Sunday, March 28, 2021

లంకానగరం జయించనలవి కానిదా? : వనం జ్వాలా నరసింహారావు

 లంకానగరం జయించనలవి కానిదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (28-03-2021) ప్రసారం  

హనుమంతుడు సీతావిషయం లంకలో జరిగినది జరిగినట్లే చెప్పగా రామచంద్రమూర్తి వినిసంతోషించిసుగ్రీవుడిని చూసి, "మన హనుమంతుడికి సమానమైనవాడని చెప్పగలవాడు ఈ లోకంలో ఎవరైనా వున్నారాలేడు...లేడు....లేడు. హనుమంతుడు కాకుండా మరెవ్వరికైనా ఆ సముద్రాన్ని దాటడం సాధ్యమయ్యేదా? రావణుడు పాలించే లంకను ఎంతటివాడైనా తన బలసంపదతో ప్రవేశించడం సాధ్యమాఒక వేళ రాక్షసులను ఏమరచి లోపల ప్రవేశించినా మళ్లీ ప్రాణాలతో తిరిగిరావడం సాధ్యమాఅలా చేయగలగడం మన హనుమంతుడికి ఒక్కడికే చెల్లింది అన్నాడు.

రాముడు ఇంకా ఇలా అన్నాడు. "సుగ్రీవుడి యోగ్యతకు తగ్గట్లు రాక్షసులను వధించి లంకాదహనం చేశాడు హనుమయజమాని చెప్పని అవసరమైన కార్యక్రమం కూడా నెరవేర్చే దూతను బుద్ధిమంతులు పురుషోత్తముడు అంటారు. ఇది ఉత్తమ దూత లక్షణం. హనుమంతుడు పురుషోత్తముడైనందున రాక్షసులకు చిక్కినాతన గౌరవానికి హానికలుగకుండాతనను దూతగా నియమించిన సుగ్రీవుడికి సంతోషం కలిగేట్లు నియమిత కార్యాన్ని సాధించాడుఇది ఆయన తన స్వామికి చేసిన ఉపకారంజానకిని చూసి వచ్చి నాకు, లక్ష్మణుడికిమా ఉత్తమ రఘువంశానికి ప్రాణాలిచ్చి రక్షించాడు.  నేనే రాజుగా వుంటే సర్వరాజ్యం నీకిచ్చేవాడిని. అది కూడా లేదాయె. కాబట్టి నువ్వు చేసిన దానికి బదులుగా నా కౌగిలిని తీసుకో ఆంజనేయా! ప్రార్థిస్తున్నాను. ఇది బదులుగా అంటున్నాను కాని సమానంగా అనడం లేదు. ఇది నువ్వు చేసినదానికి సమానం కాదు. అయినాఈ అల్ప దక్షిణను శాస్త్రోక్త దక్షిణగా తీసుకోమని నాకున్న అల్పమైన ఈ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను".

“నా ప్రార్థన నిరాకరించక మన్నించమని కోరుతున్నానుకృపతో పరిగ్రహించునువ్వు నిరాకరిస్తే నాకంతకంటే వేరే మరణం లేదుఎందుకు నా కౌగిలి సమానం కాదంటున్నానాఅక్కడ చావడానికి సిద్ధంగా వున్న సీత ప్రాణాలు నిలిపావుఆ వార్త తెచ్చి ఇక్కడ నా ప్రాణాలు నిలిపావుఇలా ఇద్దరి దేహాలు నువ్వు ఇస్తేనేను ఒక్క దేహాన్ని ఇవ్వడం ఎలా సమానమవుతుందికాదునేనేం చేయాలిఏమీ చేయలేకపోయానని బాధపడుతున్నానునా ఈ దుఃఖాన్ని నేనిచ్చిన దానిని ప్రేమతో స్వీకరించి అణచివేయినువ్వు చేసిన ఉపకారాలకు ఇది సమానం కాదనడానికి ఇంకో కారణం కూడా వుందినువ్వు నాకు సుగ్రీవుడితో స్నేహం కుదిర్చి గొప్ప ఉపకారం చేశావు. అప్పటినుండి నీకెలా ప్రత్యుపకారం చేయాల్నా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇది రెండోది. ఈ రెంటికీ నేనిచ్చిన అల్పం ఎలా సమానం కాగలదుకాబట్టి హెచ్చుతక్కువలు ఆలోచించకుండా నేనిచ్చిన అల్పాన్ని ప్రేమతో స్వీకరించు" అన్నాడు రాముడు.

రాముడు కౌగిలి ఇవ్వడం అంటే తనను తాను సమర్పించుకొనడమే. ఆత్మాత్మీయనిక్షేపం అన్నట్లుగా తనను సమర్పించుకోవడంఅంటేతనకున్న సర్వస్వాన్ని, అంటేనిత్యవిభూతిలీలావిభూతి రెండూ అర్పించినట్లే. వీటితో ఆయనకేం ప్రయోజనమంటేఆయనకు ప్రియమైనది ఇస్తేనే కదాప్రయోజనం అనవచ్చు. హనుమంతుడికి ప్రియమైంది శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహమే. పరస్వరూపంతో ఆయనకు పని లేదు. ఎవరికేది ప్రియమో దానినే భగవంతుడు వాడికిస్తాడు. కాబట్టి ఆ దివ్యమంగళ విగ్రహం మీద హనుమంతుడికి ప్రీతి అని తెలిసి రాముడు దాన్నే ఇచ్చాడు. దాంతో హనుమంతుడు తృప్తి చెందాడు.

ఆ తరువాత శరీరం పులకరిస్తుంటే రామచంద్రమూర్తి ఆంజనేయుడిని నిండుమనస్సుతో కౌగలించుకుని సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడు. "జానకీదేవిని వెతికే పని చక్కబడింది. కాని సముద్రాన్ని తలచుకుంటే దిగులుగా వుంది. దాటడానికి సాధ్యపడని సముద్రాన్ని దాటివానరులందరూ దక్షిణ దిక్కు తీరానికి చేరే ఉపాయం నీకేమైనా తెలిస్తే చెప్పు. వానరులారా! సీత ఎక్కడున్నదిఎలా వున్నదిఅనే విషయం మీరు చెప్తే విన్నాను. అక్కడికి మనం పోవాలికదాపోయే మార్గంలో సముద్రాన్ని దాటాలికదామీరంతా ఆ సముద్రాన్ని ఎలా దాటాలో ఉపాయం వుంటే చెప్పండి". ఈ విధంగా వానరులకు చెప్పిరామచంద్రమూర్తి ఆంజనేయుడితో కలిసి ఆలోచన చేశాడు.

సముద్రాన్ని దాటడం ఎలా అని విచారపడే శ్రీరామచంద్రమూర్తిని చూసి సుగ్రీవుడు ఆయనకు ధైర్యం కలిగించే మాటలను చెప్పాడు. “ఏ ఉపాయం చేస్తే పాపాత్ముడైన రావణుడిని యుద్ధంలో చంపి సీతాదేవిని తీసుకురావచ్చో ఆ మార్గాన్ని ధీరుడివై చేపట్టు. నువ్వు చేయాల్సినదంతా సముద్రాన్ని దాటి లంక చేరడానికి ఏం చేయాలన్న ఆలోచనే. లంక కనబడితే ఇక రావణుడు చచ్చినట్లే. రామచంద్రా! ఒకటి మాత్రం నిశ్చయం. సేతువు కట్టకుండా సముద్రాన్ని దాటడం దేవతలకైనా సాధ్యంకాదు. సేతువే ఏర్పాటైతే వానరులు సముద్రాన్ని దాటడం శత్రుసంహారం చేయడం తధ్యం. ఆ విషయంలో నువ్వు సందేహించాల్సింది లేదు. ఎందుకంటే ఈ వానరులు కామరూపులు. యుద్ధంలో శూరులు. కలహానికి భయపడరు. కాబట్టి నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టు. అది నీకు తగదు. శౌర్యం వున్నవాళ్లు పనులు చేయడాని అధైర్యపడరు" అని అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న రామచంద్రమూర్తిహనుమంతుడితో, "హనుమంతానువ్వు లంకానగరాన్ని కళ్లారా చూశావుకదాదానిలో కోటలెన్ని వున్నాయిసైన్యం ఎంతమేరకు వుందిచెప్పులంకకు ద్వారాలెన్నికోటలెన్నివాటిని ఏవిధంగా కట్టించారురాక్షసుల ఇండ్లు ఎన్నివాటిని రక్షించడానికి ఎలాంటి ఉపాయం చేశారుఇవన్నీ చెప్పుతీరిగ్గా లంకంతా తిరిగి చూశావు కదాఅన్నింటికీ సమర్థుడివి కాబట్టి నీకీ విద్య కూదా తెలిసే వుండాలివివరంగా చెప్పుఅని అన్నాడు.

జవాబుగా హనుమంతుడు, "దేవాలంకకు నలుదిక్కులా నాలుగు ద్వారాలున్నాయివాటి ద్వారాలను అడ్డగడియ చెట్లతో బంధించి వుంచారుఆ ద్వారాలలోని రాతి యంత్రాలతో ఆ మార్గాన వచ్చిన విరోధిసైన్యం అక్కడే చచ్చిపోతుందిరాక్షసులు నిర్మించిన శతఘ్నులు వేటుకు వందమందిని చంపగలవుఅవి ద్వార-ద్వారాన విశేషంగా ఏర్పాటుచేయబడి వున్నాయికోటగోడలను పగులగొట్టి లోపలికి పోవడం సాధ్యపడదుఆ పట్టణం చుట్టూ మిక్కిలి భయంకరమైన మొసళ్లతో నిండి చాలా లోతులో నీరున్న కందకాలున్నాయిఆ కందకాలమీద ప్రజల రాకపోకలకు అనుకూలంగా వుండే విధంగా వెడల్పాటి వంతెనలున్నాయి. శత్రువులు వచ్చినప్పుడు యంత్రాలను తిప్పితేఆ వంతెనలు లేచి కోట ద్వారాలకు తలుపుల్లాగా అడ్డుపడతాయి. అక్కడ ఇండ్ల వరసలున్నాయి. అవికూడా ఆ పలకల వంతెనల్లాగే శత్రువులు వచ్చినప్పుడు లంకాపురాన్ని రక్షిస్తాయి”.

“లంకలో జలదుర్గంకృత్రిమ దుర్గంపర్వత దుర్గంవనదుర్గాలనే నాలుగు రకాల భయంకర దుర్గాలున్నాయిఇవి ఇతరులకు సాధ్యపడవులంక నిరాధారంగా సముద్రతీరంలో వున్నదిదానిలోకి ప్రవేశించడం దేవతకు కూడా సాధ్యంకాదునావలు కూడా దాని సమీపంలోకి పోవడానికి దారిలేదుపర్వత శిఖరం అమరావతిలాగా వుందిబయటి వార్త లోపటికి పోవడం కానీలోపలివార్త బయటికి రావడానికి కానీ వీలుకాదుగొప్ప యంత్రాలునానారకాల అగడ్తలుశతఘ్నులు వున్నాయిజయించడానికి ఏదీ సాధ్యపడదుతూర్పునుండి సైన్యం రావడానికి వీలుపడదుఆ ద్వారంలో పదివేలమంది రాక్షసులు సైన్యానికి ముందు నిలిచి యుద్ధంచేయడానికి సిద్ధంగా వుంటారు ఎల్లప్పుడూదక్షిణద్వారం దగ్గర శూలాలు ధరించిన శూరులుఅజేయులు, పరాక్రమవంతులు లక్షమంది రాక్షసులు నాలుగు రకాలైన సేనలతో కాపలాకాస్తుంటారు. పడమటి వాకిట్లో పదిలక్షలమంది రాక్షసులు కాపలాగా వుంటారు. వీరికి అస్త్రవిద్యకూడా తెలుసు. ఉత్తరద్వారం దగ్గర పది అర్బుదాల రాక్షసులు ఏనుగులుగుర్రాలు వాహనాలుగా రక్షిస్తుంటారు. వీరంతా రావణుడికి పూజ్యులువిశ్వాసపాత్రులు".

హనుమంతుడి మాటలను విన్న రామచంద్రమూర్తి ఈ విధంగా అన్నాడు. "లంకను పాడుచేయడం పెద్ద పనికాదని భావిస్తున్నానురావణాసురుడి పురాన్ని ధ్వంసం చేస్తానుసత్యం చెప్తున్నానుప్రయాణానికిదే మంచి ముహూర్తంఈ ముహూర్తానికి విజయం అని పేరుఇప్పుడు మనం బయల్దేరి పోతే పగవాడు జానకిని తీసుకుని ఎక్కడికి పోగలడుఎక్కడికి పోయినా చస్తాడుఈ ముహూర్తానికి "అభిజిత్అని పేరు. ఈ రోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంనా జన్మ నక్షత్ర్రానికి ఆరవది కాబట్టి శుభం కలుగుతుందిరేపు చంద్రుడు హస్తతో కూడి ఏడవతారై ధనతార అవుతుందిఅది అశుభంరేపు ప్రయాణం చేయకూడదుకాబట్టి ఈ రోజే సైన్యంతో సహా ప్రయాణం చేయాలిమంచి శుభశకునాలు కనపడుతున్నాయికాబట్టి రావణుడిని చంపి సీతను తేవడం సత్యంశత్రువులను నాశనం చేసి, జయం పొందిఅవమానాన్ని పోగొట్టుకుంటావని చెప్పేవిధంగా కంటిపైభాగం అదురుతున్నదిప్రయాణం చేయడానికి ఇదే సరైన సమయం”.

రామచంద్రమూర్తి ఇలా చెప్పగా, సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు గుహలనుండి, పర్వత శిఖరాలనుండి, భూమ్యాకాశాలు దద్దరిల్లేట్లు భయంకరంగా బయల్దేరారు వానరులు. రామచంద్రమూర్తి లక్ష్మణ సుగ్రీవులతో కలిసి సంతోషంగా, అతివేగంగా, దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశాడు. శ్రీరాముడి వెంట వానర సైన్యం నడిచింది. ఎవరికివారు తామే రావణుడిని చంపుతామని అన్నారు. మహాబలవంతుల మధ్యన రామలక్ష్మణసుగ్రీవులు పోయారు. సుగ్రీవుడు ముందు పోతున్నాడు. త్వరగా నడవమని వానరులను ప్రోత్సహించారు. సముద్రధ్వనితో సమానమైన ధ్వనితో సముద్రం పొంగి వెల్లువగా మారిన విధంగా వానరసేన చక్కగా తోలబడ్డ గుర్రాల దండు వేగంలాగా రామచంద్రమూర్తి పక్కనే నడిచాయి.

          లక్ష్మణుడు రామచంద్రమూర్తితో సీతాదేవిని మళ్లీ ఆయన తీసుకుని వస్తాడనీ,  భూమ్మీద, ఆకాశం మీద, కనిపించే శుభశకునాలు కార్యసిద్ధి తెలియచేస్తున్నాయనీ అంటాడు. రాముడి అవతార కాలంలో జాతకఫలాలు సూచించినట్లేదండయాత్రాకాలంలో గోచార ఫలాలు రాక్షసుల విపరీత పరిణామానికి సూచనలు అయ్యాయి. శుభ శకునాలు తెలుపుతూ లక్ష్మణుడు అన్నకు సంతోషం కలిగే విధంగా చెప్తుంటే రామచంద్రమూర్తి సైన్యాన్ని వేగంగా నడిపించాడు.

ఇలా ఒక రాత్రి, ఒక పగలు విడవకుండా ప్రయాణం చేశారు. రామచంద్రమూర్తి మహేంద్రపర్వతంమీద ఎత్తైన శిఖరం ఎక్కి తాబేళ్లు, చేపలు అమితంగాకల సముద్రన్ని చూశాడు. మలయ పర్వతం, సహ్య పర్వతం దాటి సముద్రాన్ని సమీపించి, అక్కడ ఆంజనేయుడి మీదనుండి దిగి సముద్రతీరంలో వుండే వనం దాటి చెలియలి కట్ట దగ్గర అలలతో కడుగబడిన ప్రదేశానికి చేరారు.

రామచంద్రమూర్తి సుగ్రీవుడిని చూసి, "వానర రాజా! సముద్ర తీరం చేరాం. ఏదైనా ఒక ఉపాయం చేసి దీన్ని దాటాలికాని వ్యర్థంగా కాలం గడపకూడదు” అన్నాడు. సముద్రతీరాన సేనలన్నీ ఏఏ సేన ఏఏ చోట దిగాల్నో ఆ విధంగానే దిగిన తరువాత రామచంద్రమూర్తి సముద్రానికి ఆవలి ఒడ్డున సీతాదేవిని తలచుకుని దుఃపడుతున్నాడు. సీతాదేవి దుఃఖిస్తున్నదని హనుమంతుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని మరీ-మరీ దుఃఖించాడు. “సీత జీవించే వుందని హనుమంతుడు చెప్పాడు. కాబట్టి నేను కూదా జీవించగలిగాను. కాని నేనామెను చూడగలనా? నా భార్యను, స్త్రీరత్నాన్ని, భూపుత్రికను సీతను విడిచినందున కలిగిన దుఃఖం నేనెప్పుడు మాసిన గుడ్దను వదిలినట్లు వదిలి సుఖపడతానోకదా?” అని అంటాడు.   

ఇలా రాముడు శోకిస్తుంటే సాయంకాలమై సూర్యుడు అస్తమించాడు. ఆయన బాధ పోయేట్లు లక్ష్మణుడు సమాధాన పరిచే మాటాలు చెప్పాడు. అవి విని, సీతను స్మరించుకుంటూ రామచంద్రుడు సంధ్య వార్చాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment