Monday, January 9, 2023

బొమ్మకంటి.... సీల్డ్ కవర్‌ చాణక్యం (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 బొమ్మకంటి.... సీల్డ్ కవర్‌  చాణక్యం

అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-1

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (10-01-2023)

రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉందివరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడంతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్యసర్వదేవభట్ల రామనాధంమంచికంటి రామ కిషన్‌రావురావెళ్ళ సత్యనారాయణకెఎల్ నరసింహారావుబోడేపూడి వెంకటేశ్వర రావు వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగిందిఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఐ (ఎం) సీపీఐ  కంటే కొంచెం ఎక్కువైనా బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చిందిరాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుందిరాష్ట్ర చరిత్రలో, ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు ప్రప్రధమంగా నాంది పలికింది మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిఅడ్వకేట్‌ రాధాకృష్ణఅడ్వకేట్ సుబ్బారావు నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోనే అనేసంగతి బహుశా ఇప్పటి తరం వారికి చాలామందికి తెలియదు.

ఒకప్పుడు మధిర ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాలలోనూప్రత్యేకించి ఖమ్మం జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు (రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి బొమ్మకంటి శంకర్ రావు తండ్రి)కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రికేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవిఅరవై సంవత్సరాల క్రితం ముదిగొండ, ఆ పరిసర గ్రామాలలో కూడా వారి ప్రభావమే ఉండేదిశీలం సిద్ధారెడ్డి రాజకీయంగా ఎదిగిమంత్రివర్గంలో స్థానం సంపాదించినాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతోజిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించడం ప్రారంభమైందిఆ తర్వాత కాలంలోజలగం, శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు చీలిపోయి కొనసాగాయిఉభయ కమ్యూనిస్టు పార్టీలు జిల్లాలోనూప్రత్యేకించి బలంగా వున్న ముదిగొండ ప్రాంతంలోనూపరిస్థితులను బట్టి శీలం వర్గానికి, లేదా జలగం వర్గానికి మద్దతివ్వడమోతీసుకోవడమో జరిగేది.

జలగం, శీలం వర్గాల ఆధిపత్య పోరు కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్ధారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తేఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్ధారెడ్డి వర్గం మద్దతు లభించేదిఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారుఅయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షానసీపీఎం సిద్ధారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయితెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలలో కొంత మార్పు వచ్చిందిఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకిఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు. వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు

ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగాగత శతాబ్దం అరవయ్యో దశకంలోమిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడంఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీవీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయిఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌రాజకీయాలకు ‘అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టితన సమీప బంధువైన (ప్రముఖ రచయిత, మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారాంరావు తండ్రి) రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరు’ సమితి అధ్యక్షుడిని చేశారుఅప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతోసర్పంచ్‌ గా పోటీ చేయకపోయినా, ఆ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిగా పేరున్న ఆయనను బొమ్మకంటి నిర్ణయం మేరకు కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎంపిక చేయించి సమితి అధ్యక్షుడిగా చేశారని అప్పట్లో విశ్లేషకులు అనుకునేవారు. బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా నష్టపడింది ఆయన మరో సమీప బంధువు అయితరాజు రాంరావురాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదుగుతున్న అయితరాజు రాంరావు మీద బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడని కూడా అనుకునేవారు.

ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడంజలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలుఆ నేపథ్యంలోముదిగొండ, పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయికక్షలకు, కార్పణ్యాలకు దారి తీసాయిఅప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగిందిబొమ్మకంటికి అత్యంత సన్నిహితుడిగా వున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీబొమ్మకంటి ఎంపిక చేసిన సమితి అధ్యక్షుడు రావులపాటికి మధ్య భూమి’ తగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారిందిసమితి అధ్యక్షుడికి అండగా దళితులుపేదలతో సహాసాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు, పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారుదీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి కొడుకును భూస్వామి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని ఇప్పటికీ చెప్పుకుంటారు.

 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావులపాటికి అండగానూజలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చిందిఅయితే దళితులుపేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతోవారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారుఆ ప్రాంత, జిల్లాప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లురావెళ్ళ సత్యం పార్టీ పరంగా ముందున్నారురాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికిరావెళ్ళ సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారుతర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడుముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత సామినేని ఉపేంద్రయ్య గెలుపొందారుసమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగాజలగం వర్గంలో కీలకమైన వ్యక్తిగా అనతి కాలంలో ఎదిగాడుఅప్పటికే జలగంశీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయిందిఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడిందిజలగం వర్గం పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్ర వర్ణం వారు చేరగాశీలం వైపున మరో అగ్ర వర్ణం వారే చేరారుదళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు. పోరు కొనసాగింది.  

No comments:

Post a Comment