Saturday, July 21, 2018

శస్త్ర సాంగత్య దోష ఇతిహాసాన్ని శ్రీరాముడికి చెప్పిన సీత.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-18:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-18
శస్త్ర సాంగత్య దోష ఇతిహాసాన్ని శ్రీరాముడికి చెప్పిన సీత
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (22-07-2018)
సీత శ్రీరాముడికి శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెప్తూ ఇలా అంటుంది: "ప్రాణేశ్వరారామచంద్రాపూర్వకాలంలో సత్యంధర్మం అంటే ఆసక్తిగల ఒక ముని వుండేవాడుఅడవిలోని మృగాలన్నాపశు పక్ష్యాదులన్నా మిక్కిలి ప్రేమకలవాడాయనఆయన తపస్సుకు విఘ్నం కలిగించడానికి ఒకనాడు ఇంద్రుడు భటుడి వేషంలో వచ్చిఒక కత్తిని ఇచ్చిఇది నీదగ్గర వుంచుకొమ్మని చెప్పి వెళ్లాడుదాన్ని కాపాడాలన్న ఆసక్తితో ఆ ముని ఎక్కడికి పోయినా ఆ కత్తిని వెంట తీసుకుపోయేవాడు.అలా దానికి అలవాటు పడ్డాడుకత్తి చేతులో వుంచుకుని పోవడానికి అలవాటుపడ్డ మునికి దానిమీద ప్రేమ పుట్టుకొచ్చిందిలోగడ కాయలుకూరలు చేతితో కోసే ముని ఇప్పుడు కత్తితో కోయసాగాడుఅగ్నిహోత్రానికి సమిధలు చేత్తో విరిచేవాడల్లా కత్తితో కొమ్మలు కోయసాగాడు. అడవి మృగాలను కత్తితో తరమ సాగాడు. ఆ తరువాత హింసనే ప్రారంభించాడు. ఈ క్రూర వినోదాలకు అలవాటుపడి తాను చేయాల్సిన నిత్య కృత్యాలను ఉపేక్షించాడు. ఆ కారణాన వాడు అధోగతుల పాలయ్యాడు. ఆయుధం చేతిలో వుండడాన ఎంత అనర్థం కలిగిందో చూశారాఆయుధం చేతిలో వుంటే దేన్నైనా కొడ్దామన్న ఆలోచనే కలుగుతుంది.

ఇప్పుడు నేను చెప్పిన ఇతిహాసం నా కల్పితం కాదుపూర్వకాలంలో జరిగిన చరిత్రేఇది శస్త్ర సంయోగం వల్ల కలిగే కీడు గురించి తెలియచేస్తుందిఅగ్నిహోత్రుడు దేనిని (కట్టెలనుఆశ్రయిస్తాడోదాన్నే దహించి వేస్తాడుఅలాగే శస్త్రం కూడా తన్నెవరు ధరిస్తారో వారికే కీడు చేస్తుందిఇదంతా నీకు తెలియదనినువ్వు అజ్ఞానివనీనేను నేర్పడం లేదుమీరు నాకిచ్చిన చనువు కారణాననన్ను సగౌరవంగా చూసి నా మాట మన్నించడం వల్లానాకు స్వభావసిద్ధంగా మీమీద స్నేహ భావం వుండడం మూలాననేను మీరు మరచిన దానిని జ్ఞప్తికి వచ్చేట్లు చెప్పానుకాని నీకు తెలియని కొత్త విషయం నేర్పడానికి రాలేదుకాబట్టి నన్ను క్షమించునేనెంత దూరం ఆలోచించినా ఇప్పుడుఇక్కడమీ ప్రయత్నం నాకిష్ఠం కావడం లేదునువ్వు సుజన శేఖరుడవేకాని ఏదో ప్రమాద వశాత్తు సుజన కృత్యాన్ని మరచావుమునివృత్తిలో వుండే వారికి ఆయుధాలతో పనిలేదుకాబట్టి ఆయుధాలను మీరు ధరించడం సరైన పని కాదుఆపైన మనం బలవంతులంమనకు ఎవరడ్డమని బలగర్వంతో పగలేకపోయినా దండకారణ్యంలోని రాక్షసులను చంపడం మరో సరికాని పనినేనెంతో ఆలోచించారాక్షసులైనా నిరపరాధులను దండించడం నాకిష్ఠం లేదునాకు కొంచెమైనా తృప్తి కలగడం లేదుప్రాణేశ్వరాశ్రీరామచంద్రాఅడవుల్లో మునులు తిరగడానికీశస్త్రాలను ధరించడానికీ ఏం సంబంధంమునివృత్తి శాంతి ప్రధానం. ఆయుధ ధారణ కౌర్య ప్రధానం. ఒకటి శుద్ధ సాత్త్వికం....ఇంకొకటి శుద్ధ తామసం. ఇక నీకులోచితమైన క్షత్రియత్వం ఎక్కడబ్రాహ్మనోచితమైన తపస్సెక్కడరెండింటికీ పొంతన ఎలా కుదుర్తుందినువ్వు చేయబోయే ఈ పని పరస్పర విరుద్ధ గుణాలున్నది. నువ్వే ఆలోచించు. కాబట్టి రెండింటిలో ఒకటి వదలు. శస్త్రాన్నైనా వదలు....క్షాత్రమైనా వదలు....తపస్సైన వదలు. అలా కాకుండా ఎందుకు రెంటా చెడాలి?”


"ఏ దేశంలో మనం వుంటామోఆ దేశాల ధర్మం ప్రకారమే మనం నడచుకోవాలికాబట్టి ముని మార్గంలో వున్న నువ్వు మునుల పనైన అహింసను అవలంభించడం సరైన కార్యం కదాశస్త్రాన్ని ధరించడమే జరగుతేదాన్ని ఉపయోగించాలన్న పాపపు బుద్ధి పుట్తుందికాబట్టి నువ్వు అడవుల్లో వున్నన్నాళ్లు శస్త్రం ధరించవద్దు.నాకులోచిత ధర్మాన్ననుసరించి శస్త్రాన్ని ధరించాలనుకుంటేఅయోధ్యకు నువ్వు మరలిపోయిన తరువాతమళ్లీ గృహస్థ ధర్మంలో వున్నప్పుడుధర్మ సంరక్షణార్థం శస్త్రాన్ని ధరించవచ్చుఅనుభవించాల్సిన ఐశ్వర్యంపాలించాల్సిన భూమివదలిపెట్టిమునిలాగా అడవుల్లోకి వచ్చిన నువ్వుమునిలాగానే తపస్సు చేస్తేరాముడు యదార్థవాది-నాతో చెప్పినట్లే చేస్తున్నాడని కైక సంతోషిస్తుందినా కొడుకు ఎక్కువ శ్రమపడకుండా సుఖంగా వున్నాడని కౌసల్య సంతోషిస్తుందివీరేకాకుండా స్వర్గంలో వున్న నా మామగారు కూడా తనకొడుకు తనను సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తారుకాబట్టి అలాగే చేయిధర్మంతో ధనం లభిస్తుందిధర్మం వల్ల సుఖం కలుగుతుందిధర్మంతో చేసే సత్కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయిధర్మహీనుడు చేసే సత్కర్మలు ఫలించవుకాబట్టిశర్మకరా ప్రపంచం ధర్మమే సారంగా కలదిధర్మం చెడితే జగమంతా చెడుతుందిరామచంద్రాఈ ఋషీశ్వరుల వెంట హాయిగా నువ్వు ఈ ఆశ్రమానికిఆ ఆశ్రమానికీ తిరుగుతుంటే సుఖం లేదుపరలోకంలో సుఖం కావాలనుకునేవారు కఠిన వ్రతాలనునియమ నిష్ఠలను అనుసరించాలిమనస్సు జయిస్తే లోకోత్తరమైన ధర్మ ఫలం లభిస్తుందికాబట్టి దానికొరకు కృషి చేయినీ సౌజన్యంసాధుత్వంలోకమంతా గౌరవిస్తాయి. మనస్సు నచ్చిన ప్రకారం నడచుకోకుండానిష్కల్మషమైన బుద్ధితో కార్యం సాధించగలవాడివి. ఇలాంటి నీకు మూడులోకాలలో తెలియందేదీ లేదు. ప్రాణేశ్వరా! నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు. నువ్వు అడవుల్లో తిరిగినంత కాలం హింసా వ్యాపారం లేకుండా వుండకూడదాఇదే నేను కోరేది. నువ్వు సజ్జన వందితుడవు. హింసారతుడవైతే సజ్జనులు మెచ్చరేమోరాముడు క్రూరుడు అంటారేమోనని విచారిస్తున్నాను. స్థ్రీలకు స్థిర బుద్ధి లేదు. ఇతమిత్థమని నిశ్చయించలేరు. కాబట్టి నాకు స్వభావ సిద్ధమైన బుద్ధి చపలత వల్ల తోచింది చెప్పా. నీకు ధర్మం చెప్పగల సమర్థులెవరుకాబట్టినువ్వునీ తమ్ముడు ఆలోచించి ఏది మేలని తోస్తే అదే చేయండి".

3 comments:

  1. రాముడిని సీత నువ్వు..నువ్వు... అని ఏకవచనంతో సంబోధించేదా ?

    ReplyDelete
  2. Ramayana lo pidakala veta, kodi guddu meedha eekalu peekuta

    ReplyDelete
  3. స్థ్రీలకు స్థిర బుద్ధి లేదు. ఇతమిత్థమని నిశ్చయించలేరు. కాబట్టి నాకు స్వభావ సిద్ధమైన బుద్ధి చపలత వల్ల తోచింది చెప్పా. నీకు ధర్మం చెప్పగల సమర్థులెవరు?

    ReplyDelete