Friday, July 30, 2021

Unequivocal empowerment : Vanam Jwala Narasimha Rao

 Unequivocal empowerment

Vanam Jwala Narasimha Rao

Millennium Post, New Delhi (31-07-2021)

Telangana Chief Minister K Chandrashekhar Rao has come up with yet another innovative and revolutionary empowerment policy called the Dalit Bandhu Scheme, which is bound to change the life and financial status of Dalits in Telangana State forever. In the long run it will become a model policy for other states to emulate and who will be left with no alternative except to adopt the same.  In other words, the Dalit Bandhu Scheme, which will be introduced on a pilot basis from Huzurabad Assembly Constituency in Telangana, will herald a sea change in the lives of Dalits and will become torchbearer for Dalits elsewhere in the country.

An old adage says ‘Give a man a fish, and you feed him for a day. Teach a man to fish, and you feed him for a lifetime’. This is what exactly CM KCR is doing. He is giving the DBT cash required for the Dalit families to start a business on their own so that they can become traders, businessmen, service sector operators and make them self-reliant economically and live with dignity and self-respect which will finally free from all sorts of discrimination they are facing till date.

Telangana Dalit Bandhu scheme would help Dalits to define their own development and become partners in the development. The Telangana Dalit Bandhu Scheme has three factors. The first one is monitoring the implementation of the scheme, second is to evaluate the results, the third one is to create a security fund for the beneficiaries with the government’s participation and the beneficiaries.

Dalit Bandhu is not just a mere government’s welfare program but also a massive people’s movement aimed at empowering each Dalit family financially. It can be compared to the Telangana statehood agitation started and led by KCR with an aim to have a separate Telangana State and the aim was achieved.

Dr Ambedkar had shown the path for the Dalit empowerment and their rightful status in the society. CM KCR who studied the subject as part of the Centre for Subaltern Studies understood the problem and found solutions too. He realized that if Dalits are economically empowered, they would be away from any discrimination. He is upset that the Dalits who have the talent and skills are kept away from the productivity sector by keeping them away from the villages in the name of Untouchability. He is also upset that woman are confined to non-productive sector due to gender bias.

Hence CM KCR has carefully and innovatively defined, designed and developed the scheme so that it helps Dalits to immediately come out of their weak economic situation and directly get into earn money legally and in a royal way. In the sectors where there is an ample opportunity to get financially developed such as fertilizer shops, medical shops, rice mills, wine shops etc. the government will provide reservations for Dalits. With Rs 10 lakh per family assistance, the Dalits can establish themselves without any support from the Banks, and other such institutions.

Under the scheme Dalits can set up their choice of business such as power tiller, harvester, Paddy planting machine, Autos, tractors, Poultry, tent house, Diary industry, Oil Mill, grinding mill, cement and bricks business, industry, hotel, Steel, cement and building material shops, photography, videography, Mobile phone shops, Mobile tiffin Centers, Hotels, Cloth emporium, furniture shops etc.

Under Telangana Dalit Bandhu Scheme, Dalit Security Fund is also being set up permanently with the government and beneficiary participation. This Fund will be managed by the District Collectors with a committee of the beneficiaries. Every year a minimum amount will be deposited and it will be continued regularly to further help Dalits to become financially strong and viable.

The scheme envisaged Rs 1200 crore for assisting as many as 11900 families in 119 Assembly segments. It has been planned to allot Rs 1500 to Rs 2000 Crores in addition to Rs 1000 crore made available in the budget to implement the scheme. In the coming four to five years the government envisages to spend around Rs 45000 crore on the schemes’ implementation and to help poor Dalits to achieve financial freedom. If necessary, the government is prepared even to spend up to a lakh crore.

Like the Rythu Bandhu Scheme, beneficiaries of Dalit Bandhu Scheme would get the assistance directly into their bank accounts. For this, Dalit family’s profiles will be prepared. Since issues of Dalits will not be uniform and they differ from rural, semi urban to Urban areas, classification will be done on these categories to implement the Dalit Bandhu Scheme properly.

To track, monitor and supervise implementation of the scheme, CM KCR put the technology to its best use. Identity cards for the Dalit Bandhu beneficiaries will have an electronic chip inserted for every beneficiary. Through a Bar Code, the transactions will be monitored.

Under Huzurabad Constituency, where the scheme is piloted, in Huzurabad Mandal 5323 Dalit families, Kamalapuram Mandal, 4346 families, Veenavankamandal 3678, Jammikunta Mandal 4996 Dalit families, Illanthagunta Mandal 2586 families, in all 20, 929 families under Huzurabad Assembly segment would be scrutinized for selection of the beneficiaries. For the eligible Dalit families according to the guidelines Dalit Bandhu Scheme would be implemented under saturation mode.

The light that emanates with the success of the Scheme in Huzurabad would spread not only in Telangana but countrywide. As CM said, ‘Inspiration should begin somewhere. And Huzurabad is becoming one and people there should feel proud of’. He said rising over the party, ideology and other differences, everyone should work for the success of the Scheme without any fights or differences. If Dalits get victory in Huzurabad and create awareness later all over the State it will follow. If Dalit Bandhu Scheme is successful, the Dalit development will take place. The Huzurabad victory of Dalit Bandhu will be etched permanently in the history of the country. (With VJM Divakar)

Wednesday, July 28, 2021

 Preserving cultural heritage of Telangana

Vanam Jwala Narasimha Rao

The Pioneer (29-07-2021)

The United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) has inscribed the 13th-century Ramappa Temple in Palampet in Telangana State as a World Heritage Site. A consensus was reached in this regard during the ongoing virtual meet of the World Heritage Committee. While Norway opposed the inscription, Russia led an effort to have the temple recognized as a World Heritage Site. A consensus of 17 countries supported the move.

“Excellent! Congratulations to everyone, especially the people of Telangana. The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic temple complex and get a first-hand experience of its grandness,” PM Modi reacted to the announcement on Twitter.

Chief Minister Telangana K Chandrashekhar Rao hailed the decision of UNESCO. The Spiritual and cultural property developed by the Kakatiya Kings with a tremendous creativity, sculptural value has a very special place in the country’s cultural heritage said the CM. He said the state government is making all efforts to revive and restore the historical, Spiritual and proud cultural heritage of Telangana. The CM thanked UNESCO member Nations, Central Government for its support.

Being recognized as UNESCO’s World Heritage Site has many benefits. It brings international attention to the need for the preservation and conservation of the site. It brings tourism to the site, with its accompanying economic benefits to the host country and local area. It provides funds for restoration, preservation, and training. It promotes national and local pride in the natural and man-made wonders of the country. It promotes close ties with the United Nations system and the prestige and support it provides. It provides access to global project management resources. It facilitates creating partnerships between government, the private sector, and the NGOs to achieve conservation goals. The site is protected under the Geneva Convention against destruction or misuse during wartime.

Ramappa Temple is about forty kilometers from Warangal, the old capital city of Kakatiya kings, who ruled this area for about two hundred years until they were thrown out by the Delhi armies in 1332 AD. The Kakatiyas were the vassals of the Kannada Emperors. They established an integrated Andhra Empire, which was a supreme event in the history of the Telugus. It was during that period; the temple architecture was developed into an excellent art. Music and the art of dance acquired a new grace and a fresh elegance. The Vedas and Sastras gained popularity.

Warangal has the ruins of the old fort and the thousand pillar temple continue to be great attractions for tourists and lovers of art and culture. Ganapathi deva, one of the Kakatiya rulers of the thirteenth century after his accession, shifted the capital from Hanamkonda to Orugallu or the present Warangal. Even now both Warangal and Hanamkonda look like an inseparable twin city and a long road connects them. A temple and a tank were built about forty kilometers away from Warangal to commemorate the victory of Ganapathi deva in the Kalinga wars and the king dedicated the temple-tank complex to Ramappa or Lord Shiva. The spot is both utilitarian and aesthetic. It continues to irrigate thousands of acres of land even today.

No lime or mortar was used to assemble this vast mass of skillfully sculptured granite into a charming shrine. Granite pieces, well-shaped and sculptured, were just fitted into each other to make a perfect assemblage of a temple and its appurtenances. One of the subordinate shrines housing a huge Nandi, exuberantly sculptured, is almost crumbled and the Archeological Survey of India made efforts trying to repair it.

The temple which is a complete gallery of beautiful sculptures, most of them representing various scenes from the scriptures and some of them strikingly attractive for the various dance postures, they so skillfully portray, has been showing signs of crumbling for quite some time. Archeologists believe that the dilapidation was set in by a series of earthquakes in the past because no vandal could have gone all the way to the temple site to destroy it. The bricks with which the upper portion of the sanctum sanctorum was built had gripped the fancy of the tourists for a long time because they unlike the normal ones float on water. Archeologists were at their wits end when they wanted to replace the bricks suitably! How to make such floating bricks was the question before them.

It is necessary to have the tower built with light bricks because the temple has no foundations. It was built on huge oblong granite planks. That is how most of the Kakatiya structures were raised. The bricks were sent for chemical and X-Ray examination but tests did not throw any light on the compositions and make of the bricks. So, the Archeological Survey of India officials went in for chemical bricks which have a similar specific gravity so that the structure would when rebuilt, is of the same weight as that done with the floating bricks. There is no evidence with regards to the completion of this brick structure.

The temple walls were decorated with festoons or rows of decorated elephants may be because Jayapa Senani, the commander of the elephant forces of the Kakatiyas was also associated with the military victory whose monument the temple has been. Jayapa also wrote a lucid treatise on Bharatanatyam known as ‘Nruttaratnavali’. Jaya described in it vividly the principles of ‘Perini Dance’. Kakatiyas must have encouraged the Perini Dance both to satisfy their attachment to Shaivism and to impart vigor to their young men and women through this part religious mode of dancing.

It must however be agreed that Ramappa Temple, nowhere had heightened the importance of Perini dance. But, the bracket figures in the temple are really arresting due mainly to their impressionistic shapes and vigor and vitality. These figures of women dancers are perfect examples of charm and delicacy. May be there were such women among the tribe to which the Kakatiya ruler belonged. According to an inscription the king belonged to the Pulinda Tribe. The bracket figurines of dancers in the Ramappa Temple give scope to the belief that there must have been a Telangana idiom of dance and music when the Kakatiyas were ruling.

According to late G. Krishna, an all-time Great Journalist and an exponent of Telugu Culture, who wrote number of books and articles on the subject, ‘’History records that one Virabhallata, a versatile scholar was in the Kakatiya Court. When the Delhi armies had overrun the Kakatiya kingdom, the scholars migrated to the south to save themselves and also the tradition they mastered. Srungara Sekhara, the disciple of Virabhallata, was one among those migrated. He wrote a treatise in Sanskrit known as ‘Abhinaya Lakshanam’ which is suspected to contain some aspects of Dances. It is not yet published and is a manuscript in Saraswathi Mahal Library of Tanjavore”.

The question now being asked is will these festivals like the Kakatiya, remain as mere rituals or will they make a beginning to preserve the structures of the Warangal Fort, the thousand Pillar Temple, the shrine of Ramappa and the lakes of Pakala for the benefit of generations?  (With VJM Divakar)

Sunday, July 25, 2021

తాటకను శపించిన అగస్త్యుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-66 : వనం జ్వాలా నరసింహారావు

 తాటకను శపించిన అగస్త్యుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-66

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-07-2021)

లోకంలో యక్షులు దుర్బలులు అన్న పేరుందని, అలాంటప్పుడు ఒక యక్ష స్త్రీకి ఎట్లా వేయేనుగుల బలం కలిగిందని సంశయం వెలిబుచ్చాడు రాముడు. జవాబుగా: " పూర్వకాలంలో సదాచార సంపన్నుడైన సుకేతుడు అనే గొప్ప యక్షుడుండేవాడు. వాడికి సంతానం లేక పోవడంతో, బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు. సంతోషించిన బ్రహ్మ, వాడికి కొడుకును ఇవ్వకుండా, వేయేనుగుల బలంగల కూతురును ఇచ్చాడు. అది రూప యౌవనాలు కలిగినప్పుడు, సుకేతుడు, ఝర్ఝుని కొడుకైన సుందుడు కిచ్చి వివాహం చేశాడు. వారికి మారీచుడు అనే క్రూరుడైన కొడుకు పుట్టాడు. సుందుడు అగస్త్యుడి వల్ల మరణించాడు. మొగుడిని చంపిన అగస్త్యుడి మీద పగపట్టిన తాటక, కొడుకు మారీచుడు తో కలిసి, దిక్కులు పిక్కటిల్లే విధంగా అరుస్తూ, అతడిని చంపబోయింది. కోపగించిన అగస్త్యుడు, మారీచుడిని రాక్షసుడుగా కమ్మని, తాటకకు సుందర రూపం పోయి భయంకర రూపం కలగాలని - మనుష్యులను తింటూ, వికార ముఖంతో సంచరించమని శపిస్తాడు. శాపగ్రస్తురాలైన తాటక రాక్షస రూపంలో, అగస్త్యుడు సంచరించిన ప్రదేశంలోని మనుష్యులను తింటూ - వూళ్లకు వూళ్లనే పాడుచేసింది" అని వివరణ ఇచ్చి, గో బ్రాహ్మణులకు మేలు కలిగే విధంగా, దయను విడిచి, తాటకను చంపి, కీర్తిమంతుడవు కమ్మని రాముడితో అంటాడు విశ్వామిత్రుడు.

తాటకను చంపమని రాముడికి బోధించిన విశ్వామిత్రుడు

"తాటక మిక్కిలి బలశాలి. శాపం వల్ల క్రూరురాలైంది. అలాంటి దాన్ని నువ్వు తప్ప మరే మగవాడు-ఎంతటి వాడైనా-ఏ లోకం వాడైనా, చంపడానికి పూనుకోడు. నిలిచి యుద్ధం చేయనే చేయడు. దయా గుణంతో, ఇతర సందర్భాలు ఆలోచిస్తూ, స్త్రీ ని చంపితే పాపం వస్తుందని భావించ వద్దు. ఇలాంటి ఆలోచన రాజకుమారులు చేయకూడదు. సర్వకాల సర్వావస్థలలో నరపాల కుమారుడు, నాలుగు వర్ణాల వారిని రక్షించాల్సిన ధర్మముంది. ’రాజ కుమారుడు కాగానే, ధర్మంతో, ప్రజలను రక్షించాలి గాని, అధర్మంగా ప్రవర్తించవచ్చా?’ అని నువ్వడగవచ్చు. భూమిని పాలించేవారు, ప్రజలను రక్షించేందుకు, క్రూరమైనా-కాకున్నా, పాపం వచ్చినా-పుణ్యం వచ్చినా, తనపై నింద పడ్డా, ఏ పనైనా చేయాల్సిందే. ఎందుకంటే, తాను చెడిపోయినా, లోకంలోని అనేకమందిని కాపాడాలి. తన క్షేమం మాత్రమే చూసుకుంటే-చూసుకుని వూరుకుంటే, లోకం చెడిపోయి పాపం కలగొచ్చు. అందరు చేసిన అన్ని పాపాలవలన తాను చెడడం మంచిదా? తానొక్కడే ఒక్క పనిచేసి చెడిపోవడం మంచిదా?. అసత్యం తో సత్యం, అధర్మం తో ధర్మం చెడిపోయే సమయం వచ్చినప్పుడు, దానిని చక్కదిద్దే సామర్థ్యం వున్నవాడు, ఉపేక్షించి వూరుకుంటే, ఆ పాపం వాడికి తగులుతుంది. ఎందరో మనుష్యులు, ఆవులు తాటక మూలాన ప్రాణాలు కోల్పోతుంటే, నువ్వు వాళ్లను రక్షించే శక్తి వుండికూడా, మౌనంగా వూరుకుంటే, గో - బ్రాహ్మణ హత్యా దోషం నీకు కలుగుతుంది”.

స్త్రీ వధ అధర్మమంటే, నిష్కారణంగా- అధర్మంగా, ఇంత మందిని ఈ క్రూరురాలు చంపుతుంటే, రక్షించే శక్తి వుండికూడా, సహించి వూరుకోవడం ధర్మమా? అలా వూరుకుంటే, క్రమక్రమంగా దుష్టులు ప్రబలిపోతారు. శిష్టులు హతమై పోతారు. ఇదేనా ప్రజా రక్షణంటే? ఇదేనా ధర్మ సంస్థాపన? అధర్మాన్ని ధర్మమే జయించాలి గాని, అధర్మంతో జయించాలనుకుంటే, ఇరువురికీ తేడా లేదుకదా! ఒకడెక్కువ-మరొకరు తక్కువ అనడానికి వీల్లేదు. ఇరువురు అధర్మ వర్తనులే! అధర్మాన్ని ధర్మంతో జయించాలని అనుకున్నప్పుడే, అది ఉత్తమమైన మార్గమవుతుంది. అదే కనుక సాధ్యం కాకపోతే, అధర్మ వర్తనులను, అధర్మ మార్గంలోనే జయిస్తే, వారి అధర్మమే వారిని చంపినట్లవుతుంది. దీనివలన, అధర్మవర్తనుడు ధర్మంతోనైనా-అధర్మంతోనైనా చెడిపోతాడని భావమొస్తుంది. కాబట్టి, క్రూరులను క్రూరంగానూ-కుటిలులను కుటిలత తోనూ-అధర్మ వర్తనులను అధర్మంగానే, లోక హితం కోరి అణచడం తప్పుకాదు. నువ్వు రాజకుమారుడవు కనుక ప్రజలను రంజింపచేయాలి. ప్రజలు నిష్కారణంగా చస్తుంటే చూసేవాడు రాజు కాడు. నువ్వు అధర్మ కార్యం చేయాలని నేను చెప్పుతున్నానని అనుకోవద్దు. నేనూ కొన్నాళ్లు రాజ్యం ఏలిన వాడినే-ప్రజలను పాలించినివాడినే. నాకందుకే, శాస్త్రం చదవడం వల్ల-అనుభవం వల్ల, రాజ ధర్మం తెలుసు. నేనింతవరకు చెప్పింది రాజ్యభారం వహించే రాజపుత్రులకందరికీ వర్తించే సనాతనమైన ధర్మం. కాబట్టి దానికి విరోధంగా ప్రవర్తించకూడదు. తాటకకు సమయోచితమైన నీతి అంటే అధర్మమే-ధర్మం అంటే తెలియదు-అధర్మం అంటే ప్రీతి. కాబట్టి దాన్ని చంపు. రామచంద్రా!  నీకు నేను చెప్పిన విషయాలకు పూర్వ దృష్టాంతాలున్నాయి. విరోచనుడి కూతురు మంథర భూమిని చంపే ప్రయత్నం చేస్తుంటే వజ్రధారతో ఇంద్రుడు దానిని చంపలేదా? లోకంలో ఇంద్రుడుండకుండా పోవాలని సంకల్పించిన భృగు మహర్షి భార్యను-శుక్రుడి తల్లిని విష్ణువు తన చక్ర ధారతో చంపలేదా? వీళ్లిదరే కాదు-అధర్మ ప్రవర్తన గల స్త్రీలను చంపిన రాజులెందరో వున్నారింకా. కాబట్టి నువ్వింక ఆలోచించాల్సిన పనిలేదు. నేను చెప్పినట్లే తాటకను చంప" మని విశ్వామిత్రుడు రాముడికి పలు విధాలుగా బోధిస్తాడు.

Saturday, July 24, 2021

వేదవ్యాసుడు చెప్పిన వ్రీహిద్రోణాఖ్యానం, ముద్గల మహర్షి వృత్తాంతం ..... ఆస్వాదన-30 : వనం జ్వాలా నరసింహారావు

 వేదవ్యాసుడు చెప్పిన వ్రీహిద్రోణాఖ్యానం, ముద్గల మహర్షి వృత్తాంతం

ఆస్వాదన-30

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (25-07-2021)

దుర్యోధనుడు వైష్ణవ యాగం చేయడం పూర్తిచేసిన తరువాత, తాను దేవేంద్రుడి కొడుకైన ఆర్జునుడిని సంహరిస్తానని, అంతదాకా తన కాళ్లగోళ్లు కడుక్కోనని శపథం చేశాడు కర్ణుడు. తనకు కర్ణుడి సహాయం ఉన్నంతవరకు పాండవులను జయించడం ఏమంత కష్టమైన కార్యం కాదని దుర్యోధనుడు అంటాడు. ఈ విషయాలను తెలుసుకున్న ధర్మరాజు, కర్ణుడి సహజ కవచ కుండలాలను, అభేద్య కవచాన్ని, అతడి పరాక్రమాన్ని స్మరించి కలతచెందాడు.

ఇదిలా వుండగా ఒకనాడు ధర్మరాజు నిద్రిస్తుండగా అతడికి స్వప్నంలో అడవి జంతువులు కనిపించి, తమను వేటాడడం ఆపి, వేరే ప్రదేశానికి పొమ్మని వేడుకున్నాయి. ధర్మరాజు అలాగే అని వాటికి అభయమిచ్చాడు. తాము ద్వైతవనానికి వచ్చి 20 నెలలు గడిచాయని, అక్కడి నుండి వేరేచోటుకు పోదామని తమ్ములకు చెప్పాడు. కామ్యకవనానికి పోయి అక్కడ తృణబిందు మహర్షి ఆశ్రమంలో వుండడం మంచిదని నిర్ణయించుకున్నారు. అంతా బయల్దేరి కామ్యకవనానికి వెళ్లారు.

కామ్యకవనానికి ఒకనాడు వేదవ్యాస మహర్షి వచ్చాడు. మాటల మధ్యలో దానం, ధర్మం, తపస్సు, త్యాగం లాంటి విషయాల ప్రస్తావన వచ్చింది. అలాగే ముద్గలుడు అనే బ్రాహ్మణుడి ప్రస్తావన, అతడు కైవల్యాన్ని పొందిన విషయం, వ్రీహిద్రోణాఖ్యానం, వ్యాసమహర్షి చెప్పాడు. ఆ వివరాలను పూర్తిగా వినిపించమని కోరాడు ధర్మరాజు.

ముద్గలుడు మహానుభావుడు. తన గృహానికి వచ్చేవారినందరినీ ఆదరించేవాడు. అతిథులను, అభ్యాగతులను సేవించేవాడు. నిత్య సత్యవచనుడు. వైరాగ్యం కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు. భార్యాపుత్రులతో కురుక్షేత్రంలో నివసిస్తూ, పొలాలలో రాలిన ధాన్యాన్ని ఏరుకోవడం (ఉంఛవృత్తి) జీవనోపాధిగా ఎంచుకుని బతుకుతూ, నెలకు పదిహేను రోజులు నిరాహార దీక్షతో వుండేవాడు. పాడ్యమి నుండి చతుర్దశి వరకు వడ్లగింజలను ఏరి, ఒక్కొక్క వరిగింజ చొప్పున తూమెడు (నాలుగు కుంచాలు) ధాన్యం పోగు చేసేవారు. ఆ పద్నాలుగు రోజులు ఉపవాసం వుండేవారు. మర్నాడు, అంటే, అమావాస్యనాడు లేదా పౌర్ణమి నాడు వంట చేయించేవాడు. అలా వండిన అన్నంలో పితృ దేవతలకు నివేదనం చేసి, అతిథులకు పెట్టి, మిగిలినదానిని ఆయన, భార్యా పిల్లలు తినేవారు. ఈ విధంగా శరీర ధారణ కొరకు మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ, పక్షోపవాస వ్రతాన్ని నిర్వహించేవారు.

ఇలా వుండగా ఒకనాడు ముద్గలుడి దగ్గరికి పిచ్చివాడి ఆకారంలో, అనాగరికుడికా కనిపిస్తూ, దుర్వాసుడు వచ్చాడు. వచ్చి నోటికి ఇష్టమైన రీతిలో మాట్లాడ సాగాడు. అతడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు ముద్గలుడు. అతిథి సత్కారం నిర్వహించాడు. తరువాత దుర్వాసుడికి భోజనం పెట్టాడు. దుర్వాసుడు ఆ అన్నాన్ని తిని, మిగిలిన అన్నాన్ని తన శరీరం నిండా పూసుకుని, తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులనాడు రావడం కొనసాగించాడు. ముద్గల మహర్షి తాను నిరాహారుడైనప్పటికీ, దుర్వాసుడికి అతిథి మర్యాదలలో ఏలోపం రాకుండా చూశాడు. ఇలా ఆరు పర్వదినాలు దుర్వాసుడు వచ్చి ముద్గలుడిని పరీక్షించాడు. అతడిలో ఏలోపం కనిపించలేక పోవడంతో దుర్వాసుడు ఆశ్చర్యం చెందాడు.

ముద్గలుడి లాంటి దానశీలుడిని తాను ఈ పృథివిలో ఎక్కడా చూడలేదని అన్నాడు దుర్వాసుడు. ఆయన గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేనన్నాడు. ముద్గలుడు మహానుభావుడనీ, అన్నదానం చేయడంలో ఆయన నిష్ఠ సాటిలేనిదనీ, ఆయన మనస్సు పవిత్రమైనదనీ, అతిథి పూజను స్వచ్చమైన భక్తితో నిర్వహించాడనీ, ఆయన్ను ఎంతని పొగడాలనీ అన్నాడు దుర్వాసుడు. ముద్గల మహాముని వల్ల తాను మిక్కిలి సంతోషం చెందానని, గొప్ప కీర్తితో స్వర్గానికి మానవ శరీరంతోనే వెళ్లగలడని చెప్పాడు. ఇలా చెప్పి దుర్వాసుడు వెళ్లిపోయాడు.

ఆ తరువాత దేవదూతలు ముద్గలుడి దగ్గరకు కోరిన చోటుకు పోగల దివ్య విమానం తెచ్చారు. మహానుభావుడైన ముద్గలముని చేసిన పుణ్య కర్మల వల్ల స్వర్గలోకం సిద్ధించిందని, అక్కడికి రమ్మని, విమానం ఎక్కమని చెప్పారు వారు. స్వర్గలోకం ఎలా వుంటుందో తెలుసుకోవాలని వుందని, దానిని గురించి వివరించమని, అక్కడి మంచి-చెడులను గురించి చెప్పమని అడిగాడు ముద్గలుడు దేవదూతలను. జవాబుగా దేవదూత ఇలా చెప్పాడు.

‘స్వర్గలోకం భూలోకానికి పైన వుంటుంది. నిత్యం ప్రకాశిస్తూ వుంటుంది. దేవతలు నడయాడే స్థలం స్వర్గలోకం. తపస్సులో సిద్ధిపొందిన మహర్షులు, గొప్ప యజ్ఞాలను చేసినవారు, సత్యం పాటించి కృతకృత్యులైనవారు, దానధర్మాలు చేసినవారు, యుద్ధాలలో గొప్ప పరాక్రమం ప్రదర్శించినవారు స్వర్గలోకంలో సంతోషాన్ని అనుభవిస్తూ వుంటారు. అక్కడ అప్సరసలు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు నివసిస్తూ వుంటారు. స్వర్గలోకంలో 33 వేల ఆమడల వైశాల్యం కల మేరు పర్వత శిఖరం వున్నది. ఇక్కడ దాహం కాని, వేడికాని, చలికాని, ముసలితనం కాని, వ్యాధులు కాని కలగవు. స్వర్గలోకంలో ఉన్నవారికి ఎలాంటి దుఃఖాలు కలగవు. అలసట వుండదు. నిరంతర సౌఖ్యాలు అనుభవిస్తారు.

స్వర్గలోకం పైన బ్రహ్మలోకం వున్నది. మానవుడు తాను చేసిన పుణ్యాన్ని అనుభవించిన తరువాత స్వర్గలోకంలో వుండడానికి వీల్లేదు. అతడిని తిరిగి భూలోకంలో పడవేస్తారు. పుణ్యం క్షీణించిన తరువాత స్వర్గ లోకం నుండి తోసివేయబడిన వాడే తిరిగి భూలోకంలో సౌఖ్యాలను అనుభవించే స్వభావం కలవాడిగా జన్మిస్తాడు. భూలోకం ‘కర్మభూమి’. భూలోకంలో చేసిన కర్మవల్ల పుణ్యపాపాలు కలుగుతాయి.

ఇదంతా చెప్పిన దేవదూత, ముద్గలుడి మీద వున్న అభిమానం కొద్దీ ఈ విషయాలను చెప్పానని, ఆలస్యం చేయకుండా స్వర్గలోకానికి రమ్మని అన్నాడు. ముద్గలుడు కొంచెంసేపు ఆలోచించాడు. ఎక్కడికి చేరితే జీవుడు శాశ్వతంగా భూలోకానికి రాకుండా వుండగలడో, అలాంటి గొప్ప స్థాయికి చేరడానికి తాను చిత్తశుద్ధితో, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని అన్నాడు ముద్గలుడు. అలా చెప్పి స్వర్గానికి రానని అంటూ, దేవదూతను పంపించి వేశాడు. ఆ తరువాత ముద్గలుడు ఉంఛవృత్తిని విడిచి గొప్ప జ్ఞానయోగి, జీవన్ముక్తుడు అయ్యాడు.                  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

PV Narasimha Rao, Architect of India’s Reforms ..... A Book Review by Vanam Jwala Narasimha Rao

 PV Narasimha Rao, Architect of India’s Reforms

A Book Review by Vanam Jwala Narasimha Rao

Sunday Pioneer (25-07-2021)

On the occasion of Late Prime Minister PV Narasimha Rao centenary celebrations, the Government of Telangana (PVN Rao Centenary Celebrations Committee, Department of Language and Culture and Telangana Sahitya Academy) has brought out a pictorial (Coffee Table Book) book titled “PV Narasimha Rao, Architect of India’s Reforms” edited by Sanjaya Baru. This book consists of number of photos along with writings penned by national and world leaders. As mentioned in the book in its opening pages “the photos in the volume that speak a thousand words each, along with writings penned by national and world leaders, conjure up golden memories and silver tears of the transformation, guided most democratically by a man whose ‘silence and indecisions’ marked the glorious history and fructified into myriad deeds”.

The book starts with a foreword by Chief Minister Telangana K Chandrashekhar Rao followed by introduction by Editor and former Media Advisor to Prime Minister Sanjaya Baru. President of India Ram Nath Kovind, Vice-President of India M Venkaiah Naidu, Prime Minister of India Narendra Modi and former Prime Minister of India Dr Manmohan Singh sent their messages. Former Prime Minister of Malaysia Dr Mahathir Bin Mohammad, former Prime Minister of UK Sir John Major, former Prime Minister of Singapore Goh Chok Tong and former US Ambassador to India during 1994-97 Frank Wisner sent their tributes.

There are in all 17 essays from highly acclaimed personalities who included among others former Prime Minister Dr Manmohan Singh, former foreign secretary Salman Haidar, union minister Hardeep Suri, former deputy chairman planning commission Montek Sing Ahluwalia, Rajya Sabha Member Subramanian Swamy, former personal secretary to PV Ramu Damodaran, PV’s son Prabhakar Rao, founder and Chairman Emeritus of Infosys NR Narayana Murthy etc. Dr K Keshava Rao Rajya Sabha Member and Chairman PV Narasimha Rao Centenary Celebrations Committee wrote the Epilogue.

In his introduction Telangana CM KCR described PV as a true statesman, scholar, freedom fighter and a leader committed to selflessly serve the country. He said that PV’s tenure as PM will be remembered as a turning point in the economic history of India. KCR also recalled PV’s contribution to other areas of administration such as education, HRD, defense, international relations, rural development, science and technology, arts, culture and literature. KCR specifically mentioned about PV ushering in land reforms to transfer the land to the tiller.

Former Media Advisor to Prime Minister of India Sanjaya Baru in his introduction (Man of the Moment) wrote that the book edited by him contains collection of essays and tributes by an array of distinguished contemporaries of PV. The specialist scholars recall not just PV’s leadership but also the many sidelines of his complex personality write Sanjaya Baru. He described PV as one of the most accomplished Prime Ministers that India has ever had. Sanjaya Baru concluded by saying that PV laid the foundation of India’s economic rise and India’s emergence as a nuclear power, and in doing so, set the country on a new path. He was, without doubt, a Bharat Ratna.

In his Message the President of India Ram Nath Kovind described PV as ‘his contribution to the nation will always be remembered not merely for India’s path breaking economic reforms as father of India’s economic liberalization but also for taking other transformative decisions in the country’s foreign policy. Vice-President M Venkaiah Naidu in his message described PV as a visionary leader, multi-faceted personality with varied interests as Lawyer, scholar, writer, linguist and astute administrator.

Prime Minister Narendra Modi in his message mentioned that under PV’s able guidance as PM various measures were implemented that helped pull the nation out of the economic morass. Describing PV as a statesman and visionary Modi said that his tenure as PM provided the country with political and economic stability at a time when the nation was at a crossroads.

Former PM Malaysia Dr Mahathir Bin Mohammad in his message remembered the role played by PV as PM in the realignment of countries in the post cold war period. For John Major former PM of UK PV was one of his favorite leaders. In his tribute Major said that, as PM, PV not only embarked upon a successful market driven transformation of Indian economy but shared with him a wish to improve British-India relations.

Former PM Singapore Goh Chok Tong in his tribute wrote that he and Singapore remember PV as the leader who successfully opened India to the world. He said he was fortunate to have worked with PV closely to deepen India’s engagement with Singapore and the Association of South East Nations.

Frank G Wisner former Ambassador to India in his tribute said that he believed PV’s role in forging modern India’s economic and political future was consequential. As an American said Wisner, that, he is grateful for the role PV played in making it possible for India and USA to overcome the legacy of the past and set a new direction.   

In his essay titled ‘The Father of Economic Reforms’ former PM, Dr Manmohan Singh recalled his association with PV. He described PV as a person who left behind an unmatched legacy of being a linguist well versed with 10 Indian Languages and 4 foreign Languages and a scholar. PV was the first converts of new technology by not only becoming adept at using computer, but also proficient with programming mentioned Dr Manmohan Singh.

As mentioned by Sanjay Baru in his introduction, NR Narayana Murthy and GM Rao discussed in their essays PV’s historic initiative to dismantle India’s License-Permit-Control Raj and to liberalize industrial policy and to facilitate the rise of a knowledge-based economy.

PV’s leadership of India’s National Security, defense and nuclear policy and his contribution to declaring India a nuclear weapons power was outlined by Dr VS Arunachalam, NN Vohra and C Uday Bhaskar experts in defense matters.

Salman Haidar described PV as the Architect of the ‘Look East Policy’. Hardeep S Puri said PV was a Reluctant Reformer and Unacknowledged Hero. Montek Singh Ahluwalia detailed about PV’s reforms of 1991. Subramanian Swamy mentioned that PV was venerated Scholar-politician. Former Personal Secretary to PV Ramu Damodaran, now a senior functionary of UNO in a very personal note and fine tributes offered a glimpse of the Late Prime Minister whom he served.

PV’s scholarship, especially his contribution to Telugu language was brought by Velcheru Narayana Rao. Prakala Prabhakar discussed about PV’s engagement with education. A unique glimpse into PV’s style of functioning is offered by political scientist James Manor. C Raja Mohan wrote about Foreign Policy for the second Republic. Senior Journalist K Ramachandra Murthy described PV as a pragmatic politician and a man of letters. In his epilogue Dr K Keshava Rao Shared golden memories and silver tears.

At the end of the Book a bio-sketch of PV Narasimha Rao was given.

Coffee Table Book Editor Sanjaya Baru, Chairman Centenary Celebrations Committee Dr K Keshav Rao, Director Department of Language and Culture Mamidi Hari Krishna and Government of Telangana and CM KCR deserve full complements for bringing out such a great book which will be a reference book for generations to come.

Friday, July 23, 2021

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రినా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రినా?

వనం జ్వాలా నరసింహారావు

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు పురాణాల, ఇతిహాసాల ఆధారంగా, భౌగోళిక ప్రామాణికంగా సోదాహరణంగా నిరూపించే ప్రయత్నం చేయడం హర్షించాల్సిన విషయం. కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారు (వాసుదాసుగారు) వాల్మీకి రామాయణాన్ని యథా వాల్మీకంగా తెనిగిస్తూ మందరం అనే పేరుతొ గొప్ప వ్యాఖ్యానం వ్రాసారు. ఆ వ్యాఖ్యానంలో అంజనాపర్వతం గురించిన ప్రస్తావన కిష్కింధకాండ కాండలో వున్నది. అలాగే హనుమంతుడి జన్మ వృత్తాంతం గురించిన ప్రస్తావన అదే కాండలోను, సుందర కాండలోను వుంది. హనుంతుడు రామాయణంలో మొట్టమొదటిసారిగా సగం కథ అయిపోయిన తరువాత కిష్కింధకాండలో దర్శనం ఇస్తాడు. ఇక ఆ తరువాత సుందరకాండ మొత్తం హనుమత్కాండే అనాలి! కిష్కింధకాండ, యుద్ధ కాండలలో దాదాపు ఆయనే కథానాయకుడు.    

రాముడు, లక్ష్మణుడు ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, సుగ్రీవుడు చూసి భయంతో వీరిని వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. ఎటు పరుగెత్తాల్నా అని ఆలోచించసాగాడు. ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి "వానర రాజా! ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్యమూకం కదా! ఇక్కడ వాలివల్ల భయం లేదుకదా? ఒకవేళ భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందుకు తొట్రుపాటు పడుతున్నావు?” అని అడిగాడు. తన భయానికి కారణం చెప్పాడు సుగ్రీవుడు.

"ఆంజనేయా!నువ్వు పో. మాటలవల్ల, ఆకారాల వల్ల, పలురకాలైన ముఖకవళికల వల్ల, వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో, వారి మనస్సు శుద్ధమైందా? వంచనతో కూడిందా? ఇది వున్నది వున్నట్లుగా తెలుసుకో” అని ఆంజనేయుడికి చెప్పాడు సుగ్రీవుడు. హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి, వారిదగ్గరికి పోయి ఏకాగ్రచిత్తంతో, వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు. సుమనోజ్ఞంగా, సౌమ్యంగా, వంచనలేని మాటలు చెప్పి, రాజకుమారులను తృప్తికావించి, సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో.

“మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు. దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. తమ వివరాలు చెప్పారు.  

ఆ తరువాత ఆంజనేయుడు తన సన్న్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. ఇద్దరినీ భుజాలమీద ఎక్కించుకుని, తాను వచ్చిన సుగ్రీవుడి కార్యం నెరవేరిందికదా అనుకుని, సంతోషంగా, నిర్మలమైన మనస్సుతో మహావేగంగా తీసుకునిపోయి, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు. సుగ్రీవుడు తనకు రామచంద్రుడి వల్ల కలిగిన భయాన్ని వదిలి సంతోషంగా మనుష్య రూపాన్ని ధరించి త్వరత్వరగా వారి దగ్గరికి వచ్చాడు. వారిని సమీపించి, అనురాగంగా పూజించి, రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు.

         “రామా! నువ్వు నాతో స్నేహం చేస్తే, రాముడి స్నేహితుడు సుగ్రీవుడు అని గౌరవ లాభం నాకే కాని, నావల్ల నీకు గౌరవలాభాలు కలగవు. ఆ కారణాన నేనే ధన్యుడిని. నా జన్మే సార్థకం”. సుగ్రీవుడు తనకు అన్న వాలి చేసిన అపకారాన్ని గురించి చెప్పాడు.  వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు. సుగ్రీవుడితో వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు రాముడు.

“రామచంద్రా! నీకు నీ భార్యను ఎడబాయడం వల్ల కలిగిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను. నువ్వు బాధపడవద్దు. పతివ్రతైన సీతాదేవిని నీచుడైన రావణుడు ఏ ప్రదేశంలో దాచినప్పటికీ, నేను తెస్తాను. సీతాదేవి పాతాళంలో వున్నా సరే, ఆకాశాన వున్నా సరే, రామచంద్రా! ఆమెను నేను తేగలను. నువ్వు బాధపడవద్దు”.

వాలి, సుగ్రీవుల ద్వంద్వ యుద్ధంలో శ్రీరాముడు, వాలిని చంపగల భయంకర బాణాన్ని తీసి వాలికి గురిచూసి వదిలాడు. వజ్రాయుధంలాగా, వేగంగా, పిడుగులాగా, రామచంద్రమూర్తి విల్లు నుండి వెలువడిన బాణం వాలి రొమ్మును తాకింది. ఆ బాణం తాకగానే ఇద్రధ్వజంలాగా బలం క్షీణించి, వాలి నేలకూలాడు.

         సుగ్రీవుడిని మంత్రులంతా సేవించారు. రామచంద్రమూర్తి ఆజ్ఞానుసారం సుగ్రీవుడు కిష్కింధకు పోయాడు. సుగ్రీవుడు సంతోషంగా పట్టాభిషిక్తుడై ఆ తరువాత రామచంద్రమూర్తి చెప్పిన విధంగా అంగదుడిని యువరాజుగా అభిషేకించగా అందరూ సంతోషించారు. సుగ్రీవుడిని పొగిడారు. సుగ్రీవుడికి పట్టాభిషేకం, అంగదుడికి యౌవరాజ్యం ఇచ్చినందుకు అందరూ రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని మెచ్చుకున్నారు.

         కొన్నాళ్ళ తరువాత రామచంద్రమూర్తి కార్యం నెరవేర్చాల్సిన కాలం సమీపించిందని హనుమంతుడు భావించాడు. సీతను వెతకడానికి వానరులను పంపమన్నాడు. హనుమంతుడు చెప్పగా కాలానికి ఉచితమైన ఆయన మాటలు విని సుగ్రీవుడు వానర సేనానాయకుడైన నీలుడిని చూసి, వానరయూధ నాయకులందరూ పదిహేను రోజుల్లో తమ సేనలతో తన దగ్గరికి రావాలనీ, రానివారి ప్రాణాలు తీయబడుతాయనీ అంటాడు. ఆ విధంగా ప్రకటించమని నీలుడిని ఆజ్ఞాపించాడు. అంగదుడితో కలిసి నీలుడు ఆ పని చేయాలని చెప్పాడు.

కోపంతో సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన లక్ష్మణుడికి సుగ్రీవుడు కపిసేనలను రప్పించిన వార్త చెప్పింది తార. “నూర్లకొలది కొండముచ్చులు, ఎలుగులు, కోతులు, మహాబలపరాక్రమ సంపన్నులు కోట్లకొలది నీ సేవ చేయకలవారిని చూస్తావు”. అని అన్నది.  

అప్పుడు సుగ్రీవుడు తన సమీపంలో వున్న హనుమంతుడితో “హిమవత్పర్వతంలో, మహేంద్ర, వింధ్య, కైలాస, మందర పర్వతాలలో, బాలసూర్య కాంతికల సముద్ర తీర పర్వతాలలో, పడమటి కొండల్లో, సంధ్యాకాల మేఘం లాంటి ఉదయ పర్వతంలో తిరిగే కోతులను, పద్మతాల వనంలో వున్న వానరులను, నల్లటి మేఘాలతో సమానమై ఏనుగు బలం కలవారైన “అంజనాపర్వత” వానరులను, మనిషిల విశేషంగా వుండే గుహలల్లో ఉన్నవారిని, మునీశ్వరుల ఆశ్రమాలలో వున్నవారిని, ఇంకా భూమ్మీద ఎక్కడెక్కడో వున్నవారందరినీ, భయంకర వానరులందరినీ పిలిపించు” అని చెప్పాడు.  (ఇది వాల్మీకి రామాయణం కిష్కింధకాండ 37 వ సర్గలో వున్నది)

         లక్ష్మణుడు, సుగ్రీవుడితో కలిసి రామచంద్రమూర్తిని చూడడానికి ఆయన వున్న చోటుకు పోయారు. “రామచంద్రా! భూమండలంలోకల కోతులను, కొండముచ్చులను, ఎలుగులను, బలవంతులను పిలిపించాను. తమతమ సేనలతో వందలు, వందవేలు, వంద లక్షలు, అయుతాలు, శంకువులు, అర్భుదాలు, ఖర్వాలు, మధ్యములు, అంతములు, సాగరములు, పరార్తాలుగా వస్తున్నారు. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలవారు. మేరు, మందర పర్వతాలతో సమానమైన వారు. వింధ్యాద్రిలో, అంజనాద్రిలో వుండేవారు వస్తున్నారు. దుష్టుడైన రావణుడిని చంపి వీరు నీ భార్యను తెచ్చి నీకు సమర్పిస్తారు” అని అన్నాడు సుగ్రీవుడు శ్రీరాముడితో.

శతవలి,  సుషేషణుడు,  తారుడు,  కేసరి,  గవాక్షుడు,  ధూమ్రుడు,  పనసుడు, నీలుడు, గవయుడు, దరీముఖుడు, గజుడు, అశ్వినీ దేవతలా కుమారులు ద్వివిదుడు, మైందుడు, జాంబవంతుడు, రుమన్వంతుడు,  గంధమాదనుడు, తార కొడుకు అంగదుడు, ఇంద్రజాను శూరుడు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, నలుడు, దదిముఖుడు, వహ్నికుముదుడు, రంహుడు, ఉగ్ర శరభుడు మొదలైన వానర సమూహాలు సుగ్రీవుడి ఆజ్ఞానుసారం ర్రామచంద్రుడి దగ్గరకు వచ్చారు. వచ్చిన వారందరినీ సుగ్రీవుడు వాళ్ల గురించి రామచంద్రుడికి తెలియచెప్పి, వారి క్షేమ సమాచారాలను విచారించాడు. వారిని వాళ్ల సేనలతో అడవుల్లో, కొండల్లో వుండమని ఆదేశించాడు.

         సీతాదేవిని వెతకడానికి నలుదిక్కులకూ ఒక్కొక్క వానర నాయకుడి నేతృత్వంలో కోటానుకోట్ల వానర వీరులను పంపించే ముందర వాళ్ళు వెళ్లే దిక్కులో వున్న ప్రదేశాలను వివరంగా చెప్పాడు వాళ్లకు సుగ్రీవుడు. ఒక విధంగా ఆయన మాటల్లో అది సమస్త భూమండలమే!

సీతను వెతకడానికి ముందుగా తూర్పు దిశకు వినతుడిని పొమ్మన్నాడు. ఆ దిక్కున వున్న ప్రదేశాలను వివరించాడు. దక్షిణ దిక్కుకు నీలుడిని, హనుమంతుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలులను పొమ్మన్నాడు. వీళ్లందరికీ దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి చెప్పాడు. అలా చెప్పిన వాటిలో అంజనాద్రి కూడా వున్నది.  ఆ తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, పశ్చిమంగా పొమ్మంటాడు. ఆ తరువాత సుగ్రీవుడు మహాబలవంతుడైన శతవలి అనే వాడిని ఉత్తర దిక్కుకు పొమ్మంటాడు.

         దక్షిణ దిక్కుకు పోయిన హనుమదాదులకు, రావణుడు వుండే స్థలాన్ని సంపాతి చెప్పడంతో, సీతను చూడాలన్న కోరికతో సముద్ర తీరాన్ని చేరారు. వానరులు ఒక్కచోట కూర్చుండి సముద్రాన్ని తేరిపార చూశారు. “ఈ సముద్రాన్ని దాటేవారెవరు? ఈ వానరసేనను కాపాడడం అంగద, హనుమంతులకు ఎవరికి సాధ్యం” అని అనుకుంటారు.

అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడిని కార్యోన్ముఖుడిని చేయడానికి ప్రోత్సహించసాగాడు. ఇలా అన్నాడు: “నువ్వు బలంలో, పరాక్రమంలో, తేజంలో, రామలక్ష్మణ సుగ్రీవులు ముగ్గురికీ సమానమైనవాడివి కదా? ఆ ముగ్గురు ఒక ఎత్తు, నువ్వొక్కడివే ఒక ఎత్తు కదా! నీ శక్తి సామర్థ్యాలు నువ్వేల తెలుసుకోలేవు? దానికి కారణం ఏమిటో ఆలోచించు”.

         “అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనే ఒక ప్రసిద్ధ సుందరి శాపవశం వల్ల వానరస్త్రీగా అంజనాదేవి అనే పేరుతో  కుంజరుడనే వానర ప్రభువుకు కూతురుగా పుట్టింది. ఆమె కేసరి అనే వానర వల్లభుడికి భార్య అయింది. ఆ వానర స్త్రీ ఒకానొక రోజున సంతోషంగా మనుష్యస్త్రీ  స్వరూపం ధరించి, మేఘవర్ణం కల పర్వత ప్రదేశంలో తిరుగుతున్నది. అప్పుడామె కట్టుకున్న ఎర్రటి అంచుకల పచ్చని దువ్వలువ కొండగాలికి మెల్లగా జారిపోయింది. ఆమె ఉబ్బిన స్తనాలు, బలిసిన తొడలు, సన్నటి నడుము, అందమైన ముఖం, పిరుదుల అందమైన ఆకారం చూసిన వాయుదేవుడు, మోహంతో, మన్మథ బాణాలకు గురై, ఆమె భుజాలను పట్టుకుని గట్టిగా కౌగలించుకున్నాడు”.

“ఆమె అప్పుడు భయపడి ‘ఎవ్వడు నా పాతివ్రత్యానికి హానికలిగించాలని చూస్తున్నాడు?’ అని అంది. వాయుదేవుడప్పుడు ‘నువ్వు భయపడవద్దు. నేను నిన్ను ఎప్పుడూ తాకే వాయుదేవుడిని. నీకు దీనివల్ల కీర్తి కలుగుతుంది. ఈదడంలో, దాటడంలో నాకు సమానమైన కొడుకు, మిక్కిలి వేగంగా పోయేవాడు, పరాక్రమవంతుడు, బుద్ధిబలం కలవాడు నీకు పుట్టుతాడు’. అని చెప్పగా నీ తల్లి మనసులో సంతోషించి అక్కడినుండి వెళ్లిపోయి, ఒక కొండ గుహలో వానర శ్రేష్టుడివైన నిన్ను కనింది”. జాంబవంతుడు ఇలా ప్రోత్సహించగా, ప్రేరేపించగా ఆ క్షణంలోనే హనుమంతుడు విజృంభించాడు. వానరులు సంతోషంగా చూస్తుంటే తన దేహాన్ని పెంచాడు.

         లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన తరువాత, తన జన్మ వృత్తాంతాన్ని చెప్పుతాడు సీతాదేవితో. రామాయణంలో, అందునా వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఫలానా ప్రదేశమే హనుమంతుడి జన్మస్థలం అని చెప్పలేదు కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉదాహరించిన ప్రమాణాలే ఆధారంగా తీసుకుని ఆయన జన్మస్థలం అంజనాద్రి అని నిర్ణయించడం భావ్యం.