Saturday, July 14, 2018

శ్రీరాముడికి హితోపదేశం చేసిన సీతాదేవి.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-17:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-17
శ్రీరాముడికి హితోపదేశం చేసిన సీతాదేవి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (15-07-2018)
అందరూ బయటకు పోతున్న సమయంలో సీతాదేవి శ్రీరాముడు ముఖారవిందాన్ని చూసిస్నేహభావంతోప్రేమతోమెత్తటి-తియ్యటి మాటలతో ఇలా చెప్పింది: "ప్రాణేశ్వరానువ్వు అనుష్టించదల్చిన వానప్రస్థ ధర్మం కామం వల్ల కలిగే వ్యసనాలను వదిలి కూడా సూక్ష్మమైన ధర్మ మార్గంలో అనుష్ఠించవచ్చు కదాకామజ వ్యసనం లేదంటావాఅవి మూడుమొదటిది అసత్యం చెప్పడందానికంటే పెద్దది పరస్త్రీలతో భోగించడందానికంటే పెద్దది పగలేకుండా ఇతరులను నిష్కారణంగా హింసించడంఈ మూడింటిలో మొదటిదైన మిధ్యాభిభాషణం నీలో లేదుఇంతదాకా నువ్వు అసత్యం ఆడలేదుఇకరెండోదైన పరభార్యా సంగమం విషయంలో నీకలాంటి కోరికే లేదునువ్వు ధర్మ నిరతుడవు కాబట్టి నీలో ఏ పాపాలు కనబడవుకాబట్టి అధర్మకర దోషం లేదులక్ష్మణాగ్రజా!నాథానువ్వు సర్వదా సత్యంధర్మం తప్పనివాడివికాబట్టే తండ్రి వాక్యాన్ని పాలించడానికి ఇంత శ్రమ పడ్తున్నావుసత్యంధర్మం నీలో ఏ కొరతా లేకుండా వున్నాయిఇంత సత్యంధర్మం విజితేంద్రియులకు తప్ప ఇతరులకు లభించవు.నువ్వెంత జితేంద్రియుడివో నాకు తెలుసురామచంద్రా!మిథ్యాభిభాణం పరదార సంగమాభిలాష నీలో లేవుఆ విషయం గురించి నేనేం చెప్పనుకామజవ్యసనాలలో మూడోది మిగతా రెండింటి కంటే క్రూరమైనదినువ్వు అది చేయబూనావుజ్ఞానహీనులు పగలేకపోయినా ఇతరుల ప్రాణం తీస్తారుఅది అలాంటివారికి తగునుకాని నీకు తగదుఅది నాకెలా తెలుసంటావామునీశ్వరుల కొరకు దండకారణ్య వాసులైన రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశావుఅందుకోసమే ఇక్కడకు వచ్చావుమునిలాగా తిరగాలనుకుంటున్న నీకునీ తమ్ముడికి విల్లు బాణాలెందుకుఅవి హింసించే సాధనాలే కదాఆత్మరక్షణ కోసమని అనుకోవచ్చుకదా అంటావేమోఈ మునులందరూ ఆత్మరక్షణ కొరకు ఏ ఆయుధాలు ధరించారునువ్వు సాయుధుడవై వచ్చినందున మునులు వచ్చి నిన్ను రక్షించమని అడిగారంటావాఅలాగే నిన్ను రాక్షసులు హింసించడానికి వస్తే క్షత్రియుడవైన నువ్వు ఎవరిని ప్రార్థించాలంటావాఅలా వారు వస్తే నువ్వు ఆయుధాలు పట్టవచ్చుకానిఇప్పుడు మీరు విల్లు-ఆయుధాలు పట్టిన తీరు చూస్తే యుద్ధానికి పోతున్నట్లున్నదిఅందువల్ల మీ శుభంహితం కోరినదాన్నైన నేనునిష్కారణ విరోధంతో మేకేం అశుభం కలుగుతుందో అని భయపడుతున్నా.నువ్వు సత్యంధర్మం పాటించేవాడివిఇంతదాకా ఆ రెంటినీ సమంగా కాపాడుకుంటూ వస్తున్నావు. సంతోషమే! ఇప్పుడు రెంటికీ విరోధం వచ్చేట్లున్నది. సత్యంతో విరోధించే ధర్మంధర్మం కాదు. ధర్మంతో విరోధించే సత్యంసత్యం కాదు.


మీరు ఇప్పుడు అడవులకు ప్రయాణమై పోవడం సమ్మతమైన కార్యం కాదుపోతే ఏమైతుందంటావాకారణం చెప్తా వినుమీరు యుద్ధానికి పోయే విధంగా చేతులో విల్లంబులుకత్తులు ధరించి పోతున్నారుతోవలో ఎవరైనా రాక్షసుడు కనిపిస్తే ఇదిగో రాక్షసుడు దొరికాడని వాడిమీద బాణం వేస్తారుఆ దెబ్బకు వాడు చస్తాడుఅదే రాక్షసులకుమనకు విరోధ కారణమవుతుందిరాక్షసులు మనకు ప్రత్యక్షంగా అపకారం చేస్తే వారిని చంపవచ్చు కానిఎవరో ఋషీశ్వరులు చెప్పారని రాక్షసులను చంపి మనం కయ్యానికి కాలు త్రవ్వడం నాకిష్ఠం లేదురాక్షసులమీద బాణం నువ్వు ప్రయోగిస్తావని నేనెలా ఊహించానంటావానువ్వు రాక్షసులను చంపుతానని ప్రతిజ్ఞ చేశావు.నువ్వు సత్య ప్రతిజ్ఞుడవుకాబట్టి చంపక మానవుభయపడవద్దు...నిష్కారణంగా నువ్వెవరినీ చంపనని అంటావాహింసించవచ్చే వారినే హింసిస్తానంటావాఅలా అను ధైర్యం చెప్తావాఅలా అయితే నీ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిదానికి సరైన కారణం కావాలిఆ కారణం నేనే అవుతాఅప్పుడు నాకొరకు నువ్వు రాక్షసులను వధించవచ్చుకానినువ్వు ఏక పత్నీవ్రతుడవు కదానన్ను వదిలి నువ్వెలా వుంటావునా వియోగం వల్ల నువ్వెంత దుఃఖిస్తావోనీ దుఃఖం నేను సహించలేనుకాబట్టి నువ్వు అరణ్యానికి పోవడం నాకిష్ఠం లేదునా వియోగం వల్ల మీ ప్రతిజ్ఞ నెరవేరడం మేలాప్రతిజ్ఞ చెడినప్పటికీ మీరు దుఃఖపడకుండా వుండడం మేలాఅనేదే నా ఆలోచన. క్షత్రియులకు చేతిలో ఆయుధం వుంటే బలాన్ని-తేజాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి కలహం లేకుండా వుండేందుకు మీ ఆయుధాలను ఇక్కడే వుంచి పోదాం".

No comments:

Post a Comment