Saturday, October 31, 2020

Rythu Vedika, unprecedented initiative in Telangana : Vanam Jwala Narasimha Rao

 Rythu Vedika, unprecedented initiative in Telangana

Vanam Jwala Narasimha Rao

In what construed to be a land mark and unprecedented initiative in the annals of agriculture history in the independent India and a revolutionary step that will change the entire contours of farming sector at one go, Chief Minister K Chandrashekhar has formally inaugurated the first Rythu Vedika in the State at Kodakandla Mandal headquarters in Jangaon district on Saturday the 31st October 2020.

The Government of Telangana has decided to construct 2601 Rythu Vedikas-2462 Rural and 139 Urban-in all the Agriculture Extension Officer’s clusters. Accordingly, Government earmarked an amount of Rs.573 crores towards the total construction cost. Rythu Vedikas are the first of its kind in India where a platform is being created for the farmers to organize themselves in to groups for attaining their ultimate objective of getting the remunerative prices, better marketing facilities, higher productivity and ultimately making the Agriculture profitable. They will also Help the farmers to organize themselves into a formidable group to protect their rights.

What followed the formal inauguration was the passion, courage, vision, determination and devotion of CM KCR to usher in a qualitative, quantitative and expressive farm policy that would eradicate all problems, adversaries and ill effects of farm sector and make it a profitable sector forever. More than the stated aims and objectives, the Rythu Vedikas ably supported by the government policies would become synergy to bring in a transparent, people-friendly and progressive change in the governments to come.

Chief Minister K Chandrashekhar Rao has unveiled his vision for the Rythu Vedikas’ role in the Telangana state by asserting that they should become a formidable force not only to change the farm sector for good but also should become focal centers to determine the change of governance. He also wanted farmers to utilize the Rythu Vedikas to stall attempts by the Centre to thrust upon the anti-farmer and pro-corporate Farm Acts that are brought in forcibly in the recent past and face the challenges.

Inaugurating Rythu Vedika, the Chief Minister made a passionate plea to farmers to utilize the Rythu Vedika and the opportunity provided by the government to become a united force and charter the course of their profession in the way it is profitable and comfortable. He envisaged that through Rythu Vedikas, farmers at a later stage would be able to determine which crops they should cultivate, what price they should fix for their produce and how to market them for greater profitability.

In his hour-long address, the CM not only dwelled at length on the purpose, aims and objectives of Rythu Vedikas but also took the opportunity to expose the hollowness of opposition parties like the Congress and the BJP armed with facts, figures and data.

Referring to the very concept of Rythu Vedika, CM KCR said that nowhere in the world or in the country, farmers were organized and this Telangana Model is the first of its kind step to make farmers united and a formidable force. The farmers by and large in our country and worldwide were left to themselves. Adding to this, there is a peculiar situation in the country where even if the state government wants to give some subsidies or offer MSP, the Centre would stall such attempts by arm-twisting methods.

A directive given by the Food Corporation of India to all the state government not to buy Paddy fine or coarse variety at Rs 1888 per quintal was quoted by CM. Even a rupee paid more than the price; the FCI will not procure the Paddy. He said the Farm Acts that were enacted in the Rajya Sabha in an undemocratic method were aimed at helping the large corporate entities but were in reality against the interests of the farmers. The CM said that, the time has come for the Rythu Bandhu Samithis in the State to show their anger against the anti-farmer Acts of the Centre and they should also demonstrate the combined force of the farming community.

The CM said no one could distract him from making agriculture and farmers profitable. He compared the situation of agriculture before formation of the state under the united AP rule and during the past six and half years. Apart from increase in extent of cultivation leaps and bounds, the output had also reached the dizzy heights. The FCI itself went on record to say that Telangana state had accounted for 65 per cent of its total Paddy procurement in the country. He also reminded that no other state in country is procuring Paddy as it was done in the State. He also said that no other state in the country not even the Centre is implementing a slew of programs, projects, policies and schemes for the agriculture sector and farmers as was done in the State.


Despite the state incurring a loss of Rs 50,000 crore due to corona pandemic, the state has purchased the produce in the village itself. The state purchased Maize at MSP knowing fully well that it would incur losses due to Centre’s policy of reducing the import duty on Corn. He said pro-farmer and pro-agriculture schemes like Rythu Bandhu, Rythu Bhima, Rythu Vedikas, and 24-hour free power supply to farm sector and host of other schemes were initiated by his government without any one asking for it or made a demand for them.

Urging the farmers not to waste the opportunity given to them through Rythu Vedikas, the CM said his dream was to see that one day the Rythu Vedikas should become catalysts for a better change and the Rythu Bandhu Committee should take the responsibility to organize, coordinate, unite and motivate the farmers.

Reiterating that the welfare of the country is the welfare of farmers, the CM recalled his conversation with PM Modi on the need to stand by farmers and agriculture in the testing times of corona epidemic come what may. CM said that he told the PM that if our country suffers food shortage no country in the world is capable of feeling 135 Crore people in the country.

The CM exposed the cheap tricks and baseless allegations made by the Congress leaders. He also ridiculed the BJP leaders for spreading falsehoods about the Centre’s contribution to the pensions in the State. CM made a mention about farmers across the country protesting against the anti-farmer policies of the Centre with specific reference to Ramlila celebrations where people have even burnt PM Modi effigy.

The CM also spoke about the initiatives launched to strengthen the rural economy by supporting those sections of people who are dependent on agriculture, the hereditary professions and said he would soon launch a Dalit Chaitanya Jyothi program.

The Chief Minister made it abundantly clear that he wanted every farmer in the state with the extraordinary support provided by the government, should rise to the occasion, and should reach a stage where he should be able to clear all his dues and have about Rs 2 to 3 Lakh of funds with him as savings to invest into his cultivation on his own without taking any external financial support. ‘It is then that the real Bangaru Telangana is achieved’ the CM remarked.                       (With VJM Divakar)

Jaipur Foot and its advent in Hyderabad : Vanam Jwala Narasimha Rao

 Jaipur Foot and its advent in Hyderabad

Vanam Jwala Narasimha Rao

The Hans India (01-02-2020) 

Jaipur Foot that was originated in India transformed lives of hundreds and thousands of amputees all over world by providing them with mobility and dignity. TIME Magazine described Jaipur Foot, as the one that has revolutionized life of millions of landmine amputees. Lot of effort was put in, in the united AP, for the advent of it in Hyderabad 25 years ago, while Late Dr AP Ranga Rao was Managing Director of the Handicapped Development Corporation in early eighties of last century. 


A very meticulous person Late Achanta Satyanarayana IAS was posted as Secretary Social welfare in united AP. When he was explained of Jaipur Foot by Dr Ranga Rao, he was asked to work against deadlines. Dr Ranga Rao picked up an all-round artisan who was a good craftsman, intelligent and sharp to go to Jaipur with him. The artisan also had some experience in traditional artificial limb making. Together they visited the workshop and Dr Kasliwala, a colleague of Dr Sethi who invented Jaipur Foot, spent lot of time in showing them around and explaining the concept and technical details.


Next day Dr Sethi met the Doctor and Artisan. He was a very soft-spoken person. He was a good observer. He complimented for coming with an artisan saying that Indian artisans are very good. Dr Sethi took both of them around and showed them how persons who were fitted with these gadgets were trained. There was a young dancer from Tamil Nadu who lost her lower limb in a car accident and was being fitted the device and was under training. She was practicing dancing with the new limb. Much later she acted in a Telugu film produced by Eenadu Chief Ramoji Rao as heroin dancer, which won national awards. Dr Ranga Rao also saw some young people playing football and some climbing trees. It was amazing. It was a new life to them.


Later Dr Sethi arranged a meeting with other Governing members of their team which included Dr Mehta an IAS officer, who later rose to become Deputy Governor of RBI and chairman SEBI. He was a great support to them.  After a prolonged discussion they said they would impart the required training besides giving technology support to AP artisans. He however put a rider saying that, the service should be free and key doctors and artisans should be sent to Jaipur for training.


Initially they would supply a limited quantity of ‘Jaipur foot’ pieces at actual cost. Limitation was due to their limited capacity to produce Jaipur foot. Lack of enough dyes and high manufacturing costs of Dyes was responsible. The other condition Dr Sethi put was that the AP team should organize facilities close to hospital for free boarding and lodging to beneficiaries along with an attendant while they were undergoing training. The travel costs must be paid by government to the beneficiary. Dr Ranga Rao assured them of all those and invited them to visit AP and satisfy themselves. 




Dr Sethi was given the Ramon Magsaysay Award for his invention of Jaipur foot. Basically, the foot piece was made of galvanized Rubber which has some elasticity and is joined to a length of leg piece made of aluminum (Molded and welded into the shape of a leg piece). The stump of the amputated limb snugly fits on to the tubular hollow leg piece with some padding. The western technology uses a shoe made of leather. The advantage of rubber foot is one could walk into a kitchen or a temple with it. It is cheaper and can be made by a local welder or artisan with little training. The looks are more natural. The foot is made in different Bata shoe sizes and is available in different skin colors. They are mass manufactured. Aluminum Dyes to make these were expensive. Second difficulty was aluminum welding technology.


Incidentally, on the flight to Hyderabad Dr Ranga Rao got into conversation with a co-traveler sitting next to him. Knowing the purpose of Doctor’s visit to Jaipur he got interested and told that he owns an industry in Hyderabad where they manufacture the aluminum wheels for the cars which were of low weight. It was a new technology which they pioneered in India and they were also into making of aluminum dyes. What a coincidence. His name was Galada. He said he could help in Jaipur Foot manufacturing.


Next day Dr Rao went to his office and firmed up their association and also put him in touch with Dr Sethi. Necessary orders were issued by the then AP Government for hiring space for lodging patients and costs for their food and travel etc. Nizams Institute of Medical Sciences was identified as the fitting and training center. Dr Jairam Pingle an orthopedist and few junior artisans of the workshop were requested to visit Jaipur.  The artisan returned from Jaipur with few foot pieces.


A girl by name Swaroopa was referred by a doctor friend for some help. She was handicapped as she lost her lower limb in a train accident.  She was 18-year-old bubbling young lady. She discontinued her studies after eighth standard. Dr Rao decided to get her fitted with Jaipur foot and subsequently employ her in the unit. She was very happy and agreed. The Artisan started working on her. He fitted her limb in three days and she started to practice walking. In a week's time she was walking. She was employed and soon was motivating others.


Late G Krishna a senior journalist of yester years then wrote a beautiful human story on her which was published in Andhra Prabha. The title was ‘Swaroopaku Kalu Molichindi’. Many amputees were registering their names for fitment. As there were no more pieces of Jaipur foot the unit started manufacturing calipers. More trained handicapped persons were employed. The unit was bubbling with activity. Famous Physio Therapist Sudha Kishore was providing them with necessary physiotherapy and training. Orthopedist Jairam Pingle and his assistants, Dr BN Prasad, and Dr Narendranath would come to workshop daily and evaluate.


Dr Sethi was invited to visit Hyderabad and the unit and satisfy himself with the arrangements. He came and was highly impressed. Secretary Social Welfare Achanta interviewed Dr Sethi on AIR for 15 minutes in English which was broadcast nationwide on national hook up. Towards the end of interview Achanta asked Dr Sethi: How was it possible to replicate fitting of the limb in such a short time outside Jaipur? Dr Sethi replied: ‘Dr Ranga Rao’. Achanta concluded saying, ‘Yes, we have a dynamic MD’. It went on air.


That year around 500 limbs were fitted, and thousands of calipers were manufactured in a unit where they were in two digits in earlier many years.


Indira Gandhi was elected as Member of Parliament from Medak. She was planning to visit Sanga Reddy to attend ZP meeting. A meeting was held to coordinate the visit and all heads of departments were invited. Dr Ranga Rao as MD Handicapped Corporation too attended the meeting. It was decided that Jaipur foot would be presented to a disabled candidate on the occasion. Mrs. Gandhi addressed the meeting.


At the end of the meeting the Jaipur foot was presented. Everyone was thrilled. Dr Ranga Rao narrating this in his Auto Biography, ‘Hopping Memories’ recalled that he had the opportunity of sitting few yards away from Jawaharlal Nehru the then prime minister in a public function in Ravindra Bharathi and again participated in a meeting in official capacity with his daughter who too was Prime Minister after few decades.


That was the advent of Jaipur Foot to this part of India thanks to Dr AP Ranga Rao.


(Source: HOPPING MEMORIES by Dr AP RANGA RAO)

సుభద్రా పరిణయం, మిథిలా నగరానికి పోయిన శ్రీకృష్ణుడు .... శ్రీ మహాభాగవత కథ-82 : వనం జ్వాలా నరసింహారావు

 సుభద్రా పరిణయం, మిథిలా నగరానికి పోయిన శ్రీకృష్ణుడు

శ్రీ మహాభాగవత కథ-82

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

సముద్రం పాలైన గురువుగారి కుమారుడిని బలరామకృష్ణులు తీసుకువచ్చిన విషయాన్ని విన్న దేవకీదేవి, కంసుడు వధించిన తన కొడుకులను కూడా తీసుకువచ్చి తనకు చూపమని బలరామకృష్ణులను కోరింది. అలా చూపించి తన దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించింది. ఆమె కోరిక తీర్చడానికి ఇద్దరూ సుతల లోకానికి వెళ్లారు. సుతల లోకాధిపతి అయిన బలి చక్రవర్తి బలరామకృష్ణులను చూసి, వారికి స్వాగతం చెప్పి, వారిని స్తుతించి, శ్రీకృష్ణుడి దర్శన భాగ్యానికి మురిసిపోతూ, తానేం చేయాల్నో ఆజ్ఞాపించమన్నాడు.

దేవకీదేవి గర్భంలో జన్మించిన ఆరుగురు కొడుకులను కంసుడు చంపాడని, దానికి తన తల్లి విపరీతమైన బాధకు గురైందని, తన పుత్రులను చూడాలనే కోరికతో వారిని తెచ్చి ఇమ్మని తమను ప్రార్థించిందని, ఆ కారణంగా మాతృమూర్తి కోరిక తీర్చడానికి సుతల లోకానికి వచ్చామని, బలి చక్రవర్తి అధీనంలో వున్న ఆ ఆరుగురిని తీసుకునిపోయి తల్లికి చూపించి ఆమె బాధ పోగొట్టుతామని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా చూపించి వారి శాపాన్ని పోగొట్టి, వారికి సద్గతి ప్రసాదిస్తానని అన్నాడు. అలా చెప్పి, వారిని తీసుకుపోయి తల్లికి చూపించాడు. ఆమె ఎంతగానో మురిసిపోయింది. కొడుకులను ముద్దాడింది. ఒడిలోకి తీసుకుని చనుబాలిచ్చింది. వారు కూడా వైష్ణవమాయకు వశులై, తల్లిపాలు తాగారు. ఆ తరువాత ఆ ఆరుగురు దేవకీదేవికి నమస్కరించి తమతమ నివాసాలకు వెళ్లిపోయారు.

ఇదిలా వుండగా, అర్జునుడు తీర్థయాత్రలు చేద్దామనే ఆలోచనతో అంతటా తిరుగుతూ, ఒకనాడు ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం వుండి ప్రశాంతంగా కాలం గడిపాడు. అప్పుడే, సుభధ్ర మీదున్న అనురాగంతో ఆమెను చూద్దామనుకున్నాడు. ఆమెను దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని బలరాముడు భావిస్తున్నట్లు విన్నాడు. బలరాముడికి తెలియకుండా సుభద్రను చూడడానికి, సన్న్యాసి వేషంలో ద్వారకానగరం చేరుకున్నాడు అర్జునుడు. ఆయన నిజమైన సన్న్యాసి అనుకున్నారు ద్వారకానగర వాసులు. భక్తితో ప్రతిరోజూ పూజించారు. ఒకనాడు బలరాముడు కపట సన్న్యాసిని నిజమైన సన్న్యాసి భావించి తన ఇంటికి తీసుకువచ్చాడు.

బలరాముడి ఇంటికి పోయిన అర్జునుడు సుభద్ర కోసం వెతకసాగాడు. ఆమె కనబడగానే అర్జునుడి ప్రేమైక దృష్టి ఆమె మీద పడింది. సుభద్ర మీద తన మనస్సును లగ్నం చేశాడు. సుభద్ర కూడా ఆర్జునుడిని చూసింది. సుభద్రార్జునులిద్దరూ ఒకరిమీద ఒకరు మనసు పడ్డారు. అలా వుండగా, ఒకనాడు, సుభద్ర అంతఃపురం నుండి బయటకు వచ్చింది. అర్జునుడు, శ్రీకృష్ణుడు, దేవకీవసుదేవుల అనుమతితో సుభద్రను సమీపించాడు. ఆమెను తన రథం మీద కూచోబెట్టుకుని తీసుకుపోతుంటే యాదవ వీరులు అడ్డుతగిలారు. వారందరినీ ఓడించి సుభద్రను ఖాండవప్రస్థ పురానికి తీసుకెళ్లాడు.

ఈ వార్త బలరాముడికి తెలిసింది. అర్జునుడి మీద మండిపడ్డాడు. కృష్ణుడు అతడిని శాంతింప చేశాడు. సుభద్రార్జునుల వివాహానికి అతడిని సుముఖుడిని చేశాడు. బలరామ కృష్ణులు చెల్లెలు మీద ప్రేమతో దాసదాసీ జనాన్ని, సమస్త వస్తు సముదాయాన్ని అరణంగా ఇచ్చారు.

ఇదిలా వుండగా, విదేహదేశంలో వున్న మిథిలాపురంలో శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఆయన అఖండ విష్ణు భక్తుడు. ఆరోజుల్లో ధర్మ మార్గంలో సంచరించే బహుళాశ్వుడనే రాజు మిథిలానగరాన్ని పాలించేవాడు. వారిద్దరి మీదా శ్రీకృష్ణుడికి అపారమైన కరుణ కలిగింది. వారిని చూడాలని బయల్దేరాడు ఒకనాడు. ఆయన వెంట నారదాది మహర్షులు కూడా వున్నారు. శుక మహర్షి కూడా వున్నాడు. విదేహ నగరాన్ని చేరుకోగానే బహుళాశ్వుడు, శ్రుతదేవుడిని వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడికి కానుకలివ్వడానికి ఎదురుగా వెళ్ళాడు. శ్రీకృష్ణుడి పాదపద్మాలకు అంతా నమస్కరించారు. బహుళాశ్వ శ్రుతదేవులిద్దరూ పరమాత్ముడిని ప్రార్థించారు.

బహుళాశ్వ శ్రుతదేవులిద్దరి కోరికలు, ఒకరికి తెలియకుండా మరొకరివి తీర్చాలనుకుని మహర్షులను వెంటబెట్టుకుని వారిద్దరి మందిరాలకు వెళ్లాడు శ్రీకృష్ణుడు. బహుళాశ్వుడి మందిరంలో ఆయన శ్రీకృష్ణుడికి, ఆయన పరివారానికి సకల సపర్యలు చేశాడు. శ్రీకృష్ణుడిని, మహర్షులను తన ఇంట్లో కొంతకాలం వుండమని కోరాడు. ఆయన కోరినట్లే మిథిలానగరంలో కొన్ని దినాలు గడిపాడు. మరో వైపు శ్రుతదేవుడు కూడా తన ఇంటికి శ్రీకృష్ణుడి రాకకు మహాదానందపడ్డాడు. పరమాత్మను పూజించాడు. సంతోషంతో తన పైనున్న ఉత్తరీయాన్ని తీసి గిరగిరా తిప్పుతూ నృత్యం చేయసాగాడు. శ్రీకృష్ణుడిని పరిపరి విధాల స్తుతించాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు ఆయన వెంట వచ్చిన మహర్షులందరినీ సద్భక్తితో పూజించాడు.

మహాభక్తులైన బహుళాశ్వ శ్రుతదేవులిద్దరి చేత పూజలందుకున్న శ్రీకృష్ణుడు వారికి సకల సిరిసంపదలు, శుభాలు, అత్యంత భక్తి ప్రసాదించి, వారి దగ్గర సెలవు తీసుకుని ద్వారకానగారానికి వెళ్లాడు.        

          

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Friday, October 30, 2020

శ్రీకృష్ణుడి గ్రహణ స్నానం, నారదాది మహర్షుల రాక .... శ్రీ మహాభాగవత కథ-81 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణుడి గ్రహణ స్నానం, నారదాది మహర్షుల రాక

శ్రీ మహాభాగవత కథ-81

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

బలరాముడు, శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో సుఖంగా కాలం గడుపుతున్న సమయంలో, చూడశక్యం కాని ఒక సూర్య గ్రహణం రానున్నదని తెలుసుకున్న యాదవులంతా గ్రహణ స్నానానికి బయల్దేరారు. పరమ పవిత్ర ‘శ్యమంత పంచకం తీరానికి బలరామ కృష్ణులు కూడా గ్రహణ స్నానానికి బయల్దేరారు. స్నానానికి బయల్దేరుతూ ద్వారకానగర సంరక్షణ బాధ్యతను యాదవ వీరుల మీద వుంచారు. బంధుమిత్ర సమేతంగా అంతా కలిసి స్నానం చేసి ఉపవాసం కూడా చేశారు. జపధ్యానాలను చేశారు. గ్రహణానంతరం విడుపు స్నానాలు చేశారు. ఆ తరువాత పొన్న చెట్ల నీడలో ఉల్లాసంగా వినోదించారంతా.

శ్యమంత పంచక పుణ్య తీర్థాన్ని సేవించాలని ఎందరో రాజులు కూడా అక్కడికి వచ్చారు. గోపాలురు, గోపికా సమూహం, పాండవులు, కుంతీదేవి, గాంధారీ, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారంతా వచ్చారు. అంతా శ్రీకృష్ణుడిని దర్శించారు. బలరాముడు, శ్రీకృష్ణుడు రాజులందరినీ తగిన విధంగా పూజించారు, సత్కరించారు. అక్కడికి వచ్చినవారంతా యాదవులు చేసుకున్న పుణ్యాన్ని పొగిడారు. శ్రీకృష్ణుడితొ వుండే అదృష్టం వారికి కలిగిందని అన్నారు.

అప్పుడు అక్కడే వున్న కుంతీదేవి ధర్మరాజాదులు అడవుల్లో పడుతున్న కష్టాలను వసుదేవుడికి చెప్పుకుని దుఃఖించింది. వారి బాగోగులు చూడమని అడిగింది. విధిని ఎదిరించి నడవడం ఎవరికీ చేతకాదని వసుదేవుడు చెల్లెలు కుంతీదేవిని ఓదార్చాడు.

అదే సమయంలో నందుడు, యశోద గోపాలకులతో, గోపికలతో కలిసి కృష్ణుడిని చూడడానికి వచ్చారు. అలా వచ్చిన నందాదులను యాదవులు చూశారు. వసుదేవుడు వారందరికీ సకల సత్కారాలు చేశాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు వినయంతో సాష్టాంగ నమస్కారం చేశారు. యశోదాదేవి కొడుకులిద్దరినీ గుండెలకు హత్తుకుంది. కౌగలించుకుంది. రోహిణీదేవి, యశోదాదేవి, దేవకీదేవి, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇంతలో ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూద్దామా అని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న గోపికలంతా అక్కడికి వచ్చి చేరారు. శ్రీకృష్ణుడిని చూసి వారంతా కనురెప్పలు వాల్చలేకపోయారు. హృదయాలలోనే ఆయన్ను కౌగలించుకున్నారు.

గోపికలంతా కృష్ణుడిని దర్శించుకోగానే, భక్తి పారవశ్యంలోకి జారుకున్నారు. శ్రీకృష్ణుడు గోపికారమణుల అంతర్భావాన్ని గ్రహించాడు. వారందరినీ ఒక ఏకాంత ప్రదేశానికి రమ్మని, అక్కడ వారిని ప్రేమతో కౌగలించుకుని ఆనందపరవశులను చేశాడు. తాను వారిని కలవడం ఆలశ్యం అయినందున, తన మీద అలగవద్దని అన్నాడు. గోపికలకు పరమాత్మ తత్త్వాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. వారు దాంతో ఆత్మజ్ఞానాన్ని పొంది, బంధాలను వదిలేశారు. ఆయన్ను స్తుతించారు. ఆయన పాదపద్మాలను తమ మనస్సులలో స్థిరంగా నిలిచే వరం ఇవ్వమని కృష్ణ పరమాత్మను ప్రార్థించారు. శ్రీకృష్ణుడు తనను భక్తితో కొలిచిన గోపికలను తరింప చేశాడు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఉభయ కుశలోపరి గురించి మాట్లాడుకున్నారు. అలాంటి సమయంలో, శ్రీకృష్ణుడి భార్యలు ద్రౌపదీదేవి స్నేహంగా కలసి మెలిసి ఒక చోట కూర్చుని సంతోషంగా కబుర్లాడుకున్నారు. ద్రౌపదీదేవి కృష్ణ పత్నులను చూసి, వారిని శ్రీకృష్ణుడు ఏవిధంగా వివాహం చేసుకున్నాడో చెప్పమని అడిగింది. రుక్మిణీదేవి, ఇతర భార్యలు వారివారి పరిణయ వృత్తాంతాలను ద్రౌపదికి సవిస్తరంగా వినిపించారు. శ్రీకృష్ణుడి భార్య లక్షణ తనను వివాహం చేసుకోవడానికి పూర్వం శ్రీకృష్ణుడు, తన తండ్రి పెట్టిన నిబంధనకు అనుగుణంగా, ఎలా మత్స్య యంత్రాన్ని కొట్టిందీ, ఆ తరువాత తనను ఎలా వివాహమాడిందీ వివరించింది. తనను వివాహం చేసుకుని తీసుకుపోతుంటే ఆయన్ను అడ్డుకున్న శత్రు రాజులను సంహరించి తనను ద్వారకానగరం తీసుకువచ్చిన సంగతి కూడా చెప్పింది.

ఇదిలా వుండగా, ఒకనాడు, బలరామ శ్రీకృష్ణులను చూడడానికి, మహర్షి సత్తములైన దేవలుడు, ద్వితుడు, త్రితుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, గార్గ్యుడు, వశిష్ఠుడు, కాలవుడు, అంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, సుకీర్తి, మార్కండేయుడు, అగస్త్యుడు, అంగీరుడు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు మొదలైన వారంతా వచ్చారు. వచ్చినవారందరినీ పూజించి, సపర్యలు చేసి, వారు రావడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెప్పి, వారిని పరిపరి విధాల పొగిడాడు శ్రీకృష్ణుడు. వారంతా కూడా శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా స్తోత్రం చేసి, ఆయన లీలలను పొగిడి, ఆయన్ను చూడడం వల్ల తమ పుట్టుక, చదువు, తపస్సు అన్నీ సఫలమయ్యాయని అభినందించి, ఆయన అనుమతితో తమ నివాసాలకు వెళ్లడానికి సిద్ధపడ్డారు.

అప్పుడు వసుదేవుడు ఆ మునీశ్వరులకు నమస్కరించి, పాపకర్మలను పోగొట్టే సత్కర్మలేవో చెప్పమని అడిగాడు. విష్ణుదేవుడిని గూర్చి యజ్ఞాలు చేస్తే సమస్త పాపాలు నశిస్తాయన్నారు వారు. శ్రీకృష్ణుడే యజ్ఞాలన్నింటికీ అధీశ్వరుడు అనికూడా చెప్పారు. మంచి యజ్ఞం చేసి దేవఋణం తీర్చుకోమని సలహా ఇచ్చారు. ఆ మునులనే ఋత్విక్కులుగా వుండమని వసుదేవుడు కోరాడు.

శ్యమంత పంచక సమీపంలో వసుదేవుడు 18 మంది భార్యలతో యజ్ఞ దీక్షను స్వీకరించి, యజ్ఞాన్ని పూర్తి చేశాడు. మహర్షులు ఆ తరువాత వెళ్లిపోయారు. ఆ తరువాత కృష్ణుడు, బలరాముడు మరికొంత కాలం అక్కడే వున్న్నారు. మూడునెలలపాటు అంతా కలిసి గడిపారు. ఆ తరువాత నందాదులు యాదవుల దగ్గర వీడ్కోలు తీసుకుని, దృష్టి మొత్తం శ్రీకృష్ణుడి మీదే నిలిపి, వెళ్లిపోయారు. బలరామ కృష్ణులు ద్వారకానగారానికి వెళ్లారు. ద్వారకానగరంలో సుఖంగా వున్నారు.         

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Thursday, October 29, 2020

కుచేలోపాఖ్యానం .... శ్రీ మహాభాగవత కథ-80 : వనం జ్వాలా నరసింహారావు

 కుచేలోపాఖ్యానం

శ్రీ మహాభాగవత కథ-80

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడికి ఒక ప్రియమిత్రుడుండేవాడు. అతడి పేరు కుచేలుడు. అతడు వేదవేదాంగాలను చదివిన బ్రాహ్మణోత్తముడు. మహా విజ్ఞాని. ఆధ్యాత్మిక తత్త్వవేత్త. భక్తాగ్రగణ్యుడు. అతడిని దారిద్ర్యం పట్టి పీడించసాగింది. భార్యాబిడ్డలను ఏదో రకంగా పోషిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాడు. కుచేలుడి భార్య సద్గుణ సంపన్నురాలు. మహా పతివ్రత. ప్రతిరోజూ, పట్టెడన్నం పెట్టమని దీనంగా అడిగే తన పిల్లలను చూసి, ఆమె హృదయం ద్రవించి పోయేది. తమ దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని భర్తను వేడుకుంది.

చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి, తాము పడుతున్న అవస్థల గురించి చెప్పి, ఆయన కృపా కటాక్షంతో తమ దారిద్ర్యాన్ని పోగొట్టమని సలహా కూడా ఇచ్చింది. కుచేలుడిని చూసీచూడగానే శ్రీకృష్ణుడు సాటిలేని సంపదలు ఇస్తాడని చెప్పింది. ధర్మపత్ని ఇచ్చిన సలహా మేరకు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడం ఇహపర సాధనమౌతుందని నిశ్చయించుకున్నాడు కుచేలుడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పుడు ఏం కానుక తీసుకెళ్లాలని భార్యను అడిగాడు. భర్త చినిగిన కొంగులో కొన్ని అటుకులు మూటలాగా కట్టి, వాటిని కృష్ణుడికి కానుకగా ఇవ్వమని చెప్పి భర్తను అనునయంగా ద్వారకానగారానికి పంపించింది ఆయన ధర్మపత్ని. కృష్ణుడిని ఎప్పుడు చూస్తానా అన్న ఉత్సాహంతో కుచేలుడు త్వరత్వరగా నడక సాగించాడు.

కుచేలుడు ప్రయాణం చేస్తూ, తాను ద్వారకానగారాన్ని చూడడం ఎలా అనీ, ఆ నగరంలోకి ప్రవేశించడం ఎలా అనీ, శ్రీకృష్ణుడిని ఏవిధంగా దర్శించగలననీ, అంతఃపురం వాళ్లు అడ్డుతగిలితే ఏమని సమాధానం ఇవ్వాలనీ, వాళ్లకు కానుకలిద్దామంటే తనదగ్గర ఏమీ లేవుకదా అనీ, తన అదృష్టం ఎలా వుందోననీ, శ్రీకృష్ణుడు తనను చూసిన తరువాత వదులుతాడా అనీ, ఏమీ పాలుపోవడం లేదనీ అనుకుంటూ ద్వారకలోకి ప్రవేశించాడు. తరువాత రాజమార్గంలో నడవసాగాడు. మొదలు పదహారువేలమంది సుందరాంగుల బంగారు మేడలను చూసి మురిసిపోయాడు. ఒక మందిరంలో తన మిత్రుడు శ్రీకృష్ణుడు కనిపించాడు కుచేలుడికి. ఆయన రూప సౌందర్యాన్ని తనివితీరా చూశాడు కుచేలుడు.

శ్రీకృష్ణ పరమాత్మను తన్మయత్వంతో చూస్తూ ఆయన్ను సమీపిస్తుండగా, దారిద్ర్యంతో పీడించబడిన ఆ పేద బ్రాహ్మణుడిని చూసిన శ్రీకృష్ణుడు వెంటనే ఆశ్చర్యంతో తాను కూర్చున్న హంసతూలికా తల్పం దిగాడు. బాల్యమిత్రుడిని చూడగానే ప్రేమగా ఎదురుగా వెళ్లాడు. కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. అభిమానంగా తీసుకువచ్చి తన తల్పం మీద కూచోబెట్టాడు. బంగారు కలశంలోని నీళ్లతో స్నేహితుడి కాళ్లు కడిగాడు. ఆ జలాలను తన శిరస్సుమీద చల్లుకున్నాడు. చందనాన్ని కుచేలుడి శరీరం మీద చల్లాడు. విసనకర్రతో విసిరాడు. హారతులిచ్చాడు. పూలమాలలు వేశాడు. తాంబూలం ఇచ్చాడు. గోవును దానంగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆదరాభిమానాలకు బ్రాహ్మణుడు పులకించిపోయాడు.

ఇంతలో రుక్మిణీదేవి వచ్చి వింజామరతో విసరసాగింది. కుచేలుడి అదృష్టానికి అంతఃపురకాంతలు అబ్బురపడిపోయారు. శ్రీకృష్ణుడు స్నేహితుడి చేయి తన చేతిలో తీసుకుని గురుకులం రోజులనాటి ముచ్చట్లు, విద్యను అభ్యసించినప్పుడు చేసిన పనులను గురించి చెప్పాడు. కుచేలుడి కుటుంబ విషయాలు అడిగాడు. ఆయన భార్యా పిల్లల గురించి వివరాలు అడిగాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్న విషయాలు గుర్తున్నాయా అని ప్రశ్నించాడు. వారి గురువైన సాందీప మహర్షి గొప్పదనాన్ని, వైదుష్యాన్ని, వాత్సల్యాన్ని గురించి మరీమరీ గుర్తు తెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. గురుకులంలో వున్నప్పుడు ఒకరోజున గురుపత్ని తమను అడవిలో కట్టెలు తెమ్మన్న విషయం, తాము వెళ్లగానే ఉరుములతో పెద్ద వర్షం కురియడం, చీకటి వ్యాపించడం, ఇద్దరూ తడిసిపోవడం, చలికి తమ శరీరాలు వణికిపోవడం, తెల్లవార్లూ అడవిలో గడపడం, తమ గురువు సాందీపముని తమను వెతుక్కుంటూ రావడం, తమ గురుభక్తికి ఆయన మెచ్చుకుని దీవించడం, ఇంటికి తీసుకువెళ్లడం గుర్తుకు తెచ్చాడు శ్రీకృష్ణుడు.

తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణుడు పలికిన పలుకులకు కుచేలుడు ఆనందించాడు. తన దగ్గరకు వచ్చేటప్పుడు తనకు కానుకగా ఏమి తెచ్చావని అడిగాడు కుచేలుడిని కృష్ణుడు. తాను తెచ్చిన అటుకుల కానుకను శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి సంకోచించాడు కుచేలుడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు. శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో స్నేహితుడి అభిప్రాయాన్ని గ్రహించాడు. కుచేలుడికి అఖండ సంపదలు ప్రసాదించాలని నిశ్చయించాడు. అటుకుల మూటను చూసి, తనకు దాన్ని చూపలేదేమిటని అంటూ విప్పాడు కృష్ణుడు. వాటిలోంచి కొన్ని అటుకులు తీసుకుని తనకవే చాలునన్నాడు. ఆ కాసిని అటుకులే సమస్త లోకాలనూ సంతృప్తి పరుస్తాయన్నాడు. ఒక పిరికెడు తిని, మరో పిరికెడు తీసుకుంటుంటే రుక్మిణి వారించి, ఒక పిరికెడు చాలన్నది.

కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణ మందిరంలోనే గడిపాడు. మర్నాడు పొద్దున్నే తన ఊరికి బయల్దేరాడు. కృష్ణుడు కొంతదూరం స్నేహితుడితో కలిసి నడిచి ఆయన్ను సాగనంపాడు. శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నందుకు సంతోషిస్తూ ప్రయాణం సాగించాడు కుచేలుడు. తన పురం చేరుకున్నాడు. తన ఇల్లు వుండాల్సిన చోట బంగారు భవనాలను చూశాడు. సుందర ఉద్యానవనాలను చూశాడక్కడ. సరోవరాలను చూశాడు. దాసదాసీ జనాలతో అలరారుతున్న తన సౌధాన్ని చూశాడు. శోభాయమానంగా కనిపిస్తున్న ఆ సౌధాన్ని చూసి ఆలోచించసాగాడు.

ఇంతలో కుచేలుడికి స్వాగతం చెప్తూ, దేవకాంతల్లాగా వున్న కొందరు స్త్రీలు ఆయన్ను లోపలికి తీసుకుపోయారు. అక్కడ ఆయన తన ధర్మపత్నిని చూశాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించింది. పరిచారికలు సేవిస్తుంటే భాగ్యసౌభాగ్యాలతో అలరారుతున్నది భార్య. అలా శ్రీకృష్ణుడు ప్రసాదించిన సిరిసంపదలతో ఆ దంపతులిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. మహా వైభవంగా వున్న ఆ భవనంలో కుచేలుడు భార్యతో, పుత్రులతో సుఖంగా కాలం గడిపాడు. నిర్మలమైన ప్రవర్తనతో సజ్జనుడిగా మెలగసాగాడు. ఇన్ని వున్నా, కుచేలుడు భోగ భాగ్యాలపట్ల ఏవిధమైన ఆసక్తి చూపకుండా భగవంతుడినే ధ్యానం చేస్తూ, మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకున్నాడు.                       

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

CM KCR launches Dharani portal in Telangana : Vanam Jwala Narasimha Rao

CM KCR launches Dharani portal in Telangana

Vanam Jwala Narasimha Rao

Chief Minister K Chandrashekhar Rao has formally launched the Telangana State’s Dharani Portal, the integrated land record management system, at Moodu Chintalapalli Village in Medchel-Malkajgiri district on Thursday, the 29th October 2020, thus creating history in the chronicles of Land-related records, registration and mutations. With the launch of Dharani Portal, the CM, for the first time in the country, has signaled to put an end to land related disputes, problems, and tedious procedural lapses once for all. This is the beginning of a Land and property disputes free Telangana State and a step towards conclusive title in the near future. 

 After inaugurating the Dharani Portal, the Chief Minister addressed a gathering adhering to Covid guidelines, consisting of farmers, people, officials and public representatives. Speaking at length the CM said he had chosen Moodu Chintalapalli as it was the native village of a well-known first-phase 1969 Separate Telangana Movement leader Veera Reddy. Prior to launch of the portal CM KCR had garlanded the statue of Veera Reddy as a mark respect and gratitude.

During the hour-long address, the CM dwelled at length on how the value of land was recognized only after people started organized agriculture in the world. He also cited from history several incidences where an attempt was made to make Land Acts, reforms and the origin of the land records.

CM KCR said unlike other political leaders and parties, he would prefer to take decisions and initiate policies that will bring in more welfare to people but never any harm. “I have no right to make any mistake which cause harm to people,” he said. He also recalled how various schemes, projects and programs that his government launched have yielded the required results. He recalled how organizations like the Food Corporation of India, Union Government and Reserve Bank of India have acknowledged the rapid progress made by the Telangana State in the last six and half years. The Telangana State per capita consumption of power and per capita income have increased by leaps and bounds. The crop yields have also increased by several folds said CM.

Explaining in detail about the Dharani Portal, the CM said already data and details of 1,45,58,000 Acres of agriculture land were put on Dharani. The data on the Dharani Portal can be accessed by any one from anywhere in the world but they cannot tamper with it. All the government, Endowments, Wakf lands would be auto locked so that nobody can ever make any attempt to tamper and register them. 

Both seller and buyer of the land can book their slots based on their preference, pay the required registration fee and mutation fee in advance. On the day the slot is allotted, they can get their registration and mutation done within 15 to 20 minutes time. Besides the 141 existing Sub registrar officers, 570 MRO officers are now designated as Sub registrar offices. The entire land registration, mutation and updating the data would happen as it would happen in the core banking sector. No discretionary powers are given to any official and all the registration done at the prices fixed by the government. 

Referring to the Sadabainama lands, the CM said he would ask the revenue department to extent the period for regularizing Sadabainama lands for another week. There were 1,64,000 applications came in this regard. Since any new reform and change in the existing process will have some initial hiccups and teething troubles, the CM urged the people, farmers and others to bear with any problems that may crop up in initial days while operating Dharani Portal. In this context, he said for the last two days, lakhs of people are accessing Dharani portal and as such its traffic is very high often leading to hang up for a while.

The CM said to eradicate any litigants in land rights and land boundary issues a comprehensive digital survey would be done shortly and each and every piece of land and property would be fixed with longitude and latitude coordinates. CM said that every inch of land would be measured and boundaries would be fixed to avoid land related disputes once and for all. Ultimately the aim is to give conclusive rights on land to the people. The digital survey would be taken up within a few days and the work would be taken up at the earliest said CM. He also said with the success of Dharani Portal and implementation of new Revenue Act, there would be pressure on other States and also on the Centre to come out with such Acts.

On August 8, 2017, at the same Moodu Chintalapalli village, CM KCR spoke about the need and importance of maintaining the land records perfectly. He also spoke on the need to get some major reform in the land records, registration, mutation and maintenance without giving any room for the disputes. He also then spoke about the variance in the land details maintained by the Agriculture department and the revenue department. Exactly after three years, the CM today walked his talk and launched the Dharani Portal! This in itself is an amazing achievement! 


For the past three years, as the CM himself confessed, KCR and a team of senior bureaucrats, experts, legal advisors have toiled hard to achieve a noble and extremely difficult task of settling the land related disputes once and for all. About 150 to 200 meetings were held and the in-depth exercise was also done to find an everlasting solution, which would ultimately lead to the conclusive ownership rights to the people. This resulted in passing the New Revenue Act.

Besides enhancing transparency and efficiency, the portal is aimed at providing accountability and safe and hassle-free citizen services for land registrations, mutations and transfer. It is also meant to plug loopholes in the registration process as well as store all land and property-related information online. The website is designed to simplify the registration, succession and even partition of agriculture lands, to ensure that the entire process is completed within a few minutes and the e-Pattadaar passbook is provided to the land owners immediately. The documents pertaining to registration, mutation, succession and partition too would be provided on the spot.

The district collectors have already made arrangements to ensure complete preparedness in terms of staff and infrastructure prior to the launch, for effectively rendering citizen services through the website. A State level control room would be set up to address technical issues. Similarly, a district-level technical support team would resolve issues arising in the respective districts.

The Bank authorities also can check the land details online. This would become the mother of all records. Anybody can access the data from anywhere in the world. They cannot tamper with the records but can only view and download the data. To protect such a vital data, backup mechanism and disaster management technology are used. Under the New Revenue Act no officer at any level is given discretion power. Nobody would need to run from pillar to post in the offices.  With VJM Divakar


Wednesday, October 28, 2020

తీర్థయాత్రలకు వెళ్లిన బలరాముడు ..... శ్రీ మహాభాగవత కథ-79 : వనం జ్వాలా నరసింహారావు

 తీర్థయాత్రలకు వెళ్లిన బలరాముడు

శ్రీ మహాభాగవత కథ-79

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

కౌరవ, పాండవులకు మధ్య ఘోర సంగ్రామం జరగబోతోందన్న విషయాన్ని గ్రహించిన బలరాముడు, వారిద్దరూ ఆయనకు సమాన బంధువులే కాబట్టి, ఎవరి పక్షం వహించకుండా వుండడానికి, తీర్థయాత్రలకు బయల్దేరాడు. ముందుగా ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అక్కడి పవిత్ర జలాలలో స్నానం చేశాడు. ఆ తరువాత వరుసగా, సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాల, సరయూ, యమునా, గంగానది మొదలైన పుణ్య తీర్థాలను దర్శించాడు. తదనంతరం నైమిశారణ్యం చేరాడు. అక్కడ మునులు ‘దీర్ఘసత్త్రమ’ నే యజ్ఞాన్ని చేస్తున్నారు. బలరాముడు అక్కడికి వెళ్లినప్పుడు ఒక్క సూతుడు తప్ప, మిగతా మునులంతా లేచి గౌరవపూర్వకంగా ఆయనకు నమస్కరించారు.

సూతుడి చర్య బలదేవుడికి ఆగ్రహం తెప్పించింది. తన చేతిలో వున్న దర్భతో పొడిచి సూతుడిని చంపాడు. అది చూసిన మహర్షులంతా హాహాకారాలు చేస్తూ, బలరాముడితో, సూతుడు లేవకపోవడానికి కారణం చెప్పారు. దీర్ఘ సత్త్రయాగంలో మునులమంతా సూతుడికి ‘బ్రహ్మాసనం ఇచ్చి సత్కరించామని, ఆ కారణాన బలరాముడు వచ్చినప్పటికీ సూతుడు ఉన్నతాసనం దిగలేదని, భగవత్స్వరూపుడైన బలరాముడికి ఇది తెలియని విషయమా? అని అన్నారు. బలరాముడు తెలిసీతెలియక పూనుకున్న బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం మంచిదన్నారు. తన అజ్ఞానం వల్లే ఇలా జరిగిందని, దీనికి ప్రత్యామ్నాయంగా తన యోగమాయా ప్రభావంతో సూతుడిని మళ్లీ బతికిస్తానని అంటూ, సూతుడిని బతికిస్తాడు.

తానింకా ఏమన్నా చేయాల్నా అని మునులను అడిగాడు. ఇల్వలుడనే రాక్షసుడి కుమారుడైన పల్వలుడు తాము చేస్తున్న పుణ్యకార్యాలను అడ్డుకుని విధ్వంసం చేస్తున్నాడని, వాడిని సంహరించమని కోరారు మునులు. ఆ తరువాత, భారతదేశంలోని సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే సమస్త పాపాలు వైదొలగి పోతాయని చెప్పారు మునులు బలరాముడికి. ఇంతలో పర్వదినం రావడం, మహర్షులంతా యజ్ఞం చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. వెంటనే రాక్షసుడు రంగంలోకి దిగి యజ్ఞవాటికలో రక్తమాంసాలను, మలమూత్రాలను కురిపించాడు. పెద్ద-పెద్ద రాళ్లను ఆకాశం నుండి పడేశాడు. భయంకరంగా కనిపిస్తున్న పల్వాసురుడిని బలరాముడు చూశాడు.

పల్వలుడు కూడా బలరాముడిని చూసి, తన చేతిలోని గదను గిరగిరా తిప్పుతూ ఆయనమీదికి వచ్చాడు. వెంటనే తన హలాయుధాన్ని, రోకలిని తనవద్దకు రమ్మని బలరాముడు తలచుకున్నాడు. నాగలితో బలారాముడు పల్వలుడి కంఠాన్ని బిగించి, రోకలితో వాడి నెత్తిమీద బలంగా బాదాడు. తక్షణమే పల్వాసురుడు మరణించాడు. మునులంతా బలరాముడిని స్తుతించారు. మునులంతా ఆ తరువాత బలరాముడికి వీడ్కోలు పలికారు. అక్కడినుండి కౌశికి అనే నది దగ్గరికి చేరాడు బలరాముడు. అక్కడ స్నానం చేసి, సరయూ నదికి చేరాడు. తరువాత ప్రయాగకు వెళ్లి, త్రివేణీసంగమంలో మునిగి పితృదేవతలకు తర్పణలు ఇచ్చాడు. తరువాత పులస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. గోమతీనదిని చూసి, గండకీనదిని దాటి, విపాశ నదిలో, శోణా నదిలో స్నానం చేశాడు. అక్కడి నుండి గయకు వెళ్లాడు. గయలోని ఫల్గుణీ నదిలో స్నానం చేసి, కొంచెం దూరం ప్రయాణం చేసి గంగాసాగర సంగమాన్ని దర్శించాడు. తరువాత మహేంద్రగిరికి వెళ్లాడు.

మహేంద్రగిరిపైన వున్న పరశురాముడిని సందర్శించాడు. అక్కడి నుండి బయల్దేరి సప్త గోదావరిలో స్నానం చేసి, కృష్ణా నదిని, పంపా సరస్సును సందర్శించాడు. తరువాత భీమానదికి వెళ్లి, అక్కడ కుమారస్వామికి మొక్కాడు. తరువాత శ్రీశైలం వెళ్లాడు. వేంకటాచలమైన తిరుమలను దర్శించాడు. కామాక్షీదేవిని సందర్శించాడు. కాంచీపురం చూశాడు. కావేరీనదీ దగ్గరికి పోయాడు. అక్కడ స్నానం చేసి, నది మధ్యలో వేంచేసి వున్న శ్రీరంగనాథుడిని సేవించాడు. శ్రీరంగం నుండి బయల్దేరి, వృషభాద్రినెక్కి విష్ణు సందర్శనం చేసుకున్నాడు. తరువాత మథురకు వెళ్లాడు. అక్కడి నుండి సేతుబంధనం వున్న రామేశ్వరం చేరాడు. రామేశ్వరుడిని పూజించి తామ్రపర్ణీ నదికి వెళ్లాడు. మలయాచలమెక్కి అగస్త్యుడిని చూసి మొక్కాడు. అక్కడి నుండి దక్షిణ సముద్రం దాకా వెళ్లాడు. కన్యాకుమారికి వెళ్లి దుర్గాదేవిని అర్చించాడు. పంచాప్సర తీర్థంలో స్నానం చేశాడు. గోకర్ణంలోని మహేశ్వరుడిని దర్శించాడు.

ద్వీపవతిలో బలరాముడు కామదేవిని, తాపిలో వున్న పయోష్ణిని సందర్శించాడు. తరువాత వింధ్య పర్వతం దాటాడు. దండకావనంలో తిరిగాడు. మాహిష్మతీ పురంలో వున్నాడు కొంతకాలం. తరువాత మను తీర్థంలో స్నానం చేశాడు. మళ్లీ తిరిగి ప్రభాస తీర్తానికి వచ్చాడు.

అక్కడున్న మునులు, కౌరవపాండవ సంగ్రామంలో, రాజులంతా పరలోక గతులయ్యారని చెప్పారు. ఆ సమయంలో భీమ దుర్యోధన గదా యుద్ధం జరగబోతున్నదని చెప్పారు. ఆ యుద్ధం ఆపుచేద్దామని వెళ్లి యుద్ధ కాంక్షతో గదలను చేతపట్టుకున్న భీమదుర్యోధనులను చూశాడు. యుద్ధం ఆపడం ఉభయులకూ శ్రేయస్కరమని చెప్పాడు. ఆయన మాటలు వారు వినలేదు. ఇరువురూ యుద్ధం చేయడం మానలేదు. ఇక అక్కడ వుండడం అనవసరమనుకుని ద్వారకానగారానికి పోయి కొంతకాలం పాటు అక్కడే వున్నాడు.

బలరాముడు తిరిగి నైమిశారణ్యం వెళ్లాడు.  అక్కడి మహర్షుల అంగీకారంతో చక్కటి యజ్ఞం చేశాడు. ఆ తరువాత ద్వారకానగరానికి వెళ్లి సుఖంగా వున్నాడు.             

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)