Sunday, August 7, 2016

విష్ణువే జగజ్జనన కారణభూతుడు....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు ఐదవ భాగం- బాల కాండ:వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

విష్ణువే జగజ్జనన కారణభూతుడు

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
ఐదవ భాగం- బాల కాండ
వనం జ్వాలా నరసింహా రావు

సూర్య దినపత్రిక (23-05-2016)

శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రనువీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకుశత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగాఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికిఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడుఅంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడువాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.

శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండఅని పేరు."కాండం"అంటే జలం-నీరుశ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్లఅందులోని జలం కాండమనబడింది.శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతులఅర్థం నిక్షిప్తమైంది.బాల కాండలో "ఓం భూఃఅనే వ్యాహృత్యర్థం వుందిఅది గ్రంథ పఠనంలో తెలుస్తుందిఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడుఅని బోధపడుతుంది. జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయిపన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదుబాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.

బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం,అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం,కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి,భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది.శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి.అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.

వేదాధ్యయనంలో సు సంపన్నుడువ్యాకరణాది వేదాంగాలను తెలిసిన నారదుడు వాల్మీకి దగ్గర కొచ్చి చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించిఆయన పోయిన తర్వాతతమసా నదిలో స్నానం చేయడానికి పోతున్న సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో చక్కటి పద్యాన్ని రాసారు వాసు దాసుగారీవిధంగా:

మత్తకోకిలము:      రాజితద్యుతి వాల్మీకర్షియు  రాఁ గ  వెన్కొనిత  న్భర
                ద్వాజుఁ డన్ప్రి నాడఁ గ  నేగి,  పే
                రోజమై  నడిమింట  రాజిల నుగ్రదీధితి,  చార్వను
                ద్వేజితాంబులఁ  గాంచి  యిట్లనుఁ  బ్రీతుఁ డై నిజశిష్యుతోన్-1

తాత్పర్యం:     బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడు వున్నాడువీరిరువురు కలిసి,మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని,తమసానదిలో దిగుతారుతేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో ఇలా అన్నాడు.
ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి  ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

అప్పుడాయన (వాల్మీకికంటికి సమీపంలోమనోహరంగా కూస్తూ,వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించిందిఆ సమయంలోతాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండాసహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడురెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడుక్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి.సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:

"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిదిఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాదశ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవివ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమనీదీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించితనను తాను పరీక్షించుకోదల్చితొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు.


రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకంలోఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయిపాదానికి 13 అక్షరాలు.సాంఖ్యశాస్త్రం ప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుందిఎందుకంటే,వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "విష్ణు అనే అర్థమున్న "మానిషాద"శబ్దం "కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ” స్త్రీ లింగంఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైందిప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "కారాన్ని బోధిస్తుంది."నీక"అనేది "కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీదాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు)పురుషుడని అర్థం చేసుకోవాలిఇది "కారాన్ని బోధిస్తుంది.

వాసుదాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడాశ్రీరాముడా"  అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగుఅనే పదం పితృవాక్య పరిపాలన,రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనములఅనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుందిదాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుందిక్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుందిఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.

          బోయవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో బాధపడ్డ వాల్మీకివాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించితదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో,ఆయన్ను చూడడానికి వచ్చాడు బ్రహ్మదేవుడుపది దిక్కులకు తన తేజస్సును వ్యాపింపచేస్తూయోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే,వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడుతనంతట తానేదేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడుఇలా బ్రహ్మ తన ఇష్టులతోశిష్టులతో రావడంతోవాల్మీకి తటాలున లేచిమిక్కిలి భక్తితో మ్రొక్కినిలబడి ఈయనెందుకొచ్చాడా అని కారణం వెతకసాగాడుఈ సందర్భాన్ని "పంచ చామరం" పద్యంలో చెప్పారు కవి ఎలా:

 పంచ చామరం:   ఇ టా చతుర్ముఖుండ రాగఁ  నిష్ట శిష్టపాళితోఁ
                                దటాలున న్మునిప్రభుండు  తద్దభక్తి యుక్తిమై
                                నిటాలమందుఁ గేలుదోయి  నిల్చి  మ్రొక్కి  నిల్చితా
                                ని టేటికో  ననుం  గనంగ  నేగుదెంచె  ధాతయున్-2.
పంచ చామరం వృత్తానికి జ-ర-జ-ర-జ-గ గణాలు. పదో అక్షరం యతి. చతుర్ముఖ బ్రహ్మకు పంచ చామర సేవ చేశారు వాసు దాసుగారు.

రామాయణాన్ని రచించేందుకు వాల్మీకిని నియమించడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన ఆశ్రమానికి వస్తాడు. అప్పటికే జంటగా పక్షులు కలిసున్న సమయంలోఒక దాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకున్న వాల్మీకి ఆ పనిచేసిన బోయవాడిని శపించాడుశపించిన మాటలే పద్య రూపంలో కావడం అర్థంకాని వాల్మీకి నోట వచ్చిన పద్యానికి కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని తెలిసిన బ్రహ్మఅది యాదృచ్ఛికంగా వచ్చింది కాదనితన పనుపున సరస్వతీ దేవి వాల్మీకి నోటినుండి పలికించిందని అంటూరామాయణాన్ని కావ్యంగా రచించిభూ లోకంలో దాన్ని ప్రచారంలోకి తెమ్మని చెప్పి వెళ్లిపోయాడు.

తాను రచించాలని నిర్ణయించుకున్న రామాయణం రసవంతంగా,వినడానికింపుగామననం చేయడానికి అమృత సమానంగారహస్యార్థాలకు ఆధారంగాపఠించేవారికి-వినే వారికి నిర్మలమైన కీర్తినిచ్చేదిగాభగవత్ ప్రాప్తికి విరుద్ధమైన పాపాలను హరించేదిగా వుండాలనుకుంటాడు మహర్షి.ఎలావుండాలో చెప్పడానికి వాసు దాసుగారు "కవిరాజ విరాజితము" లో పద్యాన్ని రాసారు ఈ విధంగా:

కవిరాజ విరాజితము:         
సరససమాసవిలాసవిభాసము సాధునుతంబు  సుసంధిగమున్
వరమ ధురోపనతార్థ  సువాక్యని బద్ధము యోగసమంజసము
న్ఖరదశకంఠవధాధికమున్  సుమ  నస్సు ఖదంబు  మునీరితమున్
స్ఫురదురుసద్గుణభూషణభూషిత మున్ గనుఁ డీ రఘురాము కథన్-3

కవిరాజ విరాజితము ఛందస్సు"నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7స్థానాలలోనూఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది. ఈ పద్యంలో యతి రెండో సిద్ధాంతాన్ని అనుసరించి రాయబడింది.


 తాత్పర్యం: రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా-సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా-సమత్వం, మాధుర్యం,అర్థ వ్యక్తి లాంటి గుణాలు కల బోసి వాక్య బద్ధమైన కావ్యంగా-యోగం, రూఢ్యర్థాలతో కూడినదిగా-రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా-మనస్సుకు సుఖమిచ్చేదిగా-పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా-చక్కటి కావ్య గుణాలతో అలంకరించినది గా, తాను రచించ బోయే రామాయణాన్ని-అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి

No comments:

Post a Comment