Friday, July 26, 2019

ప్రగతిపథంలో దూసుకెళ్తున్న ఓపెన్ వర్సిటీ : వనం జ్వాలా నరసింహారావు


ప్రగతిపథంలో దూసుకెళ్తున్న ఓపెన్ వర్సిటీ
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-07-2019)
దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఓపెన్ డిస్టెన్స్ ల‌ర్నింగ్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, కెరియ‌ర్ ప్లానింగ్ కేంద్రం ఏర్పాటు, స్ట‌డీ మెటీరియ‌ల్ డిజిటైజేష‌న్ ఏర్పాటు.

డాక్టర్‌. బి.ఆర్‌, అంబేద్కర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బిఆర్‌ఏఓయూ) తెలంగాణ ఓపెన్‌ యూనివర్సిటీగా ప్రసిద్ది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటి. హైదరాబాద్‌ మహానగరంలో ప్రజా యూనివర్సిటీగా సేవలు అందిస్తున్నది. 2016 జూలై 25న వైస్‌ ఛాన్సిలర్‌గా ఈ యూని ' వర్సిటీ బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీ' కుసుంబ సీతారామారావు గత మూడేళ్లుగా ఉన్నత స్థాయిలో నాణ్యమైన విద్యా విషయాల కల్పనతో పాటు అధ్యయనాలకు తోడ్పడే సేవల కల్పనపై దృష్టి పెట్టారు.

యూనివర్సిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలలో విస్తరించిన ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, స్టడీ సెంటర్ల వ్యవస్థ ద్వారా మారు మూల ప్రాంతాల ప్రజలకు పెద్దఎత్తున తమ సేవలను అందిస్తున్నది. దూర విద్య కల్పనలో ప్రధాన సంస్థగా ఆవిర్భవించిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మారుమూల ప్రాంతాలలో కూడా విద్యా పరమైన వసతుల కల్పన(ఓపెన్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌... ఓడిఎల్‌)లో ప్రముఖ పాత్ర వహించింది.

భారతదేశంలోనే ఏర్పడిన తొలి ఓపెన్‌ యూనివర్సిటీగా ఖ్యాతి పొందిన బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2017-18 విద్యా నంవత్సరం నుంచి విద్యార్థుల అధ్యయనపరమైన ఆశలకు అనుగుణంగా ఛాయిస్‌ బేస్ట్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సిబిసిఎస్‌) సరళిని అమలు చేయడం ద్వారా యుజి స్థాయి కార్యక్రమాలలో పాఠ్యాంశాలు మరియు సిలబస్‌లకు మొదటి అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ రెండు విద్యా సంవత్సరాలలో నాలుగు సెమిస్టర్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు 2019-20 విద్యా సంవత్సరంలో ఫస్ట్‌ బ్యాచ్‌ గ్రాడ్యుయేట్‌లుగా యూనివర్సిటీ నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. తొలిసారిగా యూనివర్సిటీ మూడు వార్షిక స్నాతకోత్సవాలను - 21, 22, 23వ - వరుసగా నిర్వహించుకుంటున్నది. ఫలితంగా 2017, 2018, 2019 బ్యాచ్‌ల విద్యార్థులు ప్రయోజనం పొందగలరు.

సీబీసీఎస్‌ పద్ధతిలో భాగంగా విద్యాపరమైన కొత్త అంశాలు. స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సెన్స్‌ అండ్ అప్లికేషన్స్‌, జియోగ్రఫీ వంటివి అంశాలను ప్రవేశ పెట్టడంతో పాటు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో నిర్దుష్టమైన తప్పని సరి కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. ఓపెన్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌ విధానం ద్వారా నాణ్యత, నిపుణత విస్తరణకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌, కెరియర్‌ ప్లానింగ్‌ కేంద్రంను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌ డిసి, ఇతర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల మార్గదర్శిక సూత్రాల ప్రాతిపదికన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోర్సుల( సర్టిఫికెట్‌ డిప్లమా స్థాయి) బోధనా కేంద్రంగా ఈ కేంద్రం గుర్తింపు పొందుతుంది. ఇందుకోసం యూనివర్సిటీ ఆర్మి ఆర్డినెన్స్‌ కార్టర్స్‌(ఏఓసీ) సికింద్రాబాద్‌, మహారాష్ట నాలెడ్డ్‌ కార్పొరేషన్‌ లిమిడెడ్‌(ఎంకెసిఎల్‌) పుణే, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఫలితంగా అండర్‌ (గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాలలో విద్యార్థులు స్కిల్‌ ఎడ్యుకేషన్‌ పొందగలరు. ఈ స్కిల్స్‌ ప్రాతిపదికన మూడేళ్ల జనరల్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంతో పాటు ఓరియెండెట్‌ సర్టిఫికెట్‌, డిప్లమా కార్యక్రమాలలోనూ ప్రతిభలను అభివృద్ధి చేసుకుంటారు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, యూజీసీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో చేపట్టిన నేషనల్‌ డిజిటల్‌ కార్యక్రమం కింద ఈ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ లర్నర్ సపోర్ట్‌ సర్వీసెస్‌, మల్టిపుల్‌ గేట్‌ వేస్‌ ఆఫ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ లను పటిష్టం చేసింది. అలాగే ఆధునీకరించి అప్‌ గ్రేడ్‌ చేసిన యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఉద్యోగుల సమయపాలన,  క్రమబద్ధమైన హాజరును ప్రోత్సహించేందుకు బయో- మెట్రిక్‌ అటెందెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, యూనివర్సిటీ భవనాలు, మొత్తం క్యాంపస్‌ లో క్లోజ్డ్‌ సర్కూయట్‌ ఎలక్ష్ఞానిక్‌ పర్యవేక్షణ విధానాన్ని ప్రవేశ పెట్టింది.


యూనివర్సిటీ వ్యవస్థీకృత ఓపెన్‌ ఎడ్యుకేషనల్‌ రిసోర్సెస్‌ (ఓఇఆర్‌) విధానానికి రూపకల్పన చేయడంతో పాటు బీఆర్‌ఏఓయు విద్యా జ్ఞాని (ఓపెన్‌ ఎడ్యుకేషనల్‌ రిసోర్సెస్‌ రిపోజిటరీ)ని ఏర్పాటు చేస్తున్నది. అవసరమైన విద్యారులకు విద్యాపరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సాఫ్ట్‌ కాపీలను కల్పించేందుకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ డిజిటైజేషన్‌ కార్యక్రమం కూడా ఇప్పటికే ఆరంభమైంది. వెట్‌ రేడియో ద్వారా, యూ ట్యూబ్‌ ద్వారా మల్టీ మీడియా (ఆడియో- వీడియా) సహాయంతో పాఠాలను కల్పిస్తున్నారు. అన్ని అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ పరీక్షలలోనూ జవాబు పత్రాల పరిశీలన, మూల్యాంకనంలను సమర్థంగా, ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించడంతో పాటు ప్రశాంతంగా ఫలితాలను ప్రకటించేందుకు వీలుగా డిజిటల్‌ ఆన్‌ స్ర్కీన్ ఎవల్యూషన్‌ సిస్టమ్‌ (డిఓఎస్‌ ఇఎస్‌)ను యూనివర్సిటీ ప్రవేశ పెట్టింది. వ్యవస్థాపరమైన ఐటీ విధానం రూప కల్పనకు, సమర్థవంతంగా లర్నింగ్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌) కల్పనకు వీలుగా ఈ లర్నింగ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా అవార్డులు, సర్టిఫికెట్స్‌ డిజిటల్‌ స్టోరేజి పర్యవేక్షణ కోసం ఎంహెచ్‌ ఆర్‌డి( మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ) యూజీసీల నేషనల్‌ అకడమిక్‌ డిపోజిషన్‌ (ఎన్‌ఏడి) విధానంలో భాగంగా యూనివర్సిటీ సిడిఎస్‌ఎల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుని అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

వివిధ విద్యాపరమైన, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలుకోసం యూనివర్సిటీ పలు చర్చా కార్యక్రమాలను, గోష్టులను, స్మారకోపన్యాసాలను, వర్క్‌ షాప్‌లనూ, సెమినార్‌లను ఏర్పాటు చేస్తున్నది. అంతే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, కామన్వెల్త్‌ ఆఫ్ లర్నింగ్‌ (సిఓఎల్) సహకారంతో అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ లను,  పలు కీలక అంశాలపై సమావేశాలను నిర్వహించింది. ఓపెన్‌ డిజిటల్‌ లర్నింగ్‌ విధానాన్ని నిరంతరం సమర్థంగా నిర్వహించే అంశంపై చర్చించేందుకు, ఓ అంతర్జాతీయ సమావేశంతో పాటు, ఆలిండియా ఓపెన్‌ యూసివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని(ఆర్టీఎం) అంబేద్మర్‌ ఓపెన్‌‌ యూనివర్సిటీ సమర్థంగా నిర్వహించింది.

యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ తన పదవీ కాలంలో విద్యాపరమైన పలు కార్యక్రమాలను, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు గోష్టులను చురుగ్గా నిర్వహించడమే కాదు. టొరంటో, కౌలాలంపూర్‌, న్యూఢిల్లీలో జరిగిన ఓపెన్‌ యూనివర్సిటీ  వైస్‌ ఛాన్సిలర్‌ ల అంతర్జాతీయ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అలాగే పుణే సింబియోసిస్‌ యూనివర్సిటీ, అసోం గువాహటిలోని కెకెహెచ్‌ఎస్‌ ఓయూ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాల్లో విజయవంతంగా పాల్గొన్నారు.

దేశంలో ఓపెన్‌ యూనివర్సిటీల ఏర్పాటు, రెగ్యులర్‌ యూనివర్సిటీలలో ఓపెన్‌ డిజిటల్‌ లర్నింగ్‌కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, మౌలిక సౌకర్యాల నిర్దారణ, అంచనా, వాటికి అవసరమైన అక్రిడేషన్‌ విధానం రూపకల్పన కోనం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూసీజీ)కి చెందిన నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలోనూ నేషనల్‌ ఎక్రిడేషన్‌ అండ్‌ అసైస్మెంట్‌ కమిటీ(ఎన్‌ఏఏసీ) నభ్యుడుగా అంబేద్యర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం వైస్‌ ఛాన్సిలర్‌ సీతారామరావు యూజీసీ ఓడిఎల్‌, అన్‌లైన్‌ విద్య క్రమబద్ధీకరణ, అమలుకు నంబంధించిన యూజీసీ నేషనల్‌ వర్మింగ్‌ గ్రూప్‌ (ఎన్‌ డబ్య్యూజి) సభ్యులుగా ఉన్నారు. యూజీసీ జాతీయ స్టాయి వైస్‌ ఛాన్సిలర్‌ల కమిటీ నభ్యుడేగా, విజిటింగ్‌ టీమ్‌ చైర్మన్‌, సభ్యులుగా. ముంబై యూనివర్సిటీ, మేవార్‌ యూనివర్సిటీ,(చిత్తోర్‌ గఢ్‌, రాజస్టాన్‌)లను  సందర్శించి ఈ రెగ్యులర్‌ యూనివర్సిటీలలో ఓపెన్‌ డిజిటల్‌ లర్షింగ్‌ వ్యవస్థల పనితిరును, వాటి స్థాయిలను అంచనా వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.

అంబేద్మర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేసిన రూ. 20 కోట్ల ఏకమొత్తం గ్రాంట్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ భవనం పైకప్పుపై 300 కిలోవాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు చాలా మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులను చేపడుతున్నది.

విద్యారంగంలో పరిశోధన పరమైన నాణ్యత మెరుగుపరచడంతో పాటు, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ పనులను ప్రవేశపెట్టడం, విస్తరణ చేపట్టడం, స్టడీ  కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, ఆడియో- వీడియా పాఠాల అభివృద్ధి ప్రోత్సాహం, వ్య స్థకృత ఐటీ విధాన రూపకల్పన, ఓపెన్‌ డిజిటల్‌ లర్నింగ్‌ కార్యక్రమాల అంతర్జాతీయకరణ వంటి పలు కార్యక్రమాలు బీఆర్‌ఏఓయూ చేపట్టిన భవిష్యత్‌ ప్రణాళికలలో ఉన్నాయి. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గత మూడేళ్లుగా చేపట్టిన విద్యాపరమైన, అభివృద్ధి పరమైన కార్యక్రమాలు బహుశా ఇటువంటి ఏ యూనివర్సిటీ కూడా చేపట్టలేదంటే అతిశయోక్తి కాబోదు. ఈ ఘనత అంత వైస్‌ ఛాన్సిలర్‌ కుసుంబ సీతారామారావు గారికే దక్కుతుంది. అసాధారణ విద్యా వేత్త, అనుభవశాలి అయిన ఆయన ఆధ్వర్యంలో యూనివర్సిటీ బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందడమే కాక, దూరవిద్యలో ప్రపంచ స్థాయిలోనే ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూషన్‌గా ఎదిగి, ప్రశంసలు అందు కుంటున్నది. యూనివర్సిటీని ఈస్థాయికి చేర్చడంలో తనకు ముందు పనిచేసిన వైస్‌ ఛాన్సిలర్లు, ఇతరులకు వైస్‌ ఛాన్స్‌లర్‌ వినమ్ర పూర్వకంగా ధన్యవాదాలు తెలుపడం ఆయన ఔదార్యతకు అద్దం పడుతున్నది.

No comments:

Post a Comment