ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-14
వనం జ్వాలానరసింహారావు
బాల కాండ చివరి పద్యం "తరలము" వృత్తంలో ఈ విధంగా రాస్తూ కాండలో మొత్తం ఎన్ని పద్యాలున్నాయో వివరిస్తారు వాసు దాసుగారు.
తరలము: జలజవైరిమహీధరాగ్ని శశాంకపద్యనిరూపితా
తులితబాల్యవినోదఖేలన తోయజాక్ష ! రమాధవా !
కలశవారిధితుల్యసజ్జన కాండ చిత్తనివాసకా !
కలుషసంహార ! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా ! -17
ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం: జలజవైరి (చంద్రుడు)=1 , మహీధర (పర్వతాలు)= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసు దాసుగారు ఎన్ని పద్యాలు రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371 పద్యాలున్నాయి.
No comments:
Post a Comment