం, జంబుద్వీపం, భారతవర్షం, ప్రహ్లాద నరనారాయణుల యుద్ధం, మహాకాల రూపం, 12 రాశులవర్ణన మొదలైన అంశాలు వున్నాయిందులో.

వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ పురాణంలో ఉన్నాయి. ప్రియవతోపాఖ్యానం, ధర్మవ్యాధోపాఖ్యానము, శ్రాద్ధ వర్ణనము, శ్రాద్ధ విధి, ద్వాదశివ్రతము, నారాయణార్చన విధానం మొదలైన అంశాలున్నాయి ఇందులో.

మత్స్య పురాణం, అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు. సృష్టిక్రమం, మొదటి సృష్టి, బ్రహ్మాదుల సృష్టి ఇందులో తెల్సుకోవచ్చు.

శ్రీ కూర్మ మహాపురాణం మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం.  ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. కుర్మ అంటే, అత్యంత ఆసక్తికరమైన మతం-నేపథ్యం కలిగిన పురాణాంశం. ఎందుకంటే దీనికి విష్ణు అవతారంలో ఒకదాని పేరు పెట్టబడినప్పటికీ వాస్తవానికి ఇది విష్ణు, శివులకు సంబంధించిన ఇతిహాసాలు, తీర్థ (తీర్థయాత్ర), వేదాంతశాస్త్రాల కలయికను కలిగి ఉంది. ఈ కథలు ఇతర పురాణాలలో కనిపించే కథల మాదిరిగానే ఉంటాయి. ఎక్కువగా శైవ ప్రదేశాల గురించి వివరించబడింది. ఇతర పంచరాత్ర కథలు, విష్ణువు గాథలను ప్రముఖంగా వివరిస్తుంది. అందరికీ శక్తిని అందించే అత్యున్నత శక్తి మూలంగా భావించబడుతూ విష్ణు, శివ, బ్రహ్మాది దేవతలు దేవతలుగా ఉంటారని భావించబడుతుంది.

బ్రహ్మాండ పురాణము ముఖ్యమైన పురాణాలలో ఒకటి. బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంథమని చెబుతారు.యుగములు, వాని ప్రమాణములు; యుగ ధర్మములు; వాలి వృత్తాంతము; శ్రాద్ధక్రియ, విమర్శనదినము; జల స్థల విభాగము; స్వాయంభువు మనువు సంతతి; విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు; వైవస్వత మనువు; ధన్వంతరి కాశీపుర నిర్మాణము మొదలైన అంశాలున్నాయి ఇందులో.

అష్టాదశ పురాణాలలో భాగవత పురాణం శ్రేష్టమైనది. సర్వ పురాణాలలో శ్రేష్టతమమైన భాగవతాన్ని వినేవారు, వినిపించేవారు, చదివేవారు, వ్రాసేవారు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమహా విష్ణువుతో సాయుజ్యం పొందుతారు. ఆసక్తితో ఆదివారం నాడు భాగవత పఠనం గావించిన భక్తుడు సంసార సాగరాన్ని అవలీలగా దాటుతాడు.