నిరంతర సంస్కరణశీలి పీవీ నరసింహారావు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (27-06-2021)
భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి
దాక్షిణాత్యుడు పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక
వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో
అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే
స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు
బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు
ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ
సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా
పేర్కొంటారు.
దివంగత భారత ప్రధాని పివి నరసింహారావు ఒక గొప్ప తత్త్వ
శాస్త్ర వేత్త. తత్త్వశాస్త్ర వేత్తలే సమాజానికి, దేశాలకు
ఉత్తమమైన పాలకులు అని ప్రాచీన గ్రీకు తాత్త్వికుడు ప్లేటో చెప్పాడు. తాత్త్వికుల లక్షణాలన్నీ
పుణికి పుచ్చుకున్న ఏకైక వ్యక్తి పీవీ అనడంలో అతిశయోక్తి లేదేమో! ఒక తత్త్వ వేత్త
అయిన ప్రధానిగా, ఒక ఆర్ధిక
వేత్త అయిన ప్రధానిగా, ఒక సామాజిక వేత్త అయిన ప్రధానిగా, ఒక ఒక
రాజకీయవేత్త అయిన ప్రధానిగా, ఒక భాషావేత్త అయిన ప్రధానిగా, ఒక
అభ్యుదయ వేత్త అయిన ప్రధానిగా, ఒక విద్యావేత్త అయిన ప్రధానిగా,
అన్నింటినీ కలగలపిన ఒక బహుముఖ ప్రజ్ఞాశీలిగా
పీవీ చరిత్ర పుటల్లో నిలిచి పోయారు.
పివి నరసింహారావు రాజనీతిజ్ఞత, ఆర్ధిక
సంస్కరణాభిలాష అత్యద్భుతం. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి ఆర్ధిక
సంక్షోభాన్ని,
అత్యంత
చాకచక్యంగా, దేశానికి
బంగారు బాట వేసి, దిశా నిర్దేశం చేశారు. వాటి ఫలితాలు, ఫలాలు
ఇటీవలి కాలం వరకు మనమంతా అనుభవిస్తూనే ఉన్నాము. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో
మాత్రం ఒక అడుగు వెనక్కే వున్నామనాలి.
పీవీ జీవిత కాలంలో అనేక సందర్భాలలో, ఆయనను, అత్యంత
తక్కువగా అంచనా వేశారు కొందరు మహనీయులు. అయితే కాలక్రమేనా వారంతా తప్పు చేశారని
తదనంతర పరిణామాలు ప్రస్ఫుటం చేశాయి. పీవీ, భారతదేశాన్ని
ఒక ప్రధాన సమాచార సాంకేతిక భాండాగారంగా పరివర్తన చెందడానికి, దేశాన్ని బంగారం తాకట్టు పెట్టాల్సిన
స్థితి నుంచి తప్పించడానికి, దరిమిలా అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఒక సూపర
పవర్ గా తీర్చి దిద్దడానికి కారణభూతుడైన
ధీశాలి అయ్యాడు.
సాహసోపేతమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టి, తన పార్టీలోని
ప్రత్యర్థులను,
ప్రతిపక్షాలలోని
ఉద్దండులను పల్టీలు కొట్టించి, తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీ
ప్రభుత్వంగా మార్చి, ఆయన సమకాలీన
రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత వుందని నిరూపించుకున్నారు.
నెహ్రూ-గాంధీ కుటుంబేతరుడుగా, అసాధ్యాన్ని సుసాధ్యంచేసి, పప్రథమంగా
భారత జాతీయ కాంగ్రెసు ఆధిపత్యాన్ని ఆ కుటుంబం నుండి తప్పించి, అయిదేళ్లు
సుస్థిర పాలనను అందించి, ఆర్థిక-సామాజిక-రాజకీయ సంస్కరణలకు
శ్రీకారం చుట్టి చివరకు ఆ పునాదుల శిధిలాల్లోనే వాటికి రాళ్లు మోసిన
వారి చేతుల్తోనే నెట్టబడ్డారు పీవీ నరసింహారావు.
అయిదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో, శతాబ్దాల
అనుభవాన్ని సంపాదించి పలువురికి పంచి పెట్టిన మేధావి, కాకలు
తీరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా చిరునవ్వు
వీడని ధీశాలి. ఆలోచనల్లో, అమల్లో
విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనాల్సిన వ్యక్తి, అపర
చాణక్యుడుగా అందరూ స్థుతించిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణల
రూపకర్తగా ప్రతిపక్షాల నుండీ ఖండ ఖండాంతర ఆర్థిక నిపుణుల నుండీ మన్ననలనందుకున్న
వ్యక్తి పీవీ నరసింహారావు.
పీవీ నరసింహారావు సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించే
దార్శనికుడని,
స్వార్థపూరిత
ఆలోచనలను ఎప్పుడూ చేయలేదని అందరికీ తెలుసు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రం లో
విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించినప్పుడు, పేదలకు
రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. కేంద్రంలో మానవ
వనరుల మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆలోచనను నవోదయ విద్యాలయాల రూపంలో జాతీయ స్థాయిలో
ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదే. ఇందిరా గాంధీ, రాజీవ్
గాంధీ ప్రధాన మంత్రులుగా ఉన్న రోజుల్లో జాతీయ విద్యా విధానం రూపొందించిన వ్యక్తి విద్యావేత్త పీవీ
నరసింహారావు.
సుమారు ఏబై సంవత్సరాల క్రితం ఆగస్ట్ 30, 1972 న, అప్పటి
ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో నాటి ముఖ్యమంత్రి పీవీ
నరసింహారావు చారిత్రాత్మక భూసంస్కరణల బిల్లును ప్రవేశ పెట్తూ చెప్పిన మాటలు, తదనంతర
అమలు పరిణామాలు అజరామరమైన ఆణిముత్యాలు. నాటి పీవీ శాసనసభ ప్రసంగం, చర్చలో ఆయన
వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆయన అసలు-సిసలైన భూసంస్కరనాభిలాషను
ప్రతిబింబించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఏదైనా ప్రయోజనం చేకూరిందా అని
భూతద్దం పెట్టుకుని వెతుక్కుంటే, బహుశా, తెలంగాణ
ప్రాంతానికి చెందిన పీవీ సీఎంగా వున్నప్పుడు అమలు చేసిన భూసంస్కరణల ద్వారానే అన్న
సమాధానం దొరుకుతుంది. రాష్ట్రంలో సుమారు 97 శాతం
చిన్న-సన్న-మధ్యతరగతి కమతాలుండడం పీవీ చలవే!
చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన
భూసంస్కరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్తూ పీవీ నరసింహారావు చేసిన ప్రసంగం, తదనంతరం
చర్చలో పాల్గొంటూ ఆయన చెప్పిన అనేక విషయాలు, ఆయన
రాజనీతిజ్ఞతకు,
భూమికి
సంబంధించిన,
రాజకీయ-ఆర్ధిక-సామాజిక
స్థితిగతులకు సంబంధించిన, చట్టానికి-సామాజిక న్యాయానికి
సంబంధించిన అనేక అంశాలపై ఆయన కనపరచిన ప్రతిభ ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది. భూసంస్కరణల
పుణ్యమా అనీ,
పీవీ
గారి పుణ్యమా అని, భూస్వాముల భూమి పోవడంతో పాటు, చట్టం అమలు
మొదలైన తరువాత పెద్ద మొత్తంలో వ్యవసాయ భూముల కొనుగోలు, పెద్ద
కమతాలుండే విధానం, క్రమేపీ తగ్గిపోయింది.
రాజకీయాల నుండి దాదాపు విరమణ చేసిన నేపధ్యంలో, పీవీ అడగకుండానే ప్రధాని అయ్యారు. పివి తన
ప్రత్యేక శైలి, మార్క్ తో
దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని పొందారు.
జ్ఞానపీఠ ఆవార్డు గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ రచించిన
“వేయిపడగలు” తెలుగు పుస్తకాన్ని హిందీలోకి “సహస్రఫన్” గా అనువదించారు. ఎడతెగని, క్షణమైనా
తీరికలేని రాజకీయ కార్యకలాపాలు ఉన్నప్పటికీ, అన్ని భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ
క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. పివి 17 భాషలలో
నిష్ణాతులు కావడంతో పాటు ఆర్థికశాస్త్రం, చట్టం, చరిత్ర, రాజకీయాలు, కళలలో కూడా
ప్రావీణ్యం ఉంది.
పీవీ నరసింహారావుది 360 డిగ్రీస్
పర్సనాలిటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంబోత్సవాల సందర్భంగా చెప్పిన విషయం వంద
శాతం నిజం. కేసీఆర్ అన్నట్లు, అంత
అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. బహు ముఖీనమైనటువంటి, అద్భుతమైనటువంటి
వ్యక్తిత్వం పీవీది. ఆయన వ్యక్తిత్వ పటిమ ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ. మనం
వర్ణించడానికి మాటలు చాలవు. గొప్ప సంస్కరణశీలి, నిరంతర
సంస్కరణశీలి ఆయన. సంస్కరణ అభిలాషి లక్ష్యం ఏమిటి అనడానికి నిలువెత్తు రూపం మన
పీవీ. ఎక్కడ ఏ రంగంలో ఆయనను పెట్టినా, ఆ రంగంలో సంస్కరణలు
తేవడమే ఆయన చేసిన పని.
అందుకే పీవీని స్మరించు కోవటం సదా మన కర్తవ్యం, మన నైతిక
బాధ్యత,
మన
కనీస ధర్మం. అత్యున్నత వ్యక్తిత్వం కలిగి ఉండటం పివి సొంతం. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక
వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరనీయం.

No comments:
Post a Comment