(Recovered and Reloaded)
విద్యా కేంద్రంగా తెలంగాణ
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (31-05-2016)
తెలంగాణ
రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం రూపొందించే విద్యా విధానంలో
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ విద్యా సంస్థల
యాజమాన్యాలు కూడా పాలుపంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు
సంబం ధిత సంస్థల ప్రతినిధులను కోరారు.
తెలంగాణ
రాష్ట్రాన్ని నాణ్యమైన విద్యకు హబ్‌గా మార్చాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. అందుకోసం
సాంప్రదాయ విద్య స్థానంలో సార్ధకమైన, ఉపయుక్తమైన
పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని
ప్రయివేటు విద్యాసం స్థలు కూడా తమ వంతు ఆలోచనలను పంచుకోవాలని ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖరరావు అభిప్రాయం.
కొత్త
ఆలోచనలు పంచుకుని సరికొత్త విధానాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపకరించే
పాఠ్యాంశాలను రూపొం దించేందుకు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సంబంధిత
నిపుణులతో సమాలోచనలు చేసుకోవాలని,
అందుకు అవసరమైన సదస్సులు
ఏర్పాటు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఆయా సదస్సుల్లో కూలంకషంగా చర్చించిన అనంతరం వారు తమ సిఫార్సు లతో ఒక నివేది కను
సమర్పిం చాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాదు. ప్రొఫెషనల్ కాలేజీలలో అంత
అధిక సం ఖ్యలో సీట్లు నిజంగా అవసరమా, పట్టభద్రులైనవారు
తమ ప్రొఫెషనల్ విద్యకు తగి నట్లుగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారా, అదే సరళిని మనం కొన సాగించాలా లేక
మార్పులు చేయాలా అన్నది యాజమా న్యాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సిఎం సూచించారు.
పోలీస్ కానిస్టే బుల్ ఉద్యోగం కోసం ఇటీవల జరిపిన రిక్రూట్‌మెంట్‌ను ఉదాహరణగా సిఎం
ఉటంకిస్తూ, ఇంజ నీర్లు వంటి ప్రొఫెషనల్
గ్రాడ్యుయేట్లు సుమారు 30 వేల మంది ఆ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసినట్లు సిఎం
తెలియజేశారు. ప్రొఫెషనల్ కాలేజీలలో చేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య గురించి
సరిగ్గా మదింపు వేసిన పక్షంలో ఇలా జరిగి ఉండేది కాదు.
ఉద్యోగాలను
సంపాదించే కోర్సులను ప్రవేశ పెట్టాలని, ఉద్యోగావకాశాలు
లేని కోర్సులకు స్వస్తి పలకాలని ప్రైవేట్ యాజ మాన్యాలకు సిఎం సలహా ఇచ్చారు.
ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ రంగంలోని బోగస్
కాలేజీల గురించి సిఎం ప్రధానంగా ప్రస్తావిస్తూ, అటువంటి
కాలేజీలను కలిగి ఉండడం అభిలషణీ యమా అని యాజమాన్యాల ప్రతినిధులను సిఎం అడిగారు.
వాటిని అనుమ తించినట్లయితే,
తక్కిన దేశం, ఆ మాటకు వస్తే బాహ్య ప్రపంచం దాని
గురించి ఎలా భావిస్తుందని ఆయన అడిగారు.
ఎటువంటి
అంచనా కూడా లేకుండా అశాస్త్రీయంగా, లోపభూయిష్ట
రీతిలో ఇంజనీరింగ్,
డిఇడి, బిఇడి కాలేజీలను రాష్ట్రంలో ఏర్పాటు
చేశారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది ఇంజనీర్లు, 40-50
వేల మంది డిఇడి, బిఇడి అర్హత ఉన్నవారు బయటకు వస్తుంటే
వారందరికీ ఉపాధి కల్పన సాధ్యమవుతుందా? ఇది
ఎక్కడికి దారి తీస్తుంది?
విద్యా రంగంలో ఎప్పటికప్పుడు
తాజా అంశాల బోధన సదా అత్య వసరం.
తెలంగాణ
కొత్త రాష్ట్రం. తెలంగాణ కేవలం రెండేళ్ల కిందటే ఏర్పడింది. పూర్వపు అవిభాజ్య ఆంధ్ర
ప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు అవలక్షణాలు వార సత్వంగా వచ్చాయి. ఆ క్రమంలోనే
ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన సమస్యలు కూడా తెలంగాణకు వారసత్వంగా
సంక్రమించాయి. ఆ సమస్యలు వేటినీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సృష్టించలేదు.
వాస్తవానికి, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం
సమయంలోను, రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా
పునరావిష్కరణ అవసరం గురించి సిఎం కెసిఆర్ చాలా సార్లు చెబుతూ వస్తున్నారు. అనేక
రంగాలలో సరైన వ్యవస్థే లేదు.
ఎటువంటి
ఆధారమూ లేకుండా అనవసరంగా పలు విషయాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిలో వేటినీ ఎందుకు సరిచేయలేకపోతున్నారు
అనేవి సమాధానం దొరకని ప్రశ్నలు. కొత్త రాష్ట్రంగా మనం ఈ రోజు చేస్తున్నది ఏమిటి
అనేది తెలుసుకోవాలి. రాష్ట్రం,
ప్రజల భవిత కోసం సరైన పునాది
వేయాలి. 'మనం సరైన దారిలో పోతున్నప్పుడు
పొరపాటు చేయవచ్చు కాని తప్పుడు దారిలో పోతున్నప్పుడు పొరపాటు చేయరాదు' అని సిఎం చెప్పారు. కొత్త
రాష్ట్రానికి సార్వత్రికంగాను,
ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పరిశ్రమ, నీటిపారుదల, తాగునీటి మొదటూన రంగాలలో సరైన
మార్గదర్శనం కావాలి. ఐటి రంగంలో లాభాపేక్ష లేని సంస్థ అయిన నాస్‌కామ్ అధ్యక్షునితో
సిఎం జరిపిన పలు సమావేశాలలో ఒక దానిలో ఇంజనీరింగ్ కళాశాలల అంశం ప్రస్తావనకు
వచ్చింది.
ఆశ్చర్య
కరంగా ఇంజనీరింగ్‌లో 100 నకిలీ సర్టిఫికెట్లలో 75 హైదరాబాద్ నుంచి వచ్చినవేనని
నాస్‌కామ్ అధ్యక్షుడు సిఎంతో చెప్పారు. ఇది ఎందుకు జరగాలి? ఈ వ్యవహారాలకు ఎవరు బాధ్యులు? దీనిని కొనసాగనిచ్చారనేది ప్రశ్న.
సమయం ఎప్పుడూ ప్రధానం అని సిఎం చెబుతుంటారు. పరిస్థితులను అదే తీరులో కొనసాగవు.
రాష్ట్రం, దేశం, ప్రపంచం
వేగంగా పురోగమి స్తున్నాయి. ఈ రోజు తుదకు ఆదిలాబాద్ అడవి నుంచి అమెరికా వరకు కూడా
ఎవరు ఎవరితోనైనపా సెల్ ద్వారా మాట్లాడగలుగుతున్నారు. మరి విద్యా రంగంతో సహా
తెలంగాణలో మార్పులు ఎందుకు చోటు చేసుకోవడం లేదు?
ప్రభుత్వ
విద్యా సంస్థలకు తోడుగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండడం సదా అభిలషణీయం. అప్పుడే
అసలు పోటీ కనిపిస్తుంది. ఈ రోజులలో తుదకు పేద ప్రజలను మీరు మీ పిల్లలను ప్రభుత్వ
పాఠశాలలకు ఎందుకు పంపండం లేదని మనం ప్రశ్నించినట్లయితే, మనకు వచ్చే సమాధానం ప్రభుత్వ పాఠ
శాలలో బోధన భాష ఇంగ్లీష్ కాదనే. అందుకే ప్రైవేట్ సంస్థలను ఇష్టపడు తున్నారు.
చివరకు పేదలు కేడా ప్రైవేట్ విద్యా సంస్థల వైపే చూస్తున్న పరిస్థితిలో వాటిని
నైతికంగా నడపడం ఆ సంస్థల నిర్వాహకుల బాధ్యత. కొన్ని కాలేజీలు పేరుకే ఉంటుండడం, వాటిలో ఫ్యాకల్టీ, విద్యార్థులు ఉండకపోవడం దురదృష్టకరం.
ఫీజు రీయింబర్స్‌మెం ట్‌ను తప్పించుకోవడం కోసం ప్రభు త్వం తనిఖీలకు
పూనుకుంటున్నదని అనడం నిజం కాదు.
తెలంగాణ
సంపన్న రాష్ట్రమని,
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు
భయపడడం లేదని సిఎం చెబుతు న్నారు. నాణ్యమైన విద్యను బోధిస్తూ కాలేజీలను సమర్థంగా, పకడ్బందీగా నడిపినంత కాలం ఫీజు
రీయింబర్స్‌మెంట్ సమస్యే ఉండదు. ఒక్క ఫ్యాకల్టీ 11 కాలేజీలలో పని చేస్తున్నట్లు
చూపడం వంటి పద్ధతులను కొన్ని ప్రైవేట్ కాలేజీలు అనుసరించడం అత్యంత అనైతికమని సిఎం
పేర్కొ న్నారు. కొన్ని కాలేజీలు పిజి విద్యార్థులను తమ ఫ్యాకల్టీగా చూపుతున్నాయి.
ప్రైవేట్ కాలేజీలను మూసివేయించడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. అయితే, రాష్ట్రంలో బోగస్ కాలేజీ ఒక్కటి కూడా
లేదని తాను సగర్వంగా ప్రకటిం చగలిగే రోజు రావాలని సిఎం పునరుద్ఘాటించారు. బోగస్
కాలేజీలపైన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను
దుర్వినియోగం చేస్తున్నవారిపైన ప్రభుత్వ వైఖరి ఇక ముందూ కఠినంగానే ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనిఖీలు జరపడం ద్వారానే ఫీజు రీయింబర్స్‌మెంట్ దుర్వినియోగాన్ని
అరికట్టవచ్చు. తనిఖీల ద్వారా బోగస్ కాలేజీలను ఏరివేయడం జరుగుతుంది.
ఈ
ప్రక్రియ ద్వారా ఆదా చేసే సొమ్మును మెరుగైన ప్రదర్శన కోసం అసలు సిసలైన కాలేజీల
కోసం విని యోగిస్తామని సిఎం చెప్పారు. సిఎం ఈ హామీ ఇస్తూనే తనిఖీలు కొన సాగుతాయని, బోగస్ అని తేలితే నిస్సంకోచంగా వాటిని
మూసివేయిస్తామని కచ్చితంగా చెప్పారు. అయితే, లోపాలు
సరిదిద్దుకునేందుకు తగినంత సమయం ఇస్తామని వారికి సిఎం హామీ ఇచ్చారు. విద్య నాణ్యత
మెరుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదనే సందేశం ప్రజలకు చేరవలసి
ఉంటుంది. ఎవరో కొద్ది మంది వ్యక్తులే మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తు న్నారు.
దీనిని ఎటువంటి పరిస్థితిలోను అరికట్టవలసిన అగత్యం ఉన్నది.
ఇక
మీదట ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ జరుగుతుందని సిఎం తన ముగింపు పలుకులలో
హామీ ఇచ్చారు. అయితే,
ప్రైవేట్ విద్యా సంస్థలు
తప్పులు చేయకుండా ప్రతిదీ సక్రమంగా చేయాలని ఆయన హెచ్చరించారు. 'విద్యా సంస్థలకు హాని చేయాలని నేను
కోరుకోవడం లేదు. కాని ఎటువంటి పరిస్థితులలోను బోగస్ కార్యకలాపాలను అరికట్టాలని
కోరుకుంటున్నాను' అని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment