Sunday, April 25, 2021

వానరులను సృజించమని దేవతలను నియమించిన బ్రహ్మ .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-54 : వనం జ్వాలా నరసింహారావు

 వానరులను సృజించమని దేవతలను నియమించిన బ్రహ్మ

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-54

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-04-2021)

విష్ణుమూర్తి యజ్ఞ సభనుండి అంతర్థానమైన తర్వాత జరిగిన మొదటి కార్యం ప్రాజాపత్య పురుషుడు పాయసం తీసుకొని ఆవిర్భవించి, దశరథుడికివ్వడం. ఇక రెండో కార్యం బ్రహ్మ వానరులను సృజించమని దేవతలను నియమించడం.యజ్ఞంలో హవిర్భావాలను తీసుకొని బ్రహ్మాదిదేవతలు తమతమ స్థానాలకు మరలిపోయేటప్పుడు,దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు కనుక, ఆయనకు సహాయపడేందుకు, బలవంతులను-కామరూపులను-గోళ్ళు,కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశిస్తాడు బ్రహ్మ.

"పండితులు (హనుమంతుడు లాంటివారు)-నీతిమంతులు (సుగ్రీవుడు లాంటివారు)-అతిశూరులు-వాయువేగంలాంటి గమనవేగం కలవారు-ఎందులోనూ అడ్డులేనివారు-విష్ణు పరాక్రమంతో సమానమైన పరాక్రమం కలవారు-యుద్ధంలో జయింపశక్యంకానివారు-మాయాలక్షణాలు తెలిసినా మాయలుచేయనివారు-అస్త్ర,శస్త్రాలను తెలిసినవారు-ధైర్యవంతులు-భల్లూకాలు, వానరాలు, గోలూంగాల లాంటి ఆకారంగల వారు-బలాధిక్యంలో దేవతలతో సమానమైన వారు, కిన్నెర స్త్రీలకు-కింపురుష స్త్రీలకు-వానరస్త్రీలకు-యక్షస్త్రీలకు-దేవతాస్త్రీలకు-పన్నగ భల్లూక స్త్రీలకు-పేరొందిన ఉత్తమ స్త్రీలకు వానరులుగా సృజించండి. వానరులైతేనే రాక్షసులను చంపగలుగుతారు. ఇదిలా జరుగుతుందని నాకు తెలుసు. నాకు ఆవలింత కలిగినప్పుడు జాంబవంతుడనే మహాబల పరాక్రమ సంపన్నుడు నా సంకల్పంతో పుట్టాడు. అతడు భల్లూకాలందరికీ ప్రభువయ్యాడు" అని బ్రహ్మ దేవతలకు చెప్పాడు. సరేనన్న దేవతలు, బ్రహ్మ అలా చెప్పిపోగానే,సిద్ధులు-సాధ్యులు-కిన్నరులు-కింపురుషులు-ఋషులు-చారణులు-ఖేచరులు మొదలైన వారందరూ వానర వీరులను, భల్లూక శూరులను విస్తారంగా పుట్టించారు. వారందరూ, కానల్లో-కోనల్లో-పర్వతాలలో సంచరించసాగారు.

ఇంద్రుడికి వాలి-సూర్యుడికి సుగ్రీవుడు-బృహస్పతికి దారుడు-కుబేరుడికి గంధమాదనుడు- విశ్వకర్మకు నలుడు-అగ్నిహోత్రుడికి నీలుడు-అశ్వనీకుమారులకు మైందద్విదులు-వరుణుడికి సుశేణుడు-పర్జన్యుడికి శరభుడు-వాయుదేవుడికి మహాబలశాలి, గరుడవేగంకలవాడు, వజ్రంలాంటి దేహంకలవాడు, ఆంజనేయుడు-రావణాసురుడిని చంపాలన్న కోరికగల అనేకమంది మహాబలులు, మహావేగంకలవారైన ఎందరో వానరులు జన్మించారు.

 మేరుపర్వతం-మందరపర్వతంతో సమానమైన దేహాలుకలవారు, వీరులలో శ్రేష్ఠులు, కోరిన రూపం ధరించగల శక్తిగలవారు, విశేష పరాక్రమంకలవారు, ద్రుఢంగా-రోగాలు-నొప్పులు లేనిదేహంగలవారు, మరెంతో బల పరాక్రమాలున్న గోలాంగూలాలు-భల్లూకాలు-వానరులు లెక్కకు దొరకనంతమంది జన్మించారు. ఏ దేవతకు ఏ రూపమో-ఏ దేవతకు ఎంతబలమో-ఏ దేవతకు ఎంత దార్ఢ్యమో, అదే రూపంతో-అదే బలంతో-అదే దార్ఢ్యంతో , ఆయా దేవతలకు వానరులు పుట్టారు. ఋక్షస్త్రీలకు-కిన్నరస్త్రీలకు-పన్నగ స్త్రీలకు- గరుడస్త్రీలకు-దేవతాస్త్రీలకు-దివ్యర్షి స్త్రీలకు-అప్సర స్త్రీలకు-కింపురుష స్త్రీలకు-నాగ స్త్రీలకు-సిద్ధ స్త్రీలకు - విద్యాధర స్త్రీలకు-ముని కాంతలకు-యక్షస్త్రీలకు, దేవతలు కుమారులుగా జన్మించగా, వారందరూ, భూమిపై వ్యాపించి, రాళ్లు - చెట్లు - గోళ్ళు - కోరలు, ఆయుధాలుగా చేసుకొని, నానా శస్త్రాస్త్ర ప్రయోగాలను తెలుసుకున్నారు.

(దేవతల పుత్రులు కనుక స్వయంగానే శస్త్రాస్త్రజ్ఞానం కలవారే. కాకపోతే వాటితో యుద్ధంచేయరు-చేయలేదు కూడా. వారి ఆయుధాలు నఖ-వృక్ష-శిలలు. శస్త్రాస్త్ర జ్ఞానం పరులనుండి తమను రక్షించుకోవడానికే గాని, ఇతరులపై ప్రయోగించడానికి కాదు. రామ రావణ యుద్ధంలో, రామలక్ష్మణులు తప్ప వారి పక్షంలో అస్త్ర యుద్ధం చేసిన వారెవరూ లేరు. శస్త్రాస్త్రాలు వానరులు ప్రయోగించడం స్వభావ విరుద్ధం. వారలా చేసుంటే, వానరులను రావణుడు స్వభావవానరులుకాదనీ - దేవతలనీ తెలుసుకొనేవాడు. అప్పుడు వారివల్ల రావణుడికి బాధలేదు. దేవతలు పశుపక్ష్యాదులతో కొక్కోక శాస్త్రం ప్రకారం, ఆంతర సంభోగం ద్వారా సంతానం పొందారని భావించరాదు. తమ సంకల్ప బలంతోనే - తామే ఆయా జాతి స్త్రీులయందు, ఆయా ఆకారాలు ధరించి, జన్మించారని అనుకోవాలి. కొంతకాలం పూర్వం, స్త్రీ - పురుష సంభోగం లేకుండానే, సంతానం దృష్టి - స్పర్శ - సంకల్పంతో కలిగేదని విష్ణుపురాణంలో వుంది. రామచంద్రమూర్తి వధించిన వాలి ఆయనకెలా సహాయపడ్డాడని సందేహం కలగొచ్చు.

వాలి-సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనినే "సమయ" మని అని పేరు. వాలి రావణ వధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు, రావణుడితో స్నేహం చేసాడు. భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే సుగ్రీవుడికి హానిచేసి, అతడిని చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు. వాలి వధానంతరం సుగ్రీవుడితో:"వాలివలె నీవుకూడా సమయము పాటించకపోతే వాడి గతే నీకూ పట్తుంది"అని రాముడు అంటాడు.ఈ సమయమనేది రామసుగ్రీవులకు ఋశ్యమూకంలోనే జరిగిందికాదనీ-వాలి సుగ్రీవుల జనన కాలంలోనే జరిగిందనీ మరో కథ వుంది.ఈ విషయం అంగదుడి ద్వారా తెలిసిందంటారు. వాలి పుట్టకపోతే-పుట్టినా సుగ్రీవుడితో విరోధించకపోతే-విరోధించినా రాముడి చేతిలో చావకపోతే, రావణాసురుడి వధే జరుగకపోయేది. వాలి జన్మించి సుగ్రీవుడితో విరోధించడం వల్లే సుగ్రీవుడికి-రాముడికి స్నేహం కలిగింది. అదే, వాలికి-రాముడికి స్నేహమయినట్లైతే ప్రయోజనంలేకపోయేది.వాలి భయంతో, రావణుడు సీతను రాముడికి అప్పచెప్పేవాడే. అంటే, లోకోపద్రవం తగ్గేదికాదు. అపరాధికి శిక్షపడకపోయేది. వాలి జననం-సుగ్రీవుడితో విరోధం-రాముడి చేతిలో చావు, రామ కార్యమే).

ఇలా జన్మించిన వానరులు, కొండలనైనా పిండికొట్టేందుకు-చెట్ల గుంపులను ఒక్కసారిగా చెదరగొట్టేందుకు-సూర్యుడినైనా మింగేందుకు-ఒకచేత్తో భూమిని,మరోచేత్తో ఆకాశాన్ని పట్టుకొని తాళం వేసేందుకు-సముద్రాన్ని బలవంతంగా కలగాపులగం చేసేందుకు,అవసరమైన బల పరాక్రమాలు కలిగి భూమంతా నిండిపోయారు.ఆవానరులు,గాలిలాగా మారి చేతికి చిక్కని మేఘాలను కూడా పట్టుకునే శక్తికలవారు.అడవిలో తిరిగే మదించిన ఏనుగులనైనా బంధించగలరు.ఆకాశంలో విహరిస్తున్న పక్షులను కూడా పడగొట్టగలరు.వారు కోరిన రూపాలు ధరించగలరు.తేజంతో ప్రకాశిస్తూ-బుద్ధివల్ల పూజించబడుతూ-కీర్తిమంతులుగా-మంచి ధైర్యవంతులుగా-భయంకర వేగంతో- గొప్ప శౌర్యంతో-పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ సేనానాయకుల గుంపులలో,మిక్కిలి గొప్పవారైన సుగ్రీవుడులాంటివారు,వారికి నాయకుడై వుండసాగారు.

ఈ వానరులకు కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు, స్వామికార్యధురీణులు పుట్టారు. ఈ వానరులలో కొందరు ఋషవంతంలో,ఇతరులు వివిధ కొండ శిఖరాలలో,మరికొందరు అడవులలో సంచరించసాగారు. ఈ వానర సమూహాలను రక్షించుతూ-వారందరికీ,ఇంద్రకుమారుడైన వాలి రాజుగా వున్నాడు. యువరాజుగా సుగ్రీవుడు, మంత్రులుగా హనుమంతుడు-నీలుడు-నలుడు వుంటూ శత్రు భయంకరులుగా ప్రసిద్ధిగాంచారు. వానరులలో కొందరు వీరిని,వేరేవారిని మరికొందరు సేవిస్తూ వుండేవారు.గరుత్మంతుడితో సమానమైన వేగం కలవారు,యుద్ధంలో నిపుణులు, నానా విధ దేవతల నానా విధ వేషాలను-చిహ్నాలను ధరించిన వానరులు, పులులకూ, సింహాలకూ, సర్పాలకూ కూడా భయం కలిగించే విధంగా అడవుల్లో తిరిగేవారు. మేఘ సమూహాలవలె బలసినవారై, కొండ శిఖరాలలాగా ఉన్నత దేహాలు కలిగి, బల గర్వాలతో, భయంకర ఆకారాలతో, శ్రీరాముడికి సహాయం చేసేందుకొరకు జన్మించారా వానర శ్రేష్ఠులు.

శ్రీరామలక్ష్మణులు బ్రహ్మవాక్యం గౌరవించారా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామలక్ష్మణులు బ్రహ్మవాక్యం గౌరవించారా? 

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (25-04-2021) ప్రసారం

బ్రహ్మాస్త్రంతో సమానమైన ఐంద్రాస్త్రాన్ని రాముడు కుంభకర్ణుడు మీద వేయగా, అది పిడుగులాగా పోయి వాడి తలను నరికి చంపినా తరువాత, మిగిలిన మొండెం  వానరులను చంపుకుంటూ పోయి సముద్రంలో పడిన విషయాన్ని చావగా మిగిలిన హతశేషులు, రాక్షసులు రావణుడి దగ్గరికి పోయి వివరంగా చెప్పారు. యుద్ధంలో కుంభకర్ణుడు చనిపోయాడని విన్న రావణుడు సహించరాని దుఃఖంతో గాఢంగా మూర్ఛపోయి నేలమీద పడ్దాడు.

         ఏడుస్తున్న రావణుడిని చూసి త్రిశిరుడు అనేవాడు ఓదార్చాడు. “నీ భుజబలంతో రామచంద్రుడిని దండించు. ఆ మాటకొస్తే, అసలు నువ్వెందుకు యుద్ధానికి పోవాలి? నువ్వు సుఖంగా నీ ఇష్టప్రకారమే వుండు. నేను పగతీర్చుకుంటాను. నీ శత్రువులను చీల్చి చెండాడుతాను. రామచంద్రుడిని సంహరిస్తాను” అన్నాడు.

ఇలా త్రిశిరుడు చెప్పడంతో రావణుడు సంతోషపడి దుఃఖం మానాడు. ఆ తరువాత యుద్దోత్సాహంలో వున్న దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరుడు, మత్త, యుద్ధోన్మత్తులను పిలిపించాడు. వీరంతా యుద్ధంలో పరాజయం ఎరగనివారే. అందరూ వరాలు పొందినవారే. వీరిని పిలిపించిన రావణుడు, అందరినీ యుద్ధానికి పంపాడు. వారి సింహనాదాలు, వారి రెట్టలు, వారి పాద ఘట్టనలు ఆకాశాన్ని పగిలేట్లు చేసింది. భూమిని వణికించింది. రాక్షస సేనలను చూసిన వానరులు కొండలు, చెట్లు ఎత్తుకుని కేకలు వేశారు. రాక్షసులు ప్రతిధ్వని చేశారు. రాక్షసులు కూడా వెనుదీయక పదునైన బాణాలను వానరుల మీద వేశారు. ఇరుసేనలు పరాక్రమించి యుద్ధం చేశారు.

         వానరుల ధాటిని ఆపడానికి నరాంతకుడు రంగంలోకి దిగాడు. తన శక్తితో వానరులను చాలామందిని క్షణంలో చంపాడు. వానరులు ఇలా పడిపోవడం చూసిన సుగ్రీవుడు, అంగదుడితో నరాంతకుడిని చంపమని చెప్పడంతో, నరాంతకుడి మీదికి అతడు యుద్ధానికి పోయాడు. తన దృడమైన పిడికిలితో రాక్షసుడి రొమ్ము నలిగిపోయేట్లు పొడిచాడు. ఆ దెబ్బకు వాడు దూరంగా కొట్టుకు పోయి కొండలాగా పడిపోయాడు. నరాంతకుడు అలా చనిపోయాడు.

         నరాంతకుడు చావడం చూసిన త్రిశిరుడు, మహోదరుడు, దేవాంతకుడు ఒక్కసారిగా అంగదుడిని తాకి బాధించారు. ఇలా ముగ్గురు రాక్షసులు బాలుడైన అంగదుడిని తాకిన సంగతి తెలుసుకున్న హనుమంతుడు, నీలుడు ఆ దిక్కుగా వచ్చారు. నీలుడు త్రిశిరుడితో, హనుమంతుడు దేవాంతకుడితో యుద్ధం చేశారు. హనుమంతుడి పిడికిటి పొడుపుకు దేవాంతకుడు చచ్చాడు. నీలుడు చెట్లతో కూడిన ఒక పర్వతాన్ని తీసుకుని మహోదరుడి మీద వేయగా వాడు దాని తాకిడికి నేలకూలి చచ్చాడు. పినతండ్రి చావు చూసిన త్రిశిరుడు హనుమంతుడిని బాణాలతో నొప్పించాడు. హనుమంతుడు అప్పుడు తన కత్తితో త్రిశిరుడిమూడు తలలను నరికి వేశాడు. ఆ తరువాత మహాపార్స్వుడు ఋషభుడి చేతిలో చచ్చాడు. ఇది చూసి, అతికాయుడు యుద్ధానికి రాగా, వాడిని లక్ష్మణుడు ఎదిరించాడు. ఇరువురి మధ్య యుద్ధం కొనసాగింది. లక్ష్మణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే, అతికాయుడు సౌరాస్త్రాన్ని సంధించాడు. అతికాయుడు ఐశీక బాణం వేస్తె, లక్ష్మణుడు ఐందాస్త్రాన్ని వేశాడు. లక్ష్మణుడి బాణాలు అతికాయుడిని చంపలేక పోయాయి. చివరకు వాయుదేవుడు లక్ష్మణుడిని సమీపించి వీడు అల్ప ప్రయత్నంతో చచ్చేవాడు కాదని చెప్పగా, లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి వేశాడు. అది వాడి శిరస్సును కవచంతో సహా నేలకూల్చింది.

         యుద్ధ భూమిలో లక్ష్మణుడి బాణాలకు అతికాయుడు చచ్చాడని విన్న రావణుడు “నేను యుద్ధానికి పొమ్మని పంపిన రాక్షసులు వానరుల బలానికి లోబడి చావడమే కాని తిరిగి రావడం లేదుకదా? రామచంద్రుడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని గెలవడానికి సమర్థుడైనవాడు ఒక్కడు కూడా ఈ లంకా నగరంలో వెతికినా కనపడడే! ఆహా! ఏమీ రాముడి పరాక్రమం? ఏమీ ఆ అస్త్రబలం? రాక్షస శ్రేష్టులందరూ ఆయన చేతిలో చచ్చారు కదా? అలాంటి రాముడిని, సర్వక్లేశరహితుడిని విష్ణుమూర్తి, ఆదినారాయణుడుగా నేను భావిస్తాను. ఆయనకాకుండా మరెవ్వరూ ఈ కార్యం చేయలేడు. ఇక లంకంతా మీరు హెచ్చరికగా కాపలా కాయండి”. రావణుడి ఆజ్ఞానుసారం రాక్షసులు వెళ్ళిపోయారు.

         ఏం చేయడానికి తోచక రావణుడు వుండగా ఇంద్రజిత్తు సమీపించి రామలక్ష్మణులను యుద్ధ భూమిలో భయంకరమైన తన బాణాలతో పడగొట్టుతానని చెప్పి తండ్రి ఆజ్ఞ తీసుకుని యుద్ధానికి బయల్దేరాడు. ఇంద్రజిత్తు రథం ఎక్కి, కనపడకుండా ఆకాశానికి ఎగిరి, యుద్ధం చేయమని తన పక్కనున్న రాక్షసులను ప్రేరేపించాడు.

రాక్షసులు పరాక్రమించి యుద్ధం చేశారు. ఇంద్రజిత్తు తన బాణాలతో వానరులను చంపాడు. వానరులు కూడా భీకర యుద్ధం చేశారు. ఇంద్రజిత్తును ఎదిరించారు. ఇంద్రజిత్తు గంధమాదనుడిని, నలుడిని, మైందుడిని, గజుడిని, జాంబవంతుడిని, నీలుడిని, సుగ్రీవుడిని, అంగదుడిని, ఋషభుడిని, ద్వివిదుడిని, తీవ్రమైన బాణాలతో నొప్పించాడు. వానరసేనను అల్లకల్లోలం చేశాడు. అదృశ్యుడై ఆకాశాన్నుండి యుద్ధం చేశాడు. విక్రమిస్తున్న ఇంద్రజిత్తు వ్యవహారం చూసి శ్రీరాముడు తమ్ముడితో ఇలా అన్నాడు.

         “లక్ష్మణా! రావణుడి కొడుకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బలంతో వానరసేనలను నేలపాలు చేసి మనల్ని బాదిస్తున్నాడు. వీడిని మనం ఎలా జయించగలం? ఇది స్వయంభు భగవంతుడైన బ్రహ్మదేవుడి బాణం. దీని మహిమ చాలా గొప్పది. దీన్ని నాలాగే నువ్వు కూడా ఓర్చుకో. మనమంతా స్మృతి తప్పి ఏ ప్రయత్నం చేయకుండా వుండడం చూసి, జయలక్ష్మిని గ్రహించి, ఇంద్రజిత్తు తన నగారానికి పోతాడు”. ఇలా ఆయన చెప్తున్నప్పుడే బాణవర్షం అధికమై, సహించరానిదై, రామలక్ష్మణులు మూర్ఛపోయారు. వారు మూర్ఛపోవడం చూసి సంతోషించిన ఇంద్రజిత్తు వారిని ఓడించిన సంతోషంతో తన నగరానికి పోయాడు.

         అప్పుడు అక్కడ దుఃఖిస్తున్న వానర వీరులను చూసి విభీషణుడు “కపులారా! రామలక్ష్మణులు పరవశులై పడ్డారని దుఃఖిస్తే లాభం ఏమిటి? ఇది దుఃఖించాల్సిన సమయం కాదు. రాజకుమారులు బ్రహ్మవాక్యం గౌరవించాలి అనుకుని రాక్షసుల బాణాలకు చిక్కారేకాని, పరాక్రమహీనులై కాదు” అన్నాడు. అప్పుడు హానుమంతుడి క్షేమం గురించి జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు. “రామలక్ష్మణులు క్షేమంగా వున్నారా అని అడగకుండా హనుమంతుడు బాగున్నాడా అని ఎందుకు అడుగుతున్నావు? వాస్తవానికి నీకు హనుమంతుడి మీద వున్న ప్రేమ రాజకుమారుల మీద కాని, బాలుడైన అంగదుడి మీదకాని, ప్రభువైన సుగ్రీవుడి మీదకాని లేకపోవడానికి కారణం ఏమిటి?”. సమాధానంగా జాంబవంతుడు “హనుమంతుడు జీవించి వుండి మన సేనలు హతమైనా మనకు మనుగడ వుంటుంది. అలా కాకుండా హనుమంతుడు లేకుండా మనమంతా బతికున్నా లేనట్లే లెక్క. హనుమంతుడు గమనవేగాన వాయుదేవుడితోను, వీర్యాతిశయాన అగ్నిదేవుడితోను సమానం” అని అన్నాడు.

         “ఆంజనేయా! నీ పరాక్రమం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు సముద్రం దాటి చాలాదూరం పోయి హిమవత్పర్వతం చూసి అక్కడ ఋషభ శైలం, కైలాస పర్వతాలను చూడు. వాటి మధ్యన మిక్కిలి కాంతికలదై సర్వౌషధులు కలిగి అందమైన మూలికల కొండ చూడు. ఆ పర్వతం కొనలో అధికమైన తమ కాంతితో దిక్కులను వెలిగించే నాలుగు మూలికలను చూడు. వాటి కాంతిని బట్టి నువ్వు వాటిని గుర్తించగలవు. వాటిలో మృతసంజీవని (చచ్చిన వారిని బతికించేది), విశల్యకరణి (దేహంలో నాటిన ఇతర పదార్థాలను, బాణాలను, ములుకులను  వూడతీసేది), సావర్ణ్యకరణి (గాయాలతో వన్నె మారిన చోట మళ్లీ వన్నె వచ్చేట్లు చేసేది), సంధానకరణి (విరిగిన ఎముకలను, అవయవాలను అతికించేది) వుంటాయి. నువ్వు వెంటనే వెళ్లి వాటిని తెచ్చి వానరసేనకు ప్రాణాలను ఇవ్వు”. అని అంటాడు జాంబవంతుడు.

         హనుమంతుడు తన దేహాన్ని పెంచాడు వెంటనే. త్రికూట పర్వత శిఖరం ఎక్కాడు. సముద్రాన్ని దాటి పోయి మనోహరమైన మంచుకొండ చేరి జాంబవంతుడి మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. హనుమంతుడు మూలికలకోసం వేయి యోజనాల స్థలాన్ని వెతికాడు. ఆ మూలికలు కనబడలేదు. అవి కనపడక పోవడంతో హనుమంతుడు ఆ శైలాన్ని పాటులతో సహా పెళ్ళగించి ఆకాశానికి ఎగిరి, శీఘ్రంగా వచ్చాడు. హనుమంతుడు దూరం నుండి వస్తుంటేనే మూలిక గాలి సోకడం వల్ల వానరులంతా ప్రాణాలతో లేచి కూర్చున్నారు. హనుమంతుడిని చూసి కేకలు వేశారు. ఆ మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. సుగ్రీవుడు తమ వానరసేనతో లంకను కాల్చమని చెప్పాడు. ఆ మాటలకు వానరులు లంకలో ప్రవేశించి మేడలు, మిద్దెలు అగ్నికి సంతర్పణం చేస్తుంటే అవి కూలిపడ్డాయి. 

ఇదిలా వుండగా అక్కడ యుద్ధభూమిలో బాణాల బాధ తొలగగానే రామలక్ష్మణులు విల్లులు ధరించి, అల్లెతాడు మీటి టంటమ్మనే ధ్వని పుట్టించారు. కుంభకర్ణుడి కొడుకులైన కుంభనికుంభులు సేనలతో సహా యుద్ధానికి బయల్దేరారు. అలా గుంపులుగుంపులుగా వస్తున్న రాక్షస సేనను చూసి వానరసేన సింహనాదాలు చేసింది. రాక్షసుల, వానరుల మధ్య యుద్ధం జరిగింది.

         ఆ తరువాత జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు యముడిలాగా కుంభుడి మీద పడ్డాడు. అదను చూసి, సుగ్రీవుడు కుంభుడిని పట్టుకుని ఎత్తి సముద్రంలో పారవేశాడు. బయటకు వచ్చిన వాడిని సుగ్రీవుడు తన పిడికిలి బిగబట్టి కొట్టగా, ఆ దెబ్బకు కుంభుడు నేలకూలాడు. అప్పుడు నికుంభుడు యుద్ధానికి దిగాడు. అప్పుడు హనుమంతుడు నికుంభుడి మీదికి దూకి మెడపట్టి గిరగిరా తిప్పి కొట్టి, గొంతు నులుమి చంపాడు. ఇలా అంతా దాదాపు ఏకకాలంలోనే చచ్చారు.

ఆ తరువాత ఖరుడి కొడుకు మకరాక్షుడు రావణ అజ్ఞానుసారం యుద్ధానికి పోయాడు. వానరులకు, రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. మకరాక్షుడి బాణాలకు, అతడి ప్రతాపానికి, భయపడి వానరులు రాక్షసులు తరుముకుని వస్తుంటే, పరుగెత్తారు. ఇలా వానరులను తరుముతున్న రాక్షసుల మీదికి రామచంద్రమూర్తి కోపంతో తన వాడి బాణాలను వేసి వానరుల పైన పడకుండా నిలిపాడు. అప్పుడు మకరాక్షుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “నిలు నిలు రామా! ఎందుకు గర్వంతో మిడిసిపడతావు? నీ బలం ఏమాత్రమో నాకు చూపు. ద్వంద్వయుద్ధంలో నీ ప్రాణాలను బలి ఇస్తాను. పారిపోకు. నేను లేని చోట నా తండ్రిని నువ్వు దండకారణ్యంలో చంపావు. నువ్వు నా చేతుల్లో చచ్చి త్వరగా యమపురికి పోయి అక్కడ నీతో పూర్వం చచ్చిన రాక్షసులతో స్నేహంగా ఆడుకో. నీ ఇష్ట ప్రకారం, నీకే యుద్ధం కావాలనుకుంటే ఆ యుద్ధమే చేయి”.

         ఇలా అన్న మకరాక్షుడిని చూసి “ఓరీ! రాక్షసుడా! యుద్ధంలో నీ శౌర్యం చూపు. ఖరదూషణులను, నీ తండ్రిని, పద్నాలుగు వేల రాక్షసులను చంపాను. నిన్నూ అలాగే చంపుతాను” అంటాడు. శ్రీరాముడు ఇలా అనగానే, మకరాక్షుడు ఆయన్ను తన బాణాల వర్షంలో ముంచెత్తాడు. రామచంద్రమూర్తి ఆ బాణాలన్నిటినీ తన బాణాలతో ఖండించాడు. ఇరువురూ సమానంగా యుద్ధం చేశారు. తనతో సమానంగా పోరాడుతున్న రాక్షసుడిని చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే వాడి ధనస్సును తెగగొట్టి, ఎనిమిది బాణాలతో సారథిని చంపి, గుర్రాలను ఖండించి, రథం ఎగిరిపోయేట్లు కొట్టగా మకరాక్షుడు శూలం తీసుకుని కిందకు దూకాడు. దాన్ని రాముడి మీదకు విసిరాడు. దాన్ని రాముడు తుంచాడు. శూలం విరిగిపోగా రాక్షసుడు పిడికిలి పట్టి రాముడిని నిలబడమని అంటూ మీదికి దూకాడు. రాముడు చిరునవ్వు నవ్వి ఆగ్నేయాస్త్రాన్ని సంధించి వాడి రొమ్ము చీల్చి చంపాడు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Saturday, April 24, 2021

Philosophical, Scientific and Spiritual Evolution : Vanam Jwala Narasimha Rao

 Philosophical, Scientific and Spiritual Evolution

Vanam Jwala Narasimha Rao

The Hans India (25-04-2021)

In our ancient texts, pearls of wisdom and knowledge in all spheres of life and after life were preserved and often hidden under various layers of meaning.  The Vedas, Upa-vedas, Vedangas, Puranas, Darshanas, Kavyas and scores of treatises on these by our Sages, scholars, Bhasyakaras, all have answers to several questions, doubts, apprehensions, true meanings on every aspect of life matter, that may appear unknown and offer permanent answers to the seeker. One such knowledge is on Evolution.

Evolutionary philosophies are seen in variety of ways in Hindu scriptures like Bhagavata and Bharata. These philosophical concepts are often coinciding with the thoughts of modern scientific thoughts.  For example, the concept of Dashavatara can be seen as having some similarities to Charles Darwin's theory of evolution. The first incarnation of Vishnu in the form of a fish resembles the evolutionary origin of fish in the Silurian Period (from 443 million to 416 million years ago. It was the third period in the Palaeozoic Era).

Darwin’s theory is simple. He observed in Galapagos Islands of Latin America, that, life is evolved in water. All species on the earth from fish to flowers, from banana to birds, have common ancestors. They struggled continuously and started rearranging their genes, their shape, their size, their food habits, selective mating, and finally they got totally new offspring’s, and they were totally looking differently. Life in the form of Struggle for existence and survival of fittest was evolved in water. Slowly they changed to amphibians, and finally they changed to terrestrial animals. On the earth it took thousands of years to change from monkeys to primitive man and finally to present day human beings.

When we sit and read Bhagavat purana, Garuda purana, Lord Vishnu has taken Dashavatara, the ten avatars. Each and every avatar is interrelated, and resembles Darwin's theory.

Lord Vishnu has taken his first avatar in water in the form of fish (Matsya avatar). This fulfils Darwin's theory of life evolved in water. Lords second avatar is tortoise (Kurma avatar). It is amphibian and it fulfils Darwin’s theory of continuous struggle of fishes to change and adapt to amphibian life. Third avatar is boar (Varaha avatar meaning Pig). This is totally terrestrial animal. Amphibians have struggled continuously to adapt to terrestrial animal. Boar reminds us about the dinosaurs that lived on the earth thousands of years earlier. Fourth avatar is Narasimha avatar, body is human form and face and hands are like lion.

Fifth avatar is Vamana avatar, short and intelligent human. Sixth avatar is Parashurama avatar, axe man who stayed in jungle. Seventh avatar is Rama avatar, perfect gentleman, who followed monogamy. Eighth avatar is Krishna avatar. Krishna is wise, shrewd statesman like today’s politician. Ninth avatar is Buddha avatar. Buddha is pursuit of happiness. Tenth avatar is Kalki avatar. Kalki is man with weapons, Techno-humanoid man of tomorrow.

Does it not mean that our ancestors knew things that we are discovering now? Our ancestors told evolutionary theory in the form of simple and easily understandable stories. How did they get the entire evolutionary theory right in so much precision is a million-dollar question? 

Charles Darwin was born in a small town called Mount in England in 1809 to a popular doctor who wanted him to take up medicine as his career. Darwin however became scientist in a Ship and began his sea journey in 1831, from England towards Latin America. Sailing from one island to another island, he studied the animals, fossils, flowers, fruits, and the men on the island.

Darwin collected large number of fossils, animals, flowers from Galapagos Islands, Falkland Island, made careful study. He concluded that, life evolved in water in the form of simple single cell creature. The aquatic animals slowly started changing their habitat from water to earth and then to four legged animals, and later two feet human beings. Many changes are also noticed in human beings, dwarf man, to man with weapons, intelligent human beings.

According to Darwin's theory, life began in the ocean. Vishnu's first avatar, Matsya, was a fish. Vishnu's first avatar was Matsya. He took the form of a fish to save Manu from the massive deluge. Darwin believed that water is the most essential ingredient to sustain life, and thus that is where life originated. Darwin said that the species then began coming out of the water. Kurma, Vishnu's second avatar was an amphibian.


The next logical step in evolution had to be the ability to travel on the ground. To accomplish this, species started developing legs. Boar, the third form taken by Vishnu, fought Hiranyaksha to bring the earth back from the bottom of the ocean. Narsimha avatar had the features of man as well as those of a beast. This could be similar to the species the very first human beings evolved from. This indicates evolution slowly going towards human beings.

The fifth avatar, Vamana was dwarfed human being, visually very similar to the short ape species that humans have evolved from. The earliest form of apes that human beings evolved from were in fact, much shorter in height than present-day human beings. The short ape-like species finally evolved into what we call 'early man'. Parashurama, Vishnu's sixth avatar was very similar to that. In the study of evolution, all these are the traits commonly associated with the cave dwelling 'early man'.

Aurobindo was an Indian philosopher, yogi, guru, poet, and nationalist. He became a spiritual reformer, introducing his visions on human progress and spiritual evolution. The central theme of his vision was the evolution of human life into a divine life. He believed in a spiritual realisation that not only liberated but transformed human nature, enabling a divine life on earth.

Aurobindo believed that Darwinism merely describes a phenomenon of the evolution of matter into life, but does not explain the reason behind it, while he finds life to be already present in matter, because all of existence is a manifestation of Brahman.

The unfolding of earth's and man's spiritual destiny is illuminated. The Life Divine is Aurobindo’s principal philosophical work in which he presents a theory of spiritual evolution, which will culminate in the human being and the advent of a divine life on the earth.

The ancient Hindu wisdom is like the proverbial ‘Akshaya Patra’ and those who have it will never feel hungry for knowledge. Even in the Kavyas written for the easy understanding of the common readers, there are several layers of meaning. Take for instance the Sundarakanda from the Ramayana which is an encyclopaedia in itself. It has Dharma, Mantra, Tattva, Ayurveda, Jyothish, and Yoga shastras all rolled into one. This is only the tip of the Iceberg. For the serious seekers and people with true curiosity the ancient texts are like a priceless treasure. It is our failure to understand the true meaning and knowledge of these Shastras that we tend to criticize out of our sheer ignorance. Ignorance is not always blissful, definitely not in the context of our rich heritage of wisdom. (With VJM Divakar)

చ్యవన మహర్షి వృత్తాంతం, సౌకన్యాఖ్యానం, మాంధాత కథ ఆస్వాదన-17 : వనం జ్వాలా నరసింహారావు

 చ్యవన మహర్షి వృత్తాంతం, సౌకన్యాఖ్యానం, మాంధాత కథ

ఆస్వాదన-17

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-04-2021)

తీర్థయాత్రలలో భాగంగా పాండవులు దక్షిణ గంగ అయిన గోదావరిని దర్శించారు. ఆ తర్వాత ప్రభాస తీర్థానికి చేరుకున్న పాండవులను సందర్శించడానికి శ్రీకృష్ణుడు, బలరాముడు వచ్చారు. కొంతసమయం వారితో గడిపి పాండవులను వీడ్కొని వెళ్లారు వారు. యధాప్రకారం పాండవులు తమ తీర్థయాత్రలు కొనసాగించారు. నర్మదా నదిలో స్నానం చేసిన తరువాత అక్కడి వైడూర్య పర్వతాన్ని చూపించి రోమశుడు ధర్మరాజుతో, శర్యాతి మహారాజు త్రేతాయుగం చివర్లో, ద్వాపర యుగం ప్రవేశించే ముందర యజ్ఞం చేసిన చోటది అని చెప్పాడు. భృగుమహర్షి కొడుకైన చ్యవన మహర్షి శర్యాతి రాజు కూతురును వివాహం చేసుకున్న వృత్తాంతాన్ని, సౌకన్యాఖ్యానాన్ని వివరంగా చెప్పాడు రోమశుడు ధర్మరాజాదులకు.

పూర్వం భృగుమహర్షి కొడుకైన చ్యవన మహర్షి ఎన్నోవేల సంవత్సరాలు నిష్ఠగా గొప్ప తపస్సు చేశాడు. ఆ ముని శరీరం చుట్టూ పుట్ట కప్పుకుంది. ఒకనాడు శర్యాతి మహారాజు అక్కడకు సమీపంలోని కొలనులో విహరించడానికి వచ్చినప్పుడు వెంట ఆయన కూతురు కూడా వుంది. పుట్టలో నుండి కనిపిస్తున్న చ్యవన మహర్షి కన్నులను మిణుగురు పురుగులుగా భావించిన ఆమె పుట్టను తవ్వించింది. చ్యవన మహర్షికి కోపం వచ్చి అందరినీ శపించాడు. విషయం అర్థం చేసుకున్న శర్యాతి పుట్ట దగ్గరికి పోయి చ్యవన మహర్షిని క్షమించమని వేడుకున్నాడు. రాజపుత్రిక సుకన్యను తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు చ్యవనుడు. శర్యాతి అలాగే చేశాడు.

సుకన్య తన భర్త అయిన చ్యవనుడికి సేవలు చేస్తూ సుఖంగా వుండగా ఒకనాడు ఆమె దగ్గరికి అశ్వినీదేవతలు వచ్చారు. తామెవరో ఆమెకు చెప్పారు. ఆమె అందానికి తగ్గ మరెవ్వరినైనా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఆ విషయం ఆమె భర్తకు చెప్పింది. వారు చెప్పినట్లే చేయమని భర్త అన్నాడు. తర్వాత అశ్వినీదేవతలు, చ్యవనుడు ముగ్గురూ కలిసి అక్కడి కొలనులో ప్రవేశించారు. ముగ్గురూ బయటకు నవ యవ్వనులుగా తిరిగి వచ్చారు. తమ ముగ్గురిలో నచ్చినవాడిని ఒకడిని ఎన్నుకుని పెళ్లి చేసుకోమ్మన్నారు అశ్వినీదేవతలు. అప్పుడు సుకన్య తన భర్త అయిన చ్యవనుడినే వరించింది. కృతజ్ఞతగా చ్యవనుడు శర్యాతి చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తుండగా ఆశ్వినీదేవతలతో సోమరసం తాగిస్తానన్నాడు. ఆ తరువాత అశ్వినీదేవతలు వెళ్ళిపోయారు సంతోషంగా.

కొన్నాళ్ళకు శర్యాతి మహారాజు యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞంలో ఆశ్వినీదేవతలకు సోమరసం ఇవ్వడానికి సిద్ధపడ్డ చ్యవనుడి మీద కోపం వచ్చింది ఇంద్రుడికి. అతడి కోపాన్ని లెక్క చెయ్యకుండా చ్యవన మహర్షి ఆశ్వినులకు సోమరసాన్ని ఇచ్చి తాగించాడు. కోపంతో ఇంద్రుడు చ్యవనుడి మీద వజ్రాయుధాన్ని ఎత్తాడు. అప్పుడు చ్యవనుడు ఇంద్రుడు ఎత్తిన చేతిని స్తంబింపచేసి అతడిని చంపడానికి ప్రయత్నించాడు. తాను చేయిస్తున్న యజ్ఞం నుండి ఒక భయంకరమైన రాక్షసుడిని సృష్టించాడు. దేవేంద్రుడు భయపడి చ్యవనుడికి నమస్కరించి, ఇక ముందు అశ్వినీదేవతలు కూడా సోమరసం తాగడానికి అర్హులు అని ప్రకటించాడు. తరువాత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అశ్వినీదేవతలు కూడా స్వర్గానికి వెళ్లారు.

చ్యవనుడు సృష్టించిన మదుడు అనే ఆ రాక్షసుడు ఆ ముని ఆదేశం ప్రకారం కల్లులోను, స్త్రీలలోను, వేటలోను, పాచికలలోను ప్రవేశించాడు. చ్యవన మహర్షి మహిమ వెలుగొందిన ఆ ప్రదేశానికి, అక్కడి కొండకు అర్చీకపర్వతం అన్న పేరొచ్చింది. ఆ తరువాత అక్కడి పుణ్య సరస్సులో పాండవులు స్నానం చేశారు.

అక్కడి నుండి యమునానదిని చేరారు పాండవులు. అక్కడి విశేషాలు చెప్తూ మాంధాత్రుడు చేసిన యాగాల గురించి చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన యువనాశ్వుడు సంతానం కలగనందువల్ల పరితపించి మంత్రులమీద రాజ్య భారం మోపి, భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లి అతడిని ఆరాధించాడు. భృగుమహర్షి అతడితో పుతకామేష్టి యజ్ఞం చేయించి, పుత్రుడు పుట్టడానికి, పవిత్ర జలాలతో కూడిన పాత్రను ఇచ్చాడు. యజ్ఞం ముగిసిన రాత్రి పాత్రకు కాపలా వున్న ఋత్విజులు అంతా అలసి నిద్రపోయినప్పుడు  యువనాశ్వుడికి దాహం వేసి మంత్రపూతమైన యజ్ఞోదకాన్ని పొరపాటున మొత్తం తాగాడు. అది వాస్తవానికి ఆయన భార్య తాగడానికి ఉద్దేశించబడినది.

భృగుమహర్షి ఆ విషయాన్ని తెలుసుకుని యువనాశ్వుడిని చూసి, దైవఘటనను ఎవ్వరూ తప్పించలేరని, అలా తాగడం వల్ల యువనాశ్వుడు కడుపుతో వుంటాడని చెప్పాడు. ఇంద్రుడితో సమానుడైన కొడుకు పుడుతాడని కూడా చెప్పాడు. నూరు సంవత్సరాల తరువాత యువనాశ్వుడి ఎడమ పక్కను చీల్చుకుని కుమారుడు పుట్టాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఇంద్రుడు, దేవతలు ఆ బాలకుడికి మాంధాత్రుడు అని పేరు పెట్టారు. ఆ విధంగా జన్మించిన మాంధాత్రుడు ధ్యానం చేయడం చేత మాత్రమే నాలుగు వేదాలు, వివిధ శాస్త్రాలు, విలువిద్య మొదలైనవన్నీ నేర్చుకున్నాడు. ముల్లోకాలలో గౌరవించదగిన వ్యక్తి అయ్యాడు. ఆ మాంధాత సమస్త భూమండలానికి రాజరాజుగా దేవేంద్రుడి వల్ల పట్టాభిషిక్తుడై దేవేంద్రుడి సింహాసనం కూడా అధిష్టించి, ‘ఆజగావంఅనే విల్లును చేబట్టి, కవచాన్ని ధరించి, లోకాలన్నీ జయించాడు. ఇంద్రుడి మీద యుద్ధం చేసి గెలిచాడు. భూమ్మీద వానలు కురిపించాడు. పాండవులు అప్పుడు వున్న ప్రదేశంలోనే మాంధాత యజ్ఞం చేశాడని చెప్పాడు రోమశుడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)