Saturday, December 31, 2022

Year 2022: Dalit Bandhu on a massive scale-up : Vanam Jwala Narasimha Rao

 Year 2022: Dalit Bandhu on a massive scale-up

Vanam Jwala Narasimha Rao

The Hans India (01-01-2023)

Buttressing the marginalized

Millennium Post (03-01-2023)

(The scheme heralded a new chapter in the history in Telangana and the concept is spreading like a wild fire in the country. Dalit Bandhu Scheme, heralded a sea change in the lives of Dalits and has become torchbearer for Dalits elsewhere in the country. An old adage says ‘Give a man a fish, and you feed him for a day. Teach a man to fish, and you feed him for a lifetime’. This is what exactly CM KCR is doing. Government is giving Rs 10 lakh to start a business of their choice. This is making them self-reliant economically and live with dignity and self-respect. Government released Rs 3849.35 crores during Financial Year 2021-22 and made provision of Rs 17,700.00 crores in the Financial Year 2022-23 for covering about 1,77,000 families at the rate of 1500 per constituency in all the 118 Assembly Segments-Synoptic note by Editor, Hans India).

(Telangana is leading from the front with its Dalit Bandhu scheme empowering Dalits through financial assistance that’d help them set their own ventures-Editor Millennium Post).

 The comprehensive Household Survey conducted in Telangana seven and half years ago revealed that there were 1.82 million families belong to the Scheduled Castes, accounting for 17.53% of the total families. The Dalit population in the state might have gone up substantially since then. At least nine out of 33 districts in the state have more than 20% SC population now. Despite 75 years of independence, there has not been significant improvement for the uplift of Dalits and their condition under the successive governments both at center and united Andhra Pradesh. The Flagship program, Dalit Bandhu, conceived and being implemented successfully in Telangana is the first of its kind scheme for empowerment of Dalits in the country.  

Autonomy, self-determination and confidence in individuals and societies, who are vulnerable are possible only when they are adequately and systematically empowered. This would also enable them to represent their interests effectively in a responsible way and acting on their own authority. Livelihoods of Dalit who are probably more vulnerable than any other community, will be enhanced through effective participation of people and communities in the management of their own social, economic and environmental objectives through empowering.

In this context and background, during the last week of June 2021, Chief Minister K Chandrashekhar Rao conceptualized the Dalit Empowerment Policy in a meeting at Pragathi Bhavan, in the presence of Dalit leaders cutting across the party lines, who included among others, MPs, MLAs, MLCs and other stake holders. Prior to this CM KCR did a lot of brain storming with his officials, intellectuals, writers and activists from the Dalit Community before making an elaborate policy of Dalit Bandhu.

The All-Party meeting duly endorsed then, that, the proposed CM Dalit Empowerment Program would bring in a qualitative change in the lives of Dalits and would become a role model for the country. In fact, CM KCR’s endeavor has been to bring in a qualitative change in the lives of all sections of people in the State and his commitment to strengthen the rural economy has no parallel. Dalit Bandhu is not just a mere government’s welfare program but also a massive people’s movement aimed at empowering each Dalit family financially and perhaps can be compared to the Telangana statehood agitation.

The CM then also made it very clear that, under the Dalit Empowerment Program, Dalit families would be developed in a phased manner and this is in addition to SC Sub Plan. Decision to deposit the Rs 10 Lakh financial assistance without any bank guarantee, directly to the bank accounts of the Dalit beneficiaries under the scheme was also taken in the All-Party Meeting. Initially in the piloting phase it was planned to benefit 100 families from each of the 119 constituencies all over the state.

Later, before scaling of the program across the State, in all the Assembly Constituencies, in order to understand the modalities and develop further guidelines, it was decided to implement in Huzurabad Assembly Constituency, as a Pilot on saturation mode. However, Chief Minister K Chandrashekhar Rao sprang a surprise on August 4, 2021, by launching Dalit Bandhu at his adopted village of Vasaalamarri in Turkapalli mandal of Yadadri-Bhongir District. KCR declared in a meeting in the village that Dalit Bandhu had been launched.

Subsequently, it was decided to implement the Dalit Bandhu in the four mandals namely, Chintakani in Khammam District, Thirumalagiri in Suryapet District, Charagonda in Nagar Kurnool District and Nizam Sagar in Kamareddy District again on saturation mode. Consequently, more and more beneficiaries were added extending the area of implementation and numbers of beneficiaries. Thus, the program is being taken up across the state in a target mode, in a phased manner, and as a beginning, it is being implemented in all the Assembly Constituencies of the state, at the rate of 100 families per constituency, in the financial year 2021-22. Centre for Dalit Studies was roped in to share its plans for the welfare and development of Dalits.

Dalit Bandhu Scheme, heralded a sea change in the lives of Dalits and has become torchbearer for Dalits elsewhere in the country. An old adage says ‘Give a man a fish, and you feed him for a day. Teach a man to fish, and you feed him for a lifetime’. This is what exactly CM KCR is doing. He is giving the DBT cash required for the Dalit families to start a business on their own so that they can become traders, businessmen, service sector operators and make them self-reliant economically and live with dignity and self-respect.

This is thus, yet another innovative and extraordinary initiative to empower Dalits living all over the state to live with dignity, self-respect and to become self-sufficient economically forever. Needless to say, that it is paying rich dividends to the Dalit Community now, after a year and half and it received Nationwide Appreciation. The Rs 10 lakh that would be deposited directly into the accounts of Dalit families will serve as capital to start a business with the end goal of economic empowerment of the entire SC community. The scheme triggered a ripple effect having a direct impact on the entire rural economy by signaling spending in other sectors.

Telangana Dalit Bandhu scheme would help Dalits to define their own development and become partners in the development. The Scheme has three factors namely, monitoring the implementation of the scheme, evaluating the results and creating a security fund. The last is named as ‘Dalit Bandhu Rakshana Nidhi’ for protection and safety of Dalits as a supportive mechanism, which is set up permanently with the government and beneficiary participation. A sum of Rs 10,000 would be kept aside from the Rs 10 lakh assistance under the scheme and Government would add matching amount of Rs 10000. A separate SB account shall be maintained for this Rakshana Nidhi.

Under Dalit Bandhu scheme Dalits are setting-up their choice of business such as power tiller, harvester, Paddy planting machine, Autos, tractors, Poultry, tent house, Diary industry, Oil Mill, grinding mill, cement and bricks business, industry, hotel, Steel, cement and building material shops, photography, videography, Mobile phone shops, Mobile tiffin Centers, Hotels, Cloth emporium, furniture shops etc. To track, monitor and supervise implementation of the scheme, technology is put to its best use like issue of identity cards to the beneficiaries which will have an electronic chip inserted for every beneficiary. Through a Bar Code, the transactions are being monitored.

The uniqueness of the scheme is that it directly grants financial assistance to the Dalit families not to fulfil their immediate needs but to start their own economic activity which will make them financially self-sufficient forever. It helps them to stand on their own and attain growth financially without depending on any government or financial institution.

Government released Rs 3849.35 crores during Financial Year 2021-22 and made provision of Rs 17,700.00 crores in the Financial Year 2022-23 for covering about 1,77,000 families at the rate of 1500 per constituency in all the 118 Assembly Segments. The overall status as on date is: Rs 4150.00 crores released to 38, 323 beneficiaries accounts and all were grounded. These include 18,021 families in Huzurabad (Rs 1,819.15 crores released), 75 families in Vasaalamarri (Rs 7.50 crores released), 8390 families in four piloted mandals (Rs 839 crores) and 11,837 families (Rs 1,183.70 crores) in all the target mode constituencies. Among the total of 49549 nature of units started by the beneficiaries, priority wise the top five were: 8187 tractors, 7544 dairies, 6342 four-wheeler passenger vehicles, 5810 goods vehicles and 2687 RCC roof making units.

Whenever CM KCR speaks about Dalit Bandhu, he speaks with passion, conviction and from depths of his heart. CM KCR also created a special cell in CMO to monitor the scheme periodically, with a senior IAS officer Rahul Bojja heading it. The scheme heralded a new chapter in the history in Telangana and the concept is spreading like a wild fire in the country to flourish the Dalit community. When Bharat Rashtra Samithi comes with its national agenda and includes this in it, the light that emanates with the success of the Scheme in Telangana would spread nationwide. End

Tuesday, December 27, 2022

చెకుముకి రాయి, కిరోసిన్ దీపాలు, కచ్చడం బండి .. ! (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 చెకుముకి రాయి, కిరోసిన్ దీపాలు, కచ్చడం బండి .. !

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (27-12-2022) 

ఐదారు దశాబ్దాల క్రితం గ్రామాలలో వింత, వింత సాంప్రదాయాలు వుండేవి. గ్రామాలలో ఆద్యంతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. కాకపోతే, వారిలో కొందరు మోతుబరి రైతులు (భూస్వాములు), కొందరు  మామూలు చిన్నకమతాల వ్యవసాయదారులు, కొందరు రైతు కూలీలు, చాలామంది కేవలం కూలి చేసుకునో, లేక, మోతుబరి రైతుల దగ్గర పాలేర్లుగానో జీవనం సాగించేవారు.  కూలీలకు, పాలేర్లకు జీతం నగదు రూపేణా కాకుండా ధాన్యం రూపేణా ఇస్తూనే వారి చిన్నచిన్న అవసరాలకు అవసరం వచ్చినప్పుడు కావాల్సిన పైకం ఇచ్చేవారు పెద్ద రైతులు. కుటుంబాలకు కావాల్సినవన్నీ గ్రామాలలోనే లభ్యం కావటాన ఆ చెల్లింపులు కూడా నగదు రహిత లావాదేవీలే. గ్రామస్తులు కొనుక్కోవాల్సినవన్నీ చాలావరకు అమ్మకందారులు ఊరిలోకే తెచ్చి అమ్మేవారు. కూలీలకు, పాలేర్లకు అవసరమైన మరికొన్నిటిని పెద్దరైతులు సమకూర్చేవారు జీతంలో భాగంగా, లేదా, అదనంగా.

ఉదాహరణకు చిన్నతనంలో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం (రాత్రవుతుండగానే) జరిగే ఒక కార్యక్రమం నాకింకా గుర్తుంది. మాది పెద్ద వ్యవసాయం. పాలేర్లు (జీతగాళ్లు అని కూడా పిల్చేవాళ్ళం) కూడా పది మందికి పైగా వుండేవారు. రోజువారీ కూలీకి వచ్చే వాళ్లు కూడా కొందరుండేవారు. పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగొచ్చి, పశువులకు ఆ రోజుకు వేయాల్సిన దానా, ఇతర పనులు పూర్తైన తరువాత వీరందరికీ ‘పొగాకు’ పంచే కార్యక్రమం మొదలయ్యేది. జీత గాళ్లకు ఏటా ఇచ్చే జీతంతో పాటు, ఏడాదికి రెండు జతల చెప్పులు, ప్రతి రోజు తాగడానికి (పీల్చడానికి) పొగాకు (రోజులు మారుతున్న కొద్దీ బీడీలు) ఇవ్వడం ఆనవాయితీ. మా నాన్న గారు ప్రతి రోజు పొగాకు కాడల పంపకం చేసేవారు. ఒకే సారి నెలకో-పదిహేను రోజులకో కలిపి ఇచ్చే ఆనవాయితీ లేదు. పొగాకు పంపిణీ జరిగే సమయంలోనే ఆ రోజు పొలం పనులను సమీక్షించేవారు. అదొక విధమైన క్రమశిక్షణ. పొగాకును ఒక మోదుగు ఆకులో చుట్టి, చెకుముకి రాయిని, ఒక రకమైన ఇనుప ముక్కతో కొట్టి నిప్పును పుట్టించి, నిప్పు వచ్చినప్పుడు ఒకరకమైన ప్రత్యేక దూదిమీద దానిని అంటుకునేట్లు చేసి, చుట్టలో పెట్టి పొగ పీల్చేవారు ఆరోజుల్లో. చూడడానికి బలే సరదాగా వుండేది. ఇప్పుడు బహుశా ఈ విధానాన్ని ఎవరూ ఉపయోగిస్తున్నట్లు లేదు. 

ఐదారు దశాబ్దాల క్రితం విద్యుత్ సరఫరా లేదు. కిరోసిన్ దీపాల వెలుగులోనే చదువుకునే వాళ్లం. పెట్రోమాక్స్ లైట్లే వీధి దీపాలు. సాయంత్రం కాగానే, చీకటి పడటానికి కొంచెం ముందర, మున్సిపాలిటీ వాళ్లొచ్చి స్తంభాలకు వీధి దీపాలు తగిలించి పోయేవారు. 1960-1961 ప్రాంతంలో ఖమ్మంలోని మా ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. ఇక మా గ్రామానికి విద్యుత్ 1978 వరకు రాలేదు. అదే సంవత్సరం మా ఇంట్లో కనెక్షన్ పెట్టించుకున్నాం. అంతకు క్రితం పది సంవత్సరాల ముందు మా పెళ్ళి జరిగినప్పుడు మా ఇంట్లో విద్యుత్ దీపాలు లేవు. పెట్రోమాక్స్ లైట్లే దిక్కు. ఇప్పుడైతే విద్యుత్ కనెక్షన్ లేని గ్రామం, ఇల్లు, లేనే లేదు. 1970 వరకు మాకు "ఫాన్" గాలి అంటే తెలవదు. "గాస్ పొయ్యి" కూడా దాదాపు అప్పుడే కొన్నాం. అప్పట్లో కొనాలంటే అదొక పెద్ద ప్రహసనం. దాని ఖరీదు సిలిండర్ డిపాజిట్ తో సహా 300 రూపాయల లోపే!

తాగే నీటి కోసం ఇప్పుడున్నన్ని సదుపాయాలు గతంలో లేవు. ఖమ్మంలో మా ఇంటి వెనుక భావి, ఇంటి ముందర మునిసిపాలిటీ నీటి కనెక్షన్ వుండేవి. మునిసిపాలిటీ నీరు తాగడానికి సరిపోయేది. మిగిలినవాటన్నిటికీ బావి నీరే. ఇప్పటికీ శిధిలావస్థలో వున్న ఆ బావి వున్నది. ఇప్పటి లాగా ఫ్లెష్‌ ఔట్ మరుగుదొడ్లుండేవి కావు. సఫాయివాడు (స్కావెంజర్) ప్రతి రోజు వచ్చి శుభ్రం చేసేవాడు. వాడికి, నెలకు అప్పట్లో ఐదు రూపాయలిచ్చినట్లు గుర్తు. బెడ్ రూములకు అనుసంధానంగా బాత్ రూములు, లెట్రిన్లు లేవప్పుడు. వంటా-వార్పూ అంతా కట్టెల పొయ్యిల మీదే. స్నానానికి నీళ్లు కాగ పెట్టడం కూడా కందికట్టె నిప్పుల మీదే. ఇక ఇంట్లో వుండేది "ఓపెన్ బాత్ రూమే"! ఖమ్మంలోని స్నానాల గదికి కాని, మా వూళ్లోని స్నానాల గదికి కాని, చాలా రోజుల వరకు పైకప్పు లేదు. పెద్దలు సాధారణంగా వంటిమీద బట్టలతో స్నానాలు బావి దగ్గరే చేసేవారు. స్నానం చేసి తడిబట్టలు ఆరవేసుకునే ఆచారం వుండేది. పిల్లలం కూడా జీతగాడు బావిలోంచి నీళ్లు తోడి పోస్తుంటే, ఒక గంట సేపు స్నానం చేసే వాళ్లం. వారానికోసారి కుంకుడు రసంతో తలంట్లుండేవి (తల మీద స్నానం). దాని కొరకు ప్రత్యేకంగా పని వాళ్లుండే వారు.

ఇంటి అవసరాలకు కావాల్సిన శనగ, బియ్యం, జొన్న పిండి విసరడానికి, ‘ఇసురు రాయి’ వుండేది. కారం-పసుపు దంచడానికి పెద్ద రోలు, రోకలి వుండేవి. ఇవే వీటితో పాటు దోస కాయ వరుగులు, మామిడి కాయ వరుగులు కోసి ఎండ పెట్టడానికి, మొక్క జొన్నలు వలవడానికి, అలాంటి పనులనేకం చేయించడానికి వాటిలో నైపుణ్యం కల పనివారు వుండేవారు. వారికి దినసరి కూలితో పాటు, పంటలు చేతి కొచ్చిన రోజుల్లో కొంత బోనస్ లాంటిది లభించేది.

చిన్నతనంలో ప్రయాణాలు చేయడానికి కచ్చడం బండి వుండేది. ఆడవారు మేనాలు కూడా వాడేవారు. కచ్చడం బండికి, పెద్ద బండికి సైజులో కొంత తేడా వుండి, ఇది చిన్నగా వుంటుంది. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం (దాన్ని ‘చక్కి’ అనేవారు) వేయాలి. ముందర బండి తోలేవాడు కూచోవడానికి ‘తొట్టి’ వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వారు. ఎక్కువలో ఎక్కువ ముగ్గురు, నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటి ముఖాలకు ‘పొన్న కుచ్చులు’, ‘ముట్టె తాళ్లు’, మెడకు ‘మువ్వలు-గంటలు’, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి ‘కాణీ’ వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వారు) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి ‘టంగు వారు’ అలంకరించేవాళ్లం. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో ‘చండ్రకోల’ వుండేది. అది తోలుతో చేసేవాళ్లు.

ఈ హంగులన్నీ వున్న కచ్చడం బండిలో ప్రయాణం మెర్సిడీస్ బెంజ్ కారులో కంటే హుషారుగా వుండేది. ఎద్దులు బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల చప్పిడి, మువ్వల సందడి, టంగు వారు కదలడం, చూడడానికి బలే సరదాగా వుండేది. ఎక్కువమంది వుండి కచ్చడం బండి సరిపోకపోతే, ఒక పెద్ద బండికి కూడా తాత్కాలికంగా ఒక గుడిసె కట్టించి, అందులో ‘బండి జల్ల’ వేయించి, దాంట్లో ‘బోరెం’ పరిచి, దాని కింద మెత్తగా వుండేందుకు వరి గడ్డి వేసి, అందులో కూచుని ప్రయాణం చేసే వాళ్లం. కచ్చడం బండిని మా వూళ్లో వున్న వడ్రంగి కోటయ్య తయారు చేశాడు. మా ఇంటి పక్కనే జగన్నాధం అనే మరో వడ్రంగి ఇల్లుంది. ఆ ఇద్దరు వడ్రంగులు వూరును పంచుకున్నారు. వారిద్దరూ ప్రతి రైతు దగ్గర ఏడాదికి ఇంత అని, వార్షికంపైనే వడ్రంగి పనులను చేసేవారు.

Sunday, December 25, 2022

ఉత్తమమైన ధర్మం నిజం చెప్పడమని, అబద్ధాలాడడం మహాపాపమని అన్న భీష్ముడు ..... ఆస్వాదన-101 : వనం జ్వాలా నరసింహారావు

 ఉత్తమమైన ధర్మం నిజం చెప్పడమని,

అబద్ధాలాడడం మహాపాపమని అన్న భీష్ముడు

ఆస్వాదన-101

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-12-2022)

గణజనులంతా కలసికట్టుగా వున్న రాజ్యంలో సిరి తాండవిస్తుందని, అందువల్ల గణవిధానాన్ని శ్రద్ధగా పరిశీలించుకొంటూ వుండాలని భీష్ముడు చెప్పిన తరువాత, ఎన్నో రూపాల వున్న ధర్మాలను ఆచరించడం సాధ్యం కాదు కాబట్టి ఏ ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు ఇహపర లోకాలలో సుఖంగా వుండగలడని ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, తల్లీ, తండ్రీ, గురువూ నిత్యం సేవించవలసిన వారని, భక్తితో వారికి సేవలు చేస్తూ, వారేది చెప్పితే దానిని ఆచరణలో పెట్టడం ఉత్తమ ధర్మమని, ఆ ముగ్గురూ వేదత్రయం లాంటి వారని, ముల్లోకాల లాంటి వారని, త్రిమూర్తుల లాంటి వారని, వీరిలో తల్లికి ఎక్కువ గౌరవమని, తల్లితండ్రుల మీద అభిమానం కలవాడు ఇహపర లోకాలలో గౌరవించబడతాడని, గురువును సేవించినవాడు అవ్యయానందాన్ని పొందుతాడని చెప్పాడు.

అప్పుడు ధర్మరాజు మరో ప్రశ్న వేస్తూ, నిజానిజాల విషయంలో మనిషి తనకు తానుగా ఏవిధంగా ధర్మానికి బద్ధుడై వుండాలో చెప్పమని భీష్ముడిని అడిగాడు. ధర్మాలలోకల్లా ఉత్తమమైన ధర్మం నిజం చెప్పడమని; పాపాలలోకెల్లా మహాపాపం అబద్ధాలాడడమని; అయితే, పరాయివాడి సొమ్మును, ఉసురును దోచుకోవాలనుకొనే పాపులతో నిజం చెప్పడం కన్నా చేటు మరొకటి వుండదని; అబద్ధాలు ఆడైనా అలాంటి వారిని బాధించడం ఎంతో న్యాయమని; ప్రజలకు మేలు చేసే అబద్ధాలన్నీ పుణ్యాలు-ధర్మాలు అవుతాయని; సాటి జీవులను వేధించే సత్యాలన్నీ పాపాలు-అధర్మాలు అవుతాయని; అందరిలో వున్న మంచీ-చెడూ అనేవి అతి సూక్ష్మమైన వివేకంతో తెలుసుకోనాలని భీష్ముడు సమాధానం ఇచ్చాడు.

ఎలాంటివారు తమ పాపాలనుండి విముక్తులు కాగలరని ధర్మరాజు అడిగాడు. వర్ణాశ్రమ ఆచారాల నియమాలను పాటించేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, నిందించగా నిందించనివారు, ఉదారగుణం కలవారు, అతిథులను ఆదరించేవారు, వేదాలు వల్లించేవారు, యుద్ధంలో తెగించి పోరాడేవారు, ఏదేవతలనైనా ఒకే విధంగా చూస్తూ మనసుకు నచ్చిన రూపాన్ని కొల్చేవారు పాపం అనే కొండలను అనాయాసంగా దాటగలుగుతారు. అలాంటప్పుడు సౌమ్యులు అసౌమ్యులుగాను, అసౌమ్యులు సౌమ్యులుగాను కనిపించడానికి కారణం ఏమిటని, వారిని ఎలా తెలుసుకోవాలని ధర్మరాజు ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు వ్యాఘ్ర-గోమాయ సంవాదాన్ని ఉదహరించాడు. రాజైనవాడు ఇతరుల మాయ మాటలకు మోసపోకుండా మంచీ-చెడ్డా నిర్ణయించుకునే సామర్థ్యం కలిగి వుండాలని చెప్పాడు.

వెంటనే ధర్మరాజు, రాజు ఎలా నడచుకుంటే సుఖపడతాడని అడిగగా, భీష్ముడు, ఏమరుపాటు లేకుండా, జాగరూకుడిగా, ఎదుటివారి సాయం కావాలని అనుకొనేవాడు తప్పక సుఖపడుతాడని నక్కల కథ ఆధారంగా చెప్పాడు. శత్రురాజు అధికబలం కలవాడైతే, అల్ప బలంగల రాజు ఆపదలనుండి ఎలా గట్టెక్కగలడని ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు, సముద్ర సరిత్సంవాదం గురించి వివరించాడు. బలహీనుడైన రాజు తన బలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ అంచనా వేసుకోవాలని, మొండిగా పోరుకు దిగకూడదని, పగవాడి మిడిసిపాటును యుక్తిగా దాటవేయాలని, అప్పుడే ఆ రాజు ఎలాంటి చెరుపూ లేకుండా నిలబడగలడని అన్నాడు.

మంచి కులస్థుడైన సేవకుడు పదవికి తగిన విధంగా ఉద్యోగ ధర్మం నిర్వర్తించకపోతే రాజు ఏంచేయాలని అడిగాడు ధర్మరాజు. జవాబుగా ముని-కుక్క ఇతిహాసాన్ని చెప్పాడు భీష్ముడు. తక్కువ జాతివారిని ఎన్నడూ ఎక్కువగా ఆదరించకూడదని, ఆంతర్యం తెలుసుకోకుండా కేవలం తన కులం వాడని చెప్పి దుష్టుడిని అందలం ఎక్కించకూడదని, సామర్థ్యం తెలుసుకోకుండా కేవలం కులాన్ని మాత్రమే ప్రామాణికంగా పెట్టుకొని సేవకులకు పదవులు ఇవ్వరాదని, సేవకులు ఎలాంటివారో చూసుకొని, వారి-వారి యోగ్యతలను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి పదవులలో నియమించడం రాజధర్మమని భీష్ముడు అన్నాడు.

పరిజనానికి నేర్పు, కులం వుండాలని; అవి లేనివారు కోట్లకొద్దీ వున్నా ప్రయోజనం వుండదని; చాకచక్యం, పౌరుషం, స్వామిభక్తి, గొప్పతనం, స్నేహితుల బలగం, మంచి నడత వుంటే ఆ రాజు ప్రపంచాన్నంతా పాలించవచ్చని అంటూ, రాజైనవాడికి జాణతనం, పోటుతనం తప్పనిసరిగా ఉండాలన్నాడు. రాజు అనేకమైన నడతలతో ప్రజల హృదయాలను చూరగొనాలని, ప్రజలతో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడాలని, తన మంత్రాంగాన్ని పైకి పోక్కనీయకుందా వుండాలని, ధర్మాన్ని నెత్తిమీద పెట్టుకునేలా చేయాలని, తుచ్చుల కుట్రలను భగ్నం చేయాలని చెప్పాడు భీష్ముడు. రాజు అనేవాడు చాతుర్యంగల పరిజనులను ఎక్కడబడితే అక్కడ ప్రవేశపెట్టాలని, రహస్యంగా ఎదుటివారి పనులను మెలకువగా పసికట్టాలని, తనకు తానుగా అన్ని పనులలోని మంచీ-చెడ్డా విచారించుకోవాలని, రోజువారీ పనులను, ఆదాయ-వ్యయాలను, బొక్కసాన్ని, సంపదలను స్వయంగా చూసుకోవడం రాజ ధర్మమని అన్నాడు.

ఇదంతా విన్న ధర్మరాజు రాజులకు సామాన్య విషయమైన దండించడం అనేదాని తీరుతెన్నులను తెలుసుకోవాలని ఆసక్తిగా వుందన్నాడు. జవాబుగా భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. దండనీతి మంచివారిని మెప్పిస్తుందని, చెడ్డవారి పొగరును అణచివేస్తుందని, కత్తి, గద, తోమరం, విల్లమ్ములు, రోకలి, చక్రం, ఈటె, చిల్లకోల, త్రిశూలం, గొడ్డలి మొదలైన పదకొండు ధర్మనీతికి పనిముట్లని, దాని ఒంటి రంగు నలుపని, నాలుగు కోరలు, నాలుగు చేతులు, ఎనిమిది కాళ్లు వుంటాయని, లెక్కలేనన్ని చెవులు, కళ్లు వుంటాయని, చూసీచూడగానే రూపురేఖలు భయంకరంగా వుంటాయని అన్నాడు భీష్ముడు. యజ్ఞారూపధారైన విష్ణువే దండరూపంలో వుంటాడని, బాగా పాలించిన దండనీతివల్ల ప్రజలు ఎప్పుడూ రాజు అభివృద్ధినే కోరుకుంటారని, అందువల్ల రాజు తప్పక దండనీతిని ఆశ్రయించాలని, సత్యమార్గంలో ధర్మాన్ని ఆచరించాలని చెప్పాడు భీష్ముడు. వసుహోముడు మాంధాతకు చెప్పిన దండనీతి శాస్త్రం ఉదాహరించాడు.

ఆ తరువాత మరో సందేహాన్ని అడిగాడు ధర్మరాజు. ధర్మార్థ కామాలతో ఎలా నడచుకొంటే మంచిదని ప్రశ్నించాడు. సమాధానం ఇస్తూ భీష్ముడు, ఎప్పుడూ భోగం అనుభవించాలనుకొనే రాజుకు ధర్మార్థాలు హరించుకు పోతాయని, కామంలో ఆసక్తికల రాజు మంచి మార్గంలో వుండడని, ధర్మం దక్కించుకోవడానికి ఆధారం అర్థం అని, అర్థం పట్ల నిష్టతో ఎలాగైనా ధర్మాపేక్షను విడవకూడదని, కామ బుద్ధితో కాకుండా రాజ్యాన్ని ఏలుకునే రాజు గొప్పవాడవుతాడని చెప్పాడు. అలాంటప్పుడు, లోకమంతా ఎంతగానో మెచ్చుకునే శీలాన్ని, దాని స్వరూపాన్ని విప్పిచెప్పమని ప్రార్థించాడు ధర్మరాజు. మంచి ప్రవర్తన కలిగి వుండడమే శీలం అని, శీలవంతుడు సంపదలతో తులతూగుతాడని, త్రికరణశుద్ధిగా ప్రాణులకు ఎలాంటి హాని చేయకుండా వుండడమే శీలం అని, శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యం వల్ల ప్రవర్తన, ప్రవర్తన వల్ల బలం, బలం వల్ల సంపత్తి రాణిస్తాయని, కాబట్టి అన్ని శుభాలకు మూలం శీలం అని వివరించాడు భీష్ముడు. శీలం వల్ల లోకంలో గౌరవం పొందిన మాంధాత, నాభాగుడు, ప్రహ్లాదుడు మొదలైన రాజులను ఉదాహరించాడు.

అప్పుడు ధర్మరాజు భీష్ముడితో, ఆశ అనేదానికి అంతూ-పొంతూ వుండదని, ఆ ఆశ తీరకపోతే దానికన్నా మించిన బాధ కలుగుతుందని, ఆశను అణచుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. ఆశ అనే దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒక కథ చెప్తానని అంటూ, సుమిత్రుడు అనే రాజు చరిత్ర చెప్పాడు. ఆ కథ సారాంశంగా కొన్ని విషయాలను వివరించాడు. ఆశ ఒక విధంగా తప్పించుకోలేనిదని, ఆశతీరకపోతే కలవరపాటు, ఆదుర్దా కలుగుతుందని, ఎవరైనా, ఎక్కడైనా, ఏవిషయంగానైనా మనసును దిటవు చేసుకుంటే అతడికి లభ్యం కానిదేదీలేదని, మనసును ఆశకు వశం చేస్తే ఆశలు నిరంతరం కొనసాగుతూనే వుంటాయని, ఏదేమైనా ఆశను చంపుకుంటేనే ఎంతో సుఖమని, ఆశ నెరవేరకపోయినా బాధపడకూడదని అన్నాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Saturday, December 24, 2022

Decline of ethical behaviour in TS politics (Ethics at a low ebb) : Vanam Jwala Narasimha Rao

 Decline of ethical behaviour in TS politics

The Hans India (25-12-2022)

Ethics at a low ebb

Millennium Post (27-12-2022)

(In defiance of a legacy where mutual respect defined political relations of leaders across parties, politicians today are using unparliamentary languages and even epithets-Editor, Millennium Post).

(Ethics in politics is necessary for ensuring right behavior. For inculcating the sense of ethics among the politicians and for attitudinal change, they may be exposed to a formal training on ethics in politics. But who should take a lead? Can it be Election Commission of India and the Chief Election Commissioner? Or a directive from Apex Court? But who will teach ethics to these fly-by-night operators in politics to behave properly? If only their party seniors can induce some manners, culture and decency to this type of foul-mouthed leaders, on the lines of their illustrious leaders of the past, then there may be some remedy-Hans India Editor’s synopsis)

India which got independence from the British colonial rule, initially had a single political party domination, and to be more precise, the Mahatma Gandhi’s Indian National Congress, that fought for independence. Subsequently several parties emerged and couple of them were recognized as National Parties, like the Communist Parties, the Jan Sangh (later to be known as BJP etc. Democratic political systems, while performing the function of representation, rest on the competition with a political ambition to come to power. Modern democracy cannot function without political parties. But how many of these adhere to ethics and morals in politics is the question?

When regional parties started evolving and posing challenge to national parties, monopoly of later started waning. As a result, the initial decency and decorum maintained by National Parties’ leaders vanished out of insecurity, resulting in public outbursts and hurling inconsequential abuses. Mass based regional parties like Telangana Rashtra Samithi (Now Bharat Rashtra Samithi) uniting hundreds of thousands of followers, were established with a genuine goal of achieving a separate state and attempts to base itself on an appeal to the masses. Consequent to formation of state it came to power and in the near future well poised to play crucial role in national politics.

Against this backdrop, any well-balanced person will have to agree, that, for a democracy like the Indian, the crucial players namely the political leaders, above the party affiliations should adhere to some decency, dignity and decorum, especially when they speak in public and when they refer to their dignified opponents. Unfortunately, the trend in the recent past in Telangana, which is catching up fast, has been that, some vocal opposition party political leaders, that too representing a National Party, holding responsible positions, while making statements in public, day in and day out, are losing their balance. They are spitting venom against the Chief Minister and his family members, in a language that is crossing all permissible limits of decency. The language is very filthy, unparliamentary, highly unbecoming and deplorable in unequivocal terms.

Unfortunately, one such political leader in Telangana, occupying responsible position in party as well as in law making body, though his known political history is not that too long, has the idiosyncratic habit of using choicest epithets against BRS bigwigs refereeing them in singular terms, be it against CM KCR or Minister KTR or MLC Kavita or to that matter anyone belonging to BRS. He seldom spares any TRS/BRS public representative for that matter. He seems to believe that use of filthy and unparliamentarily language would attract people. How far his language and abuses are putting his own party leaders to embarrassment is a million-dolor question because, interestingly even the national leadership of that person is conspicuously silent on his utterings.

In our country there are several instances where in, some stormy petrel political leaders when used some unpalatable offensive language against respected rival politicians, were reprimanded by their own senior leadership and corrected them. For instance, soon after the Janata government was formed at the center in 1977, the then Union Industries Minister George Fernandez, a zealous critic of Indira Gandhi, addressing a public meeting in Hyderabad described her as a ‘perennial liar’ (Pathological lying, the chronic behavior of compulsive or habitual lying). When the then Prime Minister Morarji Desai, came to know of it, he gently warned him and told George to control from using such phrases, against a senior politician and a former PM and instead, reframe as Mrs Indira Gandhi ‘seldom speaks truth’ (People who used to tell lie in such a small matter and rarely speak the truth), meaning almost the same. Gone those days and leaders!

However, there are some still. During Corona pandemic times, when many opposition leaders made fun of Prime Minister Narendra Modi when he urged the people to light a candle and beat the utensils CM KCR at a media conference openly condemned it and said that PM should not be criticized in that manner and he even asked the DGP to book cases against those indulging in the mockery of PM. Like Morarji, KCR is also an exception. Both have statesman like qualities.

In another instance, when PV Narasimha Rao was the Prime Minister, the then Leader of the Opposition Atal Behari Vajpayee used to criticize the government incessantly, but with lot of respect, decency and decorum. Notwithstanding all that, PV who as the PM had deputed Vajpayee to speak on the Kashmir issue at the UN to everyone’s surprise. Similarly, Rajiv Gandhi and Atal Bihari Vajpayee shared special bonding despite representing the opposite stream of politics. When Rajiv Gandhi was the Prime Minister, he included Atal Bihari Vajpayee in an official delegation to the UN so that the BJP leader could get treatment for his kidney ailment in the US. This was made possible simply because the opposition politicians of yester years were highly decent in their conduct to get respect from party leaders in power. Why this is missing now cannot be understood.

However, criticism was not uncommon even then. As a Parliament Member from the opposition, Vajpayee used to criticize Nehru’s government inside and outside the Parliament. In one of his speeches inside the Parliament, Vajpayee said that, he sees both Churchill and Chamberlain in Nehru which evoked peals of laughter from none other than Nehru himself. During the Janata government, when Nehru’s portrait was removed from the Ministry of External Affairs office, Vajpayee took strong objection to it and got it back to the office. Such was the mutual respect the ruling and opposition had then. It also speaks a lot about their personality. That was how mutual respect among politicians prevailed then. Why is this missing now? No answer!

But who will teach ethics to these fly-by-night operators in politics to behave properly? If only their party seniors can induce some manners, culture and decency to this type of foul-mouthed leaders, on the lines of their illustrious leaders of the past, then there may be some remedy. Maybe it is high time now in our country to redefine what is parliamentary language and what is un-parliamentary one? This is important as more and more political leaders are indulging in a language that can never be called decent or in tune with dignity and decorum.

Ethics in politics is necessary for ensuring right behavior. For inculcating the sense of ethics among the politicians and for attitudinal change, they may be exposed to a formal training on ethics in politics. But who should take a lead? Can it be Election Commission of India and the Chief Election Commissioner? Or a directive from Apex Court?

Ethics basically refers to the moral codes of conduct of an individual. In fact, the goal in life for the individual as well as society has been ultimately distilled in the concept of dharma through thousands of years of our rich cultural tradition. If everybody practices the concept of dharma, then that in itself brings a sense of self-discipline. In a society where there is self-discipline, automatically there will be self-boundary. The concepts of dharma as the foundation for practice in politics are obvious. After all this is our age-old ancient philosophy, culture and tradition. 

The important component of training on ethics in politics and for politicians has to be value which in turn will provide right attitude and direction. It is predominantly the presence or otherwise of human values and ethics, which will determine effectiveness of an individual. An analysis of the malaise in the existing political situation, however, shows that despite systems and institutions are in place, the human element to drive these is lacking. Ethics must start with individual values and individual integrity. Thus, there is a need to rekindle old principles and ethical values to gain a sane perspective of work and personal life. Unethical fly-by-night politicians in Telangana shall be in the order of priority to be exposed to such a value-based training in ethics. 

Friday, December 23, 2022

అనాదిగా హస్తం ఇలా ... ! ..... వనం జ్వాలా నరసింహారావు

అనాదిగా హస్తం ఇలా ... !

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (24-12-2022)

కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అన్న వార్తలొచ్చాయి. ఎనిమిదిన్నర సంవత్సరాలకు పైగా కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారానికి దూరంగా వున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, వరుస ఓటముల నుండి గుణపాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు ఏమాత్రం కనబడడం లేదు. అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి పటిష్టమైన పోటీ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా అన్ని శ్రేణుల్లోనూ పార్టీని సిద్ధం చేయడానికి బదులుగా జాతీయ స్థాయిలోని అధినాయకత్వం తనకేమీ పట్టనట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఠా రాజకీయాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య మనుగడకు ఆరోగ్యకరం కాదని అనాలి. ఎట్టకేలకు ఎనిమిది పదులు నిండిన ఖర్గేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేయగలిగింది.

చాలాకాలానికి నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తికి ఆ పదవి దక్కింది. బలమైన అధికార పార్టీతో పాటు బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం, అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పదికాలాలపాటు వర్ధిల్లుతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో, తమతమ రాష్ట్రాలలో పట్టున్న ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజాస్వామ్య మనుగడకోసం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న నేపధ్యంలో ఇప్పటికీ కొంతమేరకు అంతో-ఇంతో ఓటుబాంకు కలిగి వున్న భారత జాతీయ కాంగ్రెస్ తనవంతు పాత్ర పోషించాల్సిన అవసరం వున్నది. పటిష్టమైన క్యాడర్ వున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దిశగా చొరవతీసుకుని బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భారత్ రాష్ట్ర సమితితో కలిసి పనిచేస్తున్న కృషి చూసైనా కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుంటే మంచిదేమో!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ తరహా వేరు. ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ (తరహా వేరుసీనియర్ కాంగ్రెస్ నాయకులను, ఆది నుండి విధేయులుగా ఉన్నవారిని పార్టీ దూరం చేసుకుంటున్నదివేరే పార్టీలో వుండి కాంగ్రెస్ పార్టీని అహర్నిశలు విమర్శించిన వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా కీలక పదవుల్లో కూర్చోబెట్టుతున్నది. స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో, స్వతంత్రం వచ్చిన తరువాత విలువలకు కట్టుబడిన జవహర్లాల నెహ్రూ హయాంలో, పార్టీ అనుసరించిన మద్యే మార్గం అతివాద-మితవాద శక్తులను కలుపుకుని భిన్నాభిప్రాయాలను వెల్లడించమని ప్రోత్సహిస్తూ, పార్టీని పటిష్టం చేయడంకాగా, ప్రస్తుతం కీలక పదవుల్లో వున్న నాయకులను పరస్పరం విమర్శించుకోమని అధిష్టానం నేరుగా ప్రోత్సహించడమే. ఒకటి-రెండు తరాలుగా పార్టీలో వున్న వ్యక్తులు కూడా వీడుతున్నారు.   

పార్టీలో విలువల క్షీణత ఒక విధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రోజుల నుండే మొదలైంది అనాలి. వేరే పార్టీలో వుంటూ కాంగ్రెస్ పార్టీని అహర్నిశలూ దూషించిన వారిని అక్కున చేర్చుకోవడం మొదలవడంతో సిద్ధాంతాలకు దూరంగా ఒక్కొక్క అడుగే జరగడం పార్టీలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అధిష్ఠానాన్ని ధిక్కరించడంపార్టీని వీడిపోవడంస్వాతంత్ర్యం రాకముందు వున్నప్పటికీ, అవన్నీ సిద్దాంతపరమైనవే. బాల గంగాధర్ తిలక్గోపాల కృష్ణ గోఖలే లాంటి వారు పార్టీతో విభేదించినప్పటికీ దూషించుకోలేదుగాంధీజీ నాయకత్వంలో నెహ్రూబోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీబోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదుతనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూనుస్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకుఅఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీఫలితంగా భవిష్యత్‍లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీయడం జరిగిందని చరిత్రకారుల విశ్లేషణ.

1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారుదాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్యఆ తర్వాత ఆయన్ను నెహ్రూ బలపర్చినప్పటికీ, పటేల్ పక్షం మనిషి పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారుగాంధీజీ మరణానంతరంరాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతకాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగాపటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కిందిఅవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలేఅప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులనిపటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డికళా వెంకట్రావులు ఒకటయ్యారునీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయికాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశంస్వగృహ ప్రవేశం చేసిఅదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారుఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారుకాంగ్రెస్‌ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు

దరిమిలానీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం, బెజవాడల మధ్య పోటీ వుండడంతోఅధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారునీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకునిగోపాలరెడ్డికి వ్యతిరేకంగాకళా వెంకట్రావునుకల్లూరు చంద్రమౌళిని కలుపుకుని పనిచేయ సాగారు

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగాకాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డితమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా “ఆంధ్ర ప్రదేశ్” రాష్ట్రం అవతరించిందిముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైందితెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిల మద్దతు బెజవాడకుబూర్గుల, విబి రాజుల మద్దతు నీలంకు లభించిందిఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారునీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారుతన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది.

1957 లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలలో నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయితన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడుకొండా వెంకట రంగారెడ్డిమర్రి చెన్నారెడ్డిపాగా పుల్లారెడ్డిబొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, “డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారుపార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం, స్వగృహ ప్రవేశం చేయడంపదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డిని జవహర్లాల్ నెహ్రూపథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారుసంజీవరెడ్డి స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారుతనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు సంజీవయ్యఏ కొద్దిమందో తప్పదాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగిందిఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగారాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాతకాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారుమర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోయిన దరిమిలా 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారుఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలలో కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడంఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించితెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులుముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడంఆయన స్థానంలో జలగం ముఖ్యమంత్రి కావడం జరిగిందిఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగాఅత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగంఆ తర్వాత కాలంలోబ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లోఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగావెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైందిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారివెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారుపీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారుఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతోబహిరంగంగానేఅసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేదిచెన్నారెడ్డి స్థానంలో ఒకరి వెంట మరొకరు అంజయ్యభవనంవిజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయంపీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డిఅధిష్ఠానం ఆశీస్సులతో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అసమ్మతి, మళ్ళీ ధిక్కార స్వరాలు. ఏడాదికే ఆయన స్థానంలో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారుఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానంమరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసితెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది

అప్పట్లో అసమ్మతినిధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినాకాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టిందిఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాతఆకస్మికంగా మరణించడంతోఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయివైఎస్ స్థానంలో తొలుత రోశయ్య, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రాలేక పోయారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగానే రాష్ట్ర విభజన జరగడం, 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం, అప్రతిహతంగా పరిపాలన సాగించడం తెలిసన విషయమే. ఆ తరువాత 2018 లో జరిగిన ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రసమితి మరింత మెజారిటీతో గెలవడం ప్రజాభిమానం చూరగొనడం, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికే రోల్ మోడల్ కావడం, ఆయన దృష్టి జాతీయ రాజకీయాల వైపు పారడం నడుస్తున్న చరిత్ర. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల స్ఫూర్తితో, తెలంగాణ మోడల్ ప్రత్యామ్నాయ అజెండాగా భారత రాష్ట్ర సమితికి శ్రీకారం చుట్టిన కేసీఆర్, సెక్యులర్ వాదులను కలుపుకుని జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా అడుగులు వేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా బీజేపీయేతర ముఖ్యమంత్రుల, పలు రంగాల మేధావుల, ప్రముఖుల మద్దతు కేసీఆర్ కు లభిస్తున్నది. ‘అబ్ కీ బాద్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం కూడా ప్రారంభించారు.     

137 సంవత్సరాల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఇటీవల గెలిచిన హిమాచల్ తొ సహా ప్రస్తుతం రెండు-మూడు రాష్ట్రాలలోనే అధికారానికి పరిమితమై పోయిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, తన భవిష్యత్ బాగుకోసం, ప్రజాస్వామ్య మనుగడకోసం, మతోన్మాదాన్ని అరికట్టడం కోసం  ప్రత్యామ్నాయ దిశగా సెక్యులర్ శక్తులకు పూర్తి మద్దతు పలకడం కంటే వర్తమాన పరిస్థితుల్లో చేయగలిగింది ఏమీలేదు. అలా కాకపోతే ఆ పార్టీకి బహుశా మనుగడ లేదేమో! ప్రజాస్వామ్యం, లౌకికవాదం బలపడితేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం.