Sunday, August 28, 2022

గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టిన భీమసేనుడు, బలరాముడి నిరసన .... ఆస్వాదన-86 : వనం జ్వాలా నరసింహారావు

 గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టిన భీమసేనుడు, బలరాముడి నిరసన

ఆస్వాదన-86

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (28-08-2022)

గద భుజాన ధరించి ఒక్కడే యుద్ధభూమి నుండి తొలగి పారిపోయిన దుర్యోధనుడు తన మాయా శక్తితో ద్వైపాయన అనే మడుగులోపలికి పోయి తన శరీరానికి నీరు తగలకుండా సంస్తంభన విద్యతో వున్నాడు. కొద్ది దూరంలో సంజయుడు వున్నాడు. అప్పుడు కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు అక్కడ తిరుగుతూ సంజయుడిని చూసి, కురురాజు ప్రాణాలతో వున్నాడా ? అని అడిగారు. దుర్యోధనుడు కొలనులో దాగి వున్న సంగతి చెప్పాడు సంజయుడు వారికి. పాండవులు అటు వస్తున్న అలికిడి విని, నలుగురు కలిసి కృపాచార్యుడి రథం మీద కౌరవుల గుడారానికి వెళ్లారు.

         ఇంతలో అటువైపుగా వచ్చిన యుయుత్సుడు ఆడువారిని హస్తినాపురానికి తీసుకుపోవడం ఉచితమైన పనని అనుకున్నాడు. యుయుత్సుడు మంచి ఆలోచన చేశాడని ధర్మరాజు అన్నాడు. యుయుత్సుడు రథారూఢుడై రాజాంతఃపుర కాంతలను రక్షించే అధికారులను కలిసి, వారితో సహా తాను కూడా ఆ స్త్రీలను ఓదార్చి, హస్తినాపురంలో ప్రవేశించారు. ఆ సమయంలో విదురుడు ఎదురుగా వచ్చి జరిగిన విషయం అంతా విని దుఃఖంతో కలతచెందాడు. యుయుత్సుడిని చేసిన మంచి పనికి పొగిడాడు. ఆ తరువాత విదురుడు అంతఃపురం చేరాడు. యుద్ధరంగంలో కౌరవ సైనికులు పూర్తిగా పలచబడ్డారు.

         పాండవులు ససైన్యంగా దుర్యోధనుడిని వెతుక్కుంటూ ఆ చోటుకు వచ్చారు. వారిని గమనించిన కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు మరొక చోటుకు పోయారు. వచ్చిన పాండవులు దుర్యోధనుడి కొరకు అనేక దిక్కులలో వెతికారు కాని అతడు కనిపించనందున చింతిస్తూ వెళ్లిపోయారు. వారు వెళ్లిన అనంతరం సంజయుడు ఆ కొలను దగ్గరికి వెళ్లాడు. కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు దుర్యోధనుడితో సంభాషించారు. కొలను నుండి బయటకు రమ్మని, పాండవ సంహారానికి నడుం బిగించమని, ఆయన చేతుల్లో పాండవ సైన్యం క్షీణిస్తుందని, గెలిస్తే భూమిని పాలించవచ్చని, చనిపోతే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని, మడుగులో దాక్కోవడం ఆయన లాంటి వీరులకు మంచిది కాదని అన్నారు. తన శరీరానికి తగిలిన బాణాల దెబ్బల వల్ల నొప్పి కలిగి చాలా దాహంగా వున్నదని, తన మనసు తన వశం తప్పుతున్నదని, అందువల్ల ఆరోజు ఆగుతే శక్తి తెచ్చుకుని మర్నాడు యుద్ధం చేసి శత్రువులను జయిద్దాం అన్నాడు రారాజు. తన వాడి బాణాలతో పాంచాలురు అందరినీ చంపికాని తాను కవచాన్ని విడువనని, తన మాట నమ్మమని, దైన్యాన్ని ముగిస్తానని అశ్వత్థామ అన్నాడు దుర్యోధనుడితో.

       అదే సమయంలో ఆ కొలనులో నీరు తాగడానికి వచ్చిన భీముడి బోయవారు పక్కనే రాజుకు, కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలకు మధ్య జరుగుతున్న సంభాషణ విని, అక్కడే దుర్యోధనుడు ఉన్నాడని నిశ్చయించుకున్నారు. బోయలు వెంటనే ఆ విషయాన్ని ధర్మరాజుకు చేరవేయాలని నిర్ణయించుకుని వెళ్లి భీముడికి చెప్పారు. భీముడు తనకు బోయవారు తెలియచేసిన విషయాన్ని అన్న ధర్మరాజుకు చెప్పి, దుర్యోధనుడు తనకు తెలిసిన ఒక క్షుద్ర విద్య కారణంగా శరీరానికి నీరు తగలకుండా ద్వైపాయన కొలనులో దాగి ఉన్నాడని అన్నాడు. వెంటనే ధర్మరాజు ఆ వైపుకు వెళ్లాడు. ఆయన వస్తున్న కోలాహలం విన్న కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు దుర్యోధనుడి అనుమతి తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. పాండవులు అటు వైపుకు రారని, హస్తినకు వెళ్తారని, ఒకవేళ వచ్చినా తాను ఆ కొలనులో వున్న విషయాన్ని తెలుసుకోలేరని, తెలుసుకున్నా తనను చేరలేరని, ఆ మడుగులో నిర్భయంగా వుంటానని దుర్యోధనుడు పోతున్న వారితో అన్నాడు. అలా అంటూ అంతవరకు బయటున్న దుర్యోధనుడు తనకు వచ్చిన స్తంభన విద్య సహాయంతో జలంలో ప్రవేశించాడు. సంజయుడు మాత్రం ఆ దగ్గరలోనే ఒక పొదలో దాగి వున్నాడు.

         ఇంతలో పాండవులు అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుడి సూచన ప్రకారం ధర్మరాజు కొలను దగ్గర నిలబడి, దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతడికి అలాంటి నీచమైన స్థితి తగదని, ఆయన కొరకు అనేకమంది రాజులు చనిపోయారని, నీళ్లలో మునిగి ఉన్నంత మాత్రాన చావు తప్పుతుందా? అని అన్నాడు. దుర్యోధనుడిని శూరుడని అంటారని, అలాంటప్పుడు కొలనులో దూరడం ధర్మమా అని, ఆయన అభిమానం ఎక్కడికి పోయిందని, యుద్ధంలో రాజులు వెనుకంజ వేయవచ్చా అని, కౌరవ వంశంలో పుట్టిన అతడు నీచమైన చావును తెచ్చుకుంటున్నాడని, ఆయన కీర్తిని, గొప్పతనాన్ని శత్రు సమూహం నవ్వే విధంగా చేస్తావా అని ధర్మరాజు ఎద్దేవా చేశాడు. భయాన్ని వదిలి, యుద్ధానికి సిద్ధమై, మగతనంతో చావో, జయమో ఒకటి నిశ్చయించుకొమ్మని, వెంటనే విజృంభించి ఎదుర్కొమ్మని, దుర్యోధనుడు యుద్ధంలో తమను ఓడిస్తే భూమండలం అంతా పాలించవచ్చని, చనిపోతే స్వర్గలోక సుఖాలు పొందవచ్చని, దాక్కుంటే అవమానమని చెప్పాడు.

         జవాబుగా దుర్యోధనుడు, తాను రథాలు, గుర్రాలు, సారథి లేనివాడినని, అస్త్రశస్త్రాలు లేని వాడినని, సేవకులు, స్నేహితులు ఎవరూ లేరని, దెబ్బల వల్ల కలిగిన బాధ వల్ల వెంటనే యుద్ధానికి తలపడలేకున్నానని, అందువల్లే తప్పుకున్నానని, అలసట తీర్చుకుని యుద్ధానికి సిద్ధమవుతానని అన్నాడు. తాను ఎవరి కొరకు రాజ్యాన్ని ఆశించాడో, ఆ కుమారులు, తన తమ్ముళ్లు లేరని, అలాంటప్పుడు యుద్ధం చేయడం ఎందుకని, ప్రపంచాన్నంతటినీ ధర్మరాజే ఏలుకొమ్మని, తనకిక యుద్ధం వద్దని, భూమినంతా ధర్మరాజుకు ఇచ్చానని, తాను శాంతంగా అడవులకు వెళ్లి నారచీరెలు కట్టుకుని తపస్సు చేసుకుంటానని ధర్మరాజుతో అన్నాడు దుర్యోధనుడు.

         అధిక ప్రేలాపనలు మాని యుద్ధానికి లెమ్మన్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు ఇచ్చిన దానంతో తాను రాజు కావడానికి అంగీకరించనని, యుద్ధంలో అతడిని చంపి భూమిని పాలిస్తానని, ఒకవేళ భూమిని ఇచ్చినా అతడిని చంపక మాననని, కాబట్టి యుద్ధం చేయమని అన్నాడు ధర్మరాజు. ఆ పరుషపు మాటలకు స్పందనగా దుర్యోధనుడు, తాను ఒక్కడినే అని, పాండవులు సేనతో సహా వున్నారని, తాను ఆయుధాలు లేనివాడినని, తాను ఏవిధంగా యుద్ధం చేయాలని ప్రశ్నించాడు. అలా ఒకవైపు అంటూనే, మరోవైపు, తానొక్కడినే ధర్మరాజును, అయన తమ్ములను, సాత్యకిని, ద్రౌపది అన్నదమ్ములను రూపుమాపుతానన్నాడు. అలా అందర్నీ చంపి భీష్మద్రోణాదివీరుల ఋణాన్ని తీర్చుకుంటానన్నాడు. అప్పుడు ధర్మరాజు, యుద్ధంలో తమ పక్షాన దుర్యోధనుడిని ఒక్కడే ఎదిరిస్తాడని, అతడిని ఓడించగలిగితే రాజ్యాన్నంతా అతడే గ్రహించి దాన్ని అనుభవించవచ్చని అన్నాడు. దుర్యోధనుడికి కావాల్సిన అస్త్రశస్త్రాలను తీసుకోవచ్చని కూడా చెప్పాడు.

         రథాల మీద చాలా యుద్ధం చేశానని ఇక గదా యుద్ధం చేస్తానని అన్నాడు దుర్యోధనుడు. అలా అంటూనే దుర్యోధనుడు విజృంభించి, జలస్తంభన స్థితిని వదిలేసి, నీటి మడుగు అల్లకల్లోలం చేసి, గదాదండాన్ని తన భుజం మీద పెట్టుకొని బయటకు వచ్చాడు. తన భుజబలం మెరుస్తుంటే పాండవులందరిని భూమ్మీద పడగొట్టి తన గద బలాన్ని ప్రదర్శిస్తానని అన్నాడు. అయితే ఒక్కరొక్కరే యుద్ధానికి రమ్మని ధర్మరాజుతో అన్నాడు. తమ ఐదుగురిలో ఒకడిని మాత్రమే యుద్ధానికి ఎంచుకోమని చెప్పాడు ధర్మరాజు. అలా అంటూనే దుర్యోధనుడికి అవసరమైన కవచాలను ఇచ్చాడు. వాటిని ధరించాడు దుర్యోధనుడు.

         ధర్మరాజు కోరిక ప్రకారం, శ్రీకృష్ణుడి సూచన మేరకు భీముడు దుర్యోధనుడితో గదా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుడు భీముడికి ఆతడు చేసిన ప్రతిజ్ఞలు గుర్తుచేసి దుర్యోధనుడిని ఓడించడం అతడికి ఒక లెక్కా అన్నాడు. భీముడికి జయం కలిగేట్లు మాట్లాడాడు. సాత్యకి, ఇతర పాంచాల కుమారులు భీముడిని ప్రోత్సహించారు. భీముడు గదను చేత ధరించి దుర్యోధనుడిని ఉద్దేశించి గతంలో తమకు చేసిన అవమానాలను జ్ఞప్తికి తెచ్చాడు. ఆ ఇద్దరు వీరులు వీరోద్రేకాలతో విజృంభించి ఒకరినొకరు చూసుకున్నారు.

         సరిగ్గా అదేసమయంలో తన శిష్యులైన భీమ దుర్యోధనుల గదా యుద్ధాన్ని చూడడానికి బలరాముడు వచ్చాడు. ఆయన్ను అప్పుడు అక్కడ చూడగానే అంతా నమస్కరించారు. బలరాముడు రాగానే దుర్యోధనుడి మనస్సు వికసించింది. ముఖంలో సంతోషం కనిపించింది. ఆ తరువాత దుర్యోధనుడి కోరిక ప్రకారం పాండవులు, దుర్యోధనుడు ద్వైపాయన కొలను విడిచి శమంతపంచకం చేరారు. ఆ ప్రదేశంలో దుర్యోధన భీమసేనులు భయంకర గర్జనలతో, పెనుగర్వంతో ఒకరికెదురుగా ఇంకొకరు నిలిచారు. స్పష్టమైన కంఠంతో దుర్యోధనుడు భీముడిని యుద్ధానికి పిలిచాడు. తాను యుద్ధానికి సిద్ధంగా వున్నానని, ఇక తన చేతికి చిక్కిన దుర్యోధనుడు ఎక్కడికీ పోలేడని అన్నాడు. ఆ సమయంలో భూగోళం వణకింది. 

         ఇరువురి మధ్యా సమతల యుద్ధం సాగింది. భీమసేన దుర్యోధనుల మధ్య గదా యుద్ధం జరిగింది. ఇరువురూ ఆశ్చర్యకరంగా పోరాడారు. లాఘవంగా కొట్టుకున్నారు. పౌరుషంతో యుద్ధం చేశారు. ఇద్దరి శరీరాలలో గాయాలు తగలగా ఆ గాయాలనుండి కారే నెత్తురు వల్ల కాసేపు సోమ్మసిల్లినప్పటికీ, గదలను చేతులు మార్చుకుంటూ పోరాడారు ఇద్దరూ. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ భీమ, దుర్యోధనుల బలాబలాలలో వున్న తేడాను విశ్లేషించాడు. శారీరకమైన బలమున్న భీముడు, నేర్పు, ఉపాయం కల దుర్యోధనుడి దెబ్బలకు నొచ్చుకుంటున్నాడని, కాబట్టి ధర్మ యుద్ధంలో దుర్యోధనుడిని జయించడం కష్టమని అన్నాడు. మోసం వున్న వైరులను మోసపు విధానంతోనే చంపడం తగినదని అన్నాడు. జూదం ఆడినప్పుడు భీముడు దుర్యోధనుడి తొడలు విరుగగొట్టుతానని శపథం చేశాడని, అందువల్ల ప్రతిజ్ఞ పేరుతో బొడ్డు కింది భాగంలో (అధర్మంగా) తొడలు విరిచి చంపడం తప్ప వేరే ఉపాయం లేదని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో భీముడు తనవైపు చూసినప్పుడు అర్జునుడు తొడలు చేత్తో చరిచాడు.

         అర్జునుడి సైగను అర్థం చేసుకున్న భీముడు, అన్యాయమైనా తొడలు విరుగ గొట్టమన్న శ్రీకృష్ణుడి సలహాను వేరే దారి లేకపోతే అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. భీమ దుర్యోధనుల గదా యుద్ధం భీకరం కాసాగింది. అప్పుడు భీమసేనుడు సందు చూసి, భయంకరమైన వజ్రపుదెబ్బతో దుర్యోధనుడి తొడలు విరిగి కూలేట్లుగా మిక్కిలి వేగంగా తన గదతో కొట్టాడు. ఆ సమయంలో పెద్ద తోకచుక్కలు నేలరాలాయి. గద దెబ్బతో తొడలు విరిగి కూలబడ్డ దుర్యోధనుడిని, ‘నీచాత్ముడా అని సంభోదిస్తూ, భీముడు, ద్రౌపదిని సభలో అవమానం చేసినందుకు తగిన ఫలం అనుభవించమని తన ఎడమ పాదంతో అతడి తలను గట్టిగా తన్నాడు. అంతటితో ఆగక గదను చేతిలో తీసుకుని భీమసేనుడు దుర్యోధనుడి మెడను అదిమిపట్టి, తలను మరోమారు తన్నాడు. అది చూసిన ధర్మరాజు అలా చేయడం అధర్మమని భీముడితో అన్నాడు. దుర్యోధనుడి స్థితిని చూసి ధర్మరాజు అతడి వల్ల ఎంత నాశనం జరిగిందని దుఃఖించాడు.

         భీమసేనుడు చేసిన పనికి విపరీతంగా కోపించిన బలరాముడు నాగలి భుజం మీద పెట్టుకుని భీముడి వైపు నడిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నగారికి అడ్డంగా పోయి భీముడు కౌరవ సభలో చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేసి, అలా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మమని చెప్పాడు. మైత్రేయ మహాముని శాపాన్ని కూడా గుర్తుచేసి, దాని కారణంగా భీముడి గదాఘాతానికి దుర్యోధనుడి తొడలు విరుగవలసి వున్నదన్నాడు. అలా చేయడం అధర్మం కాదన్నాడు. ‘కపటపు గెలుపు గెలిచిన భీముడు ప్రశంసలు పొందుతాడుగాక!’ అని, ‘ధర్మపరుడైన దుర్యోధనుడికి పుణ్యలోకాలు కలుగుతాయి అని అంటూ బలరాముడు వెళ్లిపోయాడు అక్కడి నుండి. అక్కడున్న వారు భీముడిని అనేకవిధాలుగా పొగిడారు. తొడలు విరిగి పడిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని ఆక్షేపించి మోసపూరితుడని, పాపాత్ముడని నిందించాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Thursday, August 25, 2022

MLAs quitting in last year of term unethical : Vanam Jwala Narasimha Rao

 MLAs quitting in last year of term unethical

Vanam Jwala Narasimha Rao

The Pioneer (26-08-2022)

(The Telangana by-poll for Munugodu seat when Assembly polls are less than a year away defies logic-Editor).

Yet another Assembly by-election in Telangana is in the offing. When Assembly elections are due in Telangana in about a year from now, Munugodu legislative constituency MLA resigned, causing perhaps an expensive by-poll on the exchequer, as well as on the contesting candidates and political parties. For reasons best known to them, some legislators in the recent past are choosing to resign from their respective seats at will and pleasure before completion of their terms and quit the party from which they were elected.

Political analysts term this trend as attempts to gain personal political benefit rather for any ideological preferences. This leads to a byelection for the seat vacated and sometimes a few months before the completion of tenure of legislature. If byelection is delayed, the elected MLA will be hardly left with six months or less to serve and may not even get a chance to sit in the House.

The legislator who resorts to resignation does not sense that it is a rare privilege and honor bestowed on him by the voters to sit in the prestigious legislative Assembly for a period of five years and resigning before completion of tenure is unethical, illogical and shirking the responsibility. It has also become a known practice that the individual who vacates the seat contests again on a different party ticket.

What is the rationale to resign and contest again is an unanswered question. Some national parties admit them overnight and offer party tickets with a one-point agenda of defeating the opponent, generally of a popular regional party. The morals of earlier days to give tickets after a long wait are no longer observed.

An individual normally resigns to a position he or she is holding in order to take a more challenging assignment and not for an equal or lower than the present one. Lack of opportunities for advancement and feeling disrespected in the present position are also the reasons for tendering resignation. This in effect is not happening in the resignations of the majority of legislators of late. Resigning in a professional and polite way on good terms rather than blaming the organization that he or she is leaving often in unparliamentary language has also become an unhealthy feature which is highly deplorable.

Unfortunately, the majority of legislators who resort to resignation give reasons which are not palatable. For instance, differences with the party president or not being placed in a high position in the party, or not given a minister’s berth or not getting an appointment with top leaders or not being recognized, etc., are not valid reasons.

In January, 2013, in the united Andhra Pradesh Assembly, 10 TRS MLAs quit the Assembly and not the party, protesting against the terms of reference (ToR) of the Sri Krishna Committee. The move followed the call of the all-party Telangana Joint Action Committee (JAC) to legislators from Telangana to submit their resignations en masse, rejecting the ToR to mount pressure on the Centre for taking immediate steps for the formation of Telangana. The Speaker accepted the resignations.

Five YSR Congress Party MPs resigned in April 2018 over the failure of the Centre to grant Special Category Status to Andhra Pradesh. These were examples of resignations for a cause and not for individual political gains. One of the best examples is that of Neelam Sanjiva Reddy who resigned twice in 1969 and 1977 as an MP to contest as President of India; that was a challenging assignment, once as congress candidate and afterwards as a consensus candidate.

India models its democracy in Britain. Resignation from the House of Commons has never been allowed in Britain in theory. Technically Members of Parliament sitting in the House of Commons are not permitted to resign from their seats but can only be disqualified or lose an election for which there is a well laid down procedure.

To circumvent this, MPs who wish to step down are instead appointed to an ‘Office of profit under the Crown’, which disqualifies them from sitting in Parliament. For this purpose, a legal fiction is maintained where two unpaid offices are considered to be offices of profit: Steward and Bailiff of the Chiltern Hundreds, and Steward and Bailiff of the Manor of North stead.

The US Constitution explicitly provides for the resignation of senators, but, curiously, it does not say anything about resigning from the House of Representatives. If a vacancy occurs due to a senator’s death, resignation, or expulsion, state legislatures empower the Governor to appoint a replacement to complete the term or to hold office until a special election can take place. The Governor of the represented state may immediately appoint a successor. Since special elections cost taxpayers, activists even suggested that the retiring member should cover the costs of the election.

Every rule of law can be traced to a statute or a judicial decision, but conventions cannot be traced to any particular regulation. There are clear consequences for a violation of a rule of law, but a breach of a convention attracts no consequence. A rule of law can be amended but a convention cannot be amended. Although there are conventions in the society, what determines whether a thing is properly done or not is not the convention but the prevailing rule of law as regards that subject matter.

The constitutional structure of India is based largely on the Westminster model of parliamentary system. Indian and the UK systems of traditions, conventions and procedures in a way are similar since both the countries follow parliamentary form of democracy. While India has adopted most of the rules, regulations and conventions of the United Kingdom Parliament, it has failed to follow the spirit and the basic tenets of constitutional morality and propriety of an elected member resigning his post in the middle of his term.

There is, however, always something new about Westminster and, hence, it is something that might be a good idea to adopt in India. Unfortunately, the conventions guiding resignations of lawmakers are not properly spelt out yet.

In the election law as it stands now in India, there is no bar on a lawmaker resigning his or her seat before completion of tenure of Assembly or Lok Sabha and then contesting the byelection to fill up the vacancy caused by his or her resignation. It is high time that in India frequent resignations of legislators and Parliament members purely to gain political interests and without any ideological compulsions be avoided either by law on the British model or by convention.

This not only puts an end to political hopping by those who frequently change parties but also helps in doing away with huge costs that are incurred for the frequent elections. Alternatively, it may be considered to empower the Speaker to appoint a replacement to complete the term of the legislator who resigned. Let the law also be amended so as not to allow a person to contest from more than one constituency. Further, the Election Commission should consider the British practice of no-resignation of a person once elected.

But will this ever happen in our country, which is supposed to be the largest democracy but where all the democratic, ethical and moral norms are slowly and steadily thrown to the winds?

(The author is Chief Public Relations Officer to Chief Minister, Telangana)

Monday, August 22, 2022

సోమరుల్ని పెంచే ఉచితాలు కావు, సమర్థుల్ని చేసే సంక్షేమం! .... వనం జ్వాలా నరసింహారావు

 సోమరుల్ని పెంచే ఉచితాలు కావు, సమర్థుల్ని చేసే సంక్షేమం!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-08-2022)

హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ ఖిల్లా మీద 75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి, ఆహుతులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అనీ, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమని నిశితంగా విమర్శించారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికార కేంద్రీకరణకు పాల్పడుతూ, రాష్ట్రాలు ఇస్తున్న సంక్షేమ ఫలాలను ఉచితాలని ఎద్దేవా చేస్తూ, వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలని ఉచితాలని కొట్టిపారేయడం అసమంజసమనీ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు బలీయమైన కారణం ప్రధాని మోదీ ఇటీవల ఉచిత పథకాల మీద ఎక్కుపెడుతున్న విమర్శలే. నైరాశ్యంలో కూరుకుపోయిన కొన్ని రాజకీయ పార్టీలు ఉచిత పథకాలతో రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని, అలాంటి చర్యలు మన పిల్లల భవిష్యత్తుకు ప్రతిబంధకంగా నిలుస్తాయని, స్వయంసమృద్ధిని అడ్డుకుంటాయని మోదీ ఒక సభలో అన్నారు. దేశ రాజకీయాల్లోంచి ఈ ఉచితాల సంస్కృతిని తొలగించాలని, ఇది దేశాభివృద్ధికి ప్రమాదకరమని మోదీ హెచ్చరించారు.

ప్రజల సంరక్షణ, సామాజిక అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధి దిశగా కీలకపాత్ర పోషిస్తూ శ్రేయోరాజ్యాన్ని స్థాపించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, పౌరులందరికీ సమానావకాశాలు కల్పిస్తూ, సదుపాయాలు అందరికీ సమానంగా అందేలా చూస్తూ, పౌరుల్లో బాధ్యత పెంచుతూ, ప్రజలు మెరుగైన జీవనాన్ని సాగించేందుకు వీలుగా అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిద్ధాంతం. శ్రేయోరాజ్యం నమూనాకు మూల సిద్ధాంతకర్త గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఉదారవాద ఆర్థికవేత్త సర్ విలియమ్ బెవరిడ్జ్. ఆయన 1942 నవంబరులో బ్రిటిష్ పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించారు. అందులో ఆయన ప్రభుత్వాలు తమ కర్తవ్యంగా భావించాల్సిన సామాజిక భద్రత విధానాన్ని ప్రతిపాదించారు. ఆనాడు బెవరిడ్జ్ తన శ్రేయోరాజ్యం నివేదికలో పొందుపరచిన అభిప్రాయాలు ఇప్పటికీ ఆధునిక సంక్షేమ రాష్ట్రానికి వేదిక కల్పించేవిగా పరిగణిస్తున్నారు.

బెవరిడ్జ్ సూచించినదానికన్నా మెరుగైన విధానాలనే తెలంగాణలో కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలంగాణలోని అల్పాదాయ, నిరుపేద, మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమం ప్రధాన లక్ష్యం ఈ వర్గాల వారి జీవన నాణ్యతను, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. వృద్ధులు, అంగవికలురు, విద్యార్థులు, రైతులు, శ్రామికులు, వృత్తి ఉద్యోగులు వంటి నిరుపేదలు, బడుగులకు సంక్షేమ సాయం అందించడమనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలు, కోరికలు, సమస్యలు ఎన్నో ఉంటాయి. ప్రభుత్వపరంగా వివిధ పథకాల ద్వారా ఒక లబ్ధిదారుడుగా పొందాల్సినవి కూడా ఎన్నో ఉంటాయి. వీటి నేపథ్యంలోనే ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఇవి నెరవేర్చగలరని భావించిన పార్టీనే ఎన్నుకుని అధికారం కట్టబెడతారు. వీటికి అదనంగా రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు ఫలానా మంచి జరగాలని భావించి, ఎన్నికల మేనిఫెస్టోలో తదనుగుణమైన వాగ్దానాలు చేస్తాయి. ప్రజలు ఓటు వేసేటప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తామెన్నుకున్న ప్రభుత్వం తమ అవసరాలను తీర్చే విషయంలో కానీ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కానీ ఏమాత్రం ఉదాసీనత కనపర్చకూడదనీ ప్రజలు ఆశిస్తారు. ప్రతి పథకం అమలుకూ ఎన్ని విధాల వీలుంటుందో, అన్ని విధాల చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రభుత్వాన్ని అభినందిస్తారు. మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలలో వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చాక అవి అమలు చేయడం రాజకీయ పార్టీల కనీస కర్తవ్యం. అలాకాకపోతే తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని ఎదుర్కోవాలి.

తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. వీరంతా రోజువారీ పనులు చేసుకుని కడుపు నింపుకొనేవారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి వసతి లేక వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైపోవడంతో రైతులు కూడా పేదరికం అనుభవించాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో రోజూ ఆకలి చావులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, పూర్తి జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా వేలాది కోట్ల రూపాయలతో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో పేదలకు జీవన భద్రత ఏర్పడింది. వారు పస్తులుండాల్సిన పరిస్థితి తప్పింది. అతి తక్కువ సమయంలోనే దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది. ఇలా చేయడాన్ని ఉచితాలని ప్రధాని ఎద్దేవా చేయడం సమంజసమేనా?

అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్సుమెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీం, ఎకానమిక్ సపోర్ట్ పథకం, సబ్సిడీతో గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, ఆసరా పెన్సన్లు, ఉచితంగా పేదలకు డబుల్ బెడ్రూము ఇళ్ళు, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, నేతన్నకు బీమా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్, రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బలహీనవర్గాల విద్యార్థులకు గురుకులాలు, కేసీఆర్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి... ఇలాంటి పథకాలన్నీ ప్రజల సంక్షేమానికే కదా? ఇవి ఉచితాలా?

అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా, సంక్షేమం కూడా ఉండాలి. అణగారిన వర్గాల అభివృద్ధితోనే అసలుసిసలైన అభివృద్ధి సాధ్యమని సీఎం పదే పదే అంటుంటారు. సంఘటిత అభివృద్ధితోనే బహుళార్థ ఫలితాలు సాధించగలం. ఆ విధంగానే అణగారిన వర్గాల వారికి ఆర్థికంగా పలు అవకాశాలు దక్కుతాయి. తద్వారా వారికి సాధికారత లభిస్తుంది. వారూ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుండి ఈ దిశగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేసి, వారికి సాధికారతనిచ్చేవే. ఇవి ఉచితాలెలా అవుతాయి?

తెలంగాణ రాష్ట్రంలో రూపకల్పన జరిగి, వివిధ స్థాయిల్లో అమల్లో ఉన్న వందలాది ప్రభుత్వ సంక్షేమ పథకాలు దారిద్ర్యరేఖ దిగువన జీవనం సాగిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రజల వెన్నంటి ఉంటూ వారి జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతున్నాయి. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి, తల్లీ బిడ్డల సంరక్షణతో మొదలుకొని, వారికి సరైన పౌష్టికాహారం అందిస్తూ, ఆ బిడ్డ విద్యాబుద్ధులు నేర్చే సమయంలోనూ, ఉన్నత చదువుల నేపథ్యంలోనూ, పెళ్లినాటి వేడుకల్లోనూ... ఇలా జీవిత పర్యంతం ఈ పథకాలు వారికి తోడుంటున్నాయి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ, గతంలోనూ, వర్తమానంలోనూ ఇలా జరగలేదు. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఏ కోశానా ఉచితాలని అనడానికి వీల్లేదు. వాస్తవానికి ఇలాంటివి యావత్ భారతదేశంలో తక్షణమే అమలు కావాలి.

తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల శ్రేయస్సుపై శ్రద్ధ వహిస్తూ, వారి దీర్ఘకాలిక ప్రయోజనాలే ధ్యేయంగా, సంపద సృష్టి దిశగా పథకాలన్నింటికీ రూపకల్పన చేశారు. ఆయన రూపొందించిన పథకాలన్నీ ఒకవైపు తక్షణ ప్రయోజనాలను సమకూరుస్తూనే, మరోవైపు శాశ్వతంగా, స్వయంచాలకంగా ఉపాధి కల్పనకు బాటలు వేశాయి. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ళకు పైగా అపారమైన సంపద సృష్టించడం జరిగింది. ఇవేవీ ఓట్ల కోసం అమలు చేసే ఉచిత పథకాలు కాదు. ప్రజలకు జీవన భద్రత కలిగించే బహుళార్థసాధక సంక్షేమ పథకాలు. విమర్శించే ముందు మోదీ ఇది గుర్తించాలి!

Sunday, August 21, 2022

పద్దెనిమిదవ రోజు యుద్ధం (2), కౌరవుల ఓటమి, మడుగులో దాగిన దుర్యోధనుడు .... ఆస్వాదన-85 : వనం జ్వాలా నరసింహారావు

 పద్దెనిమిదవ రోజు యుద్ధం (2),

కౌరవుల ఓటమి, మడుగులో దాగిన దుర్యోధనుడు

ఆస్వాదన-85

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (21-08-2022)

శల్యుడు తమ్ముడితో సహా మరణించిన తరువాత, కౌరవ సేన పారిపోతుంటే, దాన్ని తరుముతున్న సాత్యకిని కృతవర్మ ఎదుర్కొన్నాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం చోటుచేసుకున్నది. సాత్యకి కాసేపట్లోనే కృతవర్మ రథం గుర్రాలను, సారథిని ఖండించాడు. అది చూసి కృపాచార్యుడు అతడిని అక్కడి నుంచి తప్పించాడు. కౌరవ సైన్యాన్ని అప్పుడు వెంటాడుతున్న పాండవ సైన్యాన్ని ఒక్క దుర్యోధనుడే ఎదిరించాడు. మళ్లీ యుద్ధానికి వచ్చిన కృతవర్మ గుర్రాలను ధర్మరాజు చంపాడు. ఆ సమయంలో తనతో కలియబడ్డ కృపాచార్యుడి గుర్రాలను కూడా ధర్మరాజు కొట్టాడు. శల్యుడి చుట్టాలు ఒక్కసారిగా ధర్మరాజును చుట్టుముట్టారు. అప్పుడు భీమార్జున నకులసహదేవులు, ఉప పాండవులు, సాత్యకి మొదలైన వారు ఆ యోధులను ఎదుర్కొన్నారు. శల్యుడి రథిక సమూహాలను చంపారు. పాండవ సైన్యం కేరింతలు కొడుతూ ‘ఇక ధర్మరాజే నాయకుడు అని అరిచారు.

అదే సమయంలో యుద్ధానికి వచ్చిన శకుని మీద నకుల సహదేవులు, సాత్యకి వాడి బాణాలు వేసినప్పటికీ అతడు కూడా స్థిరంగా పోట్లాడాడు. అప్పుడు సాల్వుడు పాండవ సైన్యంలో ప్రవేశించి పరాక్రమించి పోరాడగా, ధృష్టద్యుమ్నుడు అతడిని ఎదుర్కొన్నాడు. అతడితో పాటు, తన ఏనుగుతో సహా, విజృంభించి పోరాడుతున్న సాల్వుడిని భీముడు, శిఖండి కూడా ఎదుర్కొన్నారు. భీముడు సాల్వుడి ఏనుగును తన గదతో చంపగా, సాత్యకి తన బాణం దెబ్బతో సాల్వుడి తలను భయంకరంగా ఖండించాడు. అంతలోనే విజృంభించిన కృతవర్మను సాత్యకి తన బాణాలతో నొప్పించాడు. అతడి గుర్రాలను, సూతుడిని చంపాడు. అప్పుడు కృతవర్మను యుద్ధం నుండి తప్పించాడు కృపాచార్యుడు. కౌరవ సైన్యం చెల్లాచెదరై పోయింది. ఒక్క దుర్యోధనుడు మాత్రం వీరవిహారం చేయసాగాడు. మరో పక్క శకుని కఠినమైన పరాక్రమ విక్రమంతో పోరాడుతుంటే అతడిని ధర్మరాజు ఎదుర్కొన్నాడు. శకుని కొడుకు ఉలూకుడు నకులుడితో పోరాడాడు.

దుర్యోధన, ధృష్టద్యుమ్నుల మధ్య యుద్ధం జరిగింది. ఇరువురూ తీసిపోకుండా యుద్ధం చేశారు. ధర్మరాజు కృపాచార్యుడి గుర్రాలను చంపాడు. శకుని, సహదేవులు ఘోరంగా పోరాడారు. చివరకు శకుని తప్పించుకొని యుద్ధ భూమినుండి తొలగి పక్కనే పోరాడుతున్న దుర్యోధనుడి దగ్గరికి పోయాడు. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో, అప్పటికి యుద్ధం జరగబట్టి 18 రోజులైందని, తాను యుద్ధం చేసినందువల్ల సముద్రమంత కౌరవ సైన్యం గోవుపాదమంత అయిందని, భీష్ముడు యుద్ధంలో పడిపోయినప్పుడైనా కౌరవులు సంధి చేసుకుంటారని భావించానని, కాని వారు మూఢులని తెలుసుకున్నానని, దుర్యోధనుడు ఎంతటి వివేక హీనుడో కదా అని అన్నాడు. దుర్యోధనుడు తన ప్రాణం వున్నంతదాకా ధర్మరాజుకు రాజ్య భాగం ఇవ్వడని, కాబట్టి మిగిలిన కొంచెం పని కూడా పూర్తి చేయాలని అన్నాడు. దానికొరకు వేగంగా రథం తోలమని చెప్పాడు. ఆయన అలాగే చేయగా అర్జునుడు విజృంభించాడు.

దుర్యోధనుడు, ధృష్టద్యుమ్నుడు ఒకరినొకరు ఎదుర్కొని భీకరంగా యుద్ధం చేశారు. మరో పక్క కురుకుమారులు దుర్విషహ, దుష్ప్రదర్శన ప్రముఖులు భీముడిని ఎదుర్కోగా అతడు వారి ప్రాణాలు తీశాడు. ఇక కురుకుమారులలో దుర్యోధనుడితో పాటు మరొక తమ్ముడు మాత్రమే మిగిలారు. శ్రీకృష్ణుడు అప్పుడు రథాన్ని దుర్యోధనుడి వైపు నడిపించాడు. సహదేవుడు, భీముడు కూడా దుర్యోధనుడిని చంపడానికి పూనుకున్నారు. శకుని బాగా కోపం తెచ్చుకుని, సుశర్మతో కలిసి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడి తమ్ముడు సుదర్శనుడు భీముడిని ఎదిరించాడు. దుర్యోధనుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు త్రిగర్త వీరుడైన సత్యకర్ముడి తలను ఖండించాడు. తరువాత సత్యేషుడిని చంపాడు. సుశర్మ ప్రాణాలు తీశాడు. మిగిలిన సైన్యం పారిపోయింది. భీముడు సుదర్శనుడిని సంహరించాడు. శకుని కొడుకు ఉలూకుడు సహదేవుడి చేతిలో చచ్చాడు.

శకుని సహదేవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. సహదేవుడు శకుని గుర్రాలను, ఖండించాడు. శకుని అప్పుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించగా దాన్ని కూడా ఖండించిన సహదేవుడు చివరికి బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించాడు. దుర్యోధనుడు తన చుట్టూ శూన్యం కావడం చూసి, ఎదురుగా వున్న పాండవుల సంతోషాన్ని చూసి, యుద్ధభూమినుండి తొలగిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అప్పుడు 2000 రథాలు, 700 ఏనుగులు, 500 గుర్రాలు, 10000 కాల్బలంతో కూడిన పాండవ సైన్యంతో ధృష్టద్యుమ్నుడు ప్రకాశిస్తుంటే, దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు. తగ్గిపోయిన సైన్యంలో వుండలేక గుర్రం దిగి దుర్యోధనుడు గద భుజాన ధరించి ఒక్కడే యుద్ధభూమి నుండి తొలగి పారిపోయాడు.

అలా ఒక్కడు కూడా తన వెంట వచ్చేవాడు లేకుండా ఏకాకిగా యుద్ధభూమినుండి వెళ్ళిన దుర్యోధనుడు ఆ ప్రదేశానికి దగ్గరగా ఈశాన్య భాగాన ఒక నీటిమడుగు వుంటే ఆ వైపునకు వెళ్లి ఆ మడుగులో దాక్కొని, విదురుడి మాటలు మనసులో తలచుకొంటూ దుఃఖాతిశయంతో విచారించాడు. కౌరవ యోధుల్లో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, ముగ్గురు మాత్రమే బతికిపోయారు. సంజయుడు దుర్యోధనుడు పోయిన దిక్కుకు పోయి అక్కడున్న ద్వైపాయనమనే కొలను దగ్గరకు చేరాడు. దుర్యోధనుడిని చూశాడు. అతడి స్థితికి మనస్సులో దుఃఖం కలిగింది. జరిగినదంతా ధృతరాష్ట్రుడికి చెప్పమని అన్నాడు దుర్యోధనుడు సంజయుడిని.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శల్యపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Thursday, August 18, 2022

Wrong to call welfare schemes ‘freebies’ : Vanam Jwala Narasimha Rao

 Wrong to call welfare schemes ‘freebies’

Vanam Jwala Narasimha Rao

The Pioneer (19-08-2022)

(State governments must work for the welfare of the poor, for their empowerment and providing them with basic amenities-Editor)

Delivering the Independence Day address at the Historical Golkonda Fort in Hyderabad, Telangana Chief Minister K Chandrashekhar Rao (KCR) criticized the Center for insulting States’ welfare schemes by labelling them as ‘freebies’. He added that public welfare is the foremost responsibility of the government and hence Center’s remarks are highly objectionable.

Disagreeing vehemently with the Center’s concept of freebies, KCR said that it also amounts to weakening the nation’s cooperative federal spirit and running down welfare schemes of States. Centre, which is supposed to fulfill that social responsibility, has done miserably over a period, observed KCR.

Prime Minister Narendra Modi’s recent remark on ‘revdi culture’ perhaps is at the center of CM KCR’s observations similar to some of his counterparts in the country. According to Modi, attempts are being made in the country to bring a culture of garnering votes by distributing revdis, a sweet popular in North India, distributed during festivals, which is very dangerous for the development of the country.

Criticizing some opposition parties for engaging in the politics of freebies, the PM said that they are obstacles to India’s efforts to become self-reliant while also being a burden on taxpayers. Notwithstanding this, the Independence Day was celebrated across the country with several chief ministers making a slew of welfare scheme announcements and countering Prime Minister Narendra Modi’s ‘revdi culture’ remark.

Unfortunately, PM Modi seems to have failed to take into account that social welfare schemes that subsidize the populace are a universal phenomenon now and, in a democracy, these are but natural. For instance, in the USA, the Supplemental Nutrition Assistance Program (SNAP), formerly known as the Food Stamp Program, is the largest federal nutrition assistance program that provides food-purchasing assistance for low- and no-income people.

Similarly, the Singapore Government provides financial aid to any family making less than $1,900 a month, besides providing aid in other forms such as making education more affordable, tax exemptions for impoverished families and more affordable housing. Its system of social security is based on enabling self-reliance, supported by strong family and social networks. These are a few examples only. Would these fit into the concept of freebies?

We defined our country as a welfare state, which is a form of government in which the state protects and promotes the economic and social well-being of the citizens, based on the principles of equal opportunity and equitable distribution of wealth. The welfare state is a way of governing in which the state or an established group of social institutions provides basic economic security to its citizens.

By definition, in a welfare state, the government is responsible for the individual and social welfare of its citizens. A fundamental feature of the welfare state is social insurance and social security. This is exactly or perhaps even more as envisaged in the definition of a welfare state. Welfare encompasses those government programs that provide benefits and economic assistance to no or low-income people living in Telangana.

Welfare programs of Government of Telangana aims to improve the quality of life and living standards of the poor and underprivileged. People are able to stand on their own feet with an assured monthly or annual income making them prosperous. KCR’s preference is social insurance. It may sound a bit philosophical, but the schemes conceived and being implemented by the KCR Government takes care of every stage of a human being’s life true to the saying caring from ‘cradle to grave’. 

In the letter and spirit of the welfare state, the Telangana Government implements a number of welfare programs. To name a few identified priority areas of welfare of Telangana Government, there is Kalyan Laxmi, Shadi Mubarak, Aasara pensions, Rythu Bandhu, Rythu Bhima, Sheep distribution, Fish breeding, Free Double bedroom houses, Residential school education, Dalit Bandhu, etc.

Despite spending huge amounts on these schemes, Telangana has emerged financially strong in the country. The Government’s top priority has been to extend a real helping hand to the needy, helpless and poorest of the poor strata and accordingly, welfare programs were conceived and implemented. The Aasara Pensions, aimed at providing security to life, are being given to every poverty-stricken individual, identifying them either as old or widow or single woman or a beedi worker or a handloom worker or an old age artist or a filarial affected person or AIIDS patient or for that matter any one below the poverty line.

This social security pension scheme is now extended to 10 lakh new beneficiaries from August 15 for a total of 46 lakh beneficiaries. Should this be called a freebie or a social security measure?

The large-scale distribution of sheep substantially enhanced the livestock wealth of Golla and Kurumas communities. The investment support scheme for agriculture, the Rythu Bandhu meant for providing financial assistance to farmer towards crop investment enthused the hearts of farmers. These are not freebies but welfare aimed at social security for the poor farmer.

The Dalit Bandhu Scheme, yet another welfare measure, is bound to change the life and financial status of Dalits in Telangana forever. In the long run, it will become a model policy for other states to emulate. It will herald a sea change in the lives of Dalits and will become torchbearer for Dalits elsewhere in the country.

The Telangana Dalit Bandhu Scheme would help Dalits to define their own development and become partners in the development. This is certainly not a freebie but by all means a social security measure.

Empowerment is the degree of autonomy and self-determination in people and in communities, enabling them to represent their interests in a responsible and self-determined way, acting on their own authority. It is the process of becoming stronger and more confident, especially in controlling one’s life and claiming one’s rights.

CM KCR is laying a strong foundation for future generations’ prosperity and making all sections of the society become economically self-reliant. Why call them freebies?

In a democratic society like India, people have several hopes, purposes, aspirations, ambitions, desires, requirements, passions, problems, needs and so on. People from time to time elect the party, which in their view will fulfill their needs. The contesting parties make promises in the form of election manifestos keeping in view the people’s welfare in focus.

Voters consider them and choose a particular party and elect it to power. The Government thus elected by them to keep their promises has to initiate and implement a number of welfare programs and they cannot be dubbed as freebies. Unfortunately, most of the parties after coming to power fail to keep up their promises. In the case of KCR, he has not only fulfilled all the promises and even gone beyond though not mentioned in the election manifesto.

CM KCR firmly believes that mere growth has no meaning and even legitimacy, if the deprived sections of the society are left behind. Inclusive growth should not only ensure a broad flow of benefits and economic opportunities, but also encompass empowerment and participation. And hence it’s all public welfare, please don’t call them freebies, Modiji.

(The author is Chief Public Relations Officer to Chief Minister, Telangana.)