పరిమాణాత్మక సడలింపుతో
ఆర్థికప్రగతి
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక
(29-04-2020)
తెలంగాణ
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఏప్రిల్ 11న ఏర్పాటు చేసిన పత్రికా
సమావేశంలో క్వాంటిటేటివ్ ఈజింగ్ (పరిమాణాత్మక సడలింపు) గురించి, హెలికాష్టర్ నగదు గురించి చెప్పారు. అప్పటి
నుంచి ఈ రెండు పదాల గురించి చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నిరక్షరాస్యులు కూడా
వీటి గురించి మాట్లాడుతు న్నారు. ముఖ్యమంత్రి కెఆర్ చాలా స్పష్టంగా తన మాటలు
చెప్పారు. “ప్రస్తుతం మనం క్లిష్టపరిస్టితుల్లోఉన్నాం. ఈ పరిస్థితుల నుంచి బయటపడే
పరిష్కారం గురించి మనం ఆలోచించాలి. ఈ సంక్షోభం నుంచి దేశం బయటపడడానికి ఒకే ఒక్క
మార్గం పరిమాణాత్మక సడలింపు” అని ముఖ్యమంత్రి చెప్పారు.
పరిమాణాత్మక
సడలింపు అనేది సాంప్రదాయేతర ద్రవ్యవిధానం. ఈ విధానంలో ఆర్జిక వ్యవస్థలోకి సరికొత్త
ద్రవ్యసరఫరా బయటి నుంచి జరుగుతుంది కాబట్టి, ఈ నగదు ఆకాశం నుంచి
అనుకోని సహాయంగా లభిస్తుంది కాబట్టి దీన్ని హెలికాఫ్టర్ మనీ అంటారు. (రాజకీయాల్లో
బయటి వాడిని తీసుకొచ్చి ఒక నియోజకవర్గంలో నిలబడితే, పారాచూట్ అభ్యర్థి అనడం మనకు
తెలిసిందే కదా? ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు. అర్జిక వ్యవస్థలోకి బయటి నుంచి
డబ్బును సరఫరా చేయడం. దీన్ని హెలీకాప్టర్ మనీ అంటారు). సాధారణంగా కేంద్ర రిజర్వు
బ్యాంకులు ఈ పని చేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభానికి, సంకటానికి గురైనప్పుడు మరలా గాటన పెట్టడానికి ఈ పద్ధతి పాటించడం జరుగుతుంది.
ఆ రోజు కేబినేట్
సమావేశం తర్వాత కెసిఆర్ ప్రధాని మోడీకి ఒక లేఖరాశారు. ఆ లేఖలో తన అభిప్రాయాలను స్పష్టంగా
చెప్పారు. “ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కేద్ర బ్యాంకులు సంచలనాత్మక
నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆర్జిక సంక్షోభాన్ని నివారించడానికి
ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం 1929 సంక్షోభం కన్నా, 2008 నాటి మాంద్యం కన్నా చాలా తీవ్రమైనది. ఇలాంటి క్షిష్టమయాల్లో సాహసోపేత
నిర్ణయాలు అవసరం. కోరలు చాస్తున్న ఈ ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానికి ఒకే ఒక్క
మార్గం పరిమాణాత్మక సడలింపు మాత్రమే. హెలీకాష్టర్ మనీని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి.
ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో కేంద్ర బ్యాంకులు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్
ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ సెంట్రల్
బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సెంట్రల్ బ్యాంక్ ఆపహ
రష్యా, బ్యాంక్ ఆఫ్ కెనడా,
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తదితర బ్యాంకులు ఈ
పద్ధతినే ఆచరణలో పెట్టాయి. ప్రతిపాదిత పరిమాణాత్మక సడలింపు దేశ స్తూల
జాతీయోత్పత్తిలో కనీసం 5 శాతం ఉండాలి. 2019-20లో భారత స్థూల జాతీయోత్పత్తి 203.85 లక్షల కోట్ల
రూపాయలు. ఇందులో 10 శాతం అంటే 10.15 లక్షల కోట్ల రూపాయలు పరిమాణాత్మక సడలింపు రూపంలో ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి
వివరించి రాశారు.
పరిమాణాత్మక
సడలింపులో మార్కెటు నుంచి పెద్దస్థాయిలో సెక్యురిటీల కొనుగోలు జరుగుతుంది.
ఒకదేశానికి చెందిన కేంద్రబ్యాంకు, అంటే మనదేశంలో రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారితమొత్తంలో ప్రభుత్వ బాండులు కొనుగోలు చేయడం, ఇతర ఆర్థిక పెట్టుబడులకు ఖర్చుపెడతాయి. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలోకి నగదు
ప్రత్యక్షంగా ప్రవేశించేలా చేస్తాయి. ఇది కేంద్ర బ్యాంకులు అసాధారణ' పరిస్థితుల్లో పాటించే ద్రవ్యనీతి. ఇలా కొత్తగా ప్రవేశపెట్టిన నగదుతో ప్రభుత్వ
రుణాలను కొనుగోలు చేస్తారు. పరిమాణాత్మక సడలింపు కాలం ముగిసిన తర్వాత ఈ
పెట్టబడులను ఉపసంహరిస్తారు. తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు మిగిలిపోతాయి.
పరిమాణాత్మక
సదలింపు వల్ల ఆర్ధిక వృద్ధికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది. ఎందుకంటే, ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన నగదు ప్రజల చేతుల్లోకి చేరుతుంది. ప్రజల
కొనుగోలు శక్తి పెరుగుతుంది. కౌనుగోళ్ళు పెరగడం వల్ల వినియోగదారులపై. వాణిజ్య
వర్గాలపై దాని ప్రభావం పడుతుంది. ద్రవ్యప్రవాహం క్రింది స్థాయివరకు
వ్యాపిస్తుంటుంది. ఫలితంగా స్టాక్ మార్కెట్ పనితీరు మెరుగవుతుంది.
స్థూలజాతీయోత్పత్తిలో వృద్ధి నమోదవుతుంది. అయితే ఇక్కడ సమస్యేమిటంటే, పరిమాణాత్మక సడలింపు ద్వారా తయారు చేసిన కొత్త డబ్బుతో ఆర్థికవిపణిలో ప్రభుత్వ
బాండ్లను కొనడం జరుగుతుంది. అందువల్ల కొత్తగా తయారు చేసిన డబ్బు తిన్నగా ఆర్ధిక
విపణిలోకి వెళ్ళిపోతుంది. బాండ్లు, స్టాక్ మార్కెట్ల విలువను
ఒకేసారి పెంచేస్తుంది. చరిత్రలో అత్యధిక స్థాయి విలువ బాండ్లకు లభిస్తుంది.
పరిమాణాత్మక సడలింపును ముగించడం వల్ల తర్వాత ద్రవ్యసంకోచం (deflation) తలెత్తవచ్చు.
పరిమాణాత్మక
సడలింపు లక్ష్యమేమిటంటే,
ఆర్థిక కార్యకలాపాలు పెంచడం, ఆర్థిక వ్యవస్థలో నగదును
అందజేయడం ద్వారా ఆర్టిక కార్యకలాపాలను పెంచుతారు. పరిమాణాత్మక సడలింపు వల్ల
ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఆర్థికవ్యవస్థకు అవసరమైన మొత్తం ఎంత అన్నది నిర్ణయించడంలో
పొరబడితే,
అవసరం కన్నాఎక్కువ మొత్తం నగదు ఆర్థికవ్యవస్థలో
ప్రవేశపెడితే,
సెక్యూరిటీల కొనుగోలు ద్వారా పెద్దమొత్తంలో నగదు చేర్చితే
ద్రవ్యోల్బణం చోటుచేసుకుంటుంది. అలాగే వ్యాపారాలకు, గృహావసరాలకు బ్యాంకులు రుణాలివ్వకుండా
తిరస్కరించడం జరిగితే మార్కెటులో డిమాండ్ అనేది జన్మించదు. పలితంగా పరిమాణాత్మక
సడలింపు విఫలమవతుంది.
కేంద్ర బ్యాంకు
ద్రవ్య సరఫరా పెంచితే దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పరిస్థితి పూర్తిగా
చేయిజారితే,
పరిమాణాత్మక సడలింపు వికటించవచ్చు. ఆర్థికవృద్ధి లేకుండా
ద్రవ్యోల్బణం పెరిగిపోవచ్చు. దానివల్ల డిమాండ్ మందగిస్తుంది. ద్రవ్య నిశ్చలనం (stagflation) దశ ఏర్పడవచ్చు. అంటే ధరలు పెరగడం, ద్రవ్యోలృణం, డిమాండ్ లేకపోవడం,
నిరుద్యోగం పెరిగిపోతాయి. మీడియా, బ్యాంకర్లు,
ఆర్థిక విశ్లేషకులు కొందరు పరిమాణాత్మక సడలింపును కరెన్సీ
ముద్రణగా పేర్కొంటున్నారు. సాధారణంగా పరిమాణాత్మక సడలింపు ద్వారా ప్రవేశపెట్టే
నగదుతో ప్రభుత్వ బాండ్లు కాకుండా ఇతర ఆర్థిక ఆస్తులు కొనడం జరుగుతుంది.
అమెరికాకు చెందిన
ఆర్థిక నిపుణుడు,
వరల్డ్ మనీ వాచ్ అధ్యక్షుడు కింబర్లే అమాడియో ప్రకారం జపాన్
ప్రపంచంలో మొదటిసారి పరిమాణాత్మక సడలింపును 2001 నుంచి 2006 వరకు ప్రయోగించింది. తర్వాత 2012లో షింజో అబే
ప్రధానిగా ఎన్నికైన తర్వాత కూడా పరిమాణాత్మక సడలింపు మళ్ళీ ప్రారంభించారు.
అమెరికాలోని ఫెడరల్ రిజర్వు 2008లో అత్యంత జయప్రదంగా
పరిమాణాత్మక సడలింపు అమలు చేసింది. దాదాపు 2 ట్రిలియన్ డాలర్లను
ద్రవ్య సరఫరాలో చేర్చింది. చరిత్రలో ఆర్థిక ప్రోత్సాహక కార్యకలాపాల్లో ఈ స్థాయిలో
జరిగింది మరొకటి లేదు. జనవరి 2015లో యూరోపియన్ సెంట్రల్
బ్యాంకు పరిమాణాత్మక సడలింపును ఆచరణలో పెట్టింది. గత అనుభవాలను చూస్తే పరిమాణాత్మక
సడలింపు వల్ల కొన్ని లక్ష్యాలు సాధించగలిగారు. చాలా లక్ష్యాలు సాధించడం
సాధ్యపడలేదు. అలాగే కొన్నిఆర్థిక బుడగలను కూడా ఇది సృష్టించింది. ఆర్థిక వ్యవస్థ
నిలదొక్కుకోడానికి ఉపయోగపడింది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే నిధులు, అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందజేసింది. వడ్డీ రేట్లు తక్కువస్థాయిలో ఉండేలా
చేసింది. దానివల్ల నివాసగ్భహాల మార్కెటు పునరుద్ధరణ సాధ్యపడింది.
ఆర్థికవృద్ధికి
పరిమాణాత్మక సడలింపు తోడ్పడిందన్నది నిజమే కాని అనుకున్న స్థాయిలో కాదు. మరింతగా
రుణాలు అందుబాటులోకి వస్తాయనుకున్నారు, కాని అది సాధ్యపడలేదు.
దీనివల్ల బ్యాంకులకు డబ్బు దొరికింది. బ్యాంకులు ఆ డబ్బును ఇనప్పెట్టెల్లో
దాచుకున్నాయి. ప్రజలకు రుణాలివ్వలేదు. ఈ నిధులను బ్యాంకులు ఉపయోగించుకుని
డివిడెండ్లు,
స్టాక్ ప్రతి కొనుగోళ్ళ ద్వారా తమ స్టాకుల విలువ
పెంచుకోడానికి ప్రయత్నించాయి. అయితే పరిమాణాత్మక సడలింపు వల్ల ద్రవ్యోల్బణం
పెరుగుతుందని భయపడిన స్థాయిలో పెరగలేదు. బ్యాంకులు రుణాలిచ్చి ఉన్నట్లయితే
వ్యాపారం పుంజుకుని ఉండేది. ఉద్యోగాలు పెరిగేవి.
పరిమాణాత్మక
సడలింపులో భారీస్థాయిలో నగదు మార్కెటులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కొత్తగా భారీ
సంఖ్యలో ముద్రించిన నోట్లను హెలికాఫ్టర్ మనీ అంటారు. ఆర్ధిక మాంద్యం నుంచి బయట
పడడానికి,
వడ్డీరేట్లు శూన్యానికి చేరుకున్నప్పుడు పరిస్థితి
మార్చడానికి ఈ విధంగా ముద్రించిన సొమ్మును ప్రజల చేతికి అందేలాచేస్తారు. దీన్ని
హెలీకాప్టర్ డ్రాప్ అని కూడా అంటారు. విపత్తుల సందర్భంగా ఆకాశం నుంచి నిత్యావసరాలను
హెలీకాష్టర్ల ద్వారా జారవిడిచిన మాదిరిగా అని అర్థం చేసుకోవచ్చు. ఇది సంప్రదాయేతర
ఆర్థిక విధానం. కూలబడిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ లేపి నిలబెట్టడానికి ఈ విధానాన్ని
అవలంబిస్తారు. అమెరికా ఆర్థికవేత్త మిల్దన్ ప్రయిడ్ మ్యాన్ ఈ పదాన్ని మొదట
ఉపయోగించాడు. సంక్షోభంలో ఉన్న ఆరిక వ్యవస్థను నిద్ర నుంచి ఒక్క కుదుపు ద్వారా
లేపడానికి అనూహ్యంగా భారీ పరిమాణంలో నగదును ప్రవేశపెట్టడమని (ఫైడ్
మ్యాన్నిర్వచించాడు.
ఈ విధానం ప్రకారం
కేంద్ర బ్యాంకు ప్రత్యక్షంగా దవ్యసరఫరా పెంచేస్తుంది. ప్రభుత్వం ద్వారా కొత్తగా
ముద్రించిన సొమ్మును ప్రజలకు చేరవేస్తుంది. ఆ విధంగా డిమాండ్ పెంచడానికి, ద్రవ్యోల్బణం పెంచడానికి ప్రయత్నిస్తుంది. కేంద్ర బ్యాంకులు కరెన్సీనోట్లను
ముద్రించడం వాటితో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం పరిమాణాత్మక సడలింపులో భాగం.
అయితే పరిమాణాత్మక సడలింపులో ప్రభుత్వం ఉపయోగించే డబ్బును హెలీకాష్టర్ మనీగా చాలా
మంది భావించడం లేదు. కేంద్ర బ్యాంకులు బాండ్లను కొనుగోలు చేయడం వంటిది కాదిది. ఇలా
బాండ్లను కొనడం అంటే బ్యాంకు ఆస్తులను సెంట్రల్ బ్యాంకు రిజర్వుతో మార్చుకోవడం
జరుగుతుంది. అలాగే ప్రభుత్వ అప్పుల కోసం సెంట్రల్ బ్యాంకు ప్రత్యక్షంగా
పెట్టుబడిపెట్టడం కూడా కాదిది.
మాజీ ఆర్థిక
సలహాదారుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రకారం వర్థమాన విపణులపై పరిమాణాత్మక నడలింపు
ప్రభావం సమతుల్యంగాను,
సానుకూలంగాను ఉంటుంది. ఆవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై
దీని ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వర్థమాన విపణుల్లో అస్తిరత్వానికి
కూడా ఇది కారణమైంది. స్థూల ఆర్థిక నిర్వహణను సంక్షిష్టమయ్యేలా చేసింది. ఫలితంగా
ఆయా దేశాల్లో ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై కూడా
ప్రభావం పడింది. అమెరికాలో,
ఆర్థిక విధానాలు వాణిజ్యానికి సంబంధించిన హౌస్ కమిటీ ముందు
అరవింద్ సుబ్రహ్మణ్యం ఇంతకుముందు ఈ విషయమై వాంగ్మూలం ఇచ్చి ఉన్నాడు.
ఫెడరల్ రిజర్వులకు
పరిమాణాత్మక సడలింపు అమలు చేస్తే అంతర్జాతీయంగా పడే ప్రభావం గురించి తన
అభిప్రాయాలు చెప్పారు. పరిమాణాత్మక సడలింపు వల్ల ప్రయోజనాలున్నాయి. ఇబ్బందులు కూడా
ఉన్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన పరిస్థితులుదృష్ట్వా, ముంచుకు రాబోతున్న ఆర్ధిక సంక్షోభం దృష్ట్వా, పరిమాణాత్మక సడలింపు ప్రవేశపెడితే అవసరమైనంత నగదు పంపిణీలోకివస్తుంది. ఫలితంగా
ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రభుత్వానికి
తగినంత ద్రవ్యనిల్వల సదుపాయం లభిస్తుంది. రుణ సామర్థ్యం, వ్యయ సామర్థ్యం రెండు పెరుగుతాయి. దీనివల్ల ఇబ్బందులేమిటంటే, మార్కెటులో పంపిణీ అయిన ద్రవ్యానికి తగిన స్థాయిలో ఉత్పత్తి పెరక్కపోతే, కొనుగోలు శక్తి ఒక్కసారి పడిపోవడమే కాదు, ద్రవ్యోల్బణం
పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో, కొన్ని ఇబ్బందు లున్నప్పటికీ పరిమాణాత్మక సడలింపు అనేది ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రధాని మోడీకి చేసిన గొప్ప సూచన.
No comments:
Post a Comment