Sunday, July 29, 2018

అక్షకుమారుడి చావుతో రావణుడి వంశ ధ్వంసన ప్రారంభం ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


అక్షకుమారుడి చావుతో రావణుడి వంశ ధ్వంసన ప్రారంభం
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (30-07-2018)

తన ఐదుగురు సేనానాయకులు, సైన్యంతో సహా యుద్ధంలో మరణించారన్న వార్త విన్న రావణుడు, ఇంకొంచెం బలవంతుడిని పంపాలని నిర్ణయించుకుంటాడు ఈసారి. అక్షుడనే తనకొడుకు, యుధ్ధగర్వం కలిగి, యుధ్ధానికి పోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండే భయంకర పరాక్రమవంతుడు. వాడినెంచుకున్న వెంటనే, తండ్రి కంటి సైగతోనే, యుధ్ధానికి పోవడానికి తయారవుతాడు. బంగారంతో అలంకరించిన విల్లు ధరించి, బ్రాహ్మణుల హోమాగ్నికెగిరే మంటల్లాంటి అగ్నిలా నిప్పులు కక్కుతూ బయల్దేరాడు యుధ్ధానికి. తన తపస్సుతో సంపాదించుకున్న రథమెక్కాడు. అది బంగారు, రత్నసమూహాలతో ప్రకాశిస్తున్న ధ్వజాలు కలిగి, రత్నాలతో నిండిన రథం. ఎనిమిది గుర్రాలు లాగే ఆ రథం, బాలసూర్యుడిలా వెలుగుతూ, దేవదానవులకు అజేయమై, ఆకాశంలో శీఘ్రంగా పోగలిగినదై వుంది. యుధ్ధానికి సిధ్ధమైన అక్షకుమారుడు, అంబులపొద, ఎనిమిది కత్తులు, చిల్లకోలలు ధరించి, ఆ రథమెక్కుతాడు.

(ఇంతకు ముందు యుధ్ధానికి వెళ్లినవారు, రథాలు విడిచి, ఆకాశంలో యుద్ధం చేసారని విన్న అక్షుడు, ఆకాశంలో పోగలిగే రథాన్ని తెచ్చుకున్నాడు) 

భూమ్యాకాశాలు దద్దరిల్లే ధ్వనితో, పోగలిగే రథాలు, ఉత్తమ ఏనుగులు, గుర్రాలు, పదాతిదళం వెంటరాగా, బయల్దేరిన అక్షుడు, తోరణం మీద కూర్చున్న బలవంతుడైన హనుమంతుడిని చూసాడు. ప్రళయకాలాగ్నిలా వున్న వుత్తమ వీరుడిని, ఆంజనేయుడిని సగౌరవ దృష్టితో చూసి, వాడికున్న వేగంతో వెళ్లగలనన్న పొగరున్న వాడని గ్రహించిన వాడై, తన శస్త్రాస్త్ర పాండిత్యం, దేహబలం అతడికి చూపటానికి, గ్రీష్మ సూర్యుడిలా, తీవ్రంగా ఆంజనేయుడిని మూడుబాణాలతో కొట్టాడు.

అంతటితో ఆగకుండా మీదపడి పదునైన కరకు బాణాలతో, నొప్పి కలిగించడం మొదలుపెట్టడంతో, దేవతల గుండెలదిరేలా, క్రూరంగా, అక్షుడికి, హనుమంతుడికి యుద్ధం కొనసాగింది. ఒకరికొకరు, ఇద్దరూ తీసిపోకుండా, భయంకరంగా యుద్ధం చేస్తుంటే, భూమి కంపించింది. సూర్యుడికాంతి ఆగిపోయింది. గాలి వీచడం మానింది. కొండలు కదిలాయి. ఆకాశంలో ధ్వని పుట్టింది. సముద్రాలు భయంతో కలవరపడ్డాయి. ఇలా జరుగుతుంటే, రాక్షస రాకుమారుడు, చిన్నవాడైనా, విషసర్పాల్లాంటి బంగారుకొనగల బాణాలను, మూడింటిని హనుమంతుడిపైకి విసిరాడు. అవి నాటుకుని నెత్తురు కారుతున్న హనుమంతుడి ముఖం సూర్యబింబాన్ని తలపించింది. అక్షకుమారుడి బాణాలేమో కిరణాల్లా ప్రకాశించాయి.

ఇది చూసిన ఆంజనేయుడు కోపంతో, తన చూపులతోనే అక్షకుమారుడి సేనలను, వాహనాలను దగ్ధం చేసాడు. అక్షుడుకూడా సూర్యప్రతాపంతో, కొండపై వర్షించే మేఘంలా, బాణవర్షం కురిపించ సాగాడు. తనను పట్టుకోవాలన్న ధ్యేయంతో వున్న అక్షుడిని మోసగించి ఆకాశానికెగిరాడు హనుమంతుడు. తప్పించుకున్నాడే! అనుకుంటూ ఆయనపై బాణవర్షం కురిపించాడు అక్షకుమారుడు. అయినా హనుమంతుడు చిక్కలేదు. అప్పటికీ అక్షుడు వెనుకంజ వేయలేదు. బాణాలవర్షం కురిపిస్తూనేవున్నాడు. వీడినెట్లా గెలవాలా అని హనుమంతుడాలోచిస్తుంతె, ఆయన చేతులు కట్టిపడేసి, బాధించుదామనుకున్నాడు అక్షుడు.


"వీడు చిన్నవాడైనా గొప్ప శూరుడు. బాలభానుడిలా ప్రకాశిస్తున్నాడు. భయంలేదుకాని ఇలాంటివాడికి కూడా ఆపద రాబోతున్నదే! నామనస్సంగీకరించడంలేదే! వీడి పరాక్రమాన్ని దేవతలు, యక్షులు, పన్నగులు, మహర్షులు, పొగడుతున్నారే! పోనీ వీడిదృష్టి మళ్లించి మోసం చేద్దామంటే, వీడేమో నన్నే చూస్తున్నాడే! ఎటుపోతే అటు నాకెదురవుతున్నాడు. పోనుపోను వాడి నేర్పు, తీర్పు, ఓర్పు, పెరుగుతున్నదేకాని తరగడంలలేదు. రోషంకూడా తగ్గలేదు. వీడు చిన్నవాడని ఉపేక్షిస్తే, యుద్ధంలో నాకు అవమానం తప్పదు. నేను పిల్లరాక్షసుడి చేతిలో ఓడిపోయానన్న అపకీర్తి కూడా వస్తుంది" అనుకుంటాడు అక్షకుమారుడి గురించి హనుమంతుడు.

వాడిని మెచ్చుకుంటూ, అక్షుడి పరాక్రమం, వేగం, ప్రతాపం, దేవతాసమూహాలకైనా గుండెలదిరేటట్లు వున్నాయనుకుంటాడు. అయినా వాడి విలువిద్యా పాటవాన్ని, భుజబల సంపూర్ణత్వాన్ని సహించాల్సిన పనిలేదని, వాడిని చంపాల్సిందేనని, లేకపోతే, మండుతున్న అగ్నిని చల్లార్చడం ఎంతకష్టమౌతుందో, ఇదీ అంతే అవుతుందని తలుస్తాడు. ఇలా ఆలోచిస్తూనే దేహాన్ని పెంచి, రాక్షసకుమారుడిని చంపే ఉద్దేశ్యంతో, వేగంగా, ఆకాశంలో తిరిగే గుర్రాలను, తన అరిచేతి దెబ్బతో చంపుతాడు మొదలు. అంతే రథాన్ని విరగ్గొట్టి నేలమీద పడేస్తాడు. రథం విరగడంతో, అక్షుడు కిందకు దిగి విల్లు చేతబట్టుకుని ఆకాశానికి ఎగురుతాడు, దేహాన్ని విడిచి స్వర్గానికి పోయే మహర్షిలా. ఎగిరి కత్తి చేత్తో పట్టుకుని, హనుమంతుడి దగ్గరకొచ్చి ఘోరంగా యుద్ధం చేయసాగాడు. ఇకలాభం లేదనుకుంటాడు ఆంజనేయుడు. గరుత్మంతుడు పాముతోక పట్టుకుని ఈడ్చినట్లు, వాడికాళ్లు పట్టుకుని, తిప్పి, వేగంగా బలంకొద్దీ నేలమీద వేసి బాదుతాడు. వాడితల తునకలై, కండలు, నెత్తురు, ఎముకలు, నేలంతా వ్యాపించాయి. వాడిచావుకు రావణుడి గుండెలు పగిలాయని, దేవతలు, మునులు, యక్షులు, పన్నగులు, చక్రవర్తులు, మహాత్ములు, ఇంద్రుడు సంతోషించారు. హనుమంతుడి బలానికి ఆశ్చర్యపోయారు.

బలపరాక్రమమాలలో జయంతుడితో సమానమైన, అక్షకుమారుడిని చంపిన హనుమంతుడు, ప్రళయకాల యముడిలా బడలిక తీర్చుకునేందుకు, మళ్లీ ద్వార తోరణం మీదకు ఎక్కాడు. 

Saturday, July 28, 2018

ఆర్తరక్షణ పరమ ధర్మమని సీతకు చెప్పిన శ్రీరాముడు...శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-19:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-19
ఆర్తరక్షణ పరమ ధర్మమని సీతకు చెప్పిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రభూమి దినపత్రిక (29-07-2018)

రాముడు ఆడినమాట తప్పేవాడు కాదు. కాబట్టి రాక్షసవధ చేయకుండా వుండడు. అలా అని నిష్కారణంగా వాళ్లను చంపడు. రాక్షసులేమో దుష్టులు....ఊరకే వుండేవారు కాదు. రాముడి ధనస్సు చూసి తమకు కీడు కలుగుతుందని భయపడి, వారే ఏదైనా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. రాముడు వూరకున్నా వాళ్లు వుండరు. అందుకే రాక్షస వధ మానని సీతకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. పతివ్రత అయిన సీతాదేవి కేవలం తన మీద ప్రేమతో, తన క్షేమం కోరి, చెప్పిన మాటలను విని, ఆమె అభిప్రాయం గ్రహించి, సీతాదేవి చెప్పిన అర్థ-కామ సుఖాల మీద కోరికలేక, ధర్మమే పరమార్థం అని, దానిమీదే మనసున్న వాడైన శ్రీరామచంద్రమూర్తి సీతతో ఇలా అన్నాడు:

"దేవీ! నువ్వు నన్ను క్షత్రియులకు "సార్తివ్రజరక్షారంభమునకు గార్ముక ధారమగు" నని అంగీకరించావు కదా? ఇప్పుడు దండకలో వున్న మహానుభావులు గొప్ప మనస్సు కలవారు. ఆ కారణాన ఇతరులను బాధించరు. అందుకొరకై ఇతరులను ప్రేరేపించరు. అలాంటి అహింసాపరులైన ఋషులు రాక్షసులకు భయపడి వారంతట వారే, నా ప్రయత్నం లేకుండా, కడు దుఃఖంతో నాదగ్గరకు వచ్చి, నేనే దిక్కని శరణుజొచ్చారు. ఇలా నేనే దిక్కని నమ్మిన ఆ ఆశ్రితులను ఎలాగైనా పాడైపొమ్మని తిరస్కరించడం ధర్మమా? నువ్వే చెప్పు. హింస నిషేధం అని నువ్వన్నావు. అది నేను అంగీకరిస్తా. హింస అంటే ఎలాంటిది? నిరపరాధులైన సాధువులను హింసించడాన్ని హింస అంటారు కాని అసాధువులను హింసించడాన్ని హింస అనరు కదా? రాక్షస వధమీద నాకున్న ఉద్దేశం ఏంటి? అదేమన్నా వినోద క్రీడా నాకు? వాళ్లను నేను, కామంతో కాని, క్రోధంతో కాని, లోభంతో కాని, మదమాత్సర్యాలతో కాని, మోహంతో కాని చంపాలనుకోవడం లేదు కదా? సాధువుల మేలుకొరకై చేసే పనిలో దోషముందా? దేవీ ఈ మునులు అడవుల్లో, అక్కడొక కాయ, ఇక్కడొక కూర తెచ్చుకుని దాంతోనే కడుపు నింపుకుని దేహయాత్ర చేస్తారు. ఇక రాక్షసులంటావా...మృగాలనే కాకుండా మనుష్యులను కూడా పీక్కుని తిని భోగాలనుభవిస్తారు. మునులు ధర్మపద్ధతిన నడుస్తే, వారు దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరపద్ధతిన నడుస్తారు. మునులు ఎల్లప్పుడూ వ్రతాలు ఆచరిస్తున్నందువల్ల ఇతర కార్యాలంటే ఆసక్తిలేని వారు...ఇక రాక్షసులు శిశ్నోదరపరాయణులై ఇతరులను బాధించడమే వ్రతంగా వున్నవాళ్లు. ఇలాంటి నిష్కారణ హింసాపరాయణులైన రాక్షసులను వధించి శిష్ట రక్షణ చేయడం అధర్మమా చెప్పు?”


"దండకారణ్యంలో నివసిస్తున్న మునీశ్వరుల సమూహాలు మా ఇద్దరి దగ్గరకు వచ్చి, అనేకవిధాలుగా తాము పడుతున్న దుఃఖాలను చెప్పి, తమను రక్షించాలని ప్రార్థించారు. అప్పుడు నేను, వారి పాదాలకు నమస్కారం చేసి, మునులు తన్ను చూడడానికి ముందే, వారిని చూడడానికి తాను పోనందుకు సిగ్గుపడుతున్నానని, తాను చెసిన అపరాధానికి దయతో క్షమించమని అన్నాను. వారి కోరికలేంటనీ, వారికి తాను చేయాల్సిన సహాయం ఏంటో చెప్పమని అడిగాను. అప్పుడు, దేవీ, ఏకవాక్యంగా వారంతా ఒక్కటే చెప్పారు. దండకలో వున్న రాక్షసులు తమపై పగ బూని, తాము హోమం చేస్తున్న సమయంలో తమను బాధపెట్తున్నారని, ఆ బాధ పడలేక తమకు రక్షకుడు ఎవరు వస్తారో అని విచారపడ్తుండగా, తమ పుణ్యఫలం వల్ల నేను దొరికానని అన్నారు. తపస్సు చేయడం సులువు కాదనీ, అది మిక్కిలి కష్టకార్యమనీ, అంత కష్తపడి చేద్దామంటే మధ్య-మధ్యలో విఘ్నాలు కలుగుతున్నాయనీ, తమ తపశ్సక్తి పోగొట్టుకోదల్చుకోలేక వారిని శపించడం లేదనీ, ఎంతమందిని అలా శపించగలమనీ, ఒక వేళ శపించినా తమకింక ఏ శక్తి మిగుల్తుందనీ, జీవించినా వ్యర్థమే కదా అనీ, వాళ్లన్నారు”.

వాళ్లింకా ఇలా చెప్పారు: "నిర్మలమైన కీర్తికలవాడా! మా స్థితిగతులను ఆలోచించు. రాక్షసులు చేసే పనులు ఆపుచేయించు. మా తపస్సులు సాగేట్లు చేయి.  మామీద దయచూపి మమ్మ్లల్ని రక్షించు. నువ్వు, నీ తమ్ముడే మాకిక్కడ దిక్కు. వేరే రక్షించేవారెవరూ లేరు. మీరు తప్ప మరేరాజులైనా వీరి బారినుండి మమ్మల్ని కాపాడలేరు. పూబోణీ! వాళ్లిలా చెప్పగా వారిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశాను. వట్టి మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపలేదు. నాకు సత్యం అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ప్రాణాలున్నంతవరకు చెప్పినమాట తప్పను. నువ్వే దిక్కని నన్ను ఆశ్రయించి, ఎప్పుడుకూడా ఇతరులకు హాని కలిగించే వాటి జోలికి పోకుండా, దిక్కులేనివారిగా వున్న మునులను, రాక్షసులు పనిగట్టుకుని వధించారు. నువ్వు నిర్మలమైన మనసున్నదానివికదా? ఇంతకంటే విరోధమైన పని ఏమన్నా వుందా చెప్పు? నన్ను ఆశ్రయించేదాకా ఎవరేపాపాలు చేసినా వారి పాపఫలం వాళ్లే అనుభవిస్తారని, వారిని నేను రక్షించే ప్రయత్నం చేయను. ఒకసారి నన్ను ఆశ్రయిస్తే, నేనే దిక్కని వారి రక్షాభారం నామీద వేస్తే, పాపకార్యాలు చేయకుండా వుండే దిక్కులేనివారిని రక్షించడమే నాపని. దానికి నేను కట్టుబడి వున్నాను. అలాంటి వారిని, నా రక్షణలో వున్నవారిని, నా ఆశ్రితులను, రాక్షసులు చంపుతున్నారు. నా భక్తులు నాప్రాణంతో సమానం. నా భక్తులను భాదించడమంటే నన్ను బాధించడమే. కాబట్టి పగకు దీనికి మించిన కారణం ఏం కావాలి? దీనికి జవాబు చెప్తే, సుమతీ, నువ్వు చెప్పినట్లే చేస్తా. ఇక నా మనోనిశ్చయం విను. సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలైన విడుస్తాను. ప్రాణాలకంటే ఇష్టమైన నిన్నైనా విడుస్తాను. నీ కంటే ప్రియమైన తమ్ముడినైనా విడుస్తాను. కాని సామాన్య విషయమైన ప్రతిజ్ఞ విడువను. అందునా, ముఖ్యంగా, బ్రాహ్మణులకు ఇచ్చిన మాట తప్పను".

శ్రీరాముడు సీతతో ఇంకా ఇలా అన్నాడు: "ఆశ్రిత రక్షాభారాన్ని వహించిన నేను ఆ ఆశ్రితులై, నా పరతంత్రులై, వుండే మునుల కార్యాన్ని రక్షించడం నా విధి. ఒక్క సారి వాళ్లు నాతో మేము నీ ఆశ్రితులం అని చెప్తే చాలదా? గడియ-గడియకు చెప్పాలా? నేనంత మరిచేవాడినా? వారి యోగక్షేమాలు నేను విచారించాల్సినవాడిని. అలాంటిది, వారు వచ్చి, నేను చేయాల్సిన పనిని గుర్తుచేసిన తరువాత, వారికి ప్రతిజ్ఞ చేసికూడా ఎలా నెరవేర్చకుండా వుంటాను? నువ్వు జనకరాజు కూతురువు కదా! ఇది నీకు తెలియని విషయమా? అప్పు తీసుకున్నవాడు మళ్లీ-మళ్లీ అడిగించుకోవచ్చా? అడిగించుకుని ఇవ్వడం శ్లాఘ్యమా? ఇవ్వకపోవడం శ్లాఘ్యమా? రెండూ కావు. నన్ను నమ్మి, నన్ను స్మరించి, నన్ను ధ్యానించి, అర్చించి, జపించి, సేవించి, వర్ణించి, కీర్తించి నాపై ఋణమెక్కించిన వారి ఋణం నేను తీర్చుకోవద్దా? నా భక్తుడిని నేను స్మరిస్తాను. నేను చెప్పిన మాట నెరవేర్చడం ఆలశ్యమైందని నేను విచారపడుతుండగా వారి కార్యం నెరవేర్చకుండా ఎలా వుండగలను? నాకు నీమీద, నీకు నామీద, స్నేహం-మోహం వున్న కారణాన, నువ్వు మంచి మనసున్నదానివైనందున, ఇదంతా చెప్పాను. రక్షోవధకు పూనుకున్నప్పుడు నాకు నీమీద, నీకు నామీద కల స్నేహానికి-మోహానికి విఘ్నం కలుగొచ్చునేమొ అన్న నీ అనుమానం గ్రహించాను. అది సహించైనా కార్యం నెరవేర్చాలి. నువ్వు ఉత్తమ స్త్రీవికాబట్టి, నీకిలాంటి మంచిమాటలు చెప్పగలిగాను. స్నేహం-మోహం భర్తకు తమ మీద లేకపోయినా, భర్తలమీద తమకు లేకపోయినా చెప్పగలరా? చెప్పరు. కాబట్టి నువ్వు ఉత్తమగుణ సంపన్నవనీ, నిష్కపటవ్యాపారవనీ మెచ్చ్హాను. నిర్దోషురాలా! కమలహస్తా! నువ్వు పుట్టిన జనక వంశానికి, నీ శీలానికి తగినవిధంగా చెప్పాను. ఇందేం దోషం వుంది? నువ్వు సహధర్మచారిణివి. ప్రాణాలకంటే ఎక్కువ ప్రియమైన దానివి". అని చెప్పి లక్ష్మణుడు, సీత తోడురాగా శ్రీరాముడు విల్లు ధరించాడు.

Friday, July 27, 2018

బీజేపీ ఓడుతుంది....కాంగ్రెస్ గెలవలేదు : వనం జ్వాలా నరసింహారావు


బీజేపీ ఓడుతుంది....కాంగ్రెస్ గెలవలేదు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-07-2018)

బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన ఘట్టం దేశ రాజకీయాలకు సంబంధించి అనేకు గుణపాఠాలు నేర్పింది. అనేక అంశాల్లో స్పష్టత కూడా ఇచ్చింది. స్వరాష్ట్రంలో జరుగుతున్న హోదా పోరులో ఎదురీదుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోతామని తెలిసి కూడా తమ పార్టీ ఎంపిల ద్వారా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టించారు. సంఖ్యాపరంగా గెలుపోటములు ముందే నిర్ణయించబడినప్పటికీ, ప్రత్యేక హోదాపై చర్చను నైతికతకు ముడిపెట్టారు. టిడిపి ఎంపిలు తమ ప్రసంగంలో సైతం దీనిని మెజారిటీ(ఆధిక్యత), మోరాలిటీ(నైతికత)కు మధ్య జరిగిన పోరుగా ప్రస్తావించారు. ఈ చర్చ సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఈ దేశానికి తాము మాత్రమే దిక్కు అని చెప్పుకోవడానికి తమకొచ్చిన అవకాశాన్ని, సమయాన్ని వాడుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధి తన ప్రసంగం ముగిశాక ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఆలింగనం చేసుకోవడం, దానికి బదులుగా మోడీ కూడా రాహుల్ ను వెనక్కి పిలిచి కరచాలనం చేయడం అందరం చూశాం. ఈ తతంగం చూసిన వారికి “మనిద్దరం కలిసి అందరినీ మూర్ఖులను చేద్దాం” అనే నానుడి గుర్తొచ్చింది. దేశంలో కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే ఒకదానికొకటి ప్రత్యామ్నాయమని, వేరెవరికీ చోటు లేదని వారి చర్యలు చెప్పకనే చెప్పాయి.

సభలో సంఖ్యాబలం, అవిశ్వాస తీర్మానం వీగడం లాంటి విషయాలు పక్కనబెడితే ఈ సందర్భంలో ఒకటి మాత్రం స్పష్టమయింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిజెపి అధికారంలోకి రాలేదని తేలిపోతున్నది. ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయలేదనే కఠిన వాస్తవం కూడా స్పష్టమవుతున్నది.  2014 ఎన్నికల్లో బిజెపికి మిత్రపక్షంగా ఉండి, కలిసి పోటీ చేసిన పార్టీలు ఇప్పుడా పార్టీకి దూరమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టిడిపి ఏకంగా బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానమే పెట్టింది. మరో మిత్రపక్షమైన శివసేన ఓటింగ్ దూరంగా ఉంది. బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నది. మరో రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ప్రత్యేక హోదా ఇవ్వాలనే టిడిపి డిమాండ్ ను సమర్థించాయి. ఇది బిజెపి ప్రభుత్వంపై పరోక్షంగా అవిశ్వాసం ప్రకటించడమే. ఇదే సందర్భంలో ఎఐఎడిఎంకె రూపంలో కొత్త మిత్రపక్షం దొరికడం బిజెపికి కొంతలో కొంత ఊరట. ఈ సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఓటింగ్ లో పాల్గొనకుండా అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కు సమదూరంలో ఉంది. స్వయంగా ప్రధానిచే ప్రశంసలు అందుకున్న టిఆర్ఎస్, తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంలో, బిజెపి ఉదాసీనతను గట్టిగా విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని కూడగట్టే పనిలో ఉన్న టిఆర్ఎస్ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

అవిశ్వాస తీర్మానమనే తంతు ముగిశాక ఇప్పుడు దేశ ప్రజలందరి ముందున్న ప్రశ్న.. తర్వాత ఏం జరుగుతుంది అనేది. వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగం ఎలా ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు విజయావకాశాలు ఎలా ఉంటాయి? వాటి పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయినప్పటికీ, సమాధానం లేకపోలేదు. స్పష్టమైన సమాధానమే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దికాలం క్రితం దేశ ప్రజలకిచ్చిన “ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు” కోసం ప్రయత్నమనే పిలుపు ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాల్సిన అంశం.


అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మాట్లాడిన అధికార పక్షం సభ్యులుగానీ, వ్యతిరేకించిన ప్రతిపక్షాలు గానీ అసలు విషయాలపై విస్తృతంగా చర్చించలేకపోయారు. కీలక అంశాలను విస్మరించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించడానికి అసలు కారణాలను విపక్షం స్పష్టంగా చెప్పలేకపోయింది. నరేంద్రమోడీతో సహా అధికార పక్ష సభ్యులు తమ ప్రభుత్వం చేసిందేమిటో దేశ ప్రజలకు వివరించలేకపోయారు. నాలుగేళ్లలో తాము చేసిన గొప్ప పనులేమీ లేకపోవడం అధికారపక్షానికి బలహీనతగా మారింది. ఈ దేశానికి ఏమి కావాలి? వ్యవస్థలో ఎలాంటి మార్పు తేవాలి? అనే విషయాలపై అటు అధికార పక్షంలోని బిజెపి, దాని మిత్రులకు గానీ, ప్రతిపక్షంలోని  కాంగ్రెస్, దాని మిత్రులకు గానీ స్పష్టత లేదు. నరేంద్రమోడీ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే, టిఆర్ఎస్ పార్టీ పరిపక్వత గలిగిన పార్టీ అని ప్రశంసించడం లాంటి విషయాలను మినహాయిస్తే, వార్షీక బడ్జెట్ ప్రసంగం లాగానే సాగింది.

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు పూర్తయినా దేశంలో ప్రజలు ఇంకా కనీస అవసరాల కోసం పోరాడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలే సమకూరలేదు. ఈ అంశాలను, అవిశ్వాసం సందర్భంగా అటు ప్రతిపక్షాలు గానీ, ఇటు అధికార పక్షం కానీ సమర్థంగా ప్రస్తావించలేకపోయాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, మలేసియా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఎన్నో దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే, భారతదేశం ఎందుకు వెనుకబడిపోతుందో, ఈ దేశానికున్న అవరోధాలేంటో ఇప్పటిదాకా ఈ దేశాన్నేలిన కాంగ్రెస్, బిజెపిలు చెప్పలేకపోయాయి. చెప్పలేని పరిస్థితిలో వుండడం దురదృష్టం.

భారతదేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణమైన జాతీయ పార్టీలే, అధికారంలో ఉన్న ఆ పార్టీలే అవిశ్వాసం సందర్భంగా మళ్లీ మాట్లాడాయి. కానీ ఆ పార్టీల్లో ఎవరూ కూడా దేశానికి కావాల్సినందేంటో, తేవాల్సిన సంస్కరణలేంటో విడమరిచి చెప్పలేకపోయారు. దేశ సంపదను ఎలా పెంచుకోవాలో, రాష్ట్రాలు ఎలా శక్తివంతం కావాలో, పేదరికాన్ని ఎలా తరిమికొట్టాలో, దేశాభివృద్ధి నమూనాను ఎలా రూపొందించాలో ఎవరూ చెప్పలేదు. కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ తమ మెదళ్లకు పదును పెట్టి, ఈ సమయానికి దేశానికి ఏమి కావాలనే విషయంలో వినూత్నంగా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. ఒకరిని ఒకరు నిందించుకోవడానికే తమ శక్తినంతా ఉపయోగించుకున్నారు. దేశాన్ని శక్తివంతం చేయడం, ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగపరమైన సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు తదితర అంశాలపై ఏమాత్రం చర్చ జరగలేదు. ఈ విషయాలను జాతీయ రాజకీయ పార్టీలు ప్రస్తావించలేదు. గుణాత్మక మార్పు కోసం జాతీయ ఎజెండా రూపొందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పైన పేర్కొన్న అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు వివిధ వేదికల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రపంచమంతా ఆసక్తిగా వీక్షిస్తున్న సమయంలో జాతీయపార్టీలు ఈ దేశ జౌన్నత్యాన్ని పెంచే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. మోడీ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గణాంకాలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందనే విషయం పరిగణలోకి తీసుకుని, అవి గెలిచే లోక్ సభ స్థానాలు అంచనా వేస్తే కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 165 లోక్ సభ స్థానాలున్నాయి. వాటిలో బిజెపి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఇక మిగిలిన 378 స్థానాల్లోనే బిజెపి 273 స్థానాలు గెలుచుకోవాలి. ఇది అంత సులభం కాదు. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున మిత్రపక్షాలు కోల్పోతున్న ఎన్.డి.ఏ. కూటమి బలహీన పడుతున్నది. ఎన్.డి.ఏ. కూటమిగా కూడా అధికారంలోకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో 38 స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, గోవా లాంటి రాష్ట్రాల్లో మాత్రమె బిజెపి చాకచక్యంగా వ్యవహరించితే, లబ్ది పొందే అవకాశాలున్నాయి.

ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 100 సీట్లున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం బిజెపికన్నా కాంగ్రెస్ పరిస్థితే మెరుగ్గా ఉంది. 182 సీట్లున్న ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేయాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రాష్ట్రాల్లో బిజెపి కూడా అంత బలంగా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎటొచ్చీ 101 స్థానాలున్న కేరళ, కర్ణాటక, పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 100 సీట్లున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. 425 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, అస్సాం, పంజాబ్, బీహార్, జమ్ము కాశ్మీర్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపితో సంబంధం లేకుండానే ప్రాంతీయ పార్టీలు దాదాపు 275 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ.

మొత్తంగా తేలేదేమిటంటే, వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ ఎజెండా అమలయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి, కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని నడిపించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Tuesday, July 24, 2018

Time for political overhaul : Vanam Jwala Narasimha Rao


Time for political overhaul
Vanam Jwala Narasimha Rao
Millennium Post…. New Delhi (24-07-2018)

(As the 2019 elections approach, BJP might be speculated to be on their way out but that does not mean the walking in of Congress)

South Indian Regional Party Telugu Desam moved, and National Party Congress spearheaded no-confidence motion against another National Party BJP lead government is lost leaving behind many lessons to be learnt and several conclusions to be drawn, by political analysts and pundits. As expected, the underdog Chief Minister of Andhra Pradesh, who, despite knowing that he would certainly lose the battle, but fought, described the whole affair as a fight between morality and majority hinting at morally he won!!! Both Congress and BJP depicted through the speeches of their leaders that they and they alone are the alternates to one another. The way AICC president Rahul Gandhi after conclusion of his speech hugged Prime Minister Modi and the instantaneous response of Modi reciprocating the hug by calling him back and shaking hands, reminds everyone the saying “let us together fool all others” as if there cannot be an alternative to both BJP and Congress!!!

            One picture that has clearly emerged, number game apart, and BJP winning the confidence of House, is that, the BJP is on the move to get defeated in the next general election and the Congress is certainly not going to replace it come what may. While one of the BJP’s initial allies the Telugu Desam by moving no-confidence motion deserted it long back, the other ally Sivasena deserted it by walking out from the House. BJP however found a new ally in AIADMK which supported it. Couple of other splinter parties which are in alliance with NDA also, though voted in favour of BJP, supported the special status issue raised by TDP and thus expressed no-confidence on government indirectly. Telangana Rashtra Samithi is perhaps the one and only party which not only received a word of commendation and appreciation from Prime Minister Modi but also presented its case perfectly and did not hesitate to criticise the government on issues concerned and asserting its rights. It finally rightly distanced itself from both Congress and BJP by abstaining in the voting. TRS thus confined rightly and strictly to its demand of a non-BJP and non-Congress national alternative.


            The question now is what next? What would be the likely outcome as and when elections are held? What are the chances of national and regional parties and who would be victorious? Though it’s a million-dollar question, it has certainly an answer in itself. It is exactly in this context we should look at the call given by Telangana Chief Minister K Chandrashekhar Rao couple of months ago that India requires a qualitative change in the political system.

            Yes…India needs a qualitative and momentous change as there is a political vacuum as seen through the entire process of no-confidence motion where literally every opposition party that supported the motion miserably failed in pointing out the specific reasons for no-confidence. At the same tone, Modi and his BJP as well as NDA allies equally miserably failed in projecting the government, the reason being it has nothing to highlight in its four plus years governance. There is a crystal clear political vacuum, as the present ruling coalition led by BJP, and the so called projected alternative, Congress, cannot provide the momentum that India needs and needs very critically. If one analyses the speech of Modi while replying to the no-confidence motion, barring perhaps some harsh realities like, his observation on TRS as a matured party, it mostly appeared as a routine, like a customary budget presentation speech!

Yes...It’s time that the country needs a new direction as 70 years have passed since attaining independence and still we are struggling for basic minimum needs as evident from the observations of opposition during the no-confidence motion and the inability of Prime Minister to effectively counter it. When countries like China, Japan, South Korea, Singapore, Taiwan, Malaysia, Indonesia, Thailand, Vietnam, Philippines and many more, could accomplish miraculous growth, what prevented the same in India is a question to be answered by both Congress and BJP which ruled this country alternately.



Yes…. the national political parties and the prevailing political system failed the nation, as evident from their speeches, during the no-confidence motion. None of the national parties mentioned about the reform agenda that the country badly needs now. None of them spoke about how country’s wealth could be leveraged, how states could be empowered, how to get rid of poverty and how to set a development-centric national agenda. None of the national political parties, either Congress or BJP exhibited the mindset of out of the box thinking which the need of the hour is. The opportunity that both the national parties got during the debate was only utilized for hurling remarks with personal antagonism. There was no talk or suggestion on aspects like reform agenda that includes structural changes to leverage the country’s strength, economic reforms, constitutional reforms, electoral reforms, judicial reforms as well as administrative and governance reforms. These are what Chief Minister Telangana K Chandrashekhar Rao has been often mentioning as part of his national agenda for a qualitative change. At a time when the whole world was anxiously witnessing the proceedings of the no-confidence motion, both the national parties could have spelt out them to project our country globally.

This apart, assessing the mood of the people at large, and the polarization that is likely to take place as well as possibilities of a change at the centre, there is every possibility for a change as and when elections are held. The statistical data amply proves it. The data collected scientifically shows that neither Congress nor BJP has an advantage to get the magic mark.

In the southern states of Kerala, Tamil Nadu, Pondicherry, Telangana and Andhra Pradesh as well as West Bengal and Odisha, which account for 165 Lok Sabha seats, there is absolutely no scope for BJP. This leaves BJP to win 273 seats from out of the remaining 378 from all other remaining states, which will be a herculean task. With one after one, its allies deserting BJP, it is also equally doubtful that NDA as a whole could garner that strength. BJP perhaps may have a smart political game in north-east states, Union Territories, Jammu and Kashmir and Goa which together account for just 38 seats.

As far as Congress party is concerned it may have comparatively better prospects than BJP in states like Uttarakhand, Himachal Pradesh, Gujarat, Rajasthan, Chhattisgarh and Madhya Pradesh, which account for 100 seats in Lok Sabha. States where less scope for Congress if there is no alliance with regional parties are UP, Bihar, Jharkhand and Maharashtra which together account for 182 seats. Even for BJP in these states it is a difficult go. However Congress has an edge in Kerala, Karnataka, Punjab, Haryana and North-East and Union Territories accounting for 101 seats even though there are regional parties. Its only in MP, Chhattisgarh, Rajasthan, Gujarat, HP and Uttarakhand the presence of regional parties is not there. They have a total of 100 seats. Without aligning with either Congress or BJP, the regional parties will win at least 275 seats (More than the magic mark) out of 425 in UP, West Bengal, Tamil Nadu, Odisha, Telangana, Karnataka, AP, Delhi, Maharashtra, Jharkhand, Assam, Punjab, Bihar, Jammu and Kashmir, Haryana and Kerala.

This leaves with little or no doubt, that the BJP will be out after next elections, but Congress will not be in, and it would be the regional parties together that would emerge victorious to form a Government at the centre. This, when it comes to power, is likely to push the national agenda for a qualitative change in politics and governance with Regional Party leaders like KCR taking a possible lead at the national level. END

Sunday, July 22, 2018

జంబుమాలిని, మంత్రిపుత్రులను, సేనానాయకులను చంపిన హనుమ ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


జంబుమాలిని, మంత్రిపుత్రులను, సేనానాయకులను చంపిన హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (23-07-2018)
హనుమంతుడు చైత్య పాలకులను చంపి, అందరూ వినేలా వానర సేన బలం గురించి బిగ్గరగా చెప్తున్న సమయంలోనే, రావణుడు పంపిన మహాబలశాలి, ప్రహస్తుడి పుత్రుడు జంబుమాలి అక్కడకు అతివేగంగా వచ్చాడు. ఎర్రటి పూదండలు, ఎర్రటి వస్త్రాలు, కుండలాలు ధరించాడు. ఇంద్రుడి ధనస్సు లాంటి విల్లును చేత ధరించాడు. కంచరగాడిదలు కట్టిన రథమెక్కిన జంబుమాలి, బాణాన్ని తీసుకుని, దిక్చక్రం వణికేటట్లు, వింటితాడును మీటుతాడు. తనవైపు వస్తున్న పెద్దదేహంకల వానర వీరుడిని చూసిన ఆ రాక్షసుడు, తనకు తగిన శత్రువే వీడనుకుని పొంగిపోయాడు. వింటిలో పదిబాణాలు సంధించి, హనుమంతుడి చేతులమీద, ముఖంపైన, తలమీద అవి నాటుకునేటట్లు విసురుతాడు.

(బాహుయుద్ధం చేసేవారిని పంపితే కింకరులను చంపినట్లే చంపుతాడని భయపడ్డ రావణుడు వింటి యుద్ధం చేసేవారిని పంపాడు ఈసారి).

బాణాల దెబ్బతిన్న హనుమంతుడి ముఖం నెత్తుటితో తడిసి, సూర్యకిరణాలకు వికసించిన శరత్కాలపు తామరపూవులాగా వుందప్పుడు. ఎర్రటి హనుమంతుడి ముఖం ఎర్రటి నెత్తురు బొట్లతో, ఆకాశాన ఎర్రటి చందనపు బొట్లున్న ఎర్రటి తామరలాగా వుంది. వరుస వెంట బాణాలు తాకడంతో, కోపగించిన హనుమంతుడు, దగ్గర్లో వున్న ఓ బండరాయినెత్తి వాడిమీదకు విసురుతాడు. దాన్ని వాడు పదిబాణాలతో తునాతునకలు చేసాడు. హనుమంతుడప్పుడొక చెట్టు పీకి, గిరగిరా తిప్పుతుంటే దాన్ని వాడు నాలుగు బాణాలతో నరుకుతాడు. ఆ వెంటనే, అయిదుబాణాలతో భుజాలను, ఒకబాణంతో రొమ్మును, పదిబాణాలతో స్తనప్రదేశాన్ని కొట్టాడు. మండుతున్న బాణాలతో తగిలిన ఆ దెబ్బలకు, దేహం వేధిస్తుంటే, మునుపటిలాగానే, ఇనుప గుండునొక దాన్ని తీసుకుని, గిరగిరా తిప్పి వాడి వక్షస్థలాన్ని గురిచూసి కొట్టాడు హనుమంతుడు. ఆ దెబ్బకు, తల ఏదో, మొండెమేదో, చేయి ఎక్కడో, విల్లేమయిందో, మోకాళ్లు ఏమైనాయో? అని గుర్తించలేని రీతిలో, జంబుమాలి పొడిపొడిగా, ముక్కలు చెక్కలై నేలకూలాడు.

రాధంతో, దానికి కట్టిన కంచర గాడిదలతో, వాడని, సంధించని బాణాలతో, వంటిమీదున్న అందమైన ఆభరణాలతో సహా రాక్షసుడు ముద్దగా పడిపోయాడు. చావగా మిగిలిన కింకరులు జంబుమాలి చచ్చాడని రావణుడికి తెలిపారు. మళ్లీ కోపగించిన రావణుడు, శౌర్య దర్పాల్లో గొప్పవారని పేరున్న ఏడుగురు మంత్రిపుత్రులను పంపాడు హనుమంతుడిమీదకు.

అగ్నిలాగా మండుతున్న ఆ ఏడుగురు మంత్రిపుత్రులు, ఇల్లువెడలి, విల్లులు, బాణాలు, ఇతర యుధ్ధ సామగ్రి, ఆయుధాలూ తీసుకుని, ఎవరికివారే గెలవాలన్న కోరికతో వచ్చారక్కడకు. బంగారుమయమైన ధ్వజాలున్న రధాలెక్కి, మేఘాలురిమినట్లు శబ్దంచేస్తూ పోయారు యుధ్ధానికి. కింకరుల మరణవార్త విన్నవారైన వీరి తల్లులు, వీళ్ల గతేమవుతుందోనని చుట్టపక్కాలతో చెప్పుకుని ఏడ్చారు. ఆ రాక్షసులు హనుమంతుడిని సమీపిస్తుంటే, వాళ్ల రథచక్రాల ధ్వని ఉరుముల్లాగా, బాణప్రయోగం వర్షంలాగా అనిపించింది. వాళ్లు మేఘాల్లాగా కమ్ముకున్నప్పటికీ, హనుమంతుడేమీ కలతపడలేదు. చక్కగా ద్వారం తోరణం మీద కూర్చున్న హనుమంతుడు చావుమూడిన రాక్షసులకు స్వాగతం చెప్తోన్న మృత్యుదేవతలాగా కనిపిస్తున్నాడా! ఏమో! అన్నట్లున్నాడు. అతి వేగంగా వస్తున్న వారి బాణాలకు గురికాకుండా, ఆకాశంలోనే తిరగసాగాడు. ఇంద్రధనస్సుతో కూడిన మేఘాల గుంపును వాయువు చెదరగొట్టినట్లు, హనుమంతుడు రాక్షసులను హెచ్చరిస్తూ కలవరపర్చాడు.

పెద్ద సింహనాదం చేసి, రాక్షసులను చంపుదామన్న తొందరలో, ఎక్కువ సేపు వీళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదనుకుంటూ, వాళ్లను అరిచేతుల్తో, కాళ్లతో కొట్టి, గోళ్లతో చీల్చేసాడు. చెవులదిరేటట్లు మరొక్కమారు గర్జించగా, ఆదెబ్బకు, ధ్వనికి, కొందరు చావగా, మిగిలిన కొందరు పారిపోయారు. ఇలా రాక్షసులను చంపిన హనుమంతుడు, వెంటనే ఉద్యానవనంలోకి పోయి, ఇంకా యుద్ధం చేయాలన్న కోరికతో, మల్లీ తోరణం ఎక్కి కూర్చున్నాడు.


మంత్రికుమారుల మరణవార్త విన్న రావణుడు తన ఐదుగురు సేనానాయకులైన, విరూపాక్షుడు, దుర్ధరుడు, యూపాక్షుడు, భాసకర్ణుడు, ప్రహసుడు అనేవారిని పిల్చి, వారి సమస్త సైన్యంతో వెళ్లి, కోతిని పట్టుకుని తెమ్మంటాడు. కోతేకదా అని అలక్ష్యం చేయకుండా, తగు ప్రయత్నం చేసి, దేశకాల విరోధం లేకుండే విధంగా కార్యాన్ని నెరవేర్చుకుని రమ్మంటాడు. వాడు నిజమైన కోతికాదనీ, ఇంద్రుడు తపస్సు చేసి తన్ను జయించాలన్న కోరికతో, పెద్దభూతాన్ని సృష్టించి పంపాడనీ వాళ్లతో చెప్పాడు.

వాళ్లను పొగుడుతూ: "మీసహాయం వుండవల్లేకదా, నేను అమితబలవంతులైన నాగులను, కుబేరుడిని, దేవతలను, మహర్షులను, దానవులను యుధ్ధభూమిలో గెల్చాను" అంటాడు. వాళ్లను ఓడించామన్న కారణంవలనే, తమతో విరోధంగా వున్నారనీ, పగతీర్చుకోవడానికి సమయంకోసం కాచుకున్నారనీ, తనకు కీడుచేయాలని తలుస్తున్నారనీ, అంటాడు. తనవలె వారూ దేవవిరోధులేకనుక, వారుపంపిన ఆ కోతిని ఎలాగైనా బంధించి తెమ్మంటాడు.

"ప్రతిదినం తోటల్లో, తోపుల్లో చూసే కోతిలాంటిదిది కాదు. దీన్ని పరిహాసంగా చూడవద్దు. ఇదిమిక్కిలి కీర్తిపొందిన పరాక్రమం కలది. నేను వాలిని, సుగ్రీవుడిని, జాంబవంతుడిని, నీలుడిని, ద్వివిదుడిని చూసాను. కాని ఇంతగొప్ప ఆకారం, బుధ్ధిబలం, వారించలేని తేజం వారెవరికీ లేదు. ఏదో భూతం ఈ వానర రూపంలో, ఏదో పని పెట్టుకుని వచ్చుండాలేకాని, ఇదిమామూలు కోతికాదు. మిమ్మల్ని మానవులు, దేవతలు, రాక్షసులు, ఎవ్వరూ యుద్ధంలో ఎదిరించలేరని నాకు తెలుసు. అయినా మేమింతవారమని, మాకెదురేమీ లేదని భావించక, మిక్కిలి మెలకువగా యుద్ధం చేయండి. యుద్ధంలో ఎంత బలవంతుడైనా, తానే గెలుస్తానని చెప్పలేడు. గెలుపు స్థిరంకాదు. బలవంతుడే జయించాలన్న నియమం కూడా ఏదీలేదు. కాబట్టి ప్రతివీరుడూ, శూరుడూ, తనను రక్షించుకోవటానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేయాలి" అని రావణుడు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు.

         సేనానాయకులు ఐదుగురు, శ్రేష్టమైన రథాలు, ఏనుగులు, గుర్రాలు, కావలిసినన్నీ తీసుకుని, కలకల ధ్వని చేస్తూ, విల్లంబులు, బాణాలు, ఆయుధాలు, ధరించి యుధ్ధానికెళ్తారు.

యుధ్ధానికొస్తున్న సేనానాయకులకు హనుమంతుడు, వీరుడిలా, మండుతూ ఉదయిస్తున్న ప్రకాశించే సూర్యుడిలా, మంచి మనసున్న వాడిలా, గొప్ప ఆకారం కలవాడిలా, గొప్ప వేగంకలవాడిలా, గొప్ప ధైర్యవంతుడిలా, గొప్ప ఉత్సాహం కలవాడిలా కనిపించాడు. కనిపించిన వెంటనే, వాడిలో ఒకడైన దుర్ధరుడు, అసమానమైన, పదునైన ఐదు పచ్చని బాణాలతో హనుమంతుడి తలకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాధతో హనుమంతుడు ఆకాశానికి ఎగిరి, భూమి, దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహనాదం చేసాడు. దానికదిరిన రాక్షసుడు పూర్ణ తేజస్సుతో వంద బాణాలను వానరవీరుడిపై కురిపిస్తాడు. మేఘాన్ని చెదరగొట్టే వాయువులా, ఆ బాణాలను చిందరవందర చేసి, శరీరం నొప్పి పుట్తున్నా ఓర్చుకుంటూ, తన దేహాన్ని పెంచి, ఆకాశానికెగిరి, అక్కడనుండి, కొండమీద పిడుగు పడ్డట్లు దుర్ధరుడి రథంపై దూకుతాడు.

అలా హనుమంతుడు రాక్షసుడి రథం మీద పడడంతో, గుర్రాలు ఎనిమిదీ చచ్చాయి. బండి విరిగిపోయింది. వాడూ చచ్చాడు. అది చూసిన విరూపాక్షుడు, యూపాక్షుడు కూడా ఆకాశానికి ఎగిరి, హనుమంతుడి రొమ్ము పగలకొట్టటానికి, బాణాలేస్తారు. వారి వేగాన్ని అణచివేసిన హనుమంతుడు, చటుక్కున భూమి మీదకొచ్చి, ఒక చెట్టు పీకి, రాక్షసుల మీద వేసాడు. వాళ్లు ఎత్తులో, హనుమంతుడేమో కింద వుండడంతో, ఆ చెట్టు దెబ్బకు వారిద్దరూ చచ్చారు. ఇలా తమవాళ్లు ముగ్గురూ చావడంతో, అమిత కోపంతో ప్రహసుడు, భాసకర్ణుడు హనుమంతుడిని ఆయుధాలతో, శూలాలతో, పొడవడంతో, ఆంజనేయుడు నెత్తురుతో తడిసి బాలభానుడిలా ప్రకాశించాడు. ఆ బాధతో, ప్రక్కనే వున్న ఓ పర్వత శిఖరాన్ని, అందులో వున్న చెట్లతో, పాములతో, మృగాలతోసహా పెకిలించి ఆ రాక్షసుల మీద మహా వేగంతో విసురుతాడు హనుమంతుడు. ఆ దెబ్బకు ఇద్దరూ చచ్చి నేలమీద పడ్డారు.

ఇలా సేనానాయకులందరూ చావడంతో మిగిలిన ఏనుగులను, ఏనుగులతో కలిపి గుర్రాలను,  గుర్రాలతో సహా భటులను, కొట్టి ఇంద్రుడు రాక్షసులను చంపినట్లు చంపుతాడు. పోయేదారి లేదన్న రీతిలో ఆయుధ్ధ భూమి చచ్చిన ఏనుగులతో, గుర్రాలతో, భటుల సమూహాలతో వ్యాపించాయి. వాటిమధ్యలో, హనుమంతుడు ప్రళయకాల యముడిలా కనిపించి, బడలిక తీర్చుకునేందుకు మళ్లీ తోరణసీమపైకెక్కి కూర్చున్నాడు.

Saturday, July 21, 2018

శస్త్ర సాంగత్య దోష ఇతిహాసాన్ని శ్రీరాముడికి చెప్పిన సీత.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-18:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-18
శస్త్ర సాంగత్య దోష ఇతిహాసాన్ని శ్రీరాముడికి చెప్పిన సీత
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (22-07-2018)
సీత శ్రీరాముడికి శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెప్తూ ఇలా అంటుంది: "ప్రాణేశ్వరారామచంద్రాపూర్వకాలంలో సత్యంధర్మం అంటే ఆసక్తిగల ఒక ముని వుండేవాడుఅడవిలోని మృగాలన్నాపశు పక్ష్యాదులన్నా మిక్కిలి ప్రేమకలవాడాయనఆయన తపస్సుకు విఘ్నం కలిగించడానికి ఒకనాడు ఇంద్రుడు భటుడి వేషంలో వచ్చిఒక కత్తిని ఇచ్చిఇది నీదగ్గర వుంచుకొమ్మని చెప్పి వెళ్లాడుదాన్ని కాపాడాలన్న ఆసక్తితో ఆ ముని ఎక్కడికి పోయినా ఆ కత్తిని వెంట తీసుకుపోయేవాడు.అలా దానికి అలవాటు పడ్డాడుకత్తి చేతులో వుంచుకుని పోవడానికి అలవాటుపడ్డ మునికి దానిమీద ప్రేమ పుట్టుకొచ్చిందిలోగడ కాయలుకూరలు చేతితో కోసే ముని ఇప్పుడు కత్తితో కోయసాగాడుఅగ్నిహోత్రానికి సమిధలు చేత్తో విరిచేవాడల్లా కత్తితో కొమ్మలు కోయసాగాడు. అడవి మృగాలను కత్తితో తరమ సాగాడు. ఆ తరువాత హింసనే ప్రారంభించాడు. ఈ క్రూర వినోదాలకు అలవాటుపడి తాను చేయాల్సిన నిత్య కృత్యాలను ఉపేక్షించాడు. ఆ కారణాన వాడు అధోగతుల పాలయ్యాడు. ఆయుధం చేతిలో వుండడాన ఎంత అనర్థం కలిగిందో చూశారాఆయుధం చేతిలో వుంటే దేన్నైనా కొడ్దామన్న ఆలోచనే కలుగుతుంది.

ఇప్పుడు నేను చెప్పిన ఇతిహాసం నా కల్పితం కాదుపూర్వకాలంలో జరిగిన చరిత్రేఇది శస్త్ర సంయోగం వల్ల కలిగే కీడు గురించి తెలియచేస్తుందిఅగ్నిహోత్రుడు దేనిని (కట్టెలనుఆశ్రయిస్తాడోదాన్నే దహించి వేస్తాడుఅలాగే శస్త్రం కూడా తన్నెవరు ధరిస్తారో వారికే కీడు చేస్తుందిఇదంతా నీకు తెలియదనినువ్వు అజ్ఞానివనీనేను నేర్పడం లేదుమీరు నాకిచ్చిన చనువు కారణాననన్ను సగౌరవంగా చూసి నా మాట మన్నించడం వల్లానాకు స్వభావసిద్ధంగా మీమీద స్నేహ భావం వుండడం మూలాననేను మీరు మరచిన దానిని జ్ఞప్తికి వచ్చేట్లు చెప్పానుకాని నీకు తెలియని కొత్త విషయం నేర్పడానికి రాలేదుకాబట్టి నన్ను క్షమించునేనెంత దూరం ఆలోచించినా ఇప్పుడుఇక్కడమీ ప్రయత్నం నాకిష్ఠం కావడం లేదునువ్వు సుజన శేఖరుడవేకాని ఏదో ప్రమాద వశాత్తు సుజన కృత్యాన్ని మరచావుమునివృత్తిలో వుండే వారికి ఆయుధాలతో పనిలేదుకాబట్టి ఆయుధాలను మీరు ధరించడం సరైన పని కాదుఆపైన మనం బలవంతులంమనకు ఎవరడ్డమని బలగర్వంతో పగలేకపోయినా దండకారణ్యంలోని రాక్షసులను చంపడం మరో సరికాని పనినేనెంతో ఆలోచించారాక్షసులైనా నిరపరాధులను దండించడం నాకిష్ఠం లేదునాకు కొంచెమైనా తృప్తి కలగడం లేదుప్రాణేశ్వరాశ్రీరామచంద్రాఅడవుల్లో మునులు తిరగడానికీశస్త్రాలను ధరించడానికీ ఏం సంబంధంమునివృత్తి శాంతి ప్రధానం. ఆయుధ ధారణ కౌర్య ప్రధానం. ఒకటి శుద్ధ సాత్త్వికం....ఇంకొకటి శుద్ధ తామసం. ఇక నీకులోచితమైన క్షత్రియత్వం ఎక్కడబ్రాహ్మనోచితమైన తపస్సెక్కడరెండింటికీ పొంతన ఎలా కుదుర్తుందినువ్వు చేయబోయే ఈ పని పరస్పర విరుద్ధ గుణాలున్నది. నువ్వే ఆలోచించు. కాబట్టి రెండింటిలో ఒకటి వదలు. శస్త్రాన్నైనా వదలు....క్షాత్రమైనా వదలు....తపస్సైన వదలు. అలా కాకుండా ఎందుకు రెంటా చెడాలి?”


"ఏ దేశంలో మనం వుంటామోఆ దేశాల ధర్మం ప్రకారమే మనం నడచుకోవాలికాబట్టి ముని మార్గంలో వున్న నువ్వు మునుల పనైన అహింసను అవలంభించడం సరైన కార్యం కదాశస్త్రాన్ని ధరించడమే జరగుతేదాన్ని ఉపయోగించాలన్న పాపపు బుద్ధి పుట్తుందికాబట్టి నువ్వు అడవుల్లో వున్నన్నాళ్లు శస్త్రం ధరించవద్దు.నాకులోచిత ధర్మాన్ననుసరించి శస్త్రాన్ని ధరించాలనుకుంటేఅయోధ్యకు నువ్వు మరలిపోయిన తరువాతమళ్లీ గృహస్థ ధర్మంలో వున్నప్పుడుధర్మ సంరక్షణార్థం శస్త్రాన్ని ధరించవచ్చుఅనుభవించాల్సిన ఐశ్వర్యంపాలించాల్సిన భూమివదలిపెట్టిమునిలాగా అడవుల్లోకి వచ్చిన నువ్వుమునిలాగానే తపస్సు చేస్తేరాముడు యదార్థవాది-నాతో చెప్పినట్లే చేస్తున్నాడని కైక సంతోషిస్తుందినా కొడుకు ఎక్కువ శ్రమపడకుండా సుఖంగా వున్నాడని కౌసల్య సంతోషిస్తుందివీరేకాకుండా స్వర్గంలో వున్న నా మామగారు కూడా తనకొడుకు తనను సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తారుకాబట్టి అలాగే చేయిధర్మంతో ధనం లభిస్తుందిధర్మం వల్ల సుఖం కలుగుతుందిధర్మంతో చేసే సత్కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయిధర్మహీనుడు చేసే సత్కర్మలు ఫలించవుకాబట్టిశర్మకరా ప్రపంచం ధర్మమే సారంగా కలదిధర్మం చెడితే జగమంతా చెడుతుందిరామచంద్రాఈ ఋషీశ్వరుల వెంట హాయిగా నువ్వు ఈ ఆశ్రమానికిఆ ఆశ్రమానికీ తిరుగుతుంటే సుఖం లేదుపరలోకంలో సుఖం కావాలనుకునేవారు కఠిన వ్రతాలనునియమ నిష్ఠలను అనుసరించాలిమనస్సు జయిస్తే లోకోత్తరమైన ధర్మ ఫలం లభిస్తుందికాబట్టి దానికొరకు కృషి చేయినీ సౌజన్యంసాధుత్వంలోకమంతా గౌరవిస్తాయి. మనస్సు నచ్చిన ప్రకారం నడచుకోకుండానిష్కల్మషమైన బుద్ధితో కార్యం సాధించగలవాడివి. ఇలాంటి నీకు మూడులోకాలలో తెలియందేదీ లేదు. ప్రాణేశ్వరా! నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు. నువ్వు అడవుల్లో తిరిగినంత కాలం హింసా వ్యాపారం లేకుండా వుండకూడదాఇదే నేను కోరేది. నువ్వు సజ్జన వందితుడవు. హింసారతుడవైతే సజ్జనులు మెచ్చరేమోరాముడు క్రూరుడు అంటారేమోనని విచారిస్తున్నాను. స్థ్రీలకు స్థిర బుద్ధి లేదు. ఇతమిత్థమని నిశ్చయించలేరు. కాబట్టి నాకు స్వభావ సిద్ధమైన బుద్ధి చపలత వల్ల తోచింది చెప్పా. నీకు ధర్మం చెప్పగల సమర్థులెవరుకాబట్టినువ్వునీ తమ్ముడు ఆలోచించి ఏది మేలని తోస్తే అదే చేయండి".

Wednesday, July 18, 2018

EC should stall guileful promises by parties : Vanam Jwala Narasimha Rao


EC should stall guileful promises by parties
Vanam Jwala Narasimha Rao
The Hans India (19-07-2018)

It is unfortunate that the Election Commission of India, supposed to be an autonomous constitutional authority, limits itself to the responsibility of merely administering elections to Lok Sabha, Rajya Sabha, State Legislative Assemblies and the offices of President and Vice-President in the country. This responsibility it shoulders only when it is mandatory or obligatory which happened once in five years in the beginning days after independence and later as and when elections were called for either in the whole country or in a state. It forgets that it must be cognizant of partisan dishonest promises to lure the people.

It is also unfortunate that the Election Commission seldom exhibits its authority and responsiveness when election process does not take place. This results in the political parties often go scot-free making false and untruthful promises to the people which under any circumstances would not be possible and practicable for implementation. In fact election commission is amongst the few institutions which function with both autonomy and freedom, but it rarely dares to touch any political party on issues of dishonest promises. Commission however sticks to the rule book only in the case of candidates model code, expenses, affidavits, offensive speeches etc that too during the election process. From the day one after the formation of new government, the opposition parties start making false promises until the next elections aiming at undermining the government and confusing the public.   

The election commission for all practical purposes literally sleeps although the period between election and election and does not bother at all as to what any political party does particularly with reference to promises galore. When there is no check from any corner the people are the losers and they have no option except to become victim to false promises. The election commission should check and view any such false promise seriously and if necessary threaten to cancel party’s registration if they have no basis to substantiate for their promises. After all the people cannot be fooled.

One such promise often heard these days in Telangana is TPCC President’s announcement to waive agriculture loans to a tune of Rs 2 lakhs when they are voted to power and pay within 100 days. In addition he has also been promising to pay unemployment allowance of Rs 3500. These two promises which he says will be included in their election manifesto is nothing but to attract the attention of nearly 50 lakh farmers and lakhs of unemployed youth. This is as ridiculous as some political party making a tall promise that it would build houses for poor in Indian ocean by filling it or in River Godavari or Krishna!!!

TPCC President’s announcement is not substantiated with any sustenance as to how his party (if comes to power?) will be able to accomplish. It’s a known fact that in several states as well as in Telugu states several promises were made earlier but were not implemented after assuming power and the people were mischievously mislead. Against this background if one can analyse the tall promises made by Congress, it is crystal clear that they are nothing but mere promises and impossible to implement.

            This needs a wide-ranging understanding of state finances and the pros and cons for Rs 2 lakhs loan waiver amounting to Rs. 36,000 Crores as well as its possibility and feasibility. TPCC announced that it would waive this entire amount within 100 days or say three months after it comes to power? This is a “castle in the air” impossibility, the reason being necessity to mobilise Rs. 12,000 crores per month. 


            Telangana state has an income of Rs 10,340 Crores per month from all sources. This includes tax and non-tax revenue. The tax revenue amounts to Rs 5,090 crores which includes Rs 1,650 crores from commercial taxes, Rs 1,800 crores from GST and IGST, Rs 850 crores from state excise, Rs 390 crores from registrations and Rs 300 crores from motor vehicle tax. Similarly the non-tax revenue amounts to Rs 650 crores including Rs 300 crores revenue from mines and minerals. In addition from Government of India as state’s share of taxes Telangana gets Rs 1,400 crores and towards central grants it gets another Rs 900 crores. Loans within the FRBM limit and other income from Government of India account for Rs 2,300 crores every month.

            As against this income, the essential and committed expenditure to be incurred unquestionably on first of every month includes Rs 3,200 crores for salaries of employees and pensioners and Rs 1,900 crores towards loans and interest, totalling Rs 5,100 crores. In addition to this, Rs 415 crores for free power to farmers; Rs 217 crores for ration and fine rice scheme; Rs 450 crores for Aasara pensions; Rs 100 crores for Kalyana Laxmi and Shaadi Mubarak; Rs 400 crores for students’ scholarships; Rs 800 crores for state’s share of centrally sponsored schemes; Rs 100 crores for Arogya Sri and EHS scheme; Rs 150 crores towards KCR Kits, RTC subsidy and grants to GHMC; Rs 1,050 crores for Rythu Bandhu scheme etc are to be essentially met. For salaries, pensions, loan instalments, interest payments and other essential expenditure, in all per month it amounts to Rs 8,782 crores. Added to this for irrigation projects another Rs 1,300 crores per month has to be disbursed. All these put together amount to Rs 10,082 crores per month and nothing in this is unnecessary. There is likely to be additional expenditure in view of Pay Revision Commission for employees and pensioners.

            This means the income and expenditure almost matches equally. Under these circumstances how is it possible to mobilize Rs 12,000 crores and in case if the entire income is spent on loan waiver that too in one go, as announced by PCC Chief, how does the government run? Is it not going to be a freeze of all government programs and also stoppage of salaries to employees and pensioners? These fundamental questions are to be answered by those who announced the loan waiver.

            It is also impossible to mobilize funds through loans as there is a limit to obtain loans imposed by RBI and Government of India. Even the financial institutions refuse to extend loan. It may be reminded here that TRS after coming to power moved heaven and earth and left no stone unturned to waive loans amounting to Rs 17,000 crores all at a time. It was not possible and as a result budgetary allocation had to be made and loan waiver was implemented in four instalments. The present congress and congress supported governments in Punjab and Karnataka are implementing loan waiver in instalments. The neighbouring AP state could only waive so far Rs 11,000 crores from out of Rs 24,000 crores in four years.  Same as the case with Maharashtra, Tamil Nadu, UP, Rajasthan where it is done in instalments.

            The other promise of PCC that it would pay unemployment allowance of Rs 3500 per month amounts to Rs 700 crores at least if there is an estimated 20 lakh unemployed in the state. This is also equally impossible.

            It is against this background it requires a check from a competent authority, may be, election commission, to see that such false promises attract disciplining.  END