Monday, August 8, 2016

సంక్షేమ రాష్ట్రం అంటే ఇది! : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)
సంక్షేమ రాష్ట్రం అంటే ఇది!
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (01-06-2016)

          ప్రజల సంరక్షణ, సామాజిక అభ్యున్నతి, ఆర్ధికాభివృద్ధి సాధించే దిశగా కీలకపాత్ర పోషిస్తూ శ్రేయోరాజ్యాన్ని స్థాపించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందరికి సమాన అవకాశాలు కల్పిస్తూ, సదుపాయాలు అందరికి సమానంగా అందేలా చూస్తూ, పౌరుల్లో బాధ్యత పెంచుతూ ప్రజలు మెరుగైన జీవనాన్ని సాగించేందుకు వీలుగా అవసరమైన అన్ని ప్రాధమిక సౌకర్యాలు కల్పించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిద్ధాంతం. శ్రేయో రాజ్యం నమూనాకు మూల సిద్ధాంతకర్త గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఉదారవాద ఆర్థికవేత్త సర్ విలియమ్ బెవరిడ్జ్ 1942 నవంబర్‌లో బ్రిటిష్ పార్లమెంట్‌కు ఒక నివేదిక సమర్పించారు. అందులో ఆయన ప్రభుత్వాలు తమ కర్తవ్యంగా భావించాల్సిన సామాజిక భద్రత విధానాన్ని ప్రతిపాదించారు. ఆనాడు బెవరిడ్జ్ తన శ్రేయోరాజ్యం నివేదికలో పొందుపరచిన అభిప్రాయాలు ఇప్పటికీ ఆధునిక సంక్షేమ రాష్ట్రానికి వేదిక కల్పించేవిగా పరిగణిస్తున్నారు.

          బెవరిడ్జ్ సూచించినదాని కన్నా మెరుగైన విధానాలనే తెలంగాణలో కె.చంద్రశేఖరరావు ముఖ్యమం త్రిగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో నివశిస్తున్న దిగువ ఆదాయ వర్గాలు, నిరుపేదలను దృష్టిలో ఉం చుకుని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను రూపొం దించింది. తెలం గాణ ప్రభుత్వ సంక్షేమం ప్రధాన లక్ష్యాలలో ఒకటి నిరుపేదల, బడుగు వర్గాల ప్రజల జీవన నాణ్యతను, జీవన ప్రమాణాలను మెరుగు పరచడం. వృద్ధులు, అంగవికలురు, విద్యార్థులు, రైతులు, శ్రామి కులు, వృత్తి ఉద్యోగులు వంటి నిరుపేదలు, బడుగులకు సంక్షేమ సాయం అందించడమనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం.

          రాష్ట్రంలో లభిస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో దళితులకు పంపిణీ నిమిత్తం భూమి కొనుగోలు పథకం; వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మి కులు, కల్లుగీత కార్మికులు, పేద కళాకారులకు ఆసరా పింఛన్లు; తలకు కిలో బియ్యం ఒక రూపాయి ధరకు ఆరు కిలోలు పంపిణీ; హాస్టల్ పిల్లలకు అపరి మిత ఆహారంతో సన్న బియ్యం సరఫరా; బాలింతలు, గర్భిణీ స్త్రీలకు గుడ్డు, పాలతో మెరుగైన ఆహారం; కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు; నిరుపే దలకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు; ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు మొదలైన వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్, రెసిడెన్షి యల్ పాఠశాలలు ఉన్నాయి. సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వరుస బడ్జెట్లలో భారీ మొత్తాలు కేటాయించింది. ఈ ప్రయోజనం పొందేందుకు ఆదాయం అర్హత పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో (రూ. 60 వేలు నుంచి) రూ. 1.5 లక్షలకు, పట్టణ ప్రాంతాలలో (రూ. 75 వేలు నుంచి) రూ. 2 లక్ష లకు పెంచడమైంది. దీని వల్ల అనేక మంది బిపిఎల్ పరిధిలోకి వస్తున్నారు. ఆదాయం ప్రాతిపదిక ప్రభుత్వ పథకాలు అన్నిటికీ వర్తిస్తుంది.

          హాస్టల్ పిల్లలకు అపరిమిత ఆహారంతో సన్న బియ్యం సరఫరా జరుగు తోంది. మహిళా, శిశు సంక్షేమం కోసం తగినంత బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు గుడ్డు, పాలతో మెరుగైన భోజనం సమకూరుస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి గ్యాస్ కనెక్షన్ల సరఫరా ద్వారా కిరోసిన్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయడానికి కృషి జరుగుతోంది. బాలికలకు వివాహ సమయంలో రూ. 51 వేల మేరకు ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవే శపెట్టడమైంది. ఈ పథకం కింద ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు, ఆర్థి కంగా వెనుకబడిన తరగతులకు చెందిన, వివాహం చేసుకోబోతున్న యువ తులకు వివాహానికి బాగా ముందుగానే రూ. 51 వేల మొత్తాన్ని అందజేస్తు న్నారు. వధువు తల్లికి చెక్కు ద్వారా సంబంధిత నియోజకవర్గం ఎంఎల్ఎ ఈ మొత్తాన్ని అందజేస్తారు.

బ్యాంకు అనుసంధానంతో స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు చేయూత ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త సబ్సిడీ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం కింద అన్ని కేటగరీల ఆర్థిక సహాయానికి సబ్సిడీ గణనీయంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.


          గతంలో ఆర్థిక సహాయ పథకం కింద సమ కూర్చిన గరిష్ఠ సబ్సిడీ రూ. 30 వేలు మాత్రమే. దీనిని రూ. 1 లక్ష యూనిట్ విలువకు కనీసం రూ. 80 వేలకు, రూ. 2 లక్షల యూనిట్ విలువకు రూ. 1.20 లక్షలకు, రూ. 5 లక్షలు, అంతకు మించిన యూనిట్ విలువకు రూ. 2.50 లక్షలకు పెంచడమైంది. దీని వల్ల వివిధ పథకాలు అధిక సంఖ్యాక యువజనులకు అందుబాటులో ఉంటాయి. యుఎస్ఎ, యుకె వంటి ఇతర అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యా భ్యాసానికి ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (విద్య) పథకాన్ని ప్రవేశపెట్టడమైంది. విదేశీ విద్యా పథకం పరిధిలోకి 2015-16లో మైనారిటీలను కూడా తీసుకువచ్చారు.

          ప్రొఫెషనల్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించేందుకు నిరు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. బల హీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతోంది. మౌలిక వసతులు, లాజిస్టిక్స్, నాణ్యమైన బోధన ద్వారా అత్యున్నత శ్రేణి విద్యా సౌకర్యాలు కల్పి స్తున్నారు. రాష్ట్రంలో ఇతర పాఠశాలల కన్నా రెసిడెన్షియల్ పాఠశాలల ప్రద ర్శనే ఎంతో ఉన్నతంగా ఉన్నది. అధిక సంఖ్యలో పోటీ పరీక్షలకు హాజరయ్యేం దుకు నిరుపేద విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అధిక సంఖ్యాక స్టడీ సర్కిళ్లను నిర్వహిస్తోంది.

ఆరోగ్య లక్ష్మి పేరిట 2015 జనవరి 1న సార్వత్రిక సంపూర్ణ భోజన కార్య క్రమాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. ఇది మొత్తం దేశం లోనే విశిష్టమైనది. ఎందుకంటే, రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేం దుకు ఐరన్, ఫోలిక్ ఏసిడ్ టాబ్లెట్లతో పాటు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టి కాహారం లభించేలా చూసేందుకు రోజూ గుడ్డు, పాలతో పాటు వేడి వేడి భోజ నాన్ని అందజేస్తున్నారు.

          తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇస్తోంది. బాలికలు, మహిళల రక్షణ, భద్రత కోసం వివిధ చట్టాలను సమర్థంగా అమలు పరచడానికి చర్యలను సూచించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఒకదానిని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే. కమిటీ తన సిఫా ర్సులు సమర్పించింది. ఆ సిఫార్సుల ఆధారంగా, మహిళల రక్షణ, భద్రత మెరుగుదల కోసం వివిధ శాఖలు వివిధ చర్యలను తీసుకుంటున్నాయి. తెలం గాణ ప్రభుత్వం చేపట్టిన మరొక విశిష్ట పథకం ఇది.

          గతంలో అందజేసిన సామాజిక భద్రత పింఛన్లు అత్యల్పంగా ఉండేవి. వాటితో ఆపన్నుల కనీస అవసరాలు తీరడం కనాకష్టంగా ఉంటుండేది. నానా టికీ పెరిగిపోతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించే ఉద్దే శంతో ప్రభుత్వం 'ఆసరా పింఛన్' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పైన పేర్కొన్న కేటగరీలలోని వారికి, ముఖ్యంగా అత్యంత ఆపన్నులకు గణ నీయంగా ఆర్థిక ప్రయోజనాలను కల్పించే పథకం ఇది. ఆర్థిక సహాయం స్థాయిని వికలాంగులకు నెలకు రూ. 500 నుంచి రూ. 1500 వరకు, విక లాంగులు కానివారికి నెలకు రూ. 200 నుంచి రూ. 1000 వరకు హెచ్చిం చడమైంది. ప్రభుత్వం బీడి కార్మికుల కోసం కూడా నెలకు రూ. 1000 వం తున ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టింది. ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు/ హోమ్ గార్డ్‌లు/ వర్కింగ్ జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిం చేందుకు కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించి, అమలు జరుపుతోంది. బీమా పాలసీలకు ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది.


          నిరుపేదలకు గృహవసతి విధానాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పునర్ని ర్వచించింది. నిరుపేదలకు గౌరవాన్ని కల్పించేందుకు ఇంటి నిర్మాణం నాణ్య తను, స్థలాన్ని ప్రభుత్వం హెచ్చించింది. 260 చదరపు గజాల పూర్వపు కొల బద్దకు బదులు ప్రభుత్వం ప్రస్తుతం 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు బెడ్‌రూమ్‌లు, రెండు టాయిలెట్‌లు, ఒక హాల్, వంటగదితో కొత్త పథకాన్ని ప్రారంభించింది. నిరుపేదలకు ఇటువంటి ఉదారవాద పథకాన్ని ప్రారం భించిన ఏకైక రాష్ట్రం దేశంలో బహుశా తెలంగాణ ఒక్కటే కావచ్చు. ఈ సంవ త్సరం అటువంటివి రెండు లక్షల ఇళ్లు నిర్మించాలన్నది సంకల్పం. జిహె చ్ఎంసి పరిధిలో ఒక లక్ష, తక్కిన రాష్ట్రంలో మరొక లక్ష ఇళ్ల నిర్మాణం జరు గుతుంది.

No comments:

Post a Comment