Friday, April 12, 2019

రహస్యార్థాల రామాయణం : వనం జ్వాలా నరసింహారావు


రహస్యార్థాల రామాయణం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి సనివారం సంచిక (13-04-2019)
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వ కాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించిన ఏకైక వ్యక్తి కీర్తి శేషులు వావివిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. రామాయణం అంటే ఏమిటిఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలిఅనే అంశాలను స్వయంగా వాసు దాసు గారే ఆయన పీఠికలో వివరించారు. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు-అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులుఅందరికీ అది సాధ్యమయ్యేది కాదు. "శ్రీ రామాయణంఅంటేలక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీశ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థందంపతుల మాదిరిగావారి "అభిధానంబులు అనపాయంగావుండినట్లేతత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షితను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడుఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షేశ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తుఅని వెల్లడిచేశాడుశ్రీరాముడు భగవంతుడన్న అర్థంహారంలోని సూత్రంలాగారామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది.రామాయణాన్ని చదివేవారందరుఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొనిఇందులోని ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలిఇలా ఆసక్తిగా శోధించిన వారికి-పరీక్షించిన వారికి మాత్రమేవాల్మీకి రామాయణానికి-ఇతర రామాయణాలకు (ఆ మాటకొస్తేఏ భాషలో వున్న ఏ గ్రంథాలకుగల తారతమ్యంవాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.

శ్రీ రామాయణం మహాకావ్యంపుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిదిదానిలోని గుణాలురహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గానిసర్వజ్ఞుడికి గాని మాత్రమే సాధ్యమవుతుందిశ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయివర్ణనలెన్నో వున్నాయిరామాయణం గానం చేసినాపఠించినా మనోహరంగా వుంటుందిరామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయిఅందులో శృంగార రసం "సంభోగ శృంగారం". వాల్మీకి వాక్యామృత రసాన్ని నిరంతరం ఆస్వాదన చేసిన భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యంకరుణవీరరౌద్రంభయానకబీభత్సంఅద్భుతంశాంతం రసాలను కనుగొన వచ్చురామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవుఅంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయిశ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లువర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుందిహేమంతాన్ని వర్ణిస్తుంటేమనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుందితన వర్ణనా చాతుర్యంతో వాల్మీకిపాఠకులనుతన చేతిలో బొమ్మలా చేసిఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడువాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలుశ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకందాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణంలో అనువదిస్తూ వాసు దాసుగారు ఇలా రాశారు.

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడంఆడ పక్షి అది చూసి దుఃఖించడంపరమ దయామయుడైన వాల్మీకి అది చూసిబోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని శపించడం జరిగిందిఆ శాపమే రామాయణ ఉత్పత్తికి కారణమైంది. దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుంది.రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడిందిఅలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయోఅవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకిరామాయణంలో వున్నాయివాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతంమరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగంఅలంకారాల వరకెందుకుసాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడువాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులుఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగాసందర్భోచితంగావారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయిపాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవుశ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో.


వాల్మీకి రామాయణమనే "కలశార్ణవంలో రత్నాలను వెదికేవారుమొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానంఅది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితేచీకట్లో తారాడినట్లేఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడుకొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదుఅదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చుఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చుఆయన చేసిన వర్ణనలను బట్టిప్రయోగించిన పదజాలాన్ని బట్టిపాఠకులు ఊహించుకోవచ్చుఒకే విషయంఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే,ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుందిఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయివాల్మీకి (ఆంధ్ర వాల్మీకిరామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వనికావ్యానికి ప్రాణం ధ్వనిధ్వని లేని కావ్యం శవంతో సమానంరామాయణంలో ధ్వని విశేషంగా వుందికావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండాపలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుందిరుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుందిశ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటేఎంత చెప్పినా తక్కువే అవుతుందిఇంతెందుకు ! కాళిదాసుభవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణంవాళ్లు రామాయణాన్ని ఎన్ని సార్లు చదివారో గానివారి కవితా వల్లి "వాల్మీకి వాక్సుధాసేచనంలో జీవించివృద్ధి పొందిందనడం నిర్వివాదంశ్రీ విశిష్టాద్వైతం మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది పర్యాయాలు గురు ముఖంగా రామాయణాన్ని పఠించి వ్యాఖ్య రాశారు.

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానంఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయిఅందువల్లేవాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, "అంగన్యాస కరన్యాసాదులతోయథావిధిగా చదివివారి వారి కోరికలు నెరవేర్చుకుంటారుసద్భావంతో సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందనివారు ఇంతవరకు లేరుఉత్తర కాండలో చెప్పినట్లురామాయణమంతా గాయత్రీ స్వరూపమేగాయత్రిలోని 24 అక్షరాలనుప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడిందిఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగిందిఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికిరామాయణంతో పాటే ఉపదేశించాడు. " తప స్స్వాధ్యాయ నిరతంతపస్వీ వాగ్విదాంవరమ్నారదం పరిపప్రఛ్చవాల్మీకిర్మునిపుంగవమ్అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకిఅంధ్ర వాల్మీకంలోమూలంలో వున్నట్లు "తపమున స్వాధ్యాయంబుననిపుణుని...  .....  తమి గావించెన్అన్న పద్యంతో ప్రారంభించి, "యథావిధి విన్న బఠింప నారయన్అని ముగించబడిందికామ్యార్థమైనామోక్షార్థమైనారామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తిరామాయణానికి వుండడానికి కారణంఅది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకికూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే.

శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలివేదమే అయినప్పుడువేదంతో సమానమైందని ఎలా అనవచ్చునంటేవేదంలోని వర్ణాలనేఅనులోమ-విలోమాలుగా మార్చివేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయిందివేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది.అందువల్లనేవేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లోరామాయణ పఠనం నియమితమైందిశత కోటిఅంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారుకొందరేమోశత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారుఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలివాల్మీకి సూత్రాన్ననుసరించిరామాయణం వేద స్వర సముద్ధృతంగా-సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోందివాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలోయజుర్వేదంలోని 1 29 290 పదాలే కాకుండారుగ్వేదంసామవేదంఅధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చుయజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణంశ్రీరాముడు యజుర్వేది కావడమే.

శ్రీమద్రామాయణంలోని కాండలలో వేదాక్షరాలు ఎలా వున్నాయో పరిశీలించితేబాల కాండ ప్రధమ సర్గ నుంచి ఐదో సర్గ వరకు రెండో శ్లోకం దాకానారదుడు ఉపదేశించిన విధానం రాసితర్వాతనే బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో కథా భాగం వుందిబాల కాండ 5 సర్గ 3 వ శ్లోకం నుంచిఅయోధ్య కాండ 115 వ సర్గ వరకు యజుర్వేదంఅయోధ్య కాండ 116 వ సర్గ మొదలుఅరణ్య కాండ 74 వ సర్గ వరకు ఋగ్వేదంఅరణ్య కాండ 75 వ సర్గ మొదలు సుందరకాండ 48 వ సర్గ వరకు సామవేదంసుందర కాండ 49 వ సర్గ మొదలు ఉత్తర కాండ 36 వ సర్గ వరకు అథర్వ వేదంఉత్తర కాండ 37వ సర్గ మొదలు చివర వరకు ఉపనిషత్తు-అంటే శాంతిఈ విధంగా 647 సర్గలలో 23635 శ్లోకాలు, 776794 అక్షరాలున్నాయిరామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం. "కాదినవాది సూత్రాలప్రకారం అక్షరాల కొచ్చే సంఖ్యలను బట్టి చూస్తేరామాయణంలో ఎన్నో చిత్రాలు కనిపిస్తాయి.

అవతార సంఖ్య...7, రామాయణ కాండ సంఖ్య....7, యుద్ధం జరిగిన రోజుల సంఖ్య...7, రామాయణ యుద్ధంలో ముఖ్య మైన పురుషుల సంఖ్య (రామలక్ష్మణహనుమవిభీషణరావణకుంభకర్ణఇంద్రజిత్తులు) ...7. పారాయణం చేసే వారికి ముఖ్యంగా నియమిత మైన సర్గల సంఖ్య 7. వ్యాహృతులు 7. ఇలా ఈ ఏడవ సంఖ్య మహిమ అద్భుతం. "శ్లోక శతైఅని వాల్మీకి చెప్పినట్లుబాల కాండం మొదటి సర్గ మొదటి శ్లోకం (తప స్స్వాధ్యాయ...) లోని అక్షరాల కొచ్చే సంఖ్యలను కూడితే 100 వస్తుంది 100 సంఖ్య ప్రథమ సర్గలోని శ్లోకాల సంఖ్యరామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి "జయఅని పేరు పెట్టాడు. "జయఅంటే 18. భారతంలోని పర్వాలు 18.  యుద్ధం జరిగింది 18 రోజులురణ శూరులు 18 మందిభగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయిఇలా ఆలోచిస్తే,మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుందిసీతారాముల వియోగం గురించికలిసి వుండడం గురించి అయోధ్యా కాండలో చెప్ప బడిందిమిగిలిన కాండలలో కొంత కాలమన్నా వియోగం గురించి చెప్పబడిందికాబట్టి "సీతరామనామాల సంఖ్యలు కలిపితే (సీత=67 + రామ=52) 119 వస్తుందిఅయోధ్య కాండలో 119 సర్గలున్నాయిఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో వాల్మీకి రామాయణంలో నిక్షేపం చేశాడు.

No comments:

Post a Comment